-
యుపి విభజనకు శాసనసభ తీర్మానం
-
ఆమోదించిన తీరు అప్రజాస్వామికం : ప్రతిపక్షాలు
బిఎస్పీ సభ్యుడే స్పీకర్‌గా కొన సాగ టంతో మాయావతి సర్కారు యదేచ్ఛగా తన ఆట ను కొనసాగించిందని ఆయన మండిపడ్డారు. రాష్ట్ర పునర్విభజనపై ఆయన మాట్లాడుతూరాష్ట్ర ప్రజలందరూ విభజనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారన్నారు. సిఎల్‌పి నేత ప్రమోద్ తివారీ మాట్లాడుతూ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ ఏర్పాటుకు తమ పార్టీ అనుకూలంగానే వుందని, అయితే రాష్ట్ర విభజనకు నిర్ణయం తీసుకునే ముందు వనరులు, ఇతర అంశాల విభజనను కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం వుందని అన్నారు.
అసెంబ్లీలో బలాబలాలు
మొత్తం 403 మంది సభ్యులున్న శాసనసభలో బిఎస్పీకి 220 మంది సభ్యుల (ఆరుగురు సభ్యులపై అనర్హత వేటు పడిన తరువాత) బలం వుంది. సమాజ్‌వాది పార్టీకి 89, బిజెపికి 48, కాంగ్రెస్‌కు 20, ఆరెల్డీకి 10, ఆరెస్పీకి 1 సభ్యుల బలం వుండగా తొమ్మిది మంది స్వతంత్రులు వున్నారు. అంతకు ముందు శాసనసభ శీతాకాలం సమావేశం ప్రారంభమైన వెంటనే బిజెపి సభ్యులు స్పీకర్ ముందున్న వెల్‌లోకి దూసుకెళ్లగా సమాజ్‌వాది సభ్యులు తమ స్థానాల వద్దే నిలబడి ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో సభను హోరెత్తించారు. ఈ నేపథ్యంలో శాసనసభ వ్యవహారాల మంత్రి లాల్జీ వర్మ మాట్లాడుతూ బిఎస్పీ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ వుందని వివరించారు. అయితే ప్రతిపక్ష సభ్యులు దీనిని పట్టించుకోలేదు. ఈ గందరగోళం మధ్యలోనే స్పీకర్ సుఖ్‌దేవ్ రాజ్‌భర్ సభ ప్రశ్నోత్తరాల సమయాన్ని 12.20 వరకూ వాయిదా వేశారు. తిరిగి సభ సమావేశమైన తరువాత సభలోకి వచ్చిన ముఖ్యమంత్రి మాయావతిని అవిశ్వాస తీర్మానంపై చర్చ చేపట్టాలని డిమాండ్ చేస్తూ సమాజ్‌వాది, బిజెపి సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లారు. ఈ మధ్యలో కాగితాలను వుండలు చుట్టి స్పీకర్‌పైకి విసిరివేయటంతో అప్రమత్తమైన మార్షల్స్ వాటిని అందుకుని బయట పడేశారు. అనంతరం 2012-13 ఆర్థిక సంవత్సరం తొలి నాలుగు మాసాలకు సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను సభ ఆమోదించింది. ఈ సందర్భంగా సిఎల్‌పి నేత ప్రమోద్ తివారీ మాట్లాడుతూ బిఎస్పీ సర్కారు ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తోందని, బిజెపి, సమాజ్‌వాది పార్టీలు అందుకు సహకరిస్తున్నాయని విమర్శించారు. యుపి విభజనపై బిఎస్పీ ప్రభుత్వం ఎటువంటి చర్చా లేకుండా ఆమోదించిన తీర్మానాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆమోదించరాదని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. అనంతరం సమాజ్‌వాది, బిజెపి సభ్యులు గవర్నర్ బిఎల్ జోషిని కలిసి బిఎస్పీ ప్రభుత్వంపై తమ నిరసనను తెలియచేశారు. విభజనపై ఎటువంటి చర్చ నిర్వహించకుండా కేవలం కొన్ని సెకన్లలో తీర్మానాన్ని ఆమోదిస్తున్నట్లు ప్రకటించారని, అవిశ్వాస తీర్మానానికి తామిచ్చిన నోటీసులు స్పీకర్ తిరస్కరించారని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. వెంటనే సభను రీకాల్ చేసి రాష్ట్ర విభజనపై మళ్లీ చర్చతో కూడిన తీర్మానాన్ని పెట్టాలని డిమాండ్ చేశారు.
మైనార్టీలో ఉంది కాంగ్రెస్ ప్రభుత్వమే
తెలంగాణాలో సొంత పార్టీ ఎమ్మెల్యేల రాజీనామాతో ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నట్లుగా తన సర్కారు మైనార్టీలో లేదని మాయావతి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. 'వారు నా ప్రభుత్వం మెజార్టీని కొల్పోయిందని చెప్తున్నారు. అది నిజం కాదు. వాస్తవానికి తెలంగాణాకు చెందిన పలువరు కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించారు. వాస్తవానికి ఆంధ్రప్రదేశ్‌లోని కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీలో ఉంది, నా ప్రభుత్వం కాదు' అని ఆమె పేర్కొన్నారు. శాసనసభను రద్దు చేస్తారని వస్తున్న ఉహాగానాలు అమె కొట్టివేశారు. తమ ప్రభుత్వానికి పూర్తి మెజార్టీ ఉందని విశ్వాసం వ్యక్తం చేశారు. విభజన రాజకీయ ఎత్తుగడ కాదని, 2007లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ అంశంపై కేంద్రానికి సిఫార్సు చేస్తూనే ఉన్నామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
25 సెకండ్లు
ఉత్తరప్రదేశ్ రాష్ట్రాన్ని నాలుగు ముక్కలుగా చేయాలన్న తీర్మానాన్ని ఆమోదించడానికి ఆ రాష్ట్ర శాసనసభ తీసుకున్న సమయ మెంతో తెలుసా... అక్షరాల ఇరవై ఐదు సెకన్లు మాత్రమే. తీర్మానంపై చర్చకు అవకాశం ఇవ్వకుండా సభ ఆమోదించినట్లు ప్రకటించడం అప్రజాస్వామికమని ప్రతిపక్షాలు విమర్శించాయి. స్పీకర్‌ను నిలదీశాయి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి