8, ఆగస్టు 2013, గురువారం

నీటి పంపకాల్లో పంచాయితీ రాదు

ట్రిబ్యునళ్లు ఉండగా.. అనుమానాలు దండగ.. సీమాంవూధులను భయపె నీటి పంపకాలపై దుష్ప్రచారం.. తద్వారా తెలంగాణను అడ్డకునే కుయత్నాలు‘తెలంగాణ రాష్ట్రమొస్తే భూమి బద్ధలవుతుందా?’ అంటాడు ప్రజా గాయకుడు గోరటి వెంకన్న. కానీ, తెలంగాణ ఉద్యమం ఊపందుకున్న ప్రతిసారీ కొందరు సీమాంవూధ నేతలు, ముఖ్యంగా డెల్టా ప్రాంత ఆధిపత్య వర్గాల వారు ఒక తప్పుడు ప్రచారాన్ని తీవ్ర స్థాయిలో చేస్తున్నారు. ఈ విషయంలో గోబెల్స్‌ను మించిపోయారు.

రాష్ట్ర విభజన జరిగితే జల వనరుల విషయంలో సీమాంధ్ర ప్రాంతానికి తీరని అన్యాయం జరుగుతుందని కొందరు సీమాంధ్ర నేతలు విపరీత అబద్ధాలు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ వస్తే సీమాంవూధకు నీరు వదలరని, డెల్టా ప్రాంతం ఎండిపోతుందంటూ ఒక భయానక వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. ఇలాంటి విష ప్రచారాలతో సీమాంధ్ర ప్రజల్లో అపోహలు సృష్టించి, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో ఎంతమాత్రం వాస్తవం లేదని, తెలంగాణ వస్తే జల వనరుల్లో సీమాంవూధకు అన్యాయం జరుగుతుందన్నది ఉత్తి అపోహ మాత్రమేనని నీటిపారుదలరంగ నిపుణులు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనప్పటికీ... వివిధ నదీ బేసిన్లలో తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాలు తాము వాడుకునే నీటి వాటాలో ఎలాంటి తేడా రాదని అంటున్నారు.

ప్రత్యేక రాష్ట్రం ఇచ్చినంత మాత్రాన న్యాయబద్ధంగా సీమాంవూధకు పోయే నీటిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని పేర్కొంటున్నారు. ఏ రాష్ట్రమైనా సరే నదుల నీటిని తన ఇష్టానుసారానికి వాడుకోవడం కుదరని పని అని, నదుల నీటి పంపకాల కోసం ప్రత్యేకంగా ట్రిబ్యునళ్లు ఉన్నాయని చెబుతున్నారు. అంతర్జాతీయ జల సూత్రాలు, జాతీయ జల విధానం, ట్రిబ్యునళ్ల నీటి పంపకం మేరకే అంతపూరాష్ట నదుల్లో ఆయా రాష్ట్రాలు నీటిని వినియోగించుకుంటాయని పేర్కొంటున్నారు. రాష్ట్రం విడిపోయినా నీటి పంపకాలు యథాతథంగానే ఉంటాయని, ఈ విషయంలో కొందరు సీమాంధ్ర నేతలు చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని ఎంతమాత్రం నమ్మవద్దని కోరుతున్నారు.

మొత్తం 40 నదులు..
ఆంధ్రప్రదేశ్‌లో జల సంపద విషయానికి వస్తే.. రాష్ట్రంలో పెద్దవీ, చిన్నవీ కలిపి మొత్తం 40 నదీ బేసిన్లు ఉన్నాయి. 12 అంతపూరాష్ట నదులు ఉన్నాయి. రాష్ట్రంలోని నదులన్నీ కలిసి ఏటా 75 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన 2,746 టీఎంసీల నీటిని అందజేస్తున్నాయి. కృష్ణా, గోదావరి బేసిన్లు తెలంగాణగుండా ప్రవహిస్తున్నాయి. వంశధార, నాగావళి వంటి నదుల్ని ఆంధ్రవూపదేశ్, ఒడిశా పంచుకుంటున్నాయి. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌లు గోదావరి నదిని, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌లు కృష్ణా నదిని పంచుకుంటున్నాయి. పెన్నా నదిని ఆంధ్రప్రదేశ్‌తోపాటు కర్ణాటక, పాలార్ వంటి చిన్న నదీ బేసిన్లను ఆంధ్రప్రదేశ్‌తోపాటు తమిళనాడు పంచుకుంటున్నాయి. ఆంధ్రవూపదేశ్ రెండుగా విడిపోయినా లేక మూడు రాష్ట్రాలుగా విడిపోయినా తెలంగాణ వాటాలో తేడా రాదు. కోస్తా, రాయలసీమలకు వచ్చే వాటాలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. కాబట్టి అవి పంచుకోవడానికి ఇబ్బందేమీ ఉండదు.

అంతర్జాతీయ సూత్రాల ప్రకారమే..
తెలంగాణ ఏర్పాటైతే సీమాంవూధకు నీరు వదలరనే తప్పుడు ప్రచారం గట్టిగా సాగుతున్నది. ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదు. ఎందుకంటే ఎక్కడైనా ‘ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా’ వారు ప్రతిపాదించిన న్యాయసూవూతాలను అనుసరించే పరివాహక ప్రాంతంలోని దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలకు నీటి కేటాయింపులు జరుగుతాయి. నదీ పరివాహక క్షేత్రం, వర్షపాతం, జనాభా, సాగునీటికి అనువైన భూమి, వెనుకబాటుతనం, ఇతర నీటి వనరుల లభ్యత, ప్రాధాన్యతాపరమైన వినియోగాలు తదితరాల ప్రాతిపదికనే నీటి కేటాయింపులు జరుగుతున్నాయి.

అంతర్రాష్ట్ర వివాదాలకు ట్రిబ్యునళ్లు ..
ఇకపోతే, నీరు అతి సున్నితమైన అంశం. నీటి కోసం భవిష్యత్తులో ప్రపంచ యుద్ధాలు సంభవిస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, అంతపూరాష్ట్రాల మధ్య జల వివాదాలను పరిష్కరించుకునేందుకు మన దేశంలో ఒక వ్యవస్థ, యంత్రాంగం ఉంది. ‘అంతపూరాష్ట్ర నదులు, నదీ లోయల అభివృద్ధి, క్రమబద్ధీకరణ’ అంశాలను రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో ఉన్న కేంద్ర జాబితాలో చేర్చారు. తమ సరిహద్దుల్లో పుట్టి, ప్రవహించే నదులపై ఆయా రాష్ట్రాలకు సంపూర్ణ అధికారం ఉంటుంది. అదే, అంతపూరాష్ట్ర నదుల విషయంలో తమకు కేటాయించిన నీటిని వినియోగించుకునే హక్కు మాత్రమే ఆయా రాష్ట్రాలకు ఉంటుంది. అది కూడా ఇతర రాష్ట్రాలకు ఇబ్బంది కలుగనంత వరకు మాత్రమే. అంతపూరాష్ట్ర జల వివాదాల విషయానికి వస్తే.. రాజ్యాంగంలోని 262వ ఆర్టికల్‌లో రెండు విషయాలను స్పష్టంగా చేర్చారు. ఒకటి, అంతపూరాష్ట్ర నదీ జల వినియోగం, పంపకం, నియంవూతణ విషయంలో ఏదైనా తగాదా ఏర్పడితే దాన్ని పరిష్కరించే నిమిత్తం పార్లమెంట్ చట్టం చేయవచ్చు. రెండు, పైన చెప్పిన జల వివాదాల్లో సుప్రీంకోర్టు గానీ, ఇతర కోర్టులు గానీ జోక్యం చేసుకోరాదని కూడా పార్లమెంట్ చట్టం చేయొచ్చు. ఈ 262 ఆర్టికల్ కింద పార్లమెంట్ 1956లో అంతపూరాష్ట్ర జల వివాద చట్టాన్ని చేసింది.

ఈ చట్టం ప్రకారం.. ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నీటి తగాదాను కేంద్రం దృష్టికి తెచ్చినపుడు చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారం సాధ్యం కాదని కేంద్రం భావిస్తే.. నీటి తగాదా పరిష్కార నిమిత్తం అధికార గెజిట్ ద్వారా ట్రిబ్యునల్‌ను ఏర్పాటు చేసే అధికారం కేంద్రానికి ఉంటుంది. ఇప్పటికే మన దేశంలో ఏడు ట్రిబ్యునళ్లు ఏర్పడ్డాయి. అందులో మన రాష్ట్రానికి సంబంధించి కృష్ణా ట్రిబ్యునల్(బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్), గోదావరి ట్రిబ్యునల్(బచావత్), వంశధార ట్రిబ్యునల్(ముకుందం శర్మ ట్రిబ్యునల్)-ఉన్నాయి. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాటిలో నర్మద ట్రిబ్యునల్, రావి-బియాస్ ట్రిబ్యునల్, కావేరి ట్రిబ్యునల్, మహాదాయి ట్రిబ్యునల్ ఉన్నాయి. ఇదే రీతిన భవిష్యత్తులో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక, తెలంగాణ, ఆంధ్రల మధ్య నీటి వివాదం తలెత్తితే ట్రిబ్యునల్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుంటుంది. ఆ ట్రిబ్యునల్ ఆదేశాల మేరకే నీటి కేటాయింపులు ఉంటాయి. అంతేగానీ, తెలంగాణ వస్తే కిందకు నీరు వదలరనే కోస్తాంధ్ర నాయకుల మాటల్లో ఎంతమాత్రం నిజం లేదు.


ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్ర మధ్య నీటి పంపకం ఇలా..
తెలంగాణ, ఆంధ్రలో ప్రవహించే జీవనదులు కృష్ణా, గోదావరి. యావత్ తెలంగాణ ఈ రెండు నదీ పరివాహక ప్రాంతంలో ఉంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే ప్రధానంగా పరిష్కరించుకోవాల్సింది ఈ రెండు నదుల నీటి పంపకమే. కృష్ణా నది మొత్తం పొడవు 1,440 కిలోమీటర్లు. తెలంగాణలో 492 కిలోమీటర్లు, ఆంధ్రలో 170 కిలోమీటర్ల మేర కృష్ణా నది ప్రవహిస్తుంది. ఇక పరివాహక ప్రాంత వైశాల్యం మాటకొస్తే కృష్ణాలో.. తెలంగాణ 68.50 శాతం, ఆంధ్ర 21 శాతం కలిగి ఉన్నాయి. గోదావరి మొత్తం పొడవు 1,464 కిలోమీటర్లు. 579 కిలోమీటర్లు తెలంగాణలో, 200 కిలోమీటర్లు ఆంధ్రలో ప్రవహిస్తున్నది. తెలంగాణ, ఆంధ్రలో ఈ రెండు నదులు ప్రవహించే పొడవు నిష్పత్తి 74:26.

తెలంగాణ వస్తే జల వనరుల విషయంలో సీమాంధ్రకు అన్యాయం జరుగుతుందని, ఆంధ్రాకు నీళ్లు రావంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు. అబద్ధపు ప్రచారాలతో సీమాంధ్ర ప్రజల్లో అపోహలు సృష్టించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. సీమాంధ్ర నేతలు చేస్తోన్న ప్రచారాల్లో ఎంతమాత్రం నిజం లేదు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా.. తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాలు తాము వాడుకునే నీటి వాటాలో ఎలాంటి తేడా రాదు. నీటి పంపకాలు యథాతథంగా ఉంటాయి. అంతర్జాతీయ జల సూత్రాలు, జాతీయ జల విధానం, ట్రిబ్యునళ్ల నీటి పంపకం మేరకే అంతపూరాష్ట నదుల్లో ఆయా రాష్ట్రాలు తమ వాటా నీటిని వినియోగించుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రం విషయంలోనూ ఇవే సూత్రాలు వర్తిస్తాయి.


కృష్ణా జలాల పంపకం ఇలా..
కృష్ణా నదీ జలాల పంపిణీని పరిశీలిస్తే.. ఈ నదీ పరివాహక ప్రాంతం మూడు రాష్ట్రాల్లో ఉంది. ఈ నదీ జలాలను బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు జరిపింది. ఆంధ్రవూపదేశ్‌కు 11 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను అనుసరించే ఈ కేటాయింపులు జరిగాయి. బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపులు జరిపిన తర్వాత ప్రభుత్వం ప్రాజెక్టు కేటాయింపుల్లో కొంత సర్దుబాటు చేసింది. ఫలితంగా 68.50 శాతం పరివాహక క్షేత్రం కలిగిన తెలంగాణకు 34.50 శాతం వాటా అంటే 295.26 టీఎంసీలు, కోస్తాంవూధకు 369.74 టీఎంసీలు, రాయలసీమకు 146 టీఎంసీలు దక్కాయి. మిగులు జలాల విషయానికి వస్తే కృష్ణా నదీ జలాల్లో లభించే మిగులు జలాలను బచావత్ ట్రిబ్యునల్ ఏ రాష్ట్రానికీ పంచలేదు. కాకపోతే, ఈ నీటిని ఎలాంటి హక్కు లేకుండా వాడుకునే స్వేచ్ఛను ఆంధ్రవూపదేశ్ రాష్ట్రానికి ఇచ్చింది. ఈ మేరకు మన రాష్ట్ర ప్రభుత్వం కృష్ణా బేసిన్‌లోని 227.50 టీఎంసీల మిగులు జలాలను ఉపయోగించుకునే విధంగా వివిధ ప్రాజెక్టులను చేపట్టింది. బచావత్ ట్రిబ్యునల్ కాలపరిమితి ముగియడంతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అవతరించింది. ఇది 65 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన నీటి కేటాయింపులు చేసింది. ఫలితంగా ఆంధ్రవూపదేశ్‌కు 11 టీఎంసీలతోపాటు అదనంగా 45 టీఎంసీలు లభించాయి. అలాగే, మిగులు జలాలను అంచనా వేసి మూడు రాష్ట్రాలకు పంచింది. మన రాష్ట్రానికి 145 టీఎంసీల మిగులు జలాలను కేటాయించింది. రాయలసీమకు ఉపయోగపడే తెలుగు గంగ ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయించి, మిగిలిన 120 టీఎంసీలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల క్యారీ ఓవర్ స్టోరేజీకి జత కలిపింది. అయితే, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రాష్ట్రాలు ఒప్పుకోకపోవడంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రస్తుతం వాద ప్రతివాదనలు కొనసాగుతున్నాయి. ఈ విషయం తేలేలోగా తెలంగాణ ఏర్పడితే.. కృష్ణా నది నికర జలాల్లో తెలంగాణకు 295.26 టీఎంసీలు మాత్రమే దక్కుతాయి. మిగులు జలాల విషయం తర్వాత తేలుతుంది.

గోదావరి జలాల పంపకం ఇలా..
గోదావరి విషయానికి వస్తే.. ఈ నదీ జలాలపైన కూడా బచావత్ ట్రిబ్యునల్ నివేదిక సమర్పించింది. వివిధ రాష్ట్రాలు పరస్పరం చేసుకున్న ఒప్పందాల ఆధారంగా ట్రిబ్యునల్ అవార్డు ప్రకటించింది. ఈ అవార్డు ప్రకారం ఆంధ్రవూపదేశ్‌కు గోదావరిలో లభించే నికర జలాలు 1,40 టీఎంసీలు. అందులో ఇంకా సగం నీటిని వినియోగించుకోవాల్సి ఉంది. దీన్ని ఉపయోగించుకునే క్రమంలో ఎల్లంపల్లి, ప్రాణహిత-చే కంతనపల్లి, దేవాదుల, ఇందిరా, రాజీవ్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు, ఎస్సాస్పీ రెండో దశ, వరద కాలువ, పోలవరం లాంటి అనేక పథకాలను ప్రభుత్వం చేపట్టింది. ప్రభుత్వం తలపెట్టిన ప్రాజెక్టులన్నీ పూర్తయితే తెలంగాణ 900 టీఎంసీలను వినియోగించుకుంటుందని భావించొచ్చు.

తెలంగాణ ఏర్పాటైతే పం ప కం ఇ లా..
ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే నదీ జలాల వినియోగం ఇలా ఉంటుంది. కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డాక కృష్ణా నదీ నికర జలాల్లో తెలంగాణ సుమారు 300 టీఎంసీలు ఉపయోగించుకుంటుంది. అంటే ఇప్పటి కేటాయింపులే అప్పుడూ ఉంటాయి. కొత్త రాష్ట్రాలు ఏర్పడినంత మాత్రాన ఎలాంటి మార్పు ఉండదు. ఇక కృష్ణామిగులు జలాల విషయానికి వస్తే.. బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇంకా తుది తీర్పును ప్రకటించలేదు కనుక మిగులు జలాల పంపకం ఎలా ఉండబోతుందన్నది ఇప్పుడే ఊహించలేం. ఇక, గోదావరి నదీ జలాల్లో ప్రస్తుతం జరిపిన కేటాయింపులను అనుసరించి 900 టీఎంసీల నికర జలాలు తెలంగాణకు, 50 టీఎంసీల నికర జలాలు ఆంధ్రకు ఇంచుమించుగా అందుతాయి. కనుక కొత్త రాష్ట్రాలు ఏర్పడ్డా నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పు ఉండదు. గోదావరిలో నికర జలాలే సమృద్ధిగా ఉన్నందున మిగులు జలాలపై ఎలాంటి పేచీ ఉండదు.

అంతర్జాతీయ న్యాయసూత్రాలతోనే జలపంపకాలు
‘ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లా’ వారు ప్రతిపాదించిన న్యాయసూవూతాలను అనుసరించే పరివాహక ప్రాంతంలోని దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు నీటి కేటాయింపులు జరుగుతాయి. నదీ పరివాహక క్షేత్రం, వర్షపాతం, జనాభా, సాగునీటికి అనువైన భూమి, వెనుకబాటుతనం, ఇతర నీటి వనరుల లభ్యత, ప్రాధాన్యతాపరమైన వినియోగాలు తదితరాల ప్రాతిపదికనే నీటి కేటాయింపులు జరగుతున్నాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి