సరిగ్గా రెండు నెలలు. జూలై 30 ప్రకటన వచ్చిన తర్వాత
తెలంగాణ ఎక్కడున్నది. అక్కడే. నిజాం కాలేజీ మైదానంలో సకల జనభేరి
జరగబోతున్నది. లక్ష్యం, సభ లక్షణం సుస్పష్టమే. తెలంగాణ పోరాడుతూనే ఉంటుంది.
వచ్చేదాకా. ఈ రెండు నెలల కాలంలో జరిగిన మాటల యుద్ధాలు కాంగ్రెస్ పార్టీ
స్వభావాన్ని పూర్తిగా బట్టబయలు చేశాయి. కాంగ్రెస్ పార్టీ ఏకరూపతలో లేదని,
ప్రజాస్వామ్యం ఎక్కువ అనే పేరిట బహుళ నాయకత్వంలో అనేక కేంద్రాలుగా అది
ఇబ్బందులు ఎదుర్కొంటున్నదనేది అర్థమవుతూ ఉన్నది. కాంగ్రెస్ పార్టీ 2014
ఎన్నికలకు ముందే కకావికలయిన రూపాన్ని బట్టబయలు చేసుకున్నది. ఇంకెంత మాత్రం
కాంగ్రెస్ రాజకీయ రహస్యాలు టెన్‌జన్‌పథ్‌కు మాత్రమే పరిమితమయినవి కావు.
రాజకీయ ఎత్తుగడలు అనేకంటే, ఇప్పుడు టెన్‌జన్‌పథ్ చుట్టూ ఆవరించి ఉన్న
కాంగ్రెస్ నాయకత్వం కుట్రలకు ఆలవాలమై ఉన్నది. ఆ కుట్రల ప్రభావాలు
రాష్ట్రాలన్నింటా ప్రతిఫలిస్తున్నవి. ముఖ్యంగా కాంగ్రెస్ ఇచ్చేదిగా, మనం
తీసుకునేదిగా తయారయిన తెలంగాణ అంశం మున్నెన్నడూ లేనంత సంక్లిష్టంగా మార్చే
ప్రయత్నాలు బలవంతంగా విజయవంతంగా సాగుతూ ఉన్నాయి. ఢిల్లీ కాంగ్రెస్
నాయకత్వంలో ఉన్న వైరుధ్యాలు, సోనియాగాంధీ చుట్టూ ఉన్న కోటరీలో ఉన్న
ప్రముఖుల మధ్య భేదాలు, పరస్పర హననాలు ప్రతిఫలంగానే తెలంగాణ సమస్య ‘మేడ్
డిఫికల్ట్’గా తయారవుతున్నది. బహుశా ఇది ఎటుదారి తీస్తుందో? ఊహించడం కష్టం
కాబోదు.
ఢిల్లీ రాజకీయాల్లో దక్షిణాది రాష్ట్రాలకు గానీ, దక్షిణాది
నాయకత్వాలకు కానీ దొరికే మన్నన తక్కువే. చక్రాలు తిప్పి నిర్ణయాలను
ప్రభావితం చెయ్యగలిగిన స్థితిగతులు అరుదైనవే. కానీ ఆంధ్రవూపదేశ్ విభజనకు,
అన్ని పార్టీల నిర్ణయం తర్వాత, అన్నిపక్షాల అంగీకారం తర్వాత వేచిచూసీచూసీ
చిట్టచివరగా ప్రకటించిన కాంగ్రెస్ ప్రక్రియను ముందుకు తీసుకుపోవడంలో
తాత్సారం చేసింది. ఈ తాత్సారం, ఈ సాచివేత ఉద్దేశపూర్వకమైనదేనని ఇటీవలి
రెండు ఘటనలు రుజువు చేస్తున్నాయి.
జగన్ విడుదల, ముఖ్యమంత్రి
కిరణ్‌కుమార్‌డ్డి అధిష్ఠానాన్ని, దిగ్విజయ్‌సింగ్, సోనియాగాంధీని
ధిక్కరించినట్టుగా చేసిన ప్రకటనలు. ముందూ వెనకా జరిగిన ఈ పరిణామాలన్నింటి
అంతస్సూత్రం టెన్‌జన్‌పథ్, దాని చుట్టూ ఆవరించి ఉన్న రాజకీయ కురువృద్ధుల
కుట్రలలో దాగివున్నది. అనకూడదు
గానీ రాష్ట్రపతి భవన్ వేపు కూడా వేలు చూపవలసే ఉన్నది. అది కాంగ్రెస్ సంస్కృతి.
కాంగ్రెస్
సీడబ్ల్యూసీ జూలై 30 ప్రకటన నాటికి ఆ పార్టీకి ఒక స్పష్టమైన రాజకీయ
ప్రణాళిక ఉన్నది. జగన్ ప్రభావం సీమాంవూధలో, కేసీఆర్ ప్రభావం తెలంగాణలో
పాదుకుంటున్న పరిస్థితుల్లో ఆంధ్రవూపదేశ్ నుంచి గణనీయంగా స్థానాలు
సంపాదించడం ఎట్లా అన్నదే.. ఆ ప్రణాళిక. సుదీర్ఘంగా అపరిష్కృతంగా ఉండి,
డిసెంబర్ 9న విస్పష్టంగా ప్రకటించీ ముందుకు కదలని తెలంగాణపై నిర్ణయం
తీసుకోవడం. నిజానికి డిసెంబర్ 9 ప్రకటన, సీడబ్ల్యూసీ నిర్ణయం కన్నా
ప్రభుత్వ పరంగా, క్యాబినెట్ ద్వారా వచ్చిన ప్రకటన. దానికి చట్టబద్ధత
ఉన్నది. రాజ్యాంగబద్ధత ఉన్నది.
పార్లమెంటులో ఆ ప్రకటన వెలువడింది.
కానీ సీమాంవూధులు, కాంగ్రెస్ అధిష్ఠానానికి, ఈ దేశపు ఏలికలకు ఆయువుపట్టుగా
ఉన్న కార్పొరేట్లు, పెట్టుబడిదారీ రాజకీయవేత్తలు దాన్ని అడ్డుకోగలిగారు.
కాంగ్రెస్ పార్టీ తెలంగాణను నమ్మించి గొంతు కోసింది. ప్రజాస్వామ్యాన్ని,
పార్లమెంటునూ అపహాస్యం చేసి తెలంగాణ ప్రజల ముందు అతి పెద్దవూదోహిగా
నిలబడింది. చరిత్ర పొడవునా తెలంగాణ పట్ల కాంగ్రెస్ అధినాయకత్వం ద్రోహ చింతన
ప్రదర్శించింది. తెలంగాణకు ఏ వెసులుబాటూ లేకుండా, తెలంగాణ పోరాటాలకు కనీస
ఫలితం లేకుండా ఆంధ్రవేపు కాంగ్రెస్ అధిష్ఠానం నిలబడింది. అది లాబీయింగ్
వల్ల కావొచ్చు. ధన ప్రభావాల వల్ల కావొచ్చు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న
అభివృద్ధి నమూనాలో, సరళీకరణ, ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ ఏజెంట్లు
ఆంధ్రవూపదేశ్‌లో సహజంగానే సీమాంధ్ర పెట్టుబడిదారులు అయినందువల్ల కావొచ్చు
కానీ ఇప్పటికీ కాంగ్రెస్ అధిష్ఠానం వాళ్లతోనే జమిలి కుట్రలు చేస్తున్నది.
కాంగ్రెస్
స్వభావంలో అధిష్ఠానాన్ని ధిక్కరించినవాళ్లు బతికిబట్టకట్టిన ఏ దృష్టాంతమూ
లేదు. అది న్యాయమా? అన్యాయమా? హేతువుందా? లేదా? అనేది పక్కనబెడితే
కాంగ్రెస్ అధిష్ఠానం నిర్మాణం, వ్యవహరణ తీరులోనే ఏక నాయకత్వం, దానిచుట్టూ
కోటరీలుగా పనిచేస్తుంది. అయితే ఇందిరాగాంధీ నుంచి సోనియాగాంధీ దాకా
అధిష్ఠానాన్ని ధిక్కరించిన వారెవరూ కాంగ్రెస్‌లో ఉండలేరని తేలిపోయింది.
కొందరు బతికిబట్టకట్టి స్వతంవూతంగా పార్టీలుగా ఎదిగారు. మళ్లీ కాంగ్రెస్
పంచన చేరారు. మరికొందరు అడ్రస్ గల్లంతయ్యారు. మళ్లీ తన నమూనాలోకి, మళ్లీ తన
గుప్పిట్లోకి వస్తే కాదనడానికి కాంగ్రెస్‌కు పెద్దగా అభ్యంతరం ఉండదు. ఇది
కూడా చరిత్ర నిరూపితమైన అంశమే. బహుశా జగన్ విడుదలను, బహుశా
కిరణ్‌కుమార్‌డ్డి ధిక్కారాన్ని ఈరకంగా చూస్తే తప్ప, ఆఖరుగా బొత్స
సత్యనారాయణ రాజీనామా ప్రయత్నాలను కూడా పరిశీలిస్తే తప్ప ఈ విషయం అర్థం
కాదు. కానీ సులభంగా, అన్ని రాష్ట్రాల విభజన లాగే సమస్యలు పెద్దవవకుండా, ఇరు
ప్రాంతాల సాధారణ ప్రజల మధ్య విద్వేషాలు రగలకుండా తెలంగాణను విడగొట్టడంలో
కాంగ్రెస్ విఫలమయింది. కాంగ్రెస్ అధిష్ఠానం సమస్యను ఒక పద్ధతి ప్రకారంగా
పెంచిపోషిస్తూ వస్తున్నది. ముందే చెప్పినట్టుగా మొదటి ప్రణాళికలో తెలంగాణలో
కేసీఆర్, సీమాంవూధలో జగన్, మిగతా కాంగ్రెస్‌పార్టీ, రెండు చోట్లా
లాభసాటిగా పార్లమెంటుకు గణనీయ స్థానాలు దక్కించుకోవడం అనే గేమ్‌ప్లాన్‌లో
భాగంగానే సీడబ్ల్యూసీ నిర్ణయం వెలువడింది.
విశాలాంధ్ర ఒక విఫల
ప్రయోగం. బలవంతపు విలీనం నుంచి తెలంగాణ విముక్తి కోరుకుంటున్నది.
హైదరాబాద్‌తో విలీనం అయ్యింది కనుకనే హైదరాబాద్‌తో సహా విడిపోబోతున్నది.
కానీ విభజనతో ప్రపంచం మునిగిపోతుందని, భూమి బద్దలవుతుందని, ప్రళయం
వస్తుందని అపోహలను పెంచి పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య
విద్వేషాలనురెచ్చగొడ్తున్నది. అధిష్ఠానం దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సి
ఉన్నది.
సీడబ్ల్యూసీ ప్రకటన తర్వాత రెండు నెలలకు కాంగ్రెస్
పార్టీకే చెందిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌డ్డి నిన్న ధిక్కార స్వరం
వినిపించారు. ఆయన మాట్లాడిన మాటలు వేటికీ వీసమంత విలువలేదు. పచ్చి
అబద్ధాలు. చరివూతకు సంబంధించిన అసత్యాలు. విలీనం కాకముందే ప్రతిపాదించిన
నాగార్జునసాగర్‌ను, ఇట్లాంటి ప్రాజెక్టు విడిపోతే కట్టుకోగలమా? అన్నప్పుడు,
నెహ్రూ, పటేల్‌లను కలిపి, ఆంధ్రవూపదేశ్ ఏర్పాటుకు ముడిపెట్టి
మాట్లాడినప్పుడు ముఖ్యమంవూతికి ఈ రాష్ట్రానికి సంబంధించి గానీ, నీటి
ప్రాజెక్టుల గురించీ కానీ, విలీనం నాటి చరిత్ర, అంశాలు కానీ, విభజనతో
ఏర్పడే అపోహలు కాకుండా నిజమైన సమస్యలు కానీ తెలియదని అనుకోవాల్సి
వస్తున్నది. లేదా తెలిసి తెలిసీ ఆయన ఆంధ్ర ప్రజలను రెచ్చగొట్టడానికి
దారుణంగా వ్యవహరిస్తున్నారని అనుకోవాల్సి ఉన్నది. నిజానికి ఒక రాష్ట్రానికి
ముఖ్యమంత్రి ఇంత సగటు ఆంధ్రవాది మనస్తత్వంతో మాట్లాడితే
ఆశ్చర్యపోవాల్సిందే.
ఆంధ్ర ప్రాంతాల ప్రజల పట్ల, వాళ్ల కోసం
నిలబడుతున్న వారి జ్ఞానస్థాయిని చూసి జాలిపడాల్సిందే. సగటు ఆంధ్రవాదులు,
అశోక్‌బాబులు (దురదృష్టవశాత్తు ఆయన సంస్కృతి గురించి కూడా మాట్లాడే సాహసం
చేసి ఉన్నారు.) కు మించి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి ఏమి ఊహిస్తాం.
మామూలుగా అయితే ఒక సంస్థ బాధ్యుడుగా ఉన్నవాళ్లే వ్యక్తిగత అభివూపాయాలు,
ఉద్వేగాలు ఆధారంగా కాకుండా సంస్థ ప్రయోజనాల మేరకు విశాలంగా మాట్లాడతారు.
బాధ్యతల బరువు నుంచి, కొంతైనా బాధ్యతగా మాట్లాడతారు. జూలై 30 ప్రకటన తర్వాత
రెండు విలేకరుల సమావేశాలు, ఒక రాజ్యసభ టీవీ ఇంటర్వ్యూలలో
కిరణ్‌కుమార్‌డ్డి మాట్లాడిన మాటలు ఆయన అర్హతను, స్థాయిని పూర్తి
ప్రశ్నార్థకం చేశాయి. పరిణతి ఏమాత్రం లేని ఒక రాజకీయవేత్తలా ఆయన చిత్తం
వచ్చిన ప్రతి మాటా మాట్లాడారు.
కాంగ్రెస్ అధిష్ఠానం పాత్ర
గురించి, కుట్రల గురించి ఇక్కడే సందేహాలు వాస్తవాలుగా కనబడుతున్నాయి.
నిజానికి తాత్సారం తర్వాత ఒక పద్ధతి ప్రకారంగా సీమాంధ్ర అశోక్‌బాబులను,
అపోహల ఆధారంగా రెచ్చగొట్టగలిగారు. విభజన ప్రక్రియను ఒక బ్రహ్మపదార్థంగా
రహస్యంలాగా తయారు చేశారు. విభజన తప్ప అన్నీ చర్చలకు, సంప్రదింపులకు,
పట్టువిడుపులకు ఆస్కారం ఉన్నవేనని ఒకసారి క్యాబినెట్ నోట్ తర్వాత ప్రభుత్వ
ప్రకియలో ఈ అంశాలన్నింటినీ పరిష్కరించవచ్చున్న విషయాన్ని మరుగుపరిచారు.
ఇది ప్రయత్న పూర్వకంగానే జరిగింది. ఎందుకంటే విభజనతో సీమాంవూధులకు కలిగే
కష్టనష్టాలు, లేదా సీమాంవూధుల అభ్యంతరాలు, ప్రధానంగా, ఉద్యోగాలు, ఉపాధి,
నీరు, విద్యుత్, నిధుల లాంటి ఉమ్మడి సమస్యలను పరిష్కరించుకోవచ్చనే ఒక
భరోసాను అధిష్ఠానం ఎందుకో కావాలనే ఉద్వేశపూర్వకంగా కల్పించలేదు. పైగా ఒక
సగటు ఆంధ్రా, మనస్తత్వం ఉన్న సమైక్యాంధ్ర అంటే, (యునైటెడ్ ఆంధ్ర)
ముఖ్యమంవూతిని, తెలంగాణ అంటే తీవ్ర ద్వేషాన్ని ప్రకటించే ముఖ్యమంవూతిని
కొనసాగించారు. ఆయన దాన్ని సావకాశంగా తీసుకొని సీమాంధ్ర ఉద్యమాన్ని, అబద్ధపు
పునాదుల మీద , ఊహాజనిత కష్టనష్టాల మీద, అపోహలను పెంచి పెద్దచేసి
నిప్పురాజేశారు. విభజన ఇక అసా ధ్యం అని, దాన్ని ఎప్పటిలాగానే అడ్డుకోగలమన్న
భరోసాను స్వయంగా ముఖ్యమంత్రి కల్పించి, అక్కడ మంట ఎగదోశారు. ఏపీఎన్జీవో
అధ్యక్షుడు అశోక్‌బాబు ఎట్లా ప్రారంభమై ఎట్లాంటి డిమాండ్లదాకా ఎదిగాడో?
ఇప్పుడు ఆయన ఏకంగా ప్రజల మధ్య ఉద్యోగుల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే ఒక
ప్రతీకయై, ఒక అనైతిక, అప్రజాస్వామిక, రాజ్యాంగ వ్యతిరేక ఉద్యమం కోసం,
దౌర్జన్యంగా మంత్రులను, రాజకీయ నేతలను రాజీనామా చేస్తారా? ఛస్తారా! అనేదాకా
ఎట్లా ఎదిగాడో చూస్తే ముఖ్యమంత్రి, కాంగ్రెస్ అధిష్ఠానం ఇచ్చిన
సావకాశాన్ని ఎంతగా సద్వినియోగం చేసుకున్నారో? ఇప్పుడు అధిష్ఠానానికే
సవాళ్లు విసిరేంతగా ఎదిగాడో అర్థమవుతుంది.
నిజానికి సీమాంధ్ర
ప్రజలు, అదృష్టవంతులు వాళ్ల ఉద్యమానికి ఒక ముఖ్యమంత్రి, అది కూడా ఎవరైనా
ఏమన్నా అనుకుంటారేమో. నన్ను స్టేట్స్‌మేన్ కాకుం డా కుట్రదారు అంటారేమొనన్న
కనీస బెదురులేని సగటు ఆంధ్ర మనస్తత్వం గల ప్రాంతీయ ఫండమెంటలిస్టు’ వారి
నాయకుడు. ప్రభుత్వమే నాయకత్వం వహి స్తున్న ఉద్యమాన్ని కూడా బహుశా తెలుగు
ప్రజలు మొట్టమొదటిసారి చూస్తూ ఉండడం కూడా తెలుగు వారి పూర్వజన్మసుకృతం.
ఆంధ్ర జేఏసీ చైర్మన్‌కు ఏమి అధికారాలు ఉంటాయి. ముఖ్యమంత్రి కన్నా...ండు
ప్రాంతాలు కలెగలిసి విలీనమైన ఒక రాష్ట్రంలో, ఒక ప్రాంతం విలీనం చేదు
అనుభవమై, భంగపడి, నష్టపోయి విభజన కోసం ఉద్యమించి ఫలితం సాధిస్తున్న క్షణాన,
తెలంగాణ ద్వేషిగా వ్యవహరిస్తున్న ఒక ముఖ్యమంత్రి ఎంతైనా చేయగలరు. బహుశా
కిరణ్‌కుమార్‌డ్డి అదే పనిలో ఉన్నారు. నిజానికి ఆయన మాటలకు ఆవేశపడడం,
ఆశ్చర్యపోవడం ఇక ముందు అవసరంలేదు. ఆయన అంతే. అయితే ఇక్కడ విషయం ఏమంటే
అదిష్ఠానం ఆయనకు కల్పిస్తున్న వెసులుబాటు వెనక రహస్యం ఏమిటి? ఎందుకోసం? ఈ
వెసులుబాటు ఇప్పుడు అయిపోయిందా? జగన్ విడుదల అనంతర పరిణామాల తర్వాత తమకు
భవిష్యత్ ఇక లేదని తెలుసుకున్న, తేల్చుకున్న తర్వాతనే కిరణ్‌కుమార్‌డ్డి,
ఎంపీలు ధిక్కరించి రాజీనామాల బాట పడుతున్నారా? ఇవీ ఇప్పటి ప్రశ్నలు.
రావాల్సిన సమాధానాలు.
విశాలాంధ్ర ఒక విఫల ప్రయోగం. బలవంతపు
విలీనం నుంచి తెలంగాణ విముక్తి కోరుకుంటున్నది. హైదరాబాద్‌తో విలీనం
అయ్యింది కనుకనే హైదరాబాద్‌తో సహా విడిపోబోతున్నది. కానీ విభజనతో ప్రపంచం
మునిగిపోతుందని, భూమి బద్దలవుతుందని, ప్రళయం వస్తుందని అపోహలను పెంచి
పోషిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొడ్తున్నది.
అధిష్ఠానం దీనికి ప్రధాన బాధ్యత వహించాల్సి ఉన్నది. ప్రాంతీయ ఫండమెంటలిజం
ప్రమాదకరమైనది. తెలంగాణది ప్రాంతీయత సమస్య కాదు. తను కోల్పోయిన స్వేచ్ఛను
మళ్లీ పొంద డం. దీనికి వ్యతిరేకంగా మెజారిటీ ప్రాంతీయ ఫండమెంటలిజాన్ని
రెచ్చగొడ్తున్న కాంగ్రెస్ పార్టీ దానికి తగిన మూల్యం చెల్లించాల్సి
వస్తుంది. జఢత వీడి, నిజంగానే సీమాంధ్ర ప్రజల్లో వ్యాపింపజేసిన అపోహలను,
అనుమానాలను తొలగించడానికి తక్షణమే పార్లమెంటులో బిల్లు పెట్టాలి. ప్రభుత్వ
సంస్థలు రంగంలోకి దిగి విభజన సంప్రదింపులు జరపాలి. అధికారికంగా విభజన
సత్వరమే జరిగిపోవాలి. లేదంటే కాంగ్రెస్ కుట్ర రాజకీయాలకు పాల్పడుతుందనే
విషయం అందరికీ అర్థమవుతుంది. అప్పుడిక ఆ పార్టీ కి ‘నా ఘర్ కా నా ఘాట్‌కా’
రెండుచోట్లా సమాధి కాక తప్పదు.. ప్రజల మధ్య విద్వేషాలకు కారకులయ్యే వారు,
ఇప్పటి ప్రపంచంలో తెలుగుజాతికి తీవ్ర నష్టం చేసిన వాళ్లుగా మిగులుతారు.
తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ అప్రమత్తతే దానికి రక్ష.
-అల్లం నారాయణ
narayana.allam@gmail.com;M