29, నవంబర్ 2011, మంగళవారం

కొలువుల సందడి


రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల సందడి నెలకొంది. వివిధ శాఖల్లో కొలువులను భర్తీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఈ మేరకు పరీక్షలకు నోటిఫికేషన్లిచ్చే పనిలో ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(ఎపిపిఎస్సీ) బిజీబిజీగా ఉంది. దీంతో ఎన్నడూ లేనివిధంగా నిరుద్యోగులంతా ప్రభుత్వోద్యోగం కోసం శిక్షణ తీసుకోవడంలో నిమగమయ్యారు. డిసెంబర్‌ చివరి నాటికి ప్రభుత్వ శాఖల్లో లక్షా 16 వేల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ఎన్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రకటించిన విషయం విదితమే. పోలీసుశాఖలో 37 వేలు, డిఎస్సీ ద్వారా 60 వేలు, ఏడు వేల విఆర్‌ఎ, విఆర్‌ఓ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్‌సిగలిచ్చింది. ఎపిపిఎస్సీ ద్వారా 18 వేల పోస్టులను భర్తీ చేయాలని భావించినా ఇప్పటివరకు ఏడు వేల పోస్టులకే అనుమతి లభించింది. వీటికి ఆర్థికశాఖ ఆమోదం లభించిందని మంగళవారం ఎపిపిఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. గ్రూప్‌-1లో 263 పోస్టులకుతోడు మరో 49 పోస్టులు అదనంగా పెరిగాయన్నారు. దరఖాస్తుల స్వీకరణ నాటికి మరింత పెరిగే అవకాశముందన్నారు. 1,176 విఆర్‌ఓ, 6,063 విఆర్‌ఓ పోస్టుల భర్తీకి డిసెంబర్‌ ఏడో తేదీన నోటిఫికేషన్‌ను విడుదల చేయనున్నట్లు రెవెన్యూ శాఖ మంత్రి రఘవీరారెడ్డి తెలిపారు. డిసెంబర్‌ 29 వరకు దరఖాస్తుల స్వీకరణ ఉంటుందని, జనవరి 30న పరీక్ష ఉంటుందని చెప్పారు.
నోటిఫికేషన్‌ రోజే పరీక్ష తేదీల ప్రకటన : పూనం
రాబోయే రోజుల్లో నోటిఫికేషన్‌ రోజే పరీక్షల తేదీని ప్రకటిస్తామని ఎపిపిఎస్సీ కార్యదర్శి పూనం మాలకొండయ్య తెలిపారు. గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ సందర్బంగా అదే పద్ధతిని అనుసరించామన్నారు. సోమవారం 263 పోస్టులతో గ్రూప్‌-1 నోటిఫికేషన్‌ వేశామని, మరో 49 పోస్టులకు ప్రభుత్వం నుండి ఆమోదం లభించిందన్నారు. దీంతో 304 పోస్టులు పెరిగాయన్నారు. ఈ సంఖ్య ఇంకాపెరిగే అవకాశముందన్నారు. గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ త్వరలో వేస్తామన్నారు. ఇప్పటివరకూ అన్ని శాఖల నుండీ ఏడు వేల పోస్టుల వరకు ఆమోదించినట్లు ఆర్థికశాఖ నుండి జాబితా వచ్చిందన్నారు. ఉద్యోగుల కోసం డిపార్టుమెంటల్‌ పరీక్షలను అబ్జెక్టివ్‌ తరహాలో పెట్టబోతున్నామన్నారు. డిసెంబర్‌ 17 నుంచి 23 వరకు పరీక్షలుంటాయని, ఫలితాలను సంక్రాంతి నాటికి విడుదల చేస్తామని చెప్పారు. 2013 నుండి సంవత్సరానికి మూడు దఫాలు డిపార్టుమెంటల్‌ పరీక్షలుంటాయన్నారు. పుస్తకాలు చూసి రాయకుండా ఉండే పరీక్షా విధానం ఉంటుందన్నారు. ఎపిపిఎస్సీ ద్వారా భర్తీ చేయబోయే పోస్టుల వివరాలను త్వరలో వెబ్‌సైట్లో పొందుపరుస్తామన్నారు.
శాఖల వారీగా పోస్టుల సంఖ్య
గ్రూప్‌-1 కింద ఏడు డిప్యూటీ కలెక్టర్లు, ఒకటి కమర్షియల్‌ టాక్స్‌, 15 ఎపి కో-ఆపరేటివ్‌ రిజిస్ట్రార్స్‌, ఐదు డిప్యూటీ సూపరింటెండెంట్‌, నాలుగు డిప్యూటీ సూపరింటెండెంట్‌ జైళ్ళు, ఐదు రిజిస్ట్రేషన్‌ సర్వీస్‌, నాలుగు ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌, 23 ఎంప్లాయిమెంట్‌ ట్రైనింగ్‌, 10 ఫైర్‌ సర్వీసెస్‌, 10 ట్రెజరరీ అసిస్టెంట్స్‌, ఆరు రీజినల్‌ ట్రాన్స్‌పోర్ట్‌, మూడు మున్సిపల్‌ గ్రేడ్‌-2, 11 జిల్లా పంచాయత్‌రాజ్‌ ఆఫీసర్స్‌, ఏడు సోషల్‌ వెల్ఫేర్‌ సర్వీసెస్‌, నాలుగు బీసీ వెల్ఫేర్‌, రెండు మెడికల్‌ హెల్త్‌(బ్యాక్‌లాగ్‌), నాలుగు అసిస్టెంట్‌ ప్రొహిబిషన్‌, 64 అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్స్‌, 129 ఎంపిడిఓ పోస్టులున్నాయి. గ్రూప్‌-2 కింద 522 సోషల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌(హెచ్‌డబ్ల్యుఓ), 289 ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్‌(హెచ్‌డబ్ల్యుఓ), 24 ఎఎస్‌డబ్ల్యుఓ, 30 జెఎ సివిల్‌ సప్లయిస్‌, 27 జెఎ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌, 50 జెఎ ఇంటర్‌బోర్డు, 102 జెఎ వైద్యవిధాన పరిషత్‌, 81 జెఎ జైళ్ళు, 28 లేబర్‌, ఏడు ఫైర్‌, 73 ఫారెస్టు కన్జ్వరేటర్‌, ఆరు ఇఎన్‌సి పబ్లిక్‌ హెల్త్‌, ఆరు జెఎ ఇఎన్‌సి, 46 ఎపిపిఎస్సీ, 118 ట్రెజరరీ, 17 కమిషనర్‌ ఆప్‌ సోషల్‌ వెల్ఫేర్‌, 22 ట్రాన్స్‌పోర్టు, 91 కమిషనర్‌ పంచాయతీరాజ్‌, 136 జూనియర్‌ ఎకౌంట్స్‌(ఎఎంయుడి), 124 సీనియర్‌ అకౌంట్స్‌ మున్సిపల్‌శాఖ, 66 సీనియర్‌, జూనియర్‌ అకౌంట్స్‌ మున్సిపల్‌ శాఖ పోస్టులున్నాయి. గ్రూప్‌-4లో సిసిఎల్‌ఎలో 952, 15 ఫీల్డ్‌ ఇన్విస్ట్‌గేషన్‌ ట్రైబల్‌ వెల్ఫేర్‌, 45 బిల్‌ కలెక్టర్‌ పోస్టుల వరకూ ఆమోదం పొందాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి