ప్రస్తుతం ఉన్న కార్లతో పోలిస్తే.. వంద శాతం భిన్నంగా ఉండే కార్ ఇది. కేవలం మూడు మీటర్ల పొడవుండే పిక్సెల్ లో నలుగురు కూర్చుని హాయిగా ప్రయాణం చేయవచ్చు. యూరప్ కోసం తయారు చేసిన ఈ కాన్సెప్ట్ కార్ ఇంకా పరీక్షించే దశలోనే ఉంది. ముందు యూరప్ మార్కెట్లో ప్రవేశ పెట్టిన తర్వాత ఇండియాలో నూ విడుదల చేసే ఆలోచనలో టాటా మోటర్స్ ఉంది. ఇందులో "మై టాటా కనెక్ట్" అనే స్పెషల్ ఫీచర్ ను టాటా మోటర్స్ పరిచయం చేస్తోంది. టాబ్లెట్ ద్వారా కార్ తో కనెక్ట్ అయిపోవచ్చు. దీనికోసం స్టీరింగ్ పక్కనే డాకింగ్ బోర్డ్ ఉంటుంది. ఇక ఈ కారుకు రెండు డోర్లే ఉంటాయి. ఇవి కూడా పక్కకు కాకుండా పైకి లేస్తాయి. దీనివల్ల ఒకేసారి నలుగురూ ఏ ఇబ్బందీ లేకుండా కారులో కూర్చోవచ్చు.నానో తరహాలోనే ఇంజన్ వెనుకభాగంలో ఉంటుంది. జీరో టర్న్ డ్రైవ్ కారణంగా ఎంతటి ఇరుకైన ప్రాంతంలోనైనా కారును పార్క్ చేసుకోవచ్చు. పిక్సెల్ పనితీరు చూడాలంటే కింద వీడియోలో
వీక్షించవచ్చు.
http://www.youtube.com/watch?feature=player_embedded&v=pn_oiA4gsDk
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి