29, ఆగస్టు 2013, గురువారం

మెట్రోకు ఓ లెక్కుంది!


8/8/2013 3:51:51 PM
- ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టుపై సీమాంధ్ర మీడియా దుష్ప్రచారం
- తెలంగాణ రాష్ట్రావిర్భావంతో ప్రయాణికుల సంఖ్య తగ్గుతుందంటూ అభూతకల్పనలు
- భాగ్యనగర బ్రాండ్ ఇమేజ్ నాశనానికి కుట్రలు
- అంచనాకు మించి ప్రయాణిస్తారు.. అనుమానాలొద్దంటున్న అధికారులు
- సంఖ్య తగ్గినా తమకో లెక్కుందంటూ ధీమా



HYD Metro Railసిటీబ్యూరో, టీమీడియా: రాజధానిలో ట్రాఫిక్ నరకం నుంచి విముక్తి కోసం ప్రభుత్వం మెట్రో రైలు ప్రాజెక్టు నిర్మిస్తోంది. దీంతో మెట్రో నిర్మాణం ఎప్పుడు పూర్తవుతుందా అని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. ఐతే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ప్రకటనతో సీమాంధ్ర మీడియా మెట్రో రైలు ప్రాజెక్టు అమలుపై అనుమానాలు వ్యక్తం చేస్తూ కథనాలు అల్లుతోంది. ప్రజల్లో అర్థంపర్థం లేని సందేహాలు రేకెత్తిస్తూ గందరగోళానికి తెర తీస్తోంది. రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత నగరమంతా ఖాళీ అవుతుందని ప్రచారం చేస్తోంది. ప్రభుత్వం అంచనా వేసినట్లుగా 2017లో ప్రయాణికుల సంఖ్య, వాహనాల సంఖ్య ఉండకపోవచ్చునంటూ ఊహాజనిత కథనాలను ప్రచురిస్తోంది. వాస్తవాలను మరుగున పెట్టి అవాకులు చెవాకులు రాస్తోంది.

- ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పని చేసే వారిలో ఇక్కడి నుంచి ఎంత మంది వెళ్లిపోతారంటే 10 వేలకు మించదని ఓ అంచనా.
-ఇక ఉమ్మడి రాజధానిగా మరో 10 సంవ త్సరాలు లెక్కిస్తే వెళ్లిపోయే వారి సంఖ్య అత్యల్పమే.
- ప్రైవేటు రంగాల్లో పని చేసే వారెవరూ ఉన్న ఉద్యోగాలను పోగొట్టుకొని కొత్తగా మరో ఉపాధిని వెతుక్కుంటూ సొంత ప్రాంతాలకు తరలి ప్రసక్తే ఉండదని నిపుణులు అభివూపాయపడుతున్నారు.
- ఇప్పటికే నగరంలో ఏర్పాటైన ఐటీ, ఫార్మా, పరిక్షిశమలు, ఇతర సంస్థలేవీ మరో నగరానికి తరలించవని పలు జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, ఎన్జీఓలు తేల్చి చెప్పాయి. మరో కేంద్రాన్ని ఇతర పట్టణాల్లోనూ ఏర్పాటు చేయవల్సిన అనివార్యత మాత్రం తలెత్తవచ్చు. కానీ ఇక్కడినుంచి పూర్తిగా ప్రాజెక్టులను రద్దు చేసుకుని వెళ్లే ప్రసక్తే ఉండదు.

- నగర వాతావరణంలో ఎలాంటి పరిక్షిశమనైనా నడపవచ్చునని ప్రపంచ స్థాయి పారిక్షిశామికవేత్తలే నిర్ధారించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఉండే వాతావరణ సమతుల్యత భాగ్యనగర సొంతం. అందుకే ఉష్ణ, శీతల ప్రాంతాల్లోని ఏ దేశానికి మెట్రోకు ఓ లెక్కుంది!చెందిన వారైనా ఇక్కడే ఆరోగ్యవంతంగా ఉండగలుగుతున్నా
రని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. దీంతో ఈ ప్రాంతాన్ని విడిచి వెళ్లడానికి పరిక్షిశమల యాజమాన్యాలు కూడా సిద్ధంగా లేవు.
కాబట్టి పై అంశాలను పరిశీలించి చూస్తే నగరం ఖాళీ అవుతుందనడం, 2017లో ప్రయాణికుల సంఖ్య, వాహనాల సంఖ్య ఉండకపోవచ్చనడం కేవలం కావాలని రాస్తున్న కల్పిత కథలుగా కొట్టిపారేయ్యవచ్చు.

ప్రయాణికుల సంఖ్యకు ఢోకా లేదు
మెట్రో రైలు నిర్మాణం పూర్తయిన తర్వాత అంటే 2017లో ప్రయాణికుల సంఖ్య రోజూ 15 లక్షలు ఉంటుందని, అది 2024కు 22 లక్షలకు చేరుతుందని రాష్ట్ర ప్రభుత్వం అంచనా వేసింది. ఈ మేరకు ఎల్‌అండ్‌టీ సంస్థకు హామీ కూడా ఇచ్చింది. ఒప్పంద పత్రాల్లోనూ అదే పేర్కొంది. అంతేగాక పలు ట్రాఫిక్, రవాణా అధ్యయనాలను ముందుగానే ఎజెన్సీల ద్వారా సర్వే చేయించి ఆ తర్వాతే మెట్రో రైలు ట్రాన్స్‌పోర్ట్ సిస్టంను ఆమోదించింది. దీన్నిబట్టి మూడు కారిడార్లలోనూ జనసాంవూదత అత్యధికంగానే ఉంటుందని తేలింది. ఫేజ్-1లోని 72 కి.మీ.లకు సంబంధించి డిటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్టులు, ట్రాఫిక్ సర్వే రిపోర్టులను, ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ నివేదికలను కూడా పరిగణనలోకి తీసుకుంది. ఒకవేళ పైన చెప్పిన ప్రయాణికుల సంఖ్యలో మార్పులొస్తే ఏం చేయాలో కూడా ప్రస్తావించినట్లు మెట్రో రైలు అధికారులు గుర్తు చేస్తున్నారు. అంచనాలేవీ లెక్క తప్పవన్నది గ్యారంటీగా కనిపిస్తోంది. ఒకవేళ అలా జరిగినా ఎల్‌అండ్‌టీ సంస్థ దీర్గకాలిక దృష్టి, భవిష్యత్‌లో ఎదురయ్యే సవాళ్లను ఊహించి అధిగమించేందుకు అవలంభించే పద్ధతుల వల్ల నష్టమొచ్చే అవకాశాలేవీ ఉండవని తేల్చి చెబుతున్నారు. కచ్చితంగా 2017లో మెట్రో రైలు ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఉద్యమ తీవ్రతలోనే మెట్రో ఆరంభం
తెలంగాణ ఉద్యమం పుష్కర కాలంగా విస్తృతమైంది. 2009 డిసెంబరు 9 ప్రకటన తర్వాతే ఉద్యమం ఉధృతమైంది. ఈ సందిగ్ధ పరిస్థితుల్లోనే హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు పునాదులు పడ్డాయి. ఎల్‌అండ్‌టి సంస్థ ఒప్పందాలు కుదుర్చుకునే నాటికే తెలంగాణ ఉద్యమం తారాస్థాయిలో ఉంది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు తథ్యమని ఆనాడే అందరికీ తెలుసు. ఈ నేపథ్యంలోనే ఎల్‌అండ్‌టీ ప్రాజెక్టును పూర్తి చేసేందుకు ముందుకొచ్చింది. ఇప్పుడేదో కొత్తగా పెను ముప్పు వాటిల్లనున్నట్లు దుష్ప్రచారం చేయడం విడ్డూరంగా ఉందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మెట్రో ఆస్తులకూ పన్ను!
మెట్రో రైల్ ప్రాజక్టుకు సంబంధించిన భవనాలకు కూడా ఆస్తిపన్ను విధించాలని జీహెచ్‌ఎంసీ అధికారులు కసరస్తు చేస్తున్నారు. అయితే, పన్ను నోటీసులు ఎల్‌అండ్‌టీకి ఇవ్వాలా? లేకుంటే హెచ్‌ఎంఆర్‌కు ఇవ్వాలా? లేక నేరుగా ప్రభుత్వానికి ఇవ్వాలా? అనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. ఎల్ అండ్ టీతో ప్రభుత్వ ఒప్పందం ప్రకారం మెట్రో ఆస్తులకు ఆస్తి పన్ను మినహాయింపు ఉంది. అయితే దీనిపై జీహెచ్‌ఎంసీకి ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడంతో.. వారు యథావిథిగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భవనాల మాదిరిగా మెట్రో బిల్డింగులకు కూడా పన్ను విధించాలని నిర్ణయించారు. ఒకవేళ పన్ను మినహాయింపున్నా రాష్ట్ర ప్రభుత్వం నుంచి వసూలు చేయాలని యోచిస్తున్నారు.

మెట్రోపై అపోహలు ఎందుకు వద్దంటే..?
- పలు ప్రపంచ స్థాయి మల్టీలెవెల్ కంపెనీలు, కార్పొరేట్ కంపెనీలు, పరిశ్రమలు, విద్య, వ్యాపార, వాణిజ్య వర్గాలకు అనుకూలమైనది.అందుకని ఎంతోమంది నగరంలో పెట్టుబడులు పెట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు. కాబట్టి నగరానికి వచ్చేవారి సంఖ్య పెరుగుతుందే కానీ తగ్గదు.
-ఇప్పుడున్న జనాభా 2021 నాటికి 1.36 కోట్లకు చేరుతుంది.
- ప్రస్తుతం నగరంలో 30 లక్షలకు మందికి సొంత వాహనాలు ఉన్నాయి. వీటి సంఖ్య 2017 నాటికి మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రతి ఏటా 2 లక్షలకు పైగానే కొత్త వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. వీటి రద్దీ వల్ల ట్రాఫిక్ సమస్య పెరగవచ్చు. దీన్ని నివారించాలంటే మెట్రో తప్ప వేరే ప్రత్యామ్నాయం లేదు.
- ప్రతి రోజూ లక్షల మంది మోటర్ సైకిళ్లపై ప్రయాణం చేస్తున్నారు. అలాగే జనాభాలో 40 శాతం ప్రజా రవాణా వ్యవస్థపై ఆధారపడ్డారు. బస్సులు, రైళ్లల్లో ప్రయాణిస్తున్నారు. 2017లో ఈ సంఖ్య గణనీయంగా పెరిగి వీరంతా తొందరగా గమ్యం చేర్చే మెట్రో బాట పట్టే అవకాశం లేకపోలేదు.

HYD Metro Railప్రపంచంలోని చాలా మెట్రో రైలు ప్రాజెక్టులు ప్రారంభమయ్యేనాటికి ప్రయాణికుల సంఖ్య చాలా తక్కువగా ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. వీటితో పోలిస్తే మహానగరంలో మెట్రో ప్రారంభం కాబోయే నాటికి వాటికంటే రెట్టింపు సంఖ్యలో ప్రయాణికులు ఉంటారని లెక్కలు చెబుతున్నాయి. ఇక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో అంచనాకు మించి ప్రయాణికులు పెరుగుతుందని పలువురు మేథావులు భావిస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే ఎల్‌అండ్‌టి సంస్థ మెట్రో పనులను చురుకుగా కొనసాగిస్తోంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి