7, నవంబర్ 2011, సోమవారం

ప్రశ్నార్థకంగా ట్రైవ్యాలీ విద్యార్థుల భవిష్యత్తు


AA

* దేశం విడిచిపోలాంటూ యూఎస్ నోటీసులు ?
* రోడ్డున పడ్డ భారత విద్యార్థులు
* మరోసారి అమెరికా వేధింపులు
* అంధకారంలో భారత విద్యార్థులు
* విద్యార్థులకు న్యాయం చేస్తామని గతంలో హామీ
* ఇతర యూనివర్శిటీల ప్రవేశానికి పరిశీలన
* హామీలకు మంగళం
* \"షా \" కిచ్చిన అమెరికా ప్రభుత్వం


ట్రైవ్యాలీ విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడింది. విద్యార్థులను ఆదుకుంటామని యూఎస్ అధికారులు హామీ ఇచ్చినా నిన్న ఒక్క సారిగా దేశం వదలి వెళ్లిపోవాలంటూ అక్కడి అధికారులు హుకుం జారీ చేశారు. దీంతో ట్రైవ్యాలీలో చదువుతున్న విద్యార్థులు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ట్రైవ్యాలీ విద్యార్థుల భవిత మళ్లీ ప్రశ్నార్థకంగా తయారైంది. ఇప్పటికి పలుమార్లు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోని...ఏదో ఒక యూనివర్శిటీలో అడ్మిషన్ల కోసం ప్రయత్నస్తున్నా ఆ విద్యార్థుల నెత్తిపై అమెరికా ప్రభుత్వం మరో పిడుగు వేసింది.

దేశం విడిచి వెళ్లి పోవాలంటూ ఆదివారం నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు వీసాలు జారీ చేయడంలో అవకతవకలకు పాల్పడిన ట్రైవ్యాలీ యూనివర్శిటీని అమెరికా ప్రభుత్వం మూసివేసిన విషయం తెల్సిందే. దాంతో వందలాది మంది భారత విద్యార్థులు రోడ్డున పడ్డారు. బాధిత విద్యార్థులు భారత ప్రభుత్వానికి మొరపెట్టుకోగా అక్కడి ఎంబసీ రంగంలోకి దిగి, ప్రభుత్వ అధికారులతో చర్చలు జరిపింది. బాధిత విద్యార్థులందరికీ ఇతర యూనివర్శిటీల్లో అడ్మిషన్లు కల్పిస్తామని ట్రైవ్యాలీ ప్రతినిధులు హామీలు కూడా ఇచ్చారు.

ఈ క్రమంలో ఆ విద్యార్థులకు సంబంధించిన వివరాల పరిశీలనను కూడా చేపట్టారు. వారిలో దాదాపు 435 మంది విద్యార్థులకు ఇతర యూనివర్శిటీల్లో చేరడానికి అమెరికా అధికారుల అనుమతితో పాటు...మిగిలిన వారి వివరాలను పరిశీలిస్తున్నట్లుగా ప్రకటించారు. ఇక ఇబ్బందులు తీరిపోతాయని సంతోషించిన ట్రైవ్యాలీ బాధిత విద్యార్థులకు ఆదివారం అమెరికా ప్రభుత్వం షాకిచ్చింది. దేశం వదలి వెళ్లిపోవాలంటూ ఆదేశించడంతో భవిష్యత్తు అంధకారంలో పడిందని విద్యార్థులు వాపోయారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి