11, నవంబర్ 2011, శుక్రవారం

వరల్డ్‌ టూరిజం మార్ట్‌ 2011లో భారత్‌కు రెండు అంతర్జాతీయ అవార్డులు


Thu, 10 Nov 2011, IST    
వరల్డ్‌ టూరిజం మార్ట్‌ 2011లో భారత్‌కు రెండు అంతర్జాతీయ అవార్డులు
పర్యాటకంలో పైపైకి...!!!
లండన్‌ : పర్యాటక రంగంలో మన దేశం దూసుకుపోతోంది. ఈ రంగంలో రెండు అంతర్జాతీయ అవా ర్డులను గెలుచుకుంది. తద్వారా లండన్‌లో జరుగుతున్న 'వరల్డ్‌ టూరిజం మార్ట్‌ 2011'లో ప్రపంచం దృష్టిని ప్రము ఖంగా ఆకర్షించింది. 'ప్రపంచపు ప్రము ఖ పర్యాటక కేంద్రం', 'ప్రపంచపు ప్రముఖ పర్యాటక బోర్డు, ఇన్‌క్రెడిబుల్‌ ఇండియా' అవార్డులను మనదేశం సొంతం చేసుకుంది. లండన్‌లోని ఎక్సెల్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో జరుగు తున్న వరల్డ్‌ టూరిజం మార్ట్‌ 2011 కార్యక్రమంలో ఈ అవార్డులను అంద జేశారు. పర్యాటక మంత్రి సుబోధ్‌కాంత్‌ సహారు వరల్డ్‌ ట్రావెల్‌ అవార్డ్స్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు గ్రాహం ఇ కుకీ నుంచి అందుకున్నారు. ఈ ఏడాది రికార్డు స్థాయిలో 50 లక్షల మంది పర్యాటకులను రప్పించిన భారత్‌ వచ్చే రెండు, మూడేళ్ళలో మరో 50 లక్షల మంది పర్యాట కులను ఆకర్షించాలనే యోచనలో ఉందని సుబోధ్‌కాంత్‌ సహారు చెప్పారు. 'ఈ ఏడాది భారత్‌కు రికార్డు స్థాయిలో 50 లక్షల మంది పర్యాటకులు వచ్చారు. మరో రెండు, మూడేళ్ళల్లో మరో 50 లక్షల మంది రావాలనుకుంటున్నాం. ఇది దేశంలో మరో 2 కోట్ల 50 లక్షల మందికి అదనపు ఉపాధిని కల్పించేందుకు దోహదపడుతుంది' అని సహారు అన్నారు. ఒకసారి పర్యటన జరిపిన తర్వాత రెండు నెలల వరకూ మళ్ళీ దేశ పర్యటనకు రాకుండా నిషేధం విధిస్తున్న పర్యాటకుల వీసా ఆంక్షల గురించి అడిగిన ప్రశ్నకు త్వరలోనే దీనిని పరిష్కరిస్తామని చెప్పారు. ఈ అడ్డంకులను తొలగించేందుకు కృషి చేస్తామని చెప్పారు. ప్రస్తుతం భారత్‌కు వస్తున్న అంతర్జాతీయ పర్యాటకుల స్థాయిని ప్రస్తుతం ఉన్న 0.6 శాతం నుంచి 1 శాతానికి (1 బిలియన్‌ పర్యా టకులు) 2016 నాటికి పెంచడమే తమ మంత్రిత్వ శాఖ లక్ష్యమని సహారు తెలిపారు. భారత పర్యాటక రంగం ప్రాతిపదిక సౌకర్యాల రంగంగా గుర్తిం పు పొందనుంది. మరో 50 లక్షల మంది పర్యాటకులను ఆకర్షించగల్గితే 20 లక్షల హోటల్‌ గదులు అవసరమ వుతాయి. ప్రైవేటు-ప్రభుత్వ భాగ స్వామ్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ సౌకర్యాలను అభివృద్ధి చేయాలి అని అన్నారు. పేదరికాన్ని నిర్మూలించేందుకు దోహదం చేయగల ఏకైక పరిశ్రమ పర్యాటక పరిశ్రమగా తాము భావిస్తున్నామని సహారు తెలిపారు. దేశంలో నిరుపేదల అభ్యున్నతికి భారత్‌కు వచ్చే పర్యాటకులు తమ వంతు సాయం చేస్తారని అన్నారు. పర్యాటక రంగం అభివృద్ధి చర్యలను తాము ఆలస్యంగా ప్రారంభించాం గానీ విజయవంతంగా ముందుకు తీసుకెళ్ళేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి