September 04, 2013
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 3 : ఒక్క రోజులో రికార్డు
స్థాయి ఆన్‌లైన్ టిక్కెట్లను విక్రయించడం ద్వారా భారతీయ రైల్వేల
చరిత్రలో సరికొత్త రికార్డు నమోదైంది. ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్ ద్వారా
సోమవారం 5.72 లక్షల మంది ప్రయాణికులు ఆన్‌లైన్‌లో టిక్కెట్లను బుక్
చేసుకున్నారు. ఈ ఏడాది ఆగస్టు 12న 5.04 లక్షల టిక్కెట్లు ఆన్‌లైన్‌లో బుక్
అవ్వడమే ఇప్పటి వరకు రికార్డుగా ఉంది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు మూడుసార్లు 5
లక్షలకుపైగా టిక్కెట్లు ఆన్‌లైన్ ద్వారా బుక్ అయ్యాయి. ఐఆర్‌సీటీసీ
ఇటీవలే ఎస్ఎంఎస్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించిన
విషయం విదితమే.ముంబై, సెప్టెంబర్ 1: రైల్వే టికెట్ బుక్ చేసుకోవడానికి ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌ను ఓపెన్ చేశారా!? లాగిన్ కావడానికి, టికెట్ బుక్ చేసుకోవడానికి నిమిషాల కొద్దీ సమయం పట్టిందా!? ఇక ఇదంతా గతమే కానుంది. భవిష్యత్తులో నిమిషానికి 7200 టికెట్లు బుక్ చేసుకునేలా వెబ్‌సైట్‌ను అప్‌గ్రేడ్ చేస్తున్నామని రైల్వే శాఖ సహాయ మంత్రి కోట్ల జయ సూర్యప్రకాశ్ రెడ్డి పునరుద్ఘాటించారు. త్వరలోనే ఇది సాకారం కానుందని తెలిపారు. రాజ్యసభలో అడిగిన ప్రశ్నకు ఆయన లిఖితపూర్వకంగా జవాబు ఇచ్చారు. తదుపరి తరం ఈ-టికెటింగ్ వ్యవస్థను సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) అభివృద్ధి చేస్తోందని తెలిపారు.
ఇదే విషయాన్ని గత మేలో ఐఆర్‌సీటీసీ ఎండీ ఆర్‌కే టాండన్ చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్లో నిమిషానికి 2000 టికెట్లను మాత్రమే బుక్ చేసే అవకాశమే ఉంది. దీంతో, వినియోగదారుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఆర్థికంగా లాభసాటి కాని బ్రాంచి లైన్లతో రైల్వేకు ఏటా రూ.1300 కోట్ల నష్టం వాటిల్లుతోందని, లాభసాటి కాని లైన్లను గణనీయంగా తగ్గించి, మిగిలిన వాటిలో ఆదాయాన్ని మెరుగుపరచుకునేందుకు చర్యలు తీసుకోవాలని రైల్వేకు ప్రజా పద్దుల శాఖ సూచించింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి