“ఆకుపై” ఉద్యమాలు ప్రపంచంలో ఎక్కడెక్కడ జరుగుతున్నాయి? -మ్యాప్
18-11-2011 తేదీ నాటికి తనకు అందిన
సమాచారం మేరకు ‘ది గార్డియన్’ పత్రిక ‘ఆకుపై’ ఉద్యమాలు నడుస్తున్న
ప్రాంతాలను ప్రపంచ పటంపై గుర్తించి ప్రచురించింది. ప్రపంచవ్యాపితంగా 82
దేశాల్లోని 951 నగరాల్లో ‘ఆకుపై’ ఉద్యమాలు జరుగుతుండగా తాను 750 నగరాలను
గుర్తించినట్లుగా ‘ది గార్డియన్’ చెబుతోంది. అమెరికాలో ‘ఆకుపై వాల్
స్ట్రీట్’ గా ప్రారంభమైన చోట (జుకొట్టి పార్క్) ఆందోళనకారులను రెండు రోజుల
క్రితం పోలీసులు బలవంతంగా ఖాళీ చేశారు. అమెరికాలోని ఇతర నగరాల్లో కూడా
ఇలాగే పోలీసులు బలప్రయోగం చేసి ఆక్రమిత పబ్లిక్ ప్రదేశాలను ఖాళి చేయించారు.
ఈ ఖాళీ చేయించిన వార్తలను ‘ది గార్డియన్’ పత్రిక, ఎందుకనో ప్రస్తావించడం
లేదు.
అమెరికా, యూరప్ లలోనే ప్రధానంగా ఆకుపై
ఉద్యమాలు కేంద్రీకృతం అయిన దృశ్యాన్ని పై పటంలో చూడవచ్చు. ఇతర ప్రాంతాల్లో
ఉద్యమాలు నడుస్తున్నప్పటికీ అవి కేవలం ఒక రోజు సంఘటనల వరకే పరిమితం
అవుతున్నాయి తప్ప అమెరికా, యూరప్ లలో జరుగుతున్నట్లుగా క్యాంపులు వేసుకుని
రోజులు, వారాల తరబడి జరగడం లేదు. అమెరికా, యూరప్ లలో ప్రభుత్వాలపైన ప్రజలు
విసిగిపోయి ఉన్నారని ఆకుపై ఉద్యమాలు రుజువు చేస్తున్నాయి. అయితే ప్రజా
ఉద్యమాలు కార్మిక వర్గ దృక్పధం ఉన్న సంస్ధల ఆధ్వర్యంలో కాకుండా బోగస్ ఉద్యమ
సంస్ధల ఆధ్వర్యంలో నడుస్తుండడమే అసలు విషాధం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి