8/31/2013 11:20:39 PM
రెండు రాష్ట్రాలు-రెండు రాజధానులు
ఉన్న ఊరును ఉన్నపలంగా వదిలి పెట్టమంటే ఎవరికైనా
కష్టంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ‘ఎవర్నీ ఊరు వదిలిపోండి’ అని ఎవరూ అనడం
లేదు. ఇలాంటి మాటను ఎవరు ఎక్కడ ఎప్పుడు అన్నా తప్పు, అమాననీయం అవుతుంది.
కానీ ఇన్నాళ్లు హైదరాబాద్ నగరంలో వ్యాపార సామ్రాజ్యాలు, భూదందాలు
విస్తరించుకుంటూ సీమాంవూధలో ఓట్ల పంటను పండించుకోవాలనుకునే వారే హైదరాబాద్
మీద ఉత్తుత్తి ప్రేమ ఒలక బోస్తూ, దాని నిర్మాణానికి కర్తృత్వాన్ని
ఆపాదించుకుంటూ సందీ ప్రేలాపనలు చేస్తున్నారు. చారివూతక, వాస్తవ
స్థితిగతులను మరిచి మాట్లాడుతున్నారు. మోకాలికి బోడిగుండుకు ముడిపెట్టే
వారి ప్రయత్నం చూస్తే జాలేస్తున్నది. విజ్ఞులనుకుంటున్న వారు కూడా అక్కసు
ప్రదర్శిస్తున్నారు. సోదర సమానుల ఆత్రపు వాదనలు వింటుంటే ఘోస
అనిపిస్తున్నది.
నగరాలను ఎవరు పనిగుట్టుకుని నిర్మించరు, అభివృద్ధి చేయరు. కాలగమనంలో అవి అభివృద్ధి చెందుతాయి. బతుకుదెరువు వెతుక్కుంటూ కొందరు, బతుకులను దోచుకోవడానికి కొందరు నగరంలో దూరుతారు. వచ్చిన వారందరు నగరం ఆలంబనంగా ఎదుగుతారు, కానీ వారే నగరాన్ని ఎదిగించలేదు. నగరాల్లో పౌర సదుపాయాలను ప్రజలందరి డబ్బులతో కల్పిస్తారు. ఆ సదుపాయాలను అధికంగా వినియోగించుకునేది కూడా ఇలా వచ్చిన వారే. మున్సిపల్ బడ్జెట్‌ను పరీక్షిస్తే ఆ విషయం అర్థమవుతుంది. సీమాంవూధులు ఎక్కువగా ఉన్న కాలనీల్లో రోడ్లు, పార్కులు, డ్రైయినేజీలకు మున్సిపల్ డబ్బులన్నీ నాటి నుంచి నేటి దాకా ఎక్కువ కేటాయించబడుతున్నాయి. నగరాలు మనుషులకు పై పై సౌకర్యాలను అందిస్తాయేమో, కానీ మానవీ య లక్షణాలను తుడిచివేస్తాయి. స్వార్థాన్ని వ్యాపార తత్వాన్ని, అనవసర పోటీని, మురికిని కాలుష్యాన్ని పెంచుతాయి. అందుకే మనకు త్రిపురాంతకుడు దేవుడు అయ్యారు. అతని పని పురాలను ధ్వంసం చేయడమే. భారతీయ సంస్కృతి సుసంపన్నం అయ్యింది గ్రామాలలోనే. హైదరాబాద్, ఇతర నగరాల గురించి మాట్లాడే వారు కొంత ఈ తాత్వికతను కూడా తెలుసుకుంటే బాగుంటుంది.
కేంద్రంలో అధికారం నెరుపుతున్న కాంగ్రెస్ పార్టీ అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటన వెల్లడించిన తర్వాత చాలామంది సీమాంధ్ర ప్రజాస్వామ్యవాదుల ముసుగులు తొలగాయి. చెన్నూరు ఆంజనేయడ్డి లాంటి వారు కూడా నిబ్బరంగా ఆలోచించలేక ముసుగులు తొలగించుకున్నారు.రాజధాని హైదరాబాద్‌లో ఆస్తులు లేని సీమాంధ్ర ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కరైనా ఉన్నారా? వాళ్ళ హెడ్‌క్వార్టర్‌గా హైదరాబాద్ ఎందుకుండాలి. ఇలా వీరు నివాస, వ్యాపార, వ్యవహారాలకు హైదరాబాద్‌ను కేంద్రంగా చేసుకుంటే వారి స్వంత నియోజకవర్గానికి ఎలా న్యాయం చేస్తారు? ఇక్కడ ఉండి కోట్లాది రూపాయల అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నవారే హైదరాబాద్ మాది అని ‘ఫాల్స్ క్లెయిమ్’ చేస్తున్నారు.
హైదరాబాద్ 1956 నాటికే దేశంలో ఐదవ పెద్దనగరం. శాసనసభ, హైకోర్టు, విశ్వవిద్యాలయం, గ్రంథాలయం, ఉస్మానియా ఆస్పత్రి లాంటి అద్భుత నిర్మాణాలున్నాయి. ఇక్కడి రోడ్లను ప్రతిరోజు నీటితో కడిగి శుభ్రం చేసేవారు. నాటి హైదరాబాద్‌లో కన్నడం, మహారాష్ట్ర ప్రజల స్వేదం,రక్తం ఇంకి ఉన్నాయి. 1960 తర్వాతనే సీమాంవూధులు, హైదరాబాద్‌లో స్థిరపడడం మొదలుపెట్టారు. ఆ తర్వాతనే తెలంగాణ జిల్లాల్లోంచి కొందరు మోతుబరులు కూడా మకాంలను హైదరాబాద్‌కు మార్చడం ప్రారంభించారు. ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి.
తెలంగాణ ప్రాంత రాజకీయ నాయకులు, భూస్వాములు, సంపన్నులు హైదరాబాద్‌ను తురకల ఊరు గా భావించే వారు. ఎక్కడి నుంచి రాజధానికి వచ్చినా రాత్రికి వారి ఊరికి వెనక్కి వెళ్ళిపోయే ప్రయత్నం చేసేవారు. పాలనా వ్యవహారాలతో బాగా సంబంధం ఉన్న కరణం, రెడ్డి కుటుంబాలు ముందుగా హైదరాబాద్ వచ్చాయి. అంతకుముందు బతుకుదెరువు కోసం ఇతర కులాల వారు హైదరాబాద్ వచ్చారు, కాని పాలక కులాల వారు రాలేదు. ముందుగా వచ్చిన వారిలో తెలంగాణ జిల్లాల్లోని కోమట్లు, మున్నూరు కాపులు, ముదిరాజ్‌లు, పద్మశాలి తదితరులు అధికంగా ఉండే వారు. ఊర్లల్లో కన్నా హైదరాబాద్‌లో కొంతమెరుగ్గా బతుకొచ్చని వారు హైదరాబాద్ వచ్చారు. నిజం చెప్పాలంటే వారంతా ఇక్కడికి బతకడానికి వచ్చారు. కానీ ఇతరుల ను దోచుకోవడానికి రాలేదు. పైరవీలు చేయడానికి రాలేదు. దందాలు చేయడానికి అస్సలు రాలేదు. ఎవరికి వారు తమ బతుకులను బాగుచేసుకోవడానికి నగరానికి వచ్చారు. కానీ ఈ ఊరిని ఉద్ధరించడానికి, దీన్ని అభివృద్ధి చేయడానికి రాలేదు. ఇక్కడ తిని ఇక్కడ మురికి చేసిండ్రు తప్ప నగర నిర్మాణానికి ఏ ఒక్కడు ఒక్క రూపాయని ఉదారంగా ఇవ్వలేదు.
అలా ఇచ్చిన ఒక్క సీమాంవూధుడూ లేడు. పైగా పార్కులకు, గల్లీలకు వాళ్ల పేర్లు పెట్టుకున్నారు.
‘పౌరసేవ’ల రూపంలో వారు చెల్లించిన పన్నుల కన్నా ఎక్కువ వెనక్కి తీసుకున్నారు. పాలకులు కూడా గ్రామాలను నిర్లక్ష్యం చేసి నగరంలోనే పౌర సదుపాయా ల కల్పనకు తొలి వూపాధాన్యం ఇచ్చారు. అలా నగరం విస్తరించింది. విస్తరణ అభివృద్ధి కానే కాదు. నగరం ఇరుకైంది. జనాభా పెరిగింది. కాలుష్యం ప్రమాదకరస్థాయిని దాటింది. హైదరాబాద్ నగరంలో ఉన్నన్ని బోర్లు ప్రపంచంలో ఏ నగరంలో లేవు. ఇంకో మూడేళ్ళల్లో భూగర్భ జలాలు ప్రమాదకరస్థాయిలో పడిపోతున్నాయని శాస్త్రవేత్తలు హెచ్చరికలు జారీ చేశారు. భూగర్భ జలాల కోసం దాదా పు అర కిలోమీటర్ లోపలికి బోరు వేసిన సందర్భాలున్నాయి. విచక్షణారహిత భూగర్భ జలాల తోడివేత, భూమిపై పొర మీద విపరీతమైన బరువులు వేయడం ద్వారా ఏ క్షణంలోనైనా నగరానికి భూకంపం తాకిడి అవకాశం ఉంది. జూబ్లీహిల్స్ ప్రాంతంలో ప్రతిరోజు భూమి కంపిస్తూనే ఉంటుంది!
కనీస చారివూతక పరిజ్ఞానం ఉన్న వారందరూ హైదరాబాద్‌ను సంస్థానం అనకూడదు. ఇది సర్వసత్తాక రాచరికం ఉన్న స్వంతంత్ర దేశం. దీనికో పతాకం ఉంది. సరిహద్దులున్నాయి. జనాలు ఉన్నారు. టంకశాల ఉంది. ప్రత్యేక కరెన్సీ ఉంది.. కస్టమ్స్ ఆఫీసులున్నాయి. ప్రత్యేక సైన్యం ఉంది. ప్రత్యేక రైలు, పోస్టల్ వ్యవస్థలున్నాయి. ఢిల్లీ, లండన్, ప్యారీస్‌ల్లో రాయబార కార్యాలయాలున్నాయి. బ్రిటిష్ వారు నిజాంకు ‘హెచ్‌ఈహెచ్’ (‘హిస్ ఎక్సపూన్స్ హైనెస్’ మహా ఘనత వహించిన) అనే బిరుదు నిచ్చారు. విశ్వాసపావూతుడైన స్నేహితుడు అని కూడా సంబోధించారు. అతడిని పట్టుకుని సీమాంవూధులు సంస్థానాధీశుడు అని అన్నారు. హైదరాబాద్‌లోని ఒక గల్లీలో సగం కూడా ఉండని పిఠాపురం సంస్థానాధీశుడిని రాజావారు అని సంబోదిస్తారు. (ఇలాగే మునగాల రాజావారు, వెంకటగిరి రాజాజీగారు, అని చిన్నా చితకా సంస్థానాధీశులను పిలిచారు) సంబోధనల వెనక ఉన్న కుట్రల మర్మం తెలంగాణ వారికి తెలియక కాదు.
ఎవరు ఏమన్నా, ఏమనుకున్నా నైజాం ఒక దేశం. నిజాం దీనికి రాజు. హైదరాబాద్ నాలుగు వందల ఏళ్ళకు ముందు నుండి రాజధాని. దీనికి ఆద్యులు గొల్లలు, ఆధునిక నగరానికి రూపకల్పన చేసింది కులీకుతుబ్‌షా. ఇరాన్‌లోని ఇస్పాహాన్ నగరం వలే దీన్ని తీర్చిదిద్దాలని ఆదేశించిన కాంతాదర్శి ఆయన. ఆ తర్వాత ఎవరు నగరానికి వచ్చినా దానికి భారమైనారు. దాన్ని వాడుకున్నారు. కానీ దాన్ని పెంచే ప్రయత్నం చేయలేదు. వారు పెరగడానికి నగరం ఆధారమైంది కానీ ఎవరూ కూడా ఒక్క రూపాయిని నగరానికి ఉదారంగా అదనపు దానం చేయలేదు. 1956కు ముందు మరాఠీ, కన్నడిగులు కట్టిన తహసీల్ డబ్బులు నగర నిర్మాణానికి వినియోగించారు. వారితోపాటు తెలంగాణ ప్రజల రక్త మాంసాలు నగర నిర్మాణంలో ఉన్నా యి. ఇతరులు నగరానికి చేసింది ఏమీలేదు.
ఆనాడు మద్రాసును వదిలిపెట్టి వచ్చేటప్పుడు సీమాంవూధులు ఇలాగే కిరికిరి పెడితే రాజాజీ గారికి కోపం వచ్చి రాత్రికి రాత్రి ఫైళ్లను లారీల్లో వేసి కర్నూలు పంపించారు. రాజకీయాల్లో వేళ్లు కాళ్ళుపెట్టి ఎదుగుదాం. అనుకున్న వారు కర్నూల్‌కు తరలి రు. కర్నూల్‌లో ఉండలేమనిపించి వారే మళ్ళీ హైదరాబాద్‌కు వచ్చారు. అలా వచ్చిన వారు వారి అంతెవాసులు ఇప్పుడు మళ్లా ఇక్కడ కిరికిరిచేస్తున్నారు. ఆనాడు మద్రా సు మీద నిజమైన ప్రేమ ఉన్న తెలుగు వారు అక్కడే ఉండిపోయారు. వారిని తమిళులు తర్వాత ఏమీ ఇబ్బంది పెట్టలేదు కదా?!
మహారాష్ట్ర నుంచి విడివడేటప్పుడు గుజరాత్‌వారు బొంబాయి గురించి ఇలాగే లొల్లి చేశారు. ఆ తర్వాత ఏం జరిగిందో అందరికీ తెలుసు. కర్నూల్‌లో గుడారాల్లో, బురదలో ఉండలేక , కుట్రపూరితంగా అన్ని రెడిమేడ్‌గా ఉన్నాయని హైదరాబాద్ వచ్చిండ్రు. వచ్చేముందు తమ్ముడిలా ఒదిగి ఉంటాం, పాలు నిళ్ళలా కలిసిపోతాం అన్నారు. తర్వాత ఒంటె అరబ్బువాడి కథలో వలే ప్రవర్తించారు. ఇప్పుడు అర్థం లేని మాటలువాదనలు విన్పిస్తున్నారు. ఉమ్మడి రాజధాని, కేంద్రపాలిత ప్రాంతం అంటున్నారు. నిర్ణయం ఏదయినా కానీ దానివల్ల ఆర్థికంగా నష్టపోయేది సీమాంధ్ర ప్రజలే. అంతో ఇంతో నగరం చుట్టూ ఉన్న తెలంగాణ జిల్లాల వారికే లబ్ధి ఉంటుంది.
హైదరాబాద్‌ను అభివృద్ధి చేశామని అంటున్న వారు ఇప్పుడు ఇంకో నగరాన్ని అభివృద్ధి చేయవచ్చు కదా. భవిష్యత్‌లో ఎవరూ వారిని ఆ కొత్త నగరం నుంచి వెళ్లిపోమ్మనరు. ‘వెయ్యి ఏళ్లున్నా వేరు తప్పదు, నూరేళ్లున్నా చావుతప్పదు’ అన్న సామెత ఇరు ప్రాంతాల్లో ఉన్నదే కదా!
ఇప్పటికైనా మీకంటూ స్వంత రాజధాని నగరం ఏర్పాటు చేసుకునే సదవకాశం వచ్చింది. చందవూబాబు చెప్పినట్లు కేంద్రాన్ని ఎక్కువ నిధులు అడగండి. విశాలమైన వీధులతో అద్భుత భవనాలతో సర్వాంగ సుందరంగా ఆధునిక నగరం నిర్మించుకునే అవకాశం ఇది. కావాలంటే ఆనాడు హైదరాబాద్ నగర పునాది నిర్మాణ సమయం లో ‘కులీ’ ప్రార్థించినట్లు ‘దేవుడా సమువూదాన్ని చేపలతో నింపినట్లు ఈ నగరాన్ని మనుష్యులతో నింపు’ అని మేం కూడా మీ నగరం కోసం ప్రార్థిస్తాం. వర్తమానం లో అద్భుత నిర్మాణ సౌలభ్యాలు అందుబాటులోకి వచ్చాయి. మీ వద్ద డబ్బులున్నా యి, సామర్థ్యాలున్నాయి. నిర్మాణ రీతుల్లో వేగం పెరిగింది. మా కళ్ళు కుట్టేలా అద్భు త రాజధాని నగరం నిర్మించుకోండి. తెలుగు వారికి రెండు రాష్ట్రాలు రెండు రాజధాని నగరాలు, రెండు హైకోర్టులు, రెండు సచివాలయాలు ఉంటే మంచిదే కదా?

-దుర్గం రవీందర్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి