28, నవంబర్ 2011, సోమవారం

ఆక్సిజన్‌కు 2480,00,00,000 ఏళ్లు


ప్రాణవాయువు ఆక్సిజన్‌కు 2480,00,00,000 ఏళ్ల సంవత్సరాల ప్రాయమని తాజా పరిశోధన ఒకటి వెల్లడించింది. ఇనుముకు ధీటుగా నిలిచే ఆస్ట్రేలియాలోని పిల్బర రాళ్ల నుంచి సేకరించిన నమూనాల ఆధారంగా తాము జరిపిన పరిశోధనలో ఈ మేరకు ఒక అంచనాకు రాగలిగామని అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం తెలిపింది. వాతావరణంలో ప్రాణవాయువు(ఆక్సిజన్‌) ఉనికిని సుమారు 2.48బిలియన్ల సంవత్సరాల క్రితం గుర్తించినట్లు ఈ పరిశోధనకు నాయకత్వం వహించిన ప్రొఫెసర్‌ మార్క్‌ బార్లీ తెలిపారు. బార్లీ బృందం పరిశోధన తాలూకు వివరాలను 'నేచర్‌' తాజా సంచికలో ప్రచురించారు. అయితే పరిశోధనకు ప్రామాణికంగా ఎంచుకున్న రాళ్ల విశ్వసనీయత ఏపాటిదనే అనుమానాలు నలుచెరగులా వ్యక్తమవుతున్నాయి. లభించిన సాక్ష్యాధారాలను బట్టి వాతావరణంలో ఆక్సిజన్‌ ఉనికికి సంబంధించి ఇదే అతి ప్రాచీనమైన అంచనగా బార్లీ తెలిపారు. భూమి మీదుండే రాళ్లు రప్పలను కూడ కరగించగల రసాయన ఆమ్లం (యాసిడ్‌) వెలువడటానికి ఆక్సిజనీకరించిన పైరైట్‌ కారణంగా ఆయన చెప్పారు. ఆక్సిజన్‌ శ్వాసగా బాక్టీరియా ఊపిరిపోసుకున్న తొలి ఘటన ఇదేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ప్రక్రియకు ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సియనోబాక్టీరియా కారణమన్నారు. ఇందుకు కీమోలిథో-ఆటోరోబిక్‌ బాక్టీరియాల పరస్పర ఉనికి అవసరమని ఆయన తెలిపారు. దీని సాయంతో మరింత ఆధునిక డేటా సేకరణకు భూజీవశాస్త్రవేత్తలు కృషి చేస్తున్నారని బార్టీ తెలిపారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి