28, నవంబర్ 2011, సోమవారం

అంగారకుడిపై పరిశోధనలు




AA

* జీవం ఉనికి కనుక్కునే ప్రయత్నాలు 
* అట్లాస్‌ 5 రాకెట్‌ ప్రయోగించిన నాసా 
* ఆగస్ట్‌ 6, 2012న అంగారకుడిపై ల్యాండింగ్‌ 
* రెండేళ్ల పాటు పరిశోధనలు 
* రోవర్‌లో 17 కెమేరాలు 
* అధునాతన సైన్స్‌ ల్యాబ్‌ 

అంగారకుడిపై జీవం ఉందా ? మనుషుల్ని పోలిన జీవులు అరుణ గ్రహంపై ఎక్కడైనా ఉన్నాయా ? కనీసం అందుకు సంబంధించిన జాడలేమైనా తెలుస్తాయా అన్న లక్ష్యంతో నాసా ప్రయోగాలు చేస్తోంది. ఇందులో భాగంగా అట్లాస్‌ 5 రాకెట్‌ను మార్స్‌పైకి ప్రయోగించింది. త్వరలోనే రోవర్‌ నుంచి సానుకూల ఫలితాలు వస్తాయని నాసా భావిస్తోంది. సువిశాల విశ్వంలో మనల్ని పోలిన జీవులు ఎక్కడైనా ఉన్నాయా ? ఉంటే ఎక్కడ అన్న అంశంపై ఏళ్ల తరబడి శాస్త్రవేత్తలు సుదీర్ఘంగా ప్రయోగాలు చేస్తున్నారు. ఆ కోవలోనే అంగారకుడిపై అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ- నాసా సైంటిస్టులు పరిశోధనలు సాగిస్తున్నారు. 

లేటెస్ట్‌గా మార్స్‌పై ప్రయోగాల కోసం అట్లాస్‌ 5 రాకెట్‌ను ప్రయోగించారు. ఫ్లోరిడాలోని కేప్‌ కెనర్‌వాల్‌ అంతరిక్ష కేంద్రం నుంచి దీన్ని ప్రయోగించారు. న్యూక్లియర్‌ పవర్‌తో కూడిన రోవర్‌ను మార్స్‌పైకి పంపుతున్నారు. పరిమాణంలో బస్‌ అంత పెద్దదిగా ఉండే ఈ రోవర్‌ వచ్చేఏడాది ఆగస్ట్‌ 6న అంగారకుడిపై దిగుతుంది. అప్పట్నుంచి రెండేళ్లపాటు అక్కడే పరిశోధనలు నిర్వహిస్తుంది. మొత్తం 154 కిలోమీటర్ల పరిధిలో ఉన్న మట్టి, రాళ్ల శాంపిల్స్‌ సేకరిస్తుంది. వాటిని క్షుణ్నంగా విశ్లేషిస్తుంది. క్యూరియాసిటీ అనే ఈ రోవర్‌కు 17 కెమేరాలు అమర్చారు. 

అలాగే, మార్స్‌ నుంచి సేకరించిన రాళ్లు, మట్టిని విశ్లేషించేందుకు అవసరమైన సైన్స్‌ ల్యాబ్‌, ఇతర సాంకేతిక పరికరాలు ఇందులో ఉన్నాయి. అన్నీ అనుకున్నట్లుగా సాగితే త్వరలోనే రోవర్‌ నుంచి సానుకూల ఫలితాలు వస్తాయని నాసా భావిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి