- 'లోయెస్ట్ స్కోరు' రికార్డు తప్పుకున్న ఆసీస్
- ఆస్ట్రేలియా 47 ఆలౌట్ :
- ఫిలాండర్ 5/15
- దక్షిణాఫ్రికా 96 ఆలౌట్ :
- వాట్సన్ 5/17
కట్‌టౌన్ : ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాల మధ్య ఇక్కడ జరుగుతున్న తొలి టెస్టులో
బౌలర్లు నిప్పులు చెరుగుతుండగా బ్యాట్స్‌మెన్ విలవిల లాడుతున్నారు. తొలి
ఇన్నింగ్స్‌లో 188 పరుగుల ఆధిక్యతతో గురువారం రెండో ఇన్నింగ్స్ ఆడిన ఆస్ట్రేలియా
కేవలం 47 పరుగులకే ఆలౌట్ అయి తృటిలో అవమానకరమైన రికార్డు నుండి 'ఎస్కేప్' అయింది.
టెస్ట్ క్రికెట్‌లో అత్యల్ప స్కోరు ఇప్పటి వరకు 26 రన్స్‌కాగా, అది ఇంగ్లండ్‌పై
న్యూజిలాండ్ సాధించింది. కాగా ఆసీస్ అత్యల్పస్కోరు 36 రన్స్‌కాగా, మ్యాచ్‌లో ఒక
దశలో 21 పరుగులకే 9 వికెట్లు వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా ఈ అవమానకరమైన
రికార్డును 'బ్రేక్' చేస్తుందని పించింది. అయితే చివరి వికెట్‌కు సిడిల్ (12),
నాథన్ లియోన్ (14) జోడీ 26 రన్స్ జోడించి ఆసీస్ పరువు కాపాడింది.
దక్షిణాఫ్రికా బౌలర్లు ఫిలాండర్ (5/15), మోర్కెల్ (9/3) ధాటికి ఆసీస్ జట్టులో ఏ ఒక్కరూ తట్టుకోలేకపోయారు. వాట్సన్ (4), హ్యూగ్స్ (9), పాంటింగ్ (0), క్లార్క్ (2), మైక్ హసి (0), హడిన్ (0), జాన్సన్ (3), హారిస్ (3), షాన్ మార్ష్ (0) కకావికల్ అయ్యారు. అంతకుముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కెప్టెన్ క్లార్క్ సెంచరీ (151, 176 బంతుల్లో 22×4) తోపాటు షాన్ మార్ష్ (44) రాణించడంతో 284 పరుగులు చేయగా, తరువాత ప్రారంభించిన సఫారీ జట్టు 24.3 ఓవర్లలో తొలి ఇన్నింగ్స్‌లో 96 రన్స్‌కు ఆలౌట్ అయింది. వాట్సన్ 17 పరుగులకు ఐదు వికెట్లు, హారిస్ 33 పరుగులకు నాలుగు వికెట్లతో బెంబేలెత్తించగా, గ్రేమీ స్మిత్ 37 (48 బంతుల్లో 3×4), రుడాల్ఫ్ (18, 29 బంతుల్లో 1×4) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి