9/6/2013 12:51:55 AM
తెలంగాణ -ఉద్యమం సందర్భంగా సీపీఎం పార్టీ అవకాశవాద రాజకీయాలు మరోసారి తేటతెల్లం అయ్యాయి. తెలంగాణ రాష్ట్రం విషయంలో అభివూపాయం చెప్పవవలసి వచ్చినప్పుడు సీపీఎం ఎప్పుడు తను భాషా ప్రయుక్త రాష్ట్రాల అవగాహనకే కట్టుబడి వున్నామని చెప్పుతూ వచ్చింది. అయితే సీపీఎం దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం పోరాడిన చరిత్ర ఎప్పుడూ లేదు. వీళ్లు గొప్పగా చెప్పుకునేది ఒక్క రాష్ట్రం ఆంధ్రవూపదేశ్ గురించి మాత్రమే. విశాలాంవూధలో ప్రజారాజ్యం పేరు తో తెలుగువారందరికి ఒకే రాష్ట్రం కావాలని మేము సైతం పోరాడామని చెప్పుకుంటారు. ఇది తప్ప మరో ఉదాహరణ చెప్పలేరు. అది కూడా అప్పు డు ఉమ్మడి కమ్యూనిస్టుపార్టీ నాయకత్వంలోనే జరిగింది. ఆ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ సీపీఐ దాని నుంచి విడిపోయిన ఎందరో కమ్యూనిస్టులు ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ఉద్యమాన్ని బలపరుస్తున్నారు. కానీ సీపీఎంగా ఏర్పడిన నాటి నుంచి ఆ పార్టీ భాషావూపయుక్త రాష్ట్రాల కోసం చేసిన పోరాటం ఏది లేదు, గొప్పగా కట్టుబడి వుండడం తప్ప.
అవును భారతదేశంలో అన్నీ భాషల వారికి తమ తమ భాషా రాష్ట్రాలు ఏర్పడ్డాయి. అందుకే మాకు మళ్ళీ ఆ అవసరం రాలేదని సీపీఎం వారు వాదించవచ్చు. అప్పుడు భారతదేశాన్ని పరిశీలించక తప్పదు. వీరి గొప్ప భాషా ప్రయుక్త రాష్ట్రం పశ్చిమబెంగాల్‌నే ముందు చూద్దాము. పశ్చిమ బెంగాల్‌లో గుర్ఖాలాండ్ రాష్ట్రం కావాలని కోరుతున్న ప్రజలు బెంగాళీలు కాదు. వారి భాష బెంగాలీ కాదు. అయినప్పుడు వారి భాషా ప్రతిపాతిపదికన ఒక రాష్ట్రం కావాలని కోరడం ఎలా తప్పు అవుతుంది. 30 ఏళ్లుగా పశ్చిమ బెంగాల్‌లో అధికారాన్ని వెలగపెట్టిన సీపీఎం గుర్ఖాలాండ్‌ను ఎందు కు వ్యతిరేకించింది. జార్ఖండ్ రాష్ట్రానికి సరిహద్దుగా వున్న బెంగాల్ కు చెందిన జిల్లాల్లో సంతాల్ ఆదివాసీ ప్రజలు ఉన్నారు. సంతాల్ ప్రజల భాష బెంగాళీ కాదు. సంతాల్ ఆదివాసులకు బెంగాళీ జాతికి ఎక్కడా అంటు సొంటు లేదు. మరి సీపీఎం పార్టీ మహాశయుల్లారా జార్ఖండ్ రాష్ట్రం ఏర్పడుతున్నప్పుడు జార్ఖండ్‌కు చెందిన వారి సోదర సంతాల్ ప్రజ లు, బెంగాల్‌లోని సంతాలు ప్రజలున్న జిల్లాలను కూడా జార్ఖండ్‌లో కలపాలని కోరినప్పుడు, ఆ జిల్లాల ప్రజలూ అంగీకరించినప్పుడు మీరెందుకు అంగీకరించలేదు. (జార్ఖండ్‌లో 24 లక్షల మంది సంతాల్ ప్రజలు ఉంటే, బెంగాల్‌లో 23 లక్షల మంది సంతాల్ ప్రజలు ఉన్నారు.)ఒకే ఆదివాసీ తెగకు చెందిన ఒకే సంస్కృతి, భాష కలిగిన ప్రజలు, ఒకే భూ భాగం కలిగిన ప్రజలు ఒకే రాష్ట్రంగా వుం టామని ఎంత బతిమాలినా బెంగాల్‌లో అధికారాన్ని చెలాయించిన సీపీఎం ఎందుకు ఒప్పుకోలేదు.
మేము పోరాడి సాధించామని చెప్పే ఆంధ్రవూపదేశ్‌ను కూడా చూద్దాము. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిషా రాష్ట్రాల సరిహద్దులలో వున్న ఆదిలాబా ద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, తూర్పుగోదా వరి, పశ్చిమగోదావరి జిల్లాలలో కోయ ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వారి భాష, సంస్కృతి, ఆర్ధిక, సామాజిక జీవనం మహారాష్ట్ర, ఛత్తీస్‌గ ఢ్, ఒడిషా రాష్ట్రాలలో వున్న కోయ ప్రజలతో దగ్గరగా వుంటాయి. ఈ నాలుగు రాష్ట్రాలలో విశాల ప్రాంతంలో వున్న ఒకే భాష, ఒకే సంస్కృతి కలిగిన కోయ ప్రజలందిరికీ ఒకే రాష్ట్రం వుండాలని భాషా ప్రయుక్త రాష్ట్రాలకు గొప్పగా కట్టుబడి వుండే సీపీఎంకు ఇప్పిటికి గుర్తుకు రాలేదు. (కానీ తెలంగాణ అనగానే మాత్రం సీపీఎంకి భాషా ప్రయుక్త రాష్ట్రాలు గుర్తుకు వస్తాయి.) లేకపోతే సీపీఎం భాషావూపయుక్త రాష్ట్రాల అవగాహనా పరిధిలోకి కోయ ప్రజలురారా?, ఒకే భాష వున్నా లిపిలేని భాషల ప్రజలు ఆ పరిధిలోకి రారా? దేశంలో స్వచ్ఛమైన భాషావూపయుక్త రాష్ట్రము ఒక్కటీ లేదు. అన్ని రాష్ట్రాల సరిహద్దులలో భిన్నమైన భాషా సంస్కృతులు కలిగిన ఆదివాసులు వున్నారు. ఒకే భాష, సంస్కృతి, ఆర్థిక, సామాజిక విధానం, ఒకే భూభాగం కలిగి వున్న ఆదివాసులకు ఒకే రాష్ట్రం ఏర్పాటు చేయకుండా అప్పటికే అభివృద్ధి చెందిన జాతుల ప్రజల తో కలిపి వివిధ రాష్ట్రాలలో విభజించి వేశారు. ఇప్పుడు ఆ ఆదివాసులు ఆయా రాష్ట్రాలలో తమ భాషను, సంస్కృతిని, అవకాశాలను కోల్పోతూ రెండవస్థాయి పౌరులుగా జీవించవలసి వస్తున్నది. భాషా ప్రయుక్త రాష్ట్రాలకు గొప్పగా కట్టి వేసుకున్న సీపీఎం దేశ ఆదివాసులకు వారి భాష ఆధారంగా రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని సైద్ధాంతికంగానైనా చెప్పదు.
తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకించడానికి సీపీఎం దగ్గర ఒక్క భాషావూపయు క్త రాష్ట్రాల ఆయుధమే లేదు చిన్న రాష్ట్రాల ఆయుధం కూడా ఉన్నది. దీనికి మతతత్వ ఆర్‌ఎస్‌ఎస్‌ను, బీజేపీ పార్టీలను బూచిగా కూడా చూపుతున్నది. చిన్న రాష్ట్రాల వల్ల భారతదేశ ఫెడరల్ వ్యవస్థ బలహీన పడుతుంది. కేంద్రం బలోపేతమవుతుంది. దీనితో కేంద్రం రాష్ట్రాలపైన నియంతృత్వాన్ని రుద్దుతుంది, నిరంకుశంగా వ్యవహరిస్తుంది అని సీపీఎం వాద న. బీజేపీ లాంటి మతతత్వపార్టీ నిరంకుశ కేంద్రం కోసం చిన్న రాష్ట్రాల నిర్మాణాన్ని బలపరుస్తున్నదనీ, భారతదేశ ఫెడరల్ వ్యవస్థను దెబ్బతీయడానికే చూస్తున్నదనీ సీపీఎం చెప్పుతున్నది. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీ ల అవగాహన గురించి సీపీఎం చెప్పుతున్నది ఒకవేళ నిజమే అయినా అది తెలంగాణ విషయంలో పనికిరాని వాదనే అవుతుంది. ఆంధ్రవూపదేశ్ విభజన జరిగినా, తెలంగాణ చిన్న రాష్ట్రం కాదు. సీమాంధ్ర చిన్న రాష్ట్రం అంతకంటే కాదు. తెలంగాణ గతంలోనే ఒక దేశంగానూ, ఒక రాష్ట్రంగా నూ మనగలిగింది. నిజంగానే చిన్న రాష్ట్రాల వల్ల కేంద్రం నిరంకుశంగా నియంతృత్వాన్ని అమలు చేస్తే చిన్న రాష్ట్రాలు అన్ని కలిసి కేంద్రానికి వ్యతిరేకంగా పోరాడలేవా? కేంద్రం రాష్ట్రాల మధ్య సరియైన సంబం ధాల కోసం చిన్న రాష్ట్రాలన్నింటితో కలిసి నిరంకుశ కేంద్రానికి వ్యతిరేకంగా సీపీఎం పోరాటం చేయరు? నాయకత్వం వహించదు ? ఘోరమైన విషయం ఏమిటంటే కేంద్రంలో ఎన్నడైనా అధికారంలోకి వస్తామనే అవగాహనే సీపీఎంకు లేదు. అటువంటి అవగాహన వుంటే, చిన్న రాష్ట్రాలు వుంటే బీజేపీ కేంద్రానికి నిరంకుశంగా మార్చుతుందనే వాదన చేయదు. సీపీఎం అధికారంలోకి వస్తే, వచ్చినప్పుడు అసలైన ఫెడరల్ కేంద్రానికి ఆచరణలో చూపించవచ్చు. కానీ కేంద్రంలో కాంగ్రెస్, బీజేపీలు తప్ప ఎవరూ అధికారంలోకి రారు అనే అవగాహనకు సీపీఎం బలంగా కట్టి వేసుకున్నది. అసలు విషయం ఒక రాష్ట్రం ఏర్పడడానికి సరైన, అవసరమైన ప్రాతిపదికలు వున్నాయో లేవా అనేది చూడాలి కానీ ఎలా అడ్డుకోవాలనే సాకులు కాదు.
ప్రస్తుతం సీపీఎం పరిస్థితి మరింత దిగజారింది. తెలంగాణ ఉద్యమం సాగుతున్నంతకాలం, భాషావూపయుక్త రాష్ట్రాలకు కట్టుబడివున్నామని చెప్పి నా, సీపీఎం తెలంగాణ రాష్ట్ర నిర్మాణానికి వ్యతిరేకంగా ఉద్యమాలు చేయలేదు. ఇతర వ్యతిరేక ప్రకటనలూ చేయలేదు. అంతేకాదు కేంద్రం ఏదో ఒక నిర్ణయం త్వరగా తీసుకొని రాష్ట్రంలో ఏర్పడిన అనిశ్చితిని తొలగించాలని సీపీఎం డిమాండ్ కూడా చేసింది. తెలంగాణ ఏర్పడకపోవడానికి ఇతర పార్టీలను కారణాలుగా చూపుతూ కేంద్రం మా భూజాల పైన తుపాకి పెట్టి కాల్చాలని చూస్తున్నదని సీపీ ఎం ఆరోపణ చేసింది. మా అంగీకారం లేకుండా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో ఎన్ని బిల్లులు పాస్ చేయించుకోలేదు అంటూ ఎదురు ప్రశ్నించారు. ఈ కాలంలో తెలంగాణ విషయంలో సీపీఎం చేసిన ప్రకటనలు అన్ని కేవలం సైద్ధాంతికమైనవి మాత్రమే అనే అర్ధం వచ్చేలా వున్నా యి. అందుకే టీఆర్‌ఎస్ ఉన్న ఎన్నికల కూటముల్లో వుండడానికి సీపీఎంకు ఎటువంటి అభ్యంతరం కూడా లేకుండింది. కానీ ఈరోజు సీపీఎం కార్యదర్శి రాఘవులు అవకాశవాదంలో చంద్రబాబు, జగన్‌లను కూడా మించిపోయాడు. ఇప్పుడు సీమాంవూధలో సమైక్య ఉద్యమం పేరుతో జరుగుతున్న ఆక్రమణ ఉద్యమాలను చూసేసరికి సీపీఎం అసలు రూపం బయటికి వచ్చింది. ఈ ఆక్రమణ ఉద్య మంలో చొరబడి మిగతా వారందరికంటే చాంపియన్‌లుగా ఫోజు పెట్టి తమ ఓటు బ్యాంకు పెంచుకోవడానికి సీపీఎం కూడా మిగతా బూర్జువా పార్టీల లాగానే పోటీ పడుతున్నది. మిగతా పార్టీలు డ్రామాలు ఆడుతున్నాయని సమైక్యత కోసం మేము స్వతంవూతంగా నిఖార్సైన పోరాటం చేస్తామని బి.వి.రాఘవులు చేసిన ప్రకటనే దీనికి నిదర్శనం. సీమాంధ్ర ఆక్రమణ ఉద్యమంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పట్ల వ్యతిరేకతను సీపీఎం వాడుకొంటున్నది. కానీ మహా కూటమిలో చేరి సీపీఎం కూడా డ్రామా ఆడిందని అక్కడి ప్రజలకు తెలుసు. సీపీఎం తన అసలు రూపం బయట పెట్టుకుని లాభం పొందవచ్చని అనుకోవచ్చు కానీ అది భ్రమ మాత్రమే. సీమాంవూధలో ఎలాగూ ఒక్క సీటు కూడా రాదు. తెలంగాణలో వున్న ఒక్క సీటు కూడా వూడుతుంది. రెండు నాల్కల పార్టీలన్నింటికి ప్రజలు ఇటువంటి వైద్యమే చేశారు చరిత్ర పొడుగునా...
-లంకా వెంకట పాపిడ్డి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి