1, సెప్టెంబర్ 2013, ఆదివారం

విడిపోవడం ప్రజాస్వామిక హక్కు!


8/31/2013 11:18:51 PM
విడిపోవడం ప్రజాస్వామిక హక్కు!
సీమాంధ్ర ప్రజలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకిస్తూ నెలరోజులుగా ఆందోళనలు చేస్తున్నారు. 1969లో తెలంగాణ ఉద్యమం ఫలితంగా కొన్ని రాజ్యాంగరక్షణలు పొందగా.. వాటిని వ్యతిరేకిస్తూ జైఆంధ్ర ఉద్యమం నడిపారు. రాయలసీమ, ఆంధ్ర నాయకులు తమ తమ ప్రయోజనాలకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నారు. రాయలసీమ ప్రాంత నాయకులు ప్రజల మనోభావాలను వారి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోకుండా రాయల తెలంగాణ, గ్రేటర్ రాయలసీమ అనే డిమాండ్లను ముందుకు తెచ్చి గందరగోళం సృష్టిస్తున్నారు. ఎలాగైనా హైదరాబాద్‌ను తెలంగాణ ప్రాంతానికి దక్కకూడదని, విద్యార్థుల్లో యువకుల్లో అపోహలు సృష్టించి, తెలంగాణను ఏర్పాటును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.

గతంలో ఎన్నడూలేనివిధంగా ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజల మధ్య సామరస్యాన్ని ప్రజాస్వామిక వాతావరణాన్ని పాడుచేస్తున్నారు. తెలంగాణవాదులు, సమైక్యవాదులు ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో దూషించుకుంటూ, సమస్యను ప్రజాస్వామిక పద్ధతిలో, రాజ్యాంగం పరిధిలో పరిష్కరించుకోకుండా పాలకవర్గాల కుట్రలకు బలైపోతున్నారు. ఇది విచారకరమైన, విషాదకరమైన పరిణామం. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే అంతిమంగా శాంతి భద్రతల పేరుతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందరి గొంతును నొక్కివేసే ప్రమా దం వున్నది. కాంగ్రెస్ పార్టీ తీసుకునే నియంతృత్వ నిర్ణయాలను ప్రజల మీద రుద్దే అవకాశం వున్నది. కనుక తెలంగాణ ప్రజలు పోరాడి సాధించుకున్న రాష్ట్రా న్ని స్వాగతిస్తూనే, ఆ క్రమంలో ముందుకొస్తున్న రాయలసీమ, ఆంధ్ర ప్రజల సమస్యలకు న్యాయపరమైన పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి పెంచాలి. ఈ సమయంలో ఏ ప్రాంతం ప్రజలైనా సంయమనం పాటించి, ప్రజాస్వామిక దృక్పథంతో ఆలోచించాలని పౌరహక్కుల సంఘం విజ్ఞప్తి చేస్తుంది.

1973లో ఏర్పడిన ఆంధ్రవూపదేశ్ పౌరహక్కుల సంఘం నాలుగు దశాబ్దాలుగా ప్రజలవైపు నిలబడి పౌరవూపజాస్వామిక హక్కుల కోసం ఉద్యమిస్తున్నది. అందులో భాగంగానే ప్రత్యేక రాష్ట్రం కోసం జరుగుతున్న ఉద్యమాన్ని బలపరిచాం. తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామిక హక్కు అని రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేశాం. చిరకాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష రాష్ట్రసాధన సాకారం అవుతున్నవేళ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఆగస్టు 10,11,2013 తేదీల్లో హైదరాబాద్‌లో జరిగిన సర్వసభ్య సమావేశం ఏకక్షిగీవంగా ‘ఆంవూధవూపదేశ్ పౌరహక్కుల సంఘం’ పేరును ‘పౌరహక్కుల సంఘం’ (సిఎల్‌సి)గా మార్చుకొని మరింత శక్తివంతంగా హక్కుల క్షేత్రంలో ఉద్యమించాలని నిర్ణయించుకున్నాం.

వ్యక్తులకే కాదు, ప్రాంతాలకూ హక్కులుంటాయి. ఒక ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలకు తమ చరివూతను, సంసృ్కతిని కాపాడుకోవడానికి మిగతా అన్ని ప్రాంతాలతోపాటు సమానంగా ఎదగడానికి అవకాశం వుంటుంది. అయితే ప్రభుత్వం అన్ని ప్రాంతాలకు వివక్షతను పాటించకుండా సమానంగా చూడగలిగినప్పుడే హక్కులను అనుభవించడానికి అవసరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ ఆలోచనా దృక్పథం రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 15, 38, 39లలో యిమిడి వుంది. భాషావూపాతిపదికన ఆంధ్రరాష్ర్టం ఏర్పడినా తెలంగాణప్రాంతం విలీనమై ఆంధ్రవూపదేశ్ ఏర్పడినా ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రాంతాలమధ్య అసమానతలు తొలగిపోలేదు. మరింత ఎక్కువయ్యా యి. ఈ నేపథ్యం నుంచే ప్రాంతీయ ఉద్యమాలు ముందుకు వచ్చాయి.
‘సమ అభివృద్ధి, సమాన అవకాశాలు ఒక ప్రజాస్వామిక హక్కు’ అనే ప్రాతిపదికన ఈ ఉద్యమాల గురించి ఆలోచించాలే తప్ప ఐక్యతావాదం,వేర్పాటు వాదం అనే ప్రాతిపదికన కాదని పౌరహక్కుల సంఘం భావిస్తున్నది. తెలంగాణ రాష్ర్టం ఏర్పాటు ఆ ప్రాంత ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్ష.

ఉమ్మడి రాష్ర్టంలో తమకు న్యాయం జరగడంలేదనీ, ఉద్యోగ అవకాశాలు కోల్పోయామనీ, నదీ జలాలలో న్యాయమైన వాటా దక్కలేదని, తమ ప్రాంతంలోని వనరులు దోపిడీకి గురయినాయనీ, తమ భాష, సంసృ్కతిని అవమానపరిచే విధంగా సినిమా, మీడియా వ్యవహరించిందనీ, తమ ప్రాంతం ఆత్మగౌరవం కోసం, అభివృద్ధి కోసం స్వయంపాలన కావాలని గత ఆరు దశాబ్దాలుగా వివిధ దశల్లో ఉద్యమించారు. విద్యార్థులు, యువతీ యువకులు తెలంగాణ రాష్ర్టం కోసం ఆత్మహత్యలకు పాల్పడ్డారు. తెలంగాణ ప్రల పోరాటం, త్యాగా ల వల్లే ప్రత్యేక రాష్ర్టం (వాస్తవానికి గతంలో హైదరాబాద్ స్టేట్) ఏర్పాటు కాబోతున్నది. మొదటి నుంచే తెలంగాణ ఉద్యమాన్ని, ఆ ఉద్యమం ముందు కు తెచ్చిన ప్రజాస్వామిక ఆకాంక్షలను పౌరహక్కుల సంఘం సమర్థించింది.తెలంగాణ రాష్ర్టం ఏర్పాటును కూడా స్వాగతిస్తున్నది. సమైక్యాంధ్ర ఉద్యమం లేవనెత్తే సమస్యలను, సందేహాల కు కేంద్ర ప్రభుత్వం స్పందించి తీర్చి వెంటనే పార్లమెంటులో రాష్ర్ట ఏర్పాటుకు సంబందించి బిల్లును ప్రవేశపెట్టాలని పౌరహక్కుల సంఘం డిమాండ్ చేస్తున్నది.

రాష్ర్ట విభజన సందర్భంగా కోస్తాంవూధకు, రాయలసీమ ప్రాంతానికి ఎలాంటి సమస్యలు ఏర్పడతాయో వాటిని ప్రజాస్వామికంగా, చట్టబద్ధంగా ఎలా పరిష్కరించాలో నిర్ధిష్టంగా ముందు పెట్టి చర్చించాలని సీమాంధ్ర ప్రజలకు విజ్ఞప్తి చేస్తు న్నాం. ఈ కృషిలో పౌరహక్కుల సంఘం సహకరిస్తుందని హామీయిస్తున్నాం. సీమాంధ్ర, సమైక్యాంధ్ర పేరుతో రాయలసీమ ప్రజలు మరోసారి మోసపోవద్దని, రాష్ట్ర విభజన జరుగుతున్న ఒక చారివూతక సందర్భంలో ఈ ప్రాంతం హక్కుల కోసం ఉద్యమించాలని కోరుతున్నాం.

రాయలసీమ కూడా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేయాలనే డిమాండు ఊపందుకున్నది. కొంతమంది రాజకీయనాయకులు తమ ప్రాబల్యం విస్తరించుకోవడానికి ‘రాయల తెలంగాణ’ గ్రేటర్ రాయలసీమ అని నినాదాలు, ముందుకు తెచ్చారు. అది కూడా తెలంగాణ విడిపోతే, అదే కండిషన్ మీద అడుగుతున్నారు. కాని, రాయలసీమ ప్రాంతం, ఇతర ప్రాంతాలతో పోల్చితే చారివూతకంగా, సంస్కృతిపరంగా సంప్రదాయాల పరంగా భిన్నమైన ఆస్తిత్వం ఉంది. ఇక్కడ ముఠా సంస్కృతి కూడా ప్రత్యేకమే. అందుకే ప్రత్యేక రాయలసీమ రాష్ర్టం కావాలంటే మళ్ళీ పాలెగాళ్ళ పెత్తనమే కదా అని భయపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణ ఏర్పడితే రెడ్డి వెలమల సామాజిక వర్గాల ఆధిపత్యమే ఉంటుంది. సమాజంలో ప్రజాస్వామికీకరణ అనేది సుదీర్ఘ పోరాటాల ద్వారానే సాధ్యమవుతుంది. ఫ్యాక్షన్ బూతాన్ని చూపించి ప్రత్యేక రాయలసీమ వద్దని అనడం కూడా సరైన అలోచన కాదు.

హైదరాబాద్‌తో కూడిన పది జిల్లాల తెలంగాణ కోసం వెంటనే పార్లమెంట్‌లో బిల్లు పెట్టాలి. హైదరాబాదు ఎవరిది ? ‘హైదరాబాదు ఎవడబ్బ సొత్తు’ అని ‘హైదరాబాదు అందిరిదీ’ అనే 10 ఏళ్ళ నుంచి 18ఏళ్ల వయస్సు పిల్లల చాలా ఆవేశంగా మీడియా ముందు మాట్లాడుతున్నారు. దాదాపు 400 ఏళ్ల చరిత్ర ఈ అమాయకమైన పిల్లలకు తెలియదు. ప్రస్తుత విద్యావ్యవస్థల్లో చరివూతను చదువుకునే అవకాశమే లేదు. ఇక ‘మేము కష్టపడి హైదరాబాదును అభివృద్ధి చేశాం’ అని రాజకీయ నాయకుల వివిధ సంఘాల నాయకులు ఆక్రోషంతో మాట్లాడుతున్నారు. విద్యార్థులు, యువకులు తమ భవిష్యత్తు ఏమిటి? అని తమ అభవూదతా భావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్ర నాయకులు హైదరాబాద్‌ను, కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలనీ లేదంటే హైదరాబాదును రాష్ట్రంగా ఏర్పాటు చేయాలని మాట్లాడుతున్నారు. మొత్తంగా తెలంగాణ రాష్ర్ట విభజన జరిగినా హైద్రాబాద్‌ను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వదిలేది లేదని దీక్షలు చేస్తున్నారు. ఇది చాలా అన్యాయమైన డిమాండు.

10ఏళ్ల పాటు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా ఉంటుందనే నిర్ణయం వెనుక ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో కొత్త రాజధానితో పాటు కొత్త నగరాలను అభివృద్ధి చేసుకునే వెసులుబాటు ఉంది. ఆంధ్ర రాష్ట్రానికి కొత్త రాజధానిని ఆలోచిచంచడం, ఆ ప్రాంతంలో వివిధ నగరాలు అభివృద్ధి గురించి విధానాలను రూపకల్పన చేయడం భవిష్యత్తులో మన విద్యార్ధులకు, యువతకు మంచిది. అంద రూ హైదరాబాద్ పోయి అభవూదతతో బతకాల్సిన అవసరంలేదు. పది జిల్లాతో కూడిన హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని పౌరహక్కుల సంఘం డిమాండు చేస్తున్నది.

సమైక్యాంధ్ర ఆందోళన ముందుకు తెచ్చిన డిమాండ్లతో పౌరహక్కుల సంఘం ఏకీభవించకపోయినా, ఉద్యమకారులపై ప్రభుత్వం అనుసరించే నిర్బం ధ విధానాలను మేము వ్యతిరేకిస్తున్నాం. నో వర్కు, నో రూల్ అనీ ఎస్మా ప్రయోగించటాన్ని ఖండిస్తున్నాం. సీమాంధ్ర ఆందోళనలో చేస్తున్న సమైక్యాంధ్ర డిమాండ్ హేతుబద్ధంకాదని అక్కడి ప్రజలకు విజ్ఞప్తి చేయాలే తప్ప చేస్తున్న ఉద్యమం కృత్రిమమైందని, ప్రజల పాత్రలేదనడం సరియైందికాదు.

సమ్మె చేస్తున్న ఉద్యోగులు, ప్రజలు వెలుబుచ్చుతున్న సందేహాలు, భయాందోళనలు సమస్యల ను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. వారు లేెవనెత్తిన అంశాలను గుడ్డిగా కొట్టిపారేయడం వల్ల సమస్య పరిష్కారం కాదు. అయితే తెలంగాణా ఉద్యమకారులు, సమైక్యాంధ్ర ఆందోళనకారులు ఒకరినొకరు తీవ్ర పదజాలంతో ధూషించడం మానివేయాలి. రాష్ట్ర విభజన సందర్భంలో తలెత్తే వనరులు, నిధులు, నీటి కేటాయింపుల, సమాన పంపిణీకి చట్టబద్ధమైన వ్యవస్థలు, చట్టాలు ఉన్నాయి. రెండు ప్రాంతాల ప్రజలు ఆమోదయోగ్యమైన ప్రమాణాలను ప్రతిపాదించి దానికి కనుగుణంగా చర్చించి సమస్యలను పరిష్కరించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం. కేంద్ర వూపభుత్వం తక్షణమే పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి విభజన ప్రక్రియను వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం.
పొఫెసర్ శేషయ్యపౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి