6, సెప్టెంబర్ 2013, శుక్రవారం

యూటీ వాదన వెనుక.


9/4/2013 11:01:47 PM
.

హైద్రాబాద్‌ను యూనియన్ టెరిటరీ చేయాలని అడగటానికి కారణం ఏమిటి? విద్యా, వైద్య అవకాశాలు హైద్రాబాద్‌లోనే ఉన్నాయని, అవి అందరికీ అందుబాటులో ఉండేందు యూనియన్ టెరిటరీ చేయాలని సీమాంవూధులు అడుగుతున్నారు. కానీ 1953లో ఉస్మానియా యూనివర్సిటీ ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించవలసిందని కొంతమంది సూచించారు. ఆనాడు పి.వి. నర్సింహారావు రీజినల్ కమిటీలో ఉన్నాడు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రమాణాలు పెంచటం వేరు, కానీ ఉస్మానియాను కేంద్రం పరిధిలోకి తేవటం రాజకీయమని దాన్ని పి.వి. వ్యతిరేకించారు. కొన్ని శతాబ్దాలు తెలంగాణ ప్రజలకు విద్యా అవకాశాలు నిరాకరించబడినాయి. ఆ ప్రజల కష్టార్జితంతోని ఉస్మానియా నిర్మించబడింది. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని తెలంగాణ ప్రజల నుంచి తప్పింది కేంద్ర ప్రభుత్వానికి అప్పగించటం అది సరైన పద్ధతి కాదు. విద్యా ప్రమాణాలు తక్కువగా ఉంటే దాని ప్రమాణాలు పెంచటానికి రాష్ట్ర ప్రభు త్వం కొన్ని చర్యలు తీసుకోవాలని పి.వి. చెప్పారు. యూనివర్సిటీలో ఇంగ్లిషు మీడి యం పెట్టండి. అనుభవజ్ఞులైన అధ్యాపకులను ఏరుకుని నియమించుకుం టాం. ఆ సందర్భంలోనే గౌతం మాథు ర్, ఖాదర్ లాంటి సమర్థులైన అధ్యాపకులను, ఆచార్యుల ను ఉస్మానియాకు తెచ్చుకోవటం జరిగింది. విశ్వవిద్యాల యం ప్రమాణాలు పెంచేందుకు కేంద్రానికి అప్పగించటం పరిష్కారం కాదని ఆచరణలో చూపించారు. కేంద్ర ప్రభు త్వం రాష్ట్రంలో విద్యా ప్రమాణాలు పెంచదలుచుకుంటే హైద్రాబాద్‌లో మరొక యూనివర్సిటీని నెలకొల్పమని ఆనాటి పెద్దలు చెప్పటం జరిగింది. ఆ విద్యా ప్రమాణాలు పెంచే విశ్వవిద్యాలయాన్ని హైద్రాబాద్‌లో కాక వెనుకపడ్డ ప్రాంతంలో పెట్టనున్నారు. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు రాజీమార్గంగా సెంట్రల్ యూనివర్సిటీ పెట్టేందుకు కేంద్రం ఒప్పుకుంది. రాష్ట్ర ప్రభుత్వం స్థల నిర్ణయం చేయాలి. ఆ స్థలాన్ని రంగాడ్డి జిల్లాలో పెట్టారు. రంగాడ్డి జిల్లాలో అప్పటికి ఒక్క డిగ్రీ కాలేజీ కూడా లేదు. ప్రాథమిక విద్యారంగంలో కూడా ఆ జిల్లా అంతగా అభివృద్ధి చెందలేదు. నేను 1956-57లో వికారాబాద్‌లో స్కూల్ చూశాను. తాండూర్‌లో మిడిల్ స్కూల్ ఉండేది. కానీ ఆనాటి రాష్ట్ర ప్రభుత్వం హైద్రాబాద్ పరిసరాల్లో కేంద్ర విద్యా సంస్థ ఉండాలని రంగాడ్డి జిల్లాలో సెంట్రల్ యూనివర్సిటీ నెలకొల్పారు. కానీ తెలంగాణ వారు విశాల హృదయంతో కనీసం ఆనాటికి వెనుకబడిన ప్రాంతమైన రంగాడ్డి జిల్లాలో ఒక విశ్వవిద్యాలయం వస్తున్నదని ఇక్కడి ప్రజలు ఆహ్వానించారు. ఇది అమాయకత్వంతో చేసింది కాదు. దూరదృష్టితో ఇక్కడి ప్రజలు సంతోషించారు. కానీ ఒక విశ్వవిద్యాలయం నెలకొల్పేటప్పుడు క్యాచ్‌మెంట్ ఏరియా చూసుకోవాలి. అమెరికా లో తూర్పువైపున ప్రతిష్ఠాత్మకమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయం అభివృద్ధి చెందితే, వెనుకబడిన ప్రాంతం పడమరవైపున బర్కలీ విశ్వవిద్యాలయం, స్టాన్‌ఫర్డ్ విద్యాసంస్థలను నెలకొల్పారు. స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయాన్ని దాత ల సాయంతో నిర్మిస్తే, బర్కిలీ విశ్వవిద్యాలయాన్ని ప్రభుత్వ నిధులలో నెలకొల్పారు. అన్ని ప్రాంతాలు అభివృద్ధి కావాలంటే విద్యాలయాల్ని వికేంవూదీకరించాలి. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బిసి రాయ్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన డాక్టర్‌గా ఆయనకు పేరుంది. దేశంలో తొలి ఐఐటిని బెంగాల్‌కు ఇవ్వమని ఆనాటి నెహ్రూను కోరారు. అయితే కలకత్తాలో నెలకొల్పుతావా అని నెహ్రూ అన్నాడు. ఆ ఉన్నత ప్రమాణాల విద్యా సంస్థను మారుమూల ఒక పల్లెటూరులో పెడతానన్నారు. అక్కడ భవనాలకు నిధులు కావాలి కదా అని నెహ్రూ అన్నాడు. ఖరగ్‌పూర్ దగ్గర హిజిడ్ అనే ప్రదేశంలో స్వాతంత్య్ర సమరయోధుల్ని నిర్బంధించిన జైలు ఉంది. దాన్ని ఖాళీ చేయించి అందు లో ఐఐటిని నెలకొల్పుతానని బి.సి.రాయ్ చెప్పారు. మీ ప్రొఫెసర్లు అక్కడి కి వెళతారా అని నెహ్రూ అన్నారు. ఆ ప్రొఫెసర్లను గ్రామాలకు వెళ్లేందుకు ప్రేరేపిస్తానని చెప్పాడు. ఐఐటి ప్రొఫెసర్ల కోసం కాదు అది ప్రజల కోసం. లోక కల్యాణ కోసమని బి.సి.రాయ్ చెప్పారు. అక్కడ రైల్వేస్టేషన్ కూడా లేదు కదా అని నెహ్రూ అంటే మనం నిర్మించుకోలేమా అని బిసి రాయ్ అన్నారు. ఖరగ్‌పూర్ రైల్వేస్టేషన్‌ను వేశారు. అందుకే ఇప్పుడది ఖరగ్‌పూర్ ఐఐటి అయ్యింది. ఆనాటి స్వాతంత్య్ర సమరయోధులు, దేశభక్తుల సంక ల్పం అంతగట్టిది.

తెలంగాణ సంపద అంతా కూడా బాసర నుంచి భద్రాచలం వరకు వ్యా పించి ఉన్నది. వనరులు ఆ ప్రాంతం నిండా ఉన్నాయి. ఆ వనరులున్న ప్రాంతంలో సాంకేతిక విద్యాలయం వస్తే ఆ ప్రాంతం స్వరూపం మారట మే గాక దేశ ఆర్థిక వ్యవస్థ బలపడుతుంది. అందుకే బాసరలో ఐఐటి పెట్టండని అడిగితే మొదట కొందరు హేళన చేసినా రాష్ట్ర శాసనసభ ఏకక్షిగీవంగా ఒప్పుకోవటం వలన ఆంధ్రవూపదేశ్‌కు ఒక ఐఐటి ఇవ్వాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ కాలేజీని ఐఐటి చేయాలని ఒక ఆలోచన తీసుకువచ్చారు. ఏ ప్రాజెక్టు వచ్చినా దాన్ని హైద్రాబాద్ చుట్టుపక్కన్నే పెట్టాలని వాదించారు. నేను ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజీలో పెట్టాలని ప్రతిపాదన వస్తే నేను ఓ.యు. ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా వ్యతిరేకించారు. తెలంగాణకు ఏ కేంద్ర ప్రాజెక్టు వచ్చినా దాన్ని హైద్రాబాద్‌కే తరలించే ప్రయత్నం చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ సిక్స్‌పాయిం ట్ ఫార్ములా కింద ఉందని అడ్మిషన్లు అలాగే చేయాలి. ఐఐటి అడ్మిషన్లు జాతీయస్థాయిలో జరుగుతుంది. అందుకే ఉస్మానియా యూనివర్సిటీలో ఐఐటి పెట్టవద్దని మేం వ్యతిరేకించాము. రాష్ట్రానికి ఐఐటి కావాలని కోరింది నువ్వే రెండో వైపున ఓయూలో ఐఐటి పెట్టొద్దని ఆందోళన చేసేది కూడా నువ్వేనా అని ఆ ఇసి సమావేశంలో అన్నారు. తెలంగాణలో ఐఐటిని ఎక్కడన్నా పెట్టుకోండి. దాన్ని హైద్రాబాద్‌లో పెట్టాల్సిన పనిలేదన్నాను. తెలంగాణకు ఏ ప్రాజెక్టు వచ్చినా దాన్ని హైద్రాబాద్‌కే తెచ్చారు. జెఎన్‌టియు హెడ్‌క్వార్టర్స్ వరంగల్‌లో పెట్టాలని పునాది రాయివేస్తే దాన్ని హైద్రాబాద్ కు తెచ్చారు. నాగార్జునసాగర్‌లో ఓపెన్ యూనివర్సిటీ కోసం శిలాఫలకం వేసి శంఖుస్థాపన చేశాకా దాన్ని హైద్రాబాద్‌కు తీసుకువచ్చారు కదా! ఆరో గ్య విశ్వవిద్యాలయాన్ని విజయవాడలో పెడితే తెలంగాణ ప్రజలు విశాల హృదయంతో ఒప్పుకున్నారు కదా. దాని కి అడ్డుపడలేదు. ఇది తెలంగాణ ప్రజల అమాయకత్వం కాదు, ఇది ఈ ప్రాంత ప్రజల విశాల హృదయానికి ప్రతీక అని మరువకండి. గ్రేటర్ హైద్రాబాద్ పేరుతో నల్గొండ, మెదక్,మహబూబ్‌నగర్, రంగాడ్డి జిల్లాల్లోని పలు మున్సిపాలిటీలు, పలు గ్రామాలను కలుపుకున్నారు. వీటిని ఎందుకు కలిపారో, హైద్రాబాద్ చుట్టూ రింగ్‌రోడ్డు గీతలు ఎందుకు గీశారో పాలకులకు ముందు తెలుసు. హైద్రాబాద్‌ను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకు తమ ఆర్థిక కోటలను కాపాడుకునేందుకే చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగానే హైద్రాబాద్‌ను యూటీ చేయాలని అంటున్నారు. అది హైద్రాబాద్‌ను గుప్పిట్లో పెట్టుకునే ఎత్తుగడయని తెలంగాణ ప్రజలకు తెలియదా? ఆ 13 జిల్లాల్లో ఎన్నెన్ని వేద విశ్వవిద్యాలయాలు, పశు వైద్య విశ్వవిద్యాలయాలు లెక్కలేనన్ని నర్సింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు నెలకొల్పుకోలేదు. తెలంగాణ పీడిత ప్రజానీకాన్ని ప్రేమించటమే గాకుండా వారి విముక్తి కోసం పోరాడుతూ వస్తుంది. ఆంధ్ర వూపాంత ప్రజల అవకాశాలకు తెలంగాణ ఎప్పుడూ అడ్డుతగలలేదు. కానీ హైద్రాబాద్‌ను తమ గుప్పిట్లో ఉంచడం కోసం ఒక వర్గం 50 సంవత్సరాల నుంచి రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు. త్యాగానికి తెలంగాణ చిహ్నంగా నిలిచింది. అందుకే అన్ని రకాలుగా తెలంగాణ సంపదలను తరలించుకుపోయారు. చివరకు హైద్రాబాద్‌ను యు. టి అంటే ఈ నేల ఒప్పుకోదు. ఇక్కడి ప్రజలు భరించలేరు. హైద్రాబాద్‌ను యు. టి. చేస్తామంటే కొత్త ఉద్యమాలను చవిచూడక తప్పదు.
-చుక్కా రామయ్య
ప్రముఖ విద్యావేత్త, సామాజిక విశ్లేషకులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి