20, నవంబర్ 2011, ఆదివారం

గిన్నీస్‌బుక్‌లోకి సువర్ణభూమి లడ్డు

విశాఖపట్నం, నవంబర్ 21 : దేశంలోనే అతి పెద్ద వినాయక ప్రతిమగా రికార్డుకెక్కిన ఎంవిపి కాలనీ గణేషునికి ప్రతష్టాత్మకమైన సువర్ణభూమి రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కానుకగా సమర్పించిన అతి భారీ లడ్డూ గిన్నీస్‌ బుక్‌లో స్థానం సంపాదించుకుంది. ఈ మేరకు గిన్నీస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌‌స వారు అందజేసిన ధృవీకరణపత్రాన్ని ప్రదర్శిస్తూ ఆ సంస్థ కార్యాలయంలో శుక్రవారం విలేకర్ల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సంస్థ జనరల్‌ మేనేజర్‌ సతీష్‌ మాట్లాడుతూ సువర్ణభూమి సంస్థ అనతి కాలంలో ఆంధ్ర రాష్ట్ర ప్రజల మన్ననలు చూరగొన్నదని పేర్కొన్నారు. తమ సంస్థ కేవలం వ్యాపార ధృక్పథమే కాకుండా ప్రజా సేవకు సంబంధించిన అనేక కార్యక్రమాలను కూడా విరివిగా చేపడుతూ ప్రజల్లో విశ్వాసాన్ని 
సంపాదించుకుంటుందని వెల్లడించారు. అదే సమయంలో దైవ కార్యక్రమాల పట్ల కూడా ప్రాధాన్యత ఇస్తూ వస్తుందన్నారు. ఇందులో భాగంగా గడిచిన వినాయక చవితికి ఎంవిపి కాలనీలో ఏర్పాటు చేసిన భారీ గణనాధునికి ప్రపంచంలోనే ఎవ్వరూ సమర్పించని ఒక భారీ లడ్డూను నైవేథ్యంగా సమర్పించామన్నారు. ఈ లడ్డూను తూర్పుగోదావరి జిల్లాలోని తాపేశ్వరంలోని ప్రసిద్ధి గాంచిన శ్రీ భక్తాంజనేయ స్వీట్స్‌ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేశారన్నారు. ఈ లడ్డూకు గిన్నీస్‌ బుక్‌లో స్థానం లభించడం ఎంతో ఆనందదా యకంగా ఉందన్నారు. ఈ గౌరవంతో సువర్ణభూమి పేరు ప్రఖ్యాతులు ప్రపంచ వ్యాప్తంగా విస్తరించడం గర్వకారణ మన్నారు. పేద, మధ్య తరగతి ప్రజల్ని దృష్టిలో ఉంచుకుని తమ సంస్థ ద్వారా అందుబాటు ధరల్లో ఫ్లాట్లు విక్రయిస్తున్నామని, అందువల్లే సువర్ణభూమి సంస్థ పట్ల ప్రజలు అంత విశ్వాసాన్ని కనబరుస్తున్నారని సతీష్‌ వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి