దుబాయ్ ప్రసాద్‌గా పేరు సంపాదించుకున్న కోనేరు ప్రసాద్ ఎక్కడి నుంచి
ఎక్కడికి ప్రయాణం చేశాడనేది ఆసక్తికరమైన విషయమే. ఎమ్మార్ ప్రాపర్టీస్
కుంభకోణం కేసులో తొలి అరెస్టు కోనేరు ప్రసాద్‌దే కావడం కూడా ఆ ఆసక్తిని
మరింత పెంచింది. ఆయన జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. అయితే, అకస్మాత్తుగా
సిబిఐ అరెస్టుతో అతనికి చేదు గుళిక మింగినట్లయింది. కృష్ణా జిల్లాకు చెందన
కోనేరు ప్రసాద్ తన జీవితాన్ని అతి సాధారణంగా ప్రారంభంచాడు. చాలా యేళ్ల
క్రితం అతను ఓ మైనింగ్ కంపెనీలో ఉద్యోగిగా చేరాడు. కొద్ది కాలంలోనే
భారతేదశంలోనే కాకుండా పశ్చిమాసియాలో, ముఖ్యంగా దుబాయ్‌లో ప్రధానమైన
వ్యక్తిగా మారిపోయారు. అతనికిప్పుడు మైనింగ్ కంపెనీలున్నాయి. రియల్
ఎస్టేట్‌లో భారీ పెట్టుబడులు పెట్టాడు. రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని చెన్నై
నుంచి నిర్వహిస్తున్నాడు.
కోనేరు ప్రసాద్ అయ్యప్ప భక్తుడు. గత 28
ఏళ్లుగా మాల వేసుకుంటున్న అతనికి గురుస్వామి హోదా కూడా లభించింది.
ప్రస్తుతం సిబిఐ అరెస్టు చేసిన సమయంలో కూడా అతను అయ్యప్ప దీక్షలో ఉన్నాడు.
అతనికి గోల్ఫ్ అంటే అమితమైన ప్రేమ. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గోల్ఫ్
క్లబ్బుల్లో అతను గోల్ఫ్ ఆడుతుంటాడు, ప్రముఖులకు విందులు ఇస్తుంటాడు.
కోనేరు ప్రసాద్‌కు విపరీతమైన చొరవ ఉంది. దాంతో దుబాయ్ ప్రభుత్వంలోనివారితో
కూడా సంబంధాలు ఏర్పడ్డాయని అంటారు. దీనివల్లనే అతను అప్పటి ముఖ్యమంత్రి,
ప్రస్తుత తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి దృష్టిలో
పడినట్లు చెబుతారు. దానివల్లనే హైదరాబాదు నగరంలో మెగా ఇంటిగ్రేటెడ్
రెసిడెన్షియల్, గోల్ఫ్ కోర్స్, ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్
ప్రాజెక్టులకు యోచన ముందుకు వచ్చినట్లు చెబుతారు.
ముఖ్యమంత్రులు
మారినా రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో కోనేరు ప్రసాద్ సన్నిహిత సంబంధాల్లో తేడా
రాలేదని చెబుతారు. చంద్రబాబుకు గతంలో అత్యంత సన్నిహితుడైన కోనేరు ప్రసాద్
దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర రెడ్డితో, కెవిపి రామచందర్ రావుతో కూడా
అంతే సన్నిహిత సంబంధాలను నెరిపిన విషయం అందరికీ తెలుసునని అంటారు. ఎమ్మార్
ప్రాపర్టీస్‌లోని విల్లాలను, విల్లా స్థలాలను, అపార్టుమెంట్లను స్టైలిష్
హోమ్స్ ద్వారా అధిక ధరలకు విక్రయించడమే ప్రసాద్ కొంప ముంచిందని అంటున్నారు.
ఎపిఐఐసితో ఒప్పందం కుదుర్చుకున్న ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో డైరెక్టర్‌గా
ఉంటూ కోనేరు ప్రసాద్ స్టైలిష్ హోమ్స్‌ను నెలకొల్పి అక్రమాలకు పాల్పడినట్లు
ఆరోపణలు వచ్చాయి. ఎమ్మార్ ప్రాపర్టీస్‌లో రాజకీయ, సినీ ప్రముఖులకు
విల్లాలు, విల్లా ప్లాట్లు అతను విక్రయించాడు. కోనేరు ప్రసాద్ ట్రైమెక్స్
గ్రూప్ సంస్థను కూడా స్థాపించాడు.
అసలేం జరిగింది..
మారిషస్ కంపెనీని తెచ్చిందే చంద్రబాబు
బినామీగా, ఫెసిలిటేటర్‌గా వ్యవహరించింది కోనేరు ప్రసాద్
{పతిఫలంగా కోనేరు స్టైలిష్ హోమ్‌కు ప్లాట్ల ధారాదత్తం
స్టైలిష్ హోమ్స్, కేరాఫ్ ట్రైమెక్స్ జీవోలోనే అప్పనంగా హక్కుల అప్పగింత, ఒప్పందంలో పూర్తిగా పందేరం
ఇది జరిగింది బాబు హయాంలోనే..
100 ప్లాట్లు కోనేరు ఖాతాలో.. వాటిపై నొక్కిందే రూ.600 కోట్లు
కాగితాలపై గజం రూ. 5 వేలు.. గుంజిందేమో రూ. 55 వేలు!
పని పూర్తయ్యాక తప్పుకున్న వైనం
2010 దాకా ఏపీఐఐసీకి తెలియనివ్వని కోనేరు
లెంకల ప్రవీణ్ రెడ్డి, సాక్షి స్పెషల్ బ్యూరో: చంద్రబాబుది భలే ఇంద్రజాలం!
అధికారంలో ఉన్నన్నాళ్లూ ఆయన రాజదండమంతా భూముల చుట్టే తిరిగింది! సర్కారు
భూములను వెదికి పట్టడం... పక్కా స్కెచ్‌తో వాటికి ఎసరు పెట్టడం.. తిమ్మిని
బమ్మిని చేసే బినామీలను బరిలో దించడం.. ఆ ముసుగులో భూములను దర్జాగా
తెగనమ్మటం.. కొంత భూమిని నేరుగా జేబు సంస్థలోకి మళ్లించుకోవడం.. భారీగా
సొమ్ము చేసుకోవడం... బాబు హయాంలో సాగిన తిరుగులేని కబ్జా సూత్రమిది!
ఎమ్మార్ ప్రాపర్టీస్ కుంభకోణంలో నారా వారు ఈ సూత్రాన్నే వాడారు. ఆయన,
బినామీలు నొక్కాల్సిందంతా నొక్కేశారు. ఏమీ తెలియనట్టుగా తీరిగ్గా
తప్పుకున్నారు. అలా దాదాపు *600 కోట్లను వాటితో పాటు కోట్ల విలువైన
విల్లాలనూ హాం ఫట్ చేసేశారు!
బాబు హైటెక్ మంత్రం బాగా ఫలించి.. మాదాపూర్ చుట్టుపక్కల భూముల ధరలు
ఆకాశాన్నంటాయి. అప్పటికే సర్కారు భూములపై పడ్డ బాబు కన్ను... సమీపంలోని 454
ఎకరాలపైనా వాలింది! అంతే. వాటి ద్వారా ‘గరిష్టంగా’ లబ్ధి పొందేలా కనీ
కనిపించని తరహాలో ఎల్లో స్కెచ్ గీశారు...! ఆ భూమిని రియల్ ఎస్టేట్
వెంచర్‌గా అమ్మి పడేయాలని నిర్ణయించారు. అందుకు వీలుగా దానికి పర్యాటక
మెరుగుల సాకుతో ‘గోల్ఫ్ కోర్స్’ అంటూ పేరు జోడించారు. స్కెచ్ అమలుకు
దుబాయిలో పారిశ్రామికవేత్తల వద్ద కూడా పట్టున్న తన బినామీ కోనేరు
ప్రసాద్‌ను రంగంలోకి దింపారు. నేరుగా ఎమ్మార్ ప్రాపర్టీస్ చైర్మన్
అలబార్‌ను కలిశారు. దుబాయి ఎకనమికల్ డెవలప్‌మెంట్‌కు అప్పట్లో ఆయన
డెరైక్టర్ జనరల్ కూడా. పెట్టుబడుల కోసమంటూ అక్కడికెళ్లిన బాబు, అలబార్‌ను
కలిశారు. అందుకు గుర్తుగా ఓ జ్ఞాపికనూ స్వీకరించారు. వీరి కలయిక వెనక
ఉన్నది కోనేరే! అసలు స్కెచ్‌నంతా అక్కడే గీశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను
ముగ్గులోకి లాగారు. ఇక్కడే మరో గమ్మత్తుంది! ఎమ్మార్ ప్రాపర్టీస్ దుబాయి
కంపెనీ అయినా.. రంగంలోకి దిగింది మాత్రం ఎమ్మార్ హోల్డింగ్-2 మారిషస్
కంపెనీ! దీని మతలబేమిటో మారిషస్ గురించి బాగా తెలిసిన పారిశ్రామికవేత్తల
వద్ద కూడా పట్టున్న తన బినామీ కోనేరు ప్రసాద్‌ను రంగంలోకి దింపారు. నేరుగా
ఎమ్మార్ ప్రాపర్టీస్ చైర్మన్ అలబార్‌ను కలిశారు. దుబాయి ఎకనమికల్
డెవలప్‌మెంట్‌కు అప్పట్లో ఆయన డెరైక్టర్ జనరల్ కూడా. పెట్టుబడుల కోసమంటూ
అక్కడికెళ్లిన బాబు, అలబార్‌ను కలిశారు. అందుకు గుర్తుగా ఓ జ్ఞాపికనూ
స్వీకరించారు. వీరి కలయిక వెనక ఉన్నది కోనేరే! అసలు స్కెచ్‌నంతా అక్కడే
గీశారు. ఎమ్మార్ ప్రాపర్టీస్‌ను ముగ్గులోకి లాగారు. ఇక్కడే మరో
గమ్మత్తుంది! ఎమ్మార్ ప్రాపర్టీస్ దుబాయి కంపెనీ అయినా.. రంగంలోకి దిగింది
మాత్రం ఎమ్మార్ హోల్డింగ్-2 మారిషస్ కంపెనీ! దీని మతలబేమిటో మారిషస్
గురించి బాగా తెలిసిన బాబుకే తెలుసు. అదంతా ప్రజలకు కూడా తెలియాలంటే
మారిషస్ కంపెనీ గుట్టు రట్టవ్వాలి! అందుకోసం ఎమ్మార్ బాగోతంపై హైకోర్టు
ఆదేశించిన సీబీఐ పూర్తిస్థాయి విచారణను బాబు హయాం నాటి నుంచీ జరపాల్సి
ఉంటుంది.
స్కెచ్ అమలయిందిలా..
విల్లాలు, గోల్ఫ్ కోర్స్ పేరుతో ఇంటిగ్రేటెడ్ ప్రాజెక్టు ఏర్పాటుకు 2001
జూలై 26 నాటికి 5 కంపెనీలు ముందుకొచ్చాయి. వాటిలో మూడింటిని షార్ట్‌లిస్ట్
చేసినా బిడ్డింగ్‌లో పాల్గొన్నది మాత్రం ఒక్కటే. అది... ఎమ్మార్
ప్రాపర్టీస్! 2001 డిసెంబర్ 15న అది టెండర్ దాఖలు చేసింది. దాన్ని 2002
జవనరి 8 నాటికల్లా ప్రభుత్వం ఖరారు చేసింది. ఆ మేరకు జీవో ఎం.ఎస్.359 జారీ
చేసింది. రెండు స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేస్తున్నట్టు
పేర్కొంది. ఎస్పీవీ-1 కింద 535 ఎకరాల్లో గోల్ఫ్ కోర్స్, మల్టీ యూజ్
ప్రాజెక్టని, ఎస్‌పీవీ-2లో 15 ఎకరాల్లో కన్వెన్షన్‌సెంటర్ కమ్ ఎగ్జిబిషన్
కాంప్లెక్స్ అని చెప్పుకొచ్చింది. ఇందులో ప్రభుత్వ భూమి 454.93 ఎకరాలు
కాగా, మరో 80.35 ఎకరాల పట్టా భూమి కోసం 2002 జూలై 10న భూ సేకరణ చట్టం
అర్జెన్సీ క్లాజ్ కింద భూ సేకరణకు నోటీసిచ్చింది. ఇదంతా ‘ప్రజాప్రయోజనాల
దృష్ట్యా’నే అంటూ నమ్మబలికింది!
ఎంఓయూలోనే ‘బాబు-కోనేరు’ వ్యూహం అమలు
మొత్తం భూములను అమ్ముకునేందుకు వీలుగా జీవోలోనే బీజం పడిందని విజిలెన్స్
విభాగం చేసిన వ్యాఖ్యలు చెప్పకనే చెబుతున్నాయి! జీవో 359లో నిబంధనలు చాలా
అసంబద్ధంగా ఉన్నాయంటూ విజిలెన్స్ తప్పుబట్టింది. అసలు ‘అసైన్ ఆపరేటర్
రైట్స్’ అంటే అర్థమేమిటని ప్రశ్నించింది. 2002 జనవరిలో జీవో విడుదలవగా
నవంబర్ 6న ఎంఓయూ కుదిరింది. డెవలపర్ ఇతర ఈక్విటీ భాగస్వాములను
చేర్చుకోవచ్చని ఎంవోయూ పేర్కొంది. ప్రాజెక్టు అభివృద్ధిగా, నిర్వహణకు,
ఆపరేషన్ తదితరాలకు డెవలపర్ తనకున్న హక్కులన్నిటినీ ఇతరులకు
బదలాయించుకోవచ్చంటూ అధికారాలిచ్చేసింది! కొలాబరేషన్ ఒప్పందాన్ని 2003 జూన్
28న మంత్రివర్గ ఉపసంఘం ఆమోదించింది. దానిపై 2004 మార్చి 12న ఏపీఐఐసీ
బోర్డు భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఇదంతా జరిగింది బాబు పాలన
చివరి రోజుల్లోనే! కొలాబరేషన్ ఒప్పందం క్లాజ్ 2.4(3) ప్రకారం నిర్వహణ విధి
విధానాలపై నియంత్రణ డెవలపర్‌దే అయినా ఆ సమాచారాన్ని మాత్రం ఏపీఐఐసీకి
ఎప్పటికప్పుడు అందజేయాలి. క్లాజ్ 2.4(5) ప్రకారం డెవలప్‌మెంట్ కోసం ఇతర
పార్టీలకు అప్పగించుకోవచ్చు. తర్వాత రెండు ఎస్పీవీలు కాస్తా మూడుగా మారాయి.
అవే ఎమ్మార్ హిల్స్ టౌన్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ (ఈహెచ్‌టీపీఎల్),
బౌల్డర్ హిల్స్ లీజర్ ప్రైవేటు లిమిటెడ్, సైబరాబాద్ కన్వెన్షన్ సెంటర్
ప్రైవేటు లిమిటెడ్. ఈ మూడింట్లోనూ కోనేరు ప్రసాద్ డెరైక్టర్‌గా 2004
నవంబర్ 16న చేరారు!
స్టైలిష్‌గా మోసం..: తర్వాత ఈహెచ్‌టీపీఎల్ ఆమోదం లేకుండానే స్టైలిష్
హోమ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌తో 2005 జనవరి 29న ఎమ్మార్ ప్రాపర్టీస్ ఒప్పందం
కుదుర్చుకుంది. అలా ఎమ్మార్‌లో తన పలుకుబడిని పకడ్బందీగా ఉపయోగించిన
కోనేరు... స్వయంగా ‘స్టైలిష్ హోమ్స్’ను ఏర్పాటు చేసి, దానితోనే ఒప్పందం
కుదుర్చుకున్నారు! విల్లాలు, ప్లాట్లు అమ్మాలన్నది ఆ ఒప్పందం సారాంశం. అది
ఐదేళ్ల పాటు వర్తిస్తుందని పేర్కొన్నారు. సరిగ్గా ఈ ఒప్పందం పూర్తయ్యాక,
కోనేరు తన పని పూర్తయ్యాక... 2010 మే 12న మూడు కంపెనీల్లోనూ డెరైక్టర్‌గా
వైదొలిగారు. ఒప్పందం మొదలయ్యాక తొలి 6 నెలల్లో 30 ప్లాట్లు అమ్మాలని
రాసుకున్నారు. వాటి సగటు పరిమాణం 1,200 చదరపు గజాలు. తొలి 100 ప్లాటను *5
వేలు చొప్పున అమ్మవచ్చు. దానికి అదనంగా 4 శాతం దాకా కమిషన్‌గా చార్జ్
చేయవచ్చు. మిగతా ప్లాట్లను మాత్రం ఈహెచ్‌టీపీఎల్ నిర్ధారించినట్టుగా
మార్కెట్ రేట్లకు అమ్మాలి. అయితే స్టైలిష్ హోమ్ 4 శాతం క మీషన్‌ను కూడా
దానికి కలుపుకోవచ్చు. కానీ జరిగింది వేరు. మార్కెట్ రేటు దాదాపుగా గజం
రూ.70 వేల దాకా ఉంటే, రూ.5 వేలకే కట్టబెట్టుకునేందుకు కోనేరుకు ఎమ్మార్
ప్రాపర్టీస్ హక్కులు దఖలు పరిచింది. తద్వారా ఒక్కో ప్లాటును సగటున చదరపు
గజం రూ.50 వేల చొప్పున ఆయన అమ్ముకున్నారు. ఇలా ఒక్కో ప్లాటులో రూ.6 కోట్ల
చొప్పున... తనకు కట్టబె ట్టిన 100 ప్లాట్లపై సుమారు రూ. 600 కోట్లు
నొక్కేశారు! ఏకంగా తన స్టైలిష్ కంపెనీ పేరుతో నాలుగు, కంపెనీ డెరైక్టర్
పేరుతో ఒకటి, కొడు కు పేరుతో మరొక ప్లాటు చొప్పున తీసేసుకున్నారు కోనేరు!
కొసమెరుపు: అసలు ఇలా విల్లాలు అమ్మడానికి స్టైలిష్ హోమ్స్ సంస్థతో ఎమ్మార్
ఒప్పందం కుదుర్చుకున్నట్టు 2010 సెప్టెంబర్ 2 దాకా ఏపీఐఐసీకే తెలియదు!
తెలిసేటప్పటికే కథా నాయకుడు కోనేరు కాస్తా డెరైక్టర్ పదవికి రాజీనామా
సమర్పించేశారు!! పైగా ఒప్పందమూ పూర్తయిపోయింది!!!
courtesy ----sakshi
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి