21, నవంబర్ 2011, సోమవారం

బాబోయ్ రూపాయి

...
స్టాక్‌మార్కెట్లలో బలహీన ట్రెండ్, యూరో రుణ సంక్షోభం ముదురుతుండటంతో డాలర్‌కి డిమాండ్ పెరిగి...
ముంబై: స్టాక్‌మార్కెట్లలో బలహీన ట్రెండ్, యూరో రుణ సంక్షోభం ముదురుతుండటంతో డాలర్‌కి డిమాండ్ పెరిగి రూపాయి పతనం కొనసాగుతోంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ దాదాపు 33 నెలల కనిష్టానికి క్షీణించింది. ఫారెక్స్ మార్కెట్లో ఏకంగా 81 పైసలు (1.58 శాతం) బలహీనపడి 52.15 వద్ద ముగిసింది. దీంతో రూపాయి విలువ వరుసగా ఆరు సెషన్లలో 203 పైసలు (4.05%) క్షీణించినట్లయింది. క్రితం ముగింపుతో పోలిస్తే ట్రేడింగ్‌లో బలహీనంగానే 51.43 వద్ద మొదలైన రూపాయి.. ఆ తర్వాత క్రమంగా 52 స్థాయి దిగువకి క్షీణించింది. చివరిగా 2009 మార్చి 3నాటి 52.19 స్థాయిని నమోదు చేసింది.

ప్రస్తుతం రూపాయి బలహీన పడటానికి గల అనేక కారణాల్లో, దిగుమతిదారులు.. అందులోనూ ప్రధానంగా ఆయిల్ రిఫైనర్ల నుంచి డాలర్లకు డిమాండ్ పెరుగుతుండటం కూడా ఒకటని డీలర్లు పేర్కొన్నారు. అలాగే, రూపాయి పతనాన్ని అడ్డుకోవడంలో రిజర్వ్ బ్యాంక్‌కి ఉన్న సామర్ధ్యం కూడా పరిమితమేనంటూ ఆర్థిక శాఖ వర్గాలు ప్రకటించడం సైతం మార్కెట్ సెంటిమెంట్‌పై ప్రతికూల ప్రభావం చూపిందన్నారు. ఇదమిత్థంగా నిర్ధారణ కాకపోయినప్పటికీ, రిజర్వ్ బ్యాంక్ ఒక దశలో ఫారెక్స్ మార్కెట్లో జోక్యం చేసుకుని ఉండి ఉంటుందని.. అందుకే రూపాయి క్షీణత కొంతైనా ఆగి ఉండొచ్చని స్టాండర్డ్ చార్టర్డ్ బ్యాంక్ ట్రెజరీ హెడ్ అనంత నారాయణ్ అభిప్రాయపడ్డారు. మరికొన్నాళ్లు రూపాయి క్షీణత కొనసాగవచ్చునని, నేడో.. రేపో చరిత్రాత్మకమైన 52.19 కనిష్ట స్థాయికి తగ్గవచ్చునని జేఆర్‌జీ వెల్త్ మేనేజ్‌మెంట్ ఫారెక్స్ డెరివేటివ్స్ అనలిస్ట్ బిటుపన్ మజుందార్ చెప్పారు. ఆపైన కొన్ని నెలల్లో 54 స్థాయికి సైతం క్షీణించే అవకాశాలున్నాయని తెలిపారు. ప్రస్తుతం ఆసియాలో అత్యధికంగా పతనమైన కరెన్సీల్లో మొదటి స్థానంలో ఉన్న రూపాయి.. అంతర్జాతీయంగా నాలుగో స్థానంలో ఉంది.

పరిస్థితి చక్కబడొచ్చు: మాంటెక్ సింగ్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా కరెన్సీ మార్కెట్లో ఉంటున్న భారీ హెచ్చుతగ్గులే రూపాయి క్షీణతకు కారణమవుతున్నాయని ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ మాంటెక్‌సింగ్ అహ్లువాలియా చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి