24 మంది అరెస్ట్
లండన్ : ప్రభుత్వ వ్యయ కుదింపు, విశ్వవిద్యాలయ బోధనా ఫీజుల పెంపుదలకు నిరసనగా
బుధవారం సెంట్రల్ లండన్‌లో వేలాది మంది విద్యార్థులు కదంతొక్కారు. ఈ సందర్భంగా
భారీగా పోలీసులను మోహరించారు. లండన్ విశ్వవిద్యాలయం నుండి మధ్యాహ్నం మొదలైన
ప్రదర్శనలో 2000 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారని పోలీసులు చెబుతున్నారు.
''విద్యా బడ్జెట్ కుదించవద్దు'' అంటూ కదం తొక్కిన విద్యార్థుల సంఖ్య 10 వేలని
నిర్వహకులు తెలిపారు. ప్రదర్శన మార్గం పొడవునా 4000 మంది పోలీసు లను మోహరించారు.
ఇంతకు ముందు జరిగిన నిరసన ప్రదర్శన హింసాత్మకంగా మారింది. గత డిసెంబరులో కొందరు
విద్యార్థులు బ్రిటీష్ యువరాజు ఛార్లెస్, ఆయన భార్య కమిల్లా వెళుతున్న కారుపై
దాడి చేశారు.
శాంతి భద్రతలకు విఘాతం కలిగించినందుకు 24 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అయితే మొత్తం మీద ప్రదర్శన ప్రశాంతంగా జరిగింది. ఇటీవల ఉవ్వెత్తున లేచిన 'వాల్ స్ట్రీట్ ఆక్రమణ ' ఉద్యమంలో ఆందోళనకారులు ట్ర ఫాల్గర్ స్క్వేర్‌లోని నెల్సన్ కాలమ్ వద్ద 20కిపైగా డేరాలను వేశారు. అయితే పోలీసులు రంగంలోకి దిగి వాటిని తొల గించారు. కార్పొరేట్ రంగం దురాశకు నిరసనగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా సెయింట్ పాల్ కెథడ్రల్ వెలుపల ఏర్పాటు చేసిన ఆందోళనాశిబిరంతో కలవాలని విద్యార్థీ ఉద్యమ కారులు ప్రయత్నించారు. కానీ భారీగా మోహరించిన పోలీసులు అది పడనివ్వలేదు. వచ్చే ఏడాది నుండి రెండు రెట్లు పెరగనున్న బోధనా ఫీజుల (9000 పౌండ్ల నుండి 14000 పౌండ్లకు) వల్ల అనేక మంది విద్యార్థులు చదువుకు దూరమవుతారని పోర్ట్స్ మౌత్ విశ్వవిద్యాలయ విద్యార్థిని చెప్పారు. దీని అర్థం విద్య ధనికులకు మాత్రమేనని. కానీ నిజానికి విద్య అందరికీ అందుబాటులో వుండాలి అని అని ఆమె అన్నారు. ప్రదర్శన సందర్భంగా నేరాలకు పాల్పడేవారిని అరెస్ట్ చేసి, విచారించవలసి వస్తుందని, పోలీసులు హెచ్చరించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి