16, నవంబర్ 2011, బుధవారం

ఆ దివంగత పరిపాలకుడి వెలుగూ నీడా


న్న లిబియా అధ్యక్షుడు మువమ్మర్ఖదాఫీని తిరుగుబాటరులు పట్టుకుని కాల్చిచంపారని తెలుస్తోంది. ఆదేశంలో ఉప్పతిల్లుతున్న తాజా పరిణామాల గుఱించి నేను ఎప్పటికప్పుడుతెలుసుకుంటూ ఉన్నాను. ఈ వార్త నాకు ఖేదాన్ని కలిగించింది. దివంగతఖదాఫీ చంపదగ్గ తప్పులేమైనా చేసినట్లు కనిపించక పోవడం ఒక కారణం.తిరుగుబాటరులమని చెప్పుకునే లిబియన్లు వాస్తవానికి దేశద్రోహులూ, పంచమాంగ దళాలూ కావచ్చునని మొదట్నుంచీ నాకో అనుమానం. తరువాత్తరువాత కొందఱు అమాయక ఆవేశపరులు కూడా బుద్ధిలేక వారితో చేఱి ఉంటారు. సాధారణంగా ప్రపంచంలో ఎక్కడైనా సరే, దురుద్దేశాలతో మొదలయ్యే తప్పుడు ఉద్యమాలకి ఒక అనర్హమైన ధర్మబద్ధత (undeserved legitimacy) ని ప్రసాదించేది ఇలాంటి అమాయక ఆవేశపరుల పొలో-చేఱికలే. 

లిబియాది ఒక పురాణవైర గాథ. నా చిన్నప్పట్నుంచీ ఆ రెండు దేశాలకీ ఆఱుంబాతికే. ఒకసారైతే అమెరికా లిబియా రాజధాని ట్రిపోలీ మీద బాంబుల వర్షాన్ని కుఱిపించింది. అప్పుడు ఆ దాడిలోంచి ఖదాఫీ చావుతప్పి కన్ను లొట్టపోయిన విధంగా తప్పించుకుని బయటపడ్డాడు. కానీ పసిబిడ్డయిన అతని కూతురు మాత్రం చనిపోయింది. ఆ కక్షతో అతను ఒక పాన్-అమ్ విమానాన్ని కూల్చివేయడానికి తీవ్రవాదులతో సహకరించాడు. అలాగే అప్పట్లో యు.కె. మీద పోరాడుతూ ఉన్న IRA అనే తీవ్రవాద సంస్థక్కూడా ఇతోఽధిక సహాయాలు అందించాడు. ఆవేశంలో చేసిన ఈ పనులు అతని జీవితచరిత్రకి మాయని మచ్చలుగా మిగిలిపోయాయి.

తన కంటే ఎన్నో రెట్లు శక్తిమంతమైన అమెరికాతోలిబియాకి ఎందుకని శత్రుత్వం ? ప్రశ్ననే మఱో విధంగా వేస్తే -తన కంటే ఎన్నోరెట్లు బలహీనమైన లిబియా అంటే అమెరికాకి ఎందుకింతద్వేషం ? ఇదొక పాతకథ. నదులై,సముద్రాలైప్రవహించే ముడిచమురు గలిగిన ప్రతి దేశంలోనూప్రతికొన్నేళ్ళకీ పునః పునరావృత్తమౌతూ కంచికి చేఱని విషాదకథ. ముడిచమురుభారీగా ఉన్న ప్రతిదేశం దగ్గఱికీ అగ్రరాజ్యం ఆగమేఘాల మీద ఱెక్కలు కట్టుకునివాలిపోతుంది. తాము చెప్పిన ధరకే ప్రతి సంవత్సరమూ ఇంత ముడిచమురుని తమకిధారాదత్తం చేయాలంటుంది. లేకపోతే ఆ ముడిచమురు వెలికితీసే పనిని తమసార్థవాహాలకే అప్పగించాలంటుంది. 

ఈ తరహా సంఘటనలు ప్రపంచంలో ఇప్పటిదాకా ఎంత తఱచుగాజఱిగాయంటే ఇవన్నీ చూసీ, చూసీ మాలాంటి సామాన్యులం కూడా ఈ అంతర్జాతీయ వ్యవహారాల్లోపండిపోయాం. ఇప్పుడు తెలుగు కోస్తా జిల్లాలలో కూడా భారీగా ముడిచమురుదొఱికే అవకాశాలున్నాయని వార్తలొస్తున్నాయి. గతానుభవాల్నిపురస్కరించుకుంటే దాని గుఱించి ఱేపు తెలుగువాళ్ళం కూడాఎన్ని యుద్ధాలుచేయాల్సి వస్తుందో మఱి తెలీదు. ఈ తరహా అంతర్జాతీయగూండాయిజానికి ఎదురొడ్డి నిలిచిన ఏకైక నాయకుడు వెనిజులా (దక్షిణఆమెరికా ఖండం) అధ్యక్షుడు హ్యూగో చావెజ్. తమ దేశపు చమురుక్షేత్రాల నుంచి విదేశీ సార్థవాహాల్ని ధైర్యంగా, నిర్దాక్షిణ్యంగా గెంటిపారేసి, అవన్నీ జాతీయం చేసి ఆధనాన్ని వెనిజులన్ ప్రజల సంక్షేమం కోసం, స్వదేశాభివృద్ధి కోసం ఉపయోగిస్తున్నాడుమహానుభావుడు. భవిష్యత్తులో అలాంటి ధీరోదాత్త నాయకుడు అవసరం ఆంధ్రులక్కూడా !

ఖదాఫీని చంపడంఅన్నివిధాలా ఒక హేయకృత్యం. పాపం, 70 ఏళ్ళకి పైబడిన వృద్ధుడూ, అస్వస్థుడూ, నిరాయుధుడూ, పదవీభ్రష్టుడూ, ఒంటరివాడూ అయిన ఒక బక్కపెద్దాయన చేతులెత్తి సలామ్ కొడుతూ, "నన్ను చంపొద్దు.రక్షించండి" అని దీనంగా అఱుస్తూంటే, నిస్సహాయుడైన ఆశరణాగతుణ్ణి నిర్దాక్షిణ్యంగా చంపేశారే ! ఏం న్యాయబద్ధత ఉంది ఈహత్యలో ? ఏం ధర్మబద్ధత ఉంది ఈ దురాగతంలో ? ఏం వీరోచితత్వం ఉంది, పదిమంది కలిసి మూలనున్నముసలివాణ్ణి చంపడంలో ? ఆయన తమఱికి నచ్చకపోతే ఆయన్నిఅరెస్టు చేసి ఆయన ఏయే తప్పులు చేశాడంటున్నారో వాటి మీద విచారణ కోసంన్యాయస్థానంలో నిలబెట్టి ఉండొచ్చు గదా ? ఆయనకు తన వాదనని సైతం బహిరంగంగావినిపించే అవకాశం ఇచ్చి ఉండొచ్చు గదా ? న్యాయాన్యాయాల్ని న్యాయమూర్తులునిర్ణయించలేరా ? అన్నింటినీ రోడ్లమీదే తేల్చుకోవడం ఏ విధమైన ప్రజాస్వామ్యం ?అదే, ప్రజల్ని అలా చంపేస్తేపాలకుల్ని నిందిస్తారే ! మఱి పాలకుల పట్ల మటుకు ఈ విధమైననిర్‌ఘృణమైన క్రూరనడత చూపించడం సమంజసమేనా ?

ఖదాఫీని"నియంత" అని ముద్రవేసిన తమఱు ఇందులో అతని కంటే తాము ఏ మాత్రం మెఱుగని నిరూపించుకోగలిగారు ? అతని శవాన్ని ఒక మంచీ, మన్ననా ఏమీ లేకుండా రోడ్డుమీద పడేసి ఈడ్చారు. నలభయ్యేళ్ళపాటు దేశాన్ని కాపాడిన వ్యక్తికి ఇవ్వాల్సిన మర్యాదేనా ఇది ? పండువృద్ధాప్యంలోకి అడుగుపెట్టిన అస్వస్థ ఖదాఫీ ఎవఱూ చంపకపోయినా ఱేపో మాపో తనంతట తాను కాలం చేసేవాడే. అటువంటప్పుడు ఎందుకని అనవసరంగా అతని ఒంట్లోకి తూటాలు దించి పాపం మూటగట్టుకున్నారు ? అతన్తోపాటు అతనికొడుకుని కూడా చంపేశారట. ఆనాడు ఖదాఫీ కూతుర్ని చంపారు. ఈనాడు అతని కొడుకునిచంపారు. పాపం ! అతని కొడుకు ఎవఱికి ఏమపకారం చేశాడు ? దీనంతటి వెనకా పాశ్చాత్యులడెస్పరేషన్ కనిపిస్తోంది. ఖదాఫీలాంటి స్వతంత్ర నాయకులూ, లేదా అతని వారసులూమళ్ళీ భవిష్యత్తులో మొలకెత్తకుండా దుంపనాశనం చేయాలనే సంకల్పంకనిపిస్తోంది. అతను బతికుంటే, అతని వాదన అతను చెప్పుకుంటే తమ ఆటలు సాగవు. అందుకనిఅసలు ఆ అవకాశం ఇవ్వనే వద్దు.

లిబియా గడ్డ నలుమూలలావేలాది కిలోమీటర్ల పొడవున ఖదాఫీ వేయించిన మంచినీటి పైప్‌లైన్ల సంపర్కజాలం  

ఖదాఫీ ఏమపకారంచేశాడు లిబియాకీ, దాని ప్రజలకీ ? ఎందుకీ తిరుగుబాటరులు అమెరికాతో చేతులు కలిపారు ?దీనికి సరైనసమాధానం "తిన్నది అఱక్క" అనుకుంటా ! నిజానికి లిబియానిసుఖసంతోషాలలో ముంచెత్తిన నాయకుడు ఖదాఫీ. అతను ఆ దేశం పాలిట అపర భగీరథుడు. ఈఆధునిక కాలంలో ప్రజాసంక్షేమం కోసం అంతకంటే తపించిన నాయకుడు లేడు. అతనిపాలనలో అవినీతి లేదు. ప్రజాధన దోపిడి లేదు. తిండికీ, బట్టకీ, ఇంటికీ కొదవ లేదు. అతని పాలనలో 65లక్షలఎడారిజనమంతా హాయిగా నీడపట్టున వేళకి తిని, పడుకొని, యాపిల్ పళ్ళలా, జాంపళ్ళలా పుష్టిగా,ఎఱ్ఱగా, తెల్లగా తయారయ్యారు.లిబియా యొక్క ముడిచమురు వనరుల్ని బలవద్ దేశాలు దోచుకుపోకుండా నలభయ్యేళ్ళ పాటు నిలబడి కుక్కలా కాపలా కాసినవాడతను. సింహంలా గర్జించినవాడతను. అరబ్బీజాతి అంతా అంతర్గత విభేదాల్ని మఱచి ఏకం కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించిన దార్శనికుడతను. అందుకోసమని ఒక దశలో తనదేశాన్ని ఈజిప్టులో విలీనం చేయడానికీ, తన అధ్యక్ష పదవినిపరిత్యజించడానికీ సైతం సిద్ధపడ్డాడు. కానీ ఈ రకమైనవిలీనానికి ఈజిప్ట్ అంగీకరించకపోవడంతో యథాతథ స్థితిని కొనసాగించకతప్పింది కాదు. అలాంటివాణ్ణి అధికార పిపాసువుగా అభివర్ణిస్తున్నాయిపాశ్చాత్య మీడియా, మఱియు దానికి ఎప్పటికప్పుడు అప్-టు-డేట్‌గా వంతపాడేతానతందానగాళ్ళైన భారతీయ మీడియా.    

లిబియా ఎడారిలో ఖదాఫీసృష్టించిన మానవనిర్మిత అద్భుతాల్లో ఒకటి ఈ మంచినీటి సరస్సు

ఆ ఎడారిదేశంలోరోజుకు 24 గంటలూ నీటి సరఫరా జఱిగేలా చూసిన మహాత్ముడతను. పైగా లిబియాకి మఱో వందేళ్ళపాటు నీటి కొఱత ఉండకూడదనే దూరదృష్టితో శాస్త్రవేత్తల్నీ, ఎంజినీర్లనీ అందఱినీసమన్వయపఱచి లిబియా భూగర్భంలో ప్రవహిస్తున్న ఒక అంతర్వాహినినికనుగొనడానికి స్ఫూర్తినిచ్చాడు. ఆ అంతర్వాహిని నుంచి లిబియాలోనిఅన్ని నగరాలకీ, పట్టణాలకీ, గ్రామాలకీ వేలాది కిలోమీటర్ల పొడవునా పైప్‌లైన్లువేసినవాడతను. ఎడారిదేశంలో మానవనిర్మిత నదినీ, మంచినీళ్ళ సరస్సుల్నీసృష్టించాడు. ఎంతో కష్టించి ఆ మరుభూమిని సస్యశ్యామలం చేశాడు.నదులుండీ, సరస్సులుండీ, అపారమైన భూగర్భజలాలుండీ మనమూ అలమటిస్తున్నాం అనేక తెఱగులనీటికొఱతతో ! ఖదాఫీలా ఆలోచించిన నాయకుడు ఎవడైనా ఉన్నాడా మనకి ? ఒకఱికి నీళ్ళిస్తేఇంకొకఱు అసూయతో ఏడ్చి మొత్తుకునే దౌర్భాగ్య దేశమిది. అనుకుంటూఅనుకుంటూ ఏళ్లూ పూళ్లూ గడిపేస్తాం. అందుకే మన దగ్గఱ తాత ప్రారంభించినచేపట్టునే మనవడు కూడా కొనసాగిస్తూంటాడు.

ఇలాంటి భారీడిగ్గర్లతో త్రవ్వించాడు

స్వేచ్ఛ కావాలని చెప్పి ఖదాఫీ మీద తిరుగుబాటుచేశారట. నవ్వొస్తోంది.  కూడూ, గుడ్డా, కొంపా, గోడూ తప్ప మిహతా అన్నీ ఉన్న అనుత్పాదక స్వేచ్ఛ దండిగానే ఉంది ఇండియాలో ! ఇక్కడ ఎవణ్ణి పడితే వాణ్ణి తిట్టొచ్చు. ఎంత ఛండాలంగా, అశ్లీలంగా నైనాతిట్టొచ్చు. ఎక్కడ పడితే అక్కడ ఉచ్చలు పొయ్యొచ్చు. ఉమ్ములేయొచ్చు.ఇష్టమొచ్చిన వేళకి ఆఫీసుకి రావొచ్చు. లంచాలివ్వొచ్చు. పుచ్చుకోవచ్చు. ఏంచేసుకోవాలంటారు ఇలాంటి స్వేచ్ఛతో ? ఈ తెఱగు స్వేచ్ఛ మన వైయక్తిక అహాన్నితనుపుతుంది. కడుపు మాత్రం నింపదు. అయినా ఖదాఫీ ఏ స్వేచ్ఛని కాలరాచాడోఇప్పటిదాకా స్పష్టత లేదు. ఇదేదో అతన్ని గద్దెదింపడం కోసం పాశ్చాత్య ముఠాచెబుతున్న కుంటిసాకులా ఉంది. నిజానికి అన్ని దేశాల్లో లాగే లిబియాలో కూడాపత్రికలున్నాయి. టీవీలున్నాయి. రేడియోలున్నాయి. ఉచిత విద్య ఉంది. ఎవఱిమతాన్ని వాళ్ళు అనుసరించే స్వేచ్ఛ ఉంది. ఆడవాళ్ళకి ఉద్యోగాలున్నాయి. సౌదీ,UAE, దుబాయిల్లోమాదిరి విగ్రహారాధకుల్ని ద్వేషించే వాతావరణం మాత్రం లిబియాలో లేదు,అది కూడా అరబ్బీమాట్లాడే ముస్లిమ్ దేశమే అయినప్పటికీ ! పాలకులుకఠినాత్ములని ఆరోపించే ముందు ప్రజలెలా ఉన్నారో కూడా ఒకసారి గమనించండి.అందఱూ ఎవఱి పరిధిలో వారు పిల్లరాక్షసుల్లాగానే ఉన్నారు. ఈ పిల్లరాక్షసుల్ని అదుపుచేయాలంటే ఈ రోజుల్లో ఒక పెద్ద రాక్షసుడు కావాలి. ఒక కుటుంబాన్నే అదుపుచేయలేకపోతున్న రోజుల్లో కోట్లాది జనాభాలు గల దేశాల్ని అదుపు చేయాలంటే సుకుమారసున్నిత హృదయులూ, నిష్కల్మషులూ చాల్తారా ?           

లారీలు కూడాదూరిపోయేటంత ఇలాంటి  పెద్దపెద్దమంచినీటి పైపుల్ని దేశమంతా శాశ్వత ప్రాతిపదికన అల్లేశాడు

చనిపోవడానికిముందు ఖదాఫీ మీద ఎంతో బుఱద జల్లారు, పిచ్చికుక్క అని పేరుపెట్టి మంచికుక్కనిచంపాలన్న ధోరణిలో ! "బతికితే లిబియా గడ్డ మీదే బతకాలి, చనిపోతే లిబియా గడ్డమీదే చనిపోవాలి" అని నిర్ణయించుకున్న దేశభక్త నియంత ఖదాఫీ. అందుకేఅతను అవకాశముండీ ఎక్కడికీ పారిపోలేదు, ముషఱ్ఱాఫ్ మాదిరి ! అతను భావిదేశావసరాల కోసం  నిల్వ చేసి దేశీయ బ్యాంకుల్లో ఇల్లడం పెట్టిన బంగారాన్నిఅతని వ్యక్తిగత అక్రమార్జనగా అభివర్ణిస్తున్నారు. ప్రతిప్రభుత్వం దగ్గఱా అలాంటి బంగారం నిల్వలు కొంత ఉంటాయనే సత్యాన్నిమఱుగుపఱుస్తున్నారు. అదంతా అక్రమార్జనే అయితే, తన సొంత అవసరాల కోసమే అయితే మఱిఅది అతని ఇంట్లో ఎందుకు లేదు ? అది గుంజుకుని అతనెందుకు విదేశాలకి సకాలంలోపలాయనం చిత్తగించలేదనే విచికిత్స ప్రపంచ ప్రజల మనస్సుల్లో తలెత్తనివిధంగా స్వకీయ మీడియా డప్పులతో ఢమఢమా హోరెత్తించేస్తున్నారు. 

తిరుగుబాటరుల మీదా, దేశద్రోహుల మీదా చర్యలు తీసుకున్నందుకు అతన్నినరహంతకుండంటున్నారు. మీరే ఒక దేశానికి అధ్యక్షుడైతే ఆయుధాలు ధరించి మీ మీదతిరగబడ్డ ఆషాఢభూతుల్ని మీరేం చేస్తారు ? ఇతరదేశాలతో చేతులు కలిపి స్వదేశంలోగూఢచర్యాలకి పాల్పడేవాళ్ళని మీరేం చేస్తారు ? దేశంలో నక్సలైట్లని ఏంచేస్తున్నారు ? పాక్ ఏజంట్లని ఏం చేస్తున్నారు ? చెచెన్యా తిరుగుబాటర్లని రష్యా ప్రభుత్వం ఏంచేసింది ? వాయవ్య సరిహద్దు రాష్ట్రపు వేర్పాటువాదుల్ని పాకిస్తాన్ ప్రభుత్వంఏం చేసింది ? అదే చేశాడు ఖదాఫీ. తప్పేంటి ? వీళ్ళ వాదం ఎలా ఉందంటే అగ్రరాజ్యాలుఏ పనైనా చేస్తే అది ఆయా ప్రభుత్వాల తరఫున ఆజాతీయవాదులు చేసినవి. వాటికి ఎవఱి వ్యక్తిగత బాధ్యతా లేదు.ఉండకూడదు. అదే, లిబియా ప్రభుత్వం తరఫున  చేసినవాటికి మాత్రం ఖదాఫీయే వ్యక్తిగతంగాబాధ్యత వహించి నేఱస్థుడుగా బోనెక్కాలి. ఆహా ఏమి ధర్మం !

రెండోప్రపంచయుద్ధం తరువాత Marcos నుంచి ముషఱ్ఱాఫ్ దాకా ప్రపంచంలో నియంతలంతా అమెరికామద్దతుతో అధికారంలో కొనసాగినవాళ్ళే. అలా కానిది ఇద్దఱు. ఒకఱు సద్దామ్ హుస్సేన్.రెండోవారు ఖదాఫీ. పాశ్చాత్యులకి Boot licking చేయని పాపానికి వాళ్ళిద్దఱి మీదా ఎంతోఅసహ్యమైన బుఱద సృష్టించి మఱీ చంపారు. వాళ్ళు నిజంగా స్వార్థపరులేఅయితే, అధికారదాహంతోహత్యలకి వెనుకాడనివారే అయితే దానికోసం వారు కూడాతక్కిన అందఱు నియంతల మాదిరే ఏనాడో దాసోహం అంటూ bootlicking చేసుండేవారు.వారు అలాంటివారు కారు. కాబట్టే ఎదిరించారు. తమ మాతృదేశప్రయోజనాల కోసం నిజమైన దేశభక్తులుగా నిలబడ్డారు. బలైపోయారు. అయితేవారికి ప్రజామద్దతు ఎంతో ఉంది. ఉంది కాబట్టే ప్రతికూలమైన అంతర్జాతీయపరిస్థితులకి సైతం ఎదురొడ్డి దశాబ్దాల పాటు అధికారంలో నిలదొక్కుకో గలిగారు.వారిది ప్రజాస్వామ్య మార్గం కాదు. కానీ అంతమాత్రాన దానికదే ఒక నేఱం కాదు. 

మన మీడియాకిప్రజాసామ్యం పేరుతో చెలామణి అవుతున్న అరాచకం పట్లా, ప్రజాస్వామ్యం పేరుచెప్పుకుని అడుగడుగునా నిరంకుశత్వాన్నిచెలాయించే వేలాదిమందిగల్లీ-స్థాయి లోకల్  గూండాల పట్లా ఉన్న మమకారం నిజమైన బాధ్యత గలిగిన, నిబద్ధులైన పరిపాలకుల మీద లేదు. అందుకని ఖదాఫీ మీద ఉత్తిపుణ్యానికి దినపత్రికల్లో ఇలా అవాకులూ, చెవాకులూ వ్రాస్తున్నారు. నిజమే, ఎందుకంటే మీడియాస్వేచ్ఛ పేరుతోతప్పుడు కూతల్నీ, పరువునష్టాల్నీ నియంతలు సహించరు. కానీ మన మీడియాకి అలా తప్పుడుకూతలు కూసే, కూసి తప్పించుకునే, మనుషుల వ్యక్తిగత జీవితాల్లోకి చొఱబడివాళ్ళ పరువు తీసే స్వేచ్ఛ కావాలి. కాబట్టే వారికి రాజులూ, నియంతలూ సరిపడరు.అందుకని తమ యొక్క ఈ మీడియా ప్రయోజనాలు - అవే సువిశాల ప్రజానీకంయొక్క ప్రయోజనాలైనట్లుగా వారు ప్రచారం చేస్తూంటారు. వారు మంచివాళ్ళకివ్యతిరేకంగా ప్రజల మనస్సుల్ని విఱవడంలోనూ, పెడసరంగా తిప్పడంలోనూసిద్ధహస్తులు. మీడియా ఇష్టానిష్టాల కనుగుణంగా ధర్మాధర్మాలు నాటకీయంగా రూపుమార్చుకుంటూ ఉంటాయి. యుద్ధం అని పేరుబెట్టి వైమానిక దాడులతో ఒకేసారి  వేలాది, వందలాదిమంది సామాన్యపౌరుల్ని మట్టుపెడితేదాన్ని మనం తప్పుపట్టకూడదు. Collateral damage అని సర్దుకుపోవాలి. అదే,ఖదాఫీతిరుగుబాటరుల మీదా, దేశద్రోహుల మీదా, విదేశీ గూఢచారుల మీదా చర్యలు తీసుకుంటే మాత్రం అతను రక్తంతాగే రాక్షసుడవుతాడు. ఏం ద్వంద్వనీతి !

పరిపాలన అంటేప్రజాస్వామ్యమొక్కటే కాదు. ఎన్నో పరిపాలనా పద్ధతులున్నాయి. అవన్నీ ప్రజాస్వామ్యమంతగౌరవనీయమైనవే. ఏ పరిపాలనాపద్ధతీ ఇతర పద్ధతుల కంటే ఇసుమంత మేల్తరం కాదు.దేని లొసుగులు దానికున్నాయి. ఆయా వ్యవస్థలు ఎవఱి చేతుల్లో ఉన్నాయి,ఎవఱి చేతనడపబడుతున్నాయనే దాని మీద ఆధారపడి వాటికి గౌరవమూ, అగౌరవమూ సిద్ధిస్తాయి.ప్రజాస్వామ్యం అనేక పద్ధతుల్లో ఒకటి మాత్రమే. అంతే గానీ అదేసర్వోత్తమం కాదు. ఇతర పరిపాలనా పద్ధతుల్ని అవలంబించేవాళ్ళందఱినీదుర్మార్గులుగా చిత్రించడం అనేది ప్రజాస్వామ్య ముసుగేసుకున్ననిరంకుశత్వాన్నీ, సంకుచితత్వాన్నీ, అసహనాన్నే బయటపెడుతుంది. అన్ని దేశాలకీప్రజాస్వామ్యం నప్పదు. ఏ దేశానికి ఏ పరిపాలనా వ్యవస్థ బావుంటుందనేది ఆయాదేశాల స్థానిక పరిస్థితులు నిర్ణయిస్తాయి. అంతేతప్ప ఒకబాహ్య విదేశీశక్తి పిలవని పేఱంటంలా వచ్చేసి, వేలుపెట్టి "మాది ప్రజాస్వామ్యం. కాబట్టిమీకూ అదే బావుంటుంది" అని చెప్పి బలవంతంగా దాన్ని రుద్దితే అది అసహ్యం,అనాగరికం,అవగాహనారాహిత్యంఅనిపించుకుంటుంది.

అందుకే ఈరోజుల్లో మీడియా మసాలాల్ని అనుమానిస్తూ వీక్షించాలి. పూర్తిగా నమ్మేయకూడదు.  అంతిమంగా, రాజు అనండి. నియంత అనండి. నాయకుడనండి. ఏ పేరు పెట్టినా, ఏ వ్యవస్థ అయినా పరిపాలకుడు పరిపాలకుడే. అతన్ని బతికున్నప్పుడూ, చనిపోయినాకా కూడా ఒకేవిధంగా గౌరవించాలి. ఇది సంస్కృతీ, సభ్యత, సంప్రదాయం గల నాగరిక దేశాల లక్షణం.


గమనిక :- ఈ వడ్డింపు (ఫీడ్) అసలు సైట్‌లోని పాఠాంతరం నుంచి భేదించవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి