బ్రాండ్ నేమ్
చాలా బలమైనది. ఒక సారి ఒక బ్రాండ్ వినియోగ దారుల మనసుల్లో బలంగా నాటుకుంటే
అది చెరిగిపోదు. ఈ నాటడం కోసమే అనేక కంపెనీలు కోట్లు దారపోసి
క్రికెటర్లనూ, సినీ తారలనూ తమ బ్రాండ్ అంబాసిడర్లుగా వాడుకుంటారు. అలాంటి
ఒక బ్రాండ్ ఆపిల్. ఆ సంస్థ తయారుచేసే వస్తువులు కొనడానికి కొత్త ప్రోడక్టు
ఏదైనా విడుదల అయ్యేముందు ఆపిల్ షాపుల ముందు రెండు మూడు రోజులనుండే టెంట్లు
వేసుకొని క్యూలలో ఉంటారు జనం.
కొత్త ఐ ఫోను
ఎవరైనా కొనిస్తే అతనికి తన కన్యాత్వాన్ని అర్పిస్తానని ఆ మధ్య ఒక యువతి
ఇంటర్నెట్‌లో ఆఫర్ ఇచ్చింది. ఐ ప్యాడ్ కొనడానికి ఒక చైనా కుర్రవాడు ఏకంగా
తన కిడ్నీనే అమ్మి పారేశాడు. ఇంత క్రేజ్ ఉంది కాబట్టే ఆపిల్ సంస్థ ఎంత ధర
పెట్టినా వెచ్చించి ఆ కంపెనీ ఉత్పత్తులను జనం వెర్రిగా కొంటున్నారు. అయితే
నిజంగా అవి అంత ఖరీదు చేస్తాయా అని కొందరు నిపుణులు వాటిని పరీక్షించి
చూస్తే వెల్లడి అయిన నిజాలు చూడండి.
ఐ సప్ప్లై
అనే సంస్థకి చెందిన నిపుణులు లేటెస్ట్ వెర్షన్ ఐ ఫోన్ 4S ని విడదీసి ఆ విడి
భాగాల ఖరీదు లెక్క కడితే అది 120 పౌండ్లుగా తేలింది. అదే ఫోను 32 GB
వెర్షన్ 499 పౌండ్లకి అమ్ముడు బోతూంది. మన కరెన్సీలో చూస్తే తయారీకి
అయ్యేది పది వేలయితే అమ్మేది నలభై వేలు. ఈ అధిక ధర ఆ ఫోన్ కోసం ఆ కంపెనీ
వెచ్చించిన రీసెర్చ్, డెవలప్‌మెంట్ తదితరాలకూ, కంపెనీకున్న ఇమేజ్‌కీ
వినియోగదారుడు చెల్లిస్తున్నట్టు అనుకోవాలి. ఐ ఫోన్‌తో అన్ని విధాలుగా
పోల్చదగ్గ శామ్‌సంగ్ S2 ఫోన్ 32 వేలకే దొరుకుతుంది. ఐ ఫోన్‌లో వాడే మెమరీ
చిప్స్ తయారుచేసేది శామ్‌సంగ్ కావడం ఒక విశేషం. శామ్‌సంగ్ కంపెనీ నుండి
మెమరీ చిప్స్ కొనుగోలు చేసే కంపెనీలలో అతి పెద్దది ఆపిల్.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి