19, ఆగస్టు 2013, సోమవారం

తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావా?



తెలంగాణ ఏర్పాటైతే నీటి పంపకాల సమస్యలు వస్తాయని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, ఇతర సీమాంధ్ర నేతలు నెత్తిననోరు పెట్టుకుని మొత్తుకుంటున్నారు. నిజానికి వారి వాదనలో ఏమైనా పస ఉన్నదా అని అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. పైన రాష్ట్రాలు ఏర్పాటయితే దిగువ రాష్ట్రాలకు నీళ్లు రాకపోతే మహారాష్ట్ర నుంచి కర్ణాటకకు, కర్ణాటక నుంచి ఆంధ్రవూపదేశ్‌కు కృష్ణా నీరు వచ్చి ఉండేదికాదు. ముఖ్యమంత్రి అమాయకత్వంతో కాని, అవగాహనా రాహిత్యంతో కానీ అలా మాట్లాడాడని అనుకోవడానికి వీల్లేదు. కేవలం రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే అలా అనుంటారు. ముఖ్యమంవూతేకాదు, సీమ నాయకులంతా ‘తెలంగాణ ఏర్పడితే సీమాంవూధకు నీళ్లురావు’ అంటున్నారు. దీనిలో తెలంగాణకు అడ్డుపడటం తప్ప మరో ఉద్దేశం కనిపించదు. ఈ వాదనలో రాజకీయాల జోలికి వెళ్లకుండా సాంకేతికంగా ఈ వాదనలను పరిశీలిద్దాం. ఏదైనా నదిని అంటే నదీ జలాలను ఆ నదికి నీరందించే దేశా లు లేక రాష్ట్రాల మధ్య పంచడానికి అంతర్జాతీయ న్యాయసూవూతాలున్నాయి. ఆ సూత్రాలను ఆధారం చేసుకునే పంపకాలు యావత్ ప్రపంచంలో జరుగుతున్నాయి. అయితే తెలంగాణకు సంబంధించి ఆ సూత్రాలను వర్తింప చేసే అవకాశంలేదు. ఆంధ్రవూపదేశ్‌లో తెలంగాణ ప్రాంతం నుంచి ప్రవహించే నదులు రెండే ండు- ఒకటి కృష్ణ, మరొకటి గోదావరి. కృష్ణా నదీజలాలను మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌లకు బచావత్ ట్రిబ్యూనల్ ఇదివరకే పంచింది.

ఆంధ్రవూపదేశ్ కొచ్చిన వాటాను ఇప్పుడు తెలంగాణ, సీమాంవూధలకు పంచవలసి ఉంటుంది. 1976లో ఏర్పాటు చేసిన బచావత్ ట్రిబ్యూనల్ కృష్ణానదిలోని నికర జలాలను 2060 టీఎంసీలుగా నిర్ధారించి మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకు 700టీఎంసీలు, ఆంధ్రవూపదేశ్‌కు 800 టీఎంసీలు కేటాయించింది. దరిమిలా మరో 70టీఎంసీ లు ‘రెటర్న్ ఫ్లోస్’ కారణం గా నికర జలాల పరిమాణం 2130 టీఎంసీలకు పెరిగిం ది. వెరసి ఆంధ్రవూపదేశ్ వాటా 811 టీఎంసీలు గా ఉంది. ఈ నిక ర జలాలకు తోడు పూర్తి మిగులు జలాలను 2000 సంవత్సరం మే వరకు అనుభవించే స్వేచ్ఛ (హక్కుకాదు) ఆంధ్రవూపదేశ్‌కు లభించింది. ఈ మిగులు జలాలను 227.50 టీఎంసీలుగా నిర్ధారించి మన ప్రభుత్వం వాటి ఆధారంగా ఏడు ప్రాజెక్టులను రూపొందించింది. అవి- ఇవి 1) తెలుగు గంగ (రాయలసీమ)-29 టీఎంసీలు, 2) గాలేరు నగరి (రాయలసీమ)- 38 , 3) హంద్రీనీవా (రాయలసీమ)-40, 4) వెలిగొండ (కోస్తాంధ్ర)-43.50.. వెరసి కోస్తాంధ్ర ప్రాజెక్టులకు 150.50 టీఎంసీలు, 5) ఎస్‌ఎల్‌బీసీ- 30 టీఎంసీలు (తెలంగాణ), 6) నెట్టంపాడు (తెలంగాణ) 22, 7) కల్వకుర్తి (తెలంగాణ)25, వెరసి తెలంగాణ ప్రాజెక్టులకు- 77 టీఎంసీలు. ఈవిధంగా రాష్ట్రం మొత్తం ఏడు ప్రాజెక్టులకుగాను 227.50 టీఎంసీలు వినియోగించుకోనున్నాయి. అయితే ఈ మిగులు జలాలపై వినియోగపు హక్కు మన రాష్ట్రానికిలేదు. కనుక కేంద్రం దృష్టిలో ఈ ఏడు ప్రాజెక్టులు అనధికార ప్రాజెక్టులే. వీటి నిర్మాణం, పైరాష్ట్రాల అభ్యంతరాల నేపథ్యంలో సాగుతున్నయి. వీటిపై అయ్యే ఖర్చు పూర్తిగా రాష్ట్ర బడ్జెట్‌లోనిదే. కానయితే, ఇటీవలే బచావత్ స్థానంలో ఏర్పడ్డ బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యూనల్ నికర జలాల కేటాయింపుల ను బచావత్ ట్రిబ్యూనల్ నిర్ధారించినట్టుగానే యథాతథంగా ఉంచి, బేసిన్లో ఉద్భవించే మిగులు జలాలను మూడు రాష్ట్రాల మధ్య పంపకానికి పెట్టింది. లోగడ పూర్తిస్థాయిలో మిగులు జలాలను అనుభవించిన స్వేచ్ఛకు మారుగా 25 టీఎంసీల మిగులు జలాలను తెలుగు గంగకు, 150 టీఎంసీల మిగులు జలాలను నాగార్జునసాగర్ క్యారీ ఓవర్ కెపాసిటీ కోసం 9 టీఎంసీల మిగులు నీటిని జూరాలకు, మరో 6 టీఎంసీల నీటిని నదిలో ప్రవాహం కోసం వదలాల్సి ఉంటుందని కొత్త ట్రిబ్యూనల్ తమ ప్రాథమిక తీర్పులో వెల్లడించింది. ఈ తీర్పును వ్యతిరేకిస్తూ మన రాష్ట్రం ట్రిబ్యూనల్ పునః సమీక్ష కోసం సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది.

ఇంత వరకు మిగులు జలాలపై ఏ రాష్ట్రానికెంత వాటా ఉంటుందో నిర్ణయం జరగలేదు. కాబట్టి మిగు లు జలాల సంగతలా వదిలేసి తెలంగాణ ఏర్పడితే ఆ కొత్త రాష్ట్రానికి ఎంత పరిమాణంలో నికర జలాలు వస్తాయన్నది ప్రశ్న. కృష్ణా బేసిన్‌లోని నికర జలాలు మొత్తం (2060+70) 2130 టీఎంసీలని తెలుసుకున్నాం. అందులో మహారాష్ట్ర 585 టీఎంసీలు, కర్ణాటక 734 టీఎంసీల వాటా పోను, మనకు దక్కిన వాటా 811 టీఎంసీలు. కనుక తెలంగా ణ ఏర్పడితే ఈ 811 టీఎంసీల నికర జలాలనే రెండు రాష్ట్రాలు అంటే తెలంగాణ, ఆంధ్రరాష్ట్రం పంచుకోవలసి ఉంటుంది. అయితే కొత్తగా పంచడానికి ఏమిలేదు. ట్రిబ్యూనలే వివిధ ప్రాజెక్టులకు కేటాయింపులు జరిపింది. తెలంగాణలోని ప్రాజెక్టులకు 278.96టీఎంసీలు లభించాయి. ట్రిబ్యూనల్ తీర్పు వెల్లడి అయ్యాక ప్రభుత్వం కృష్ణా డెల్టాకు బచావత్ ట్రిబ్యూనల్ కేటాయించిన 181.2 టీఎంసీలలో 29 టీఎంసీలను తగ్గించి ఆ నీటిని భీమా (తెలంగాణ)కు 20 టీఎంసీలు, మిగిలిన 9టీఎంసీలను పులిచింతల (కోస్తాంవూధ)కు కేటాయించింది. ఈ రకంగా తెలంగాణ నికర జలాల వాటా 298.96 టీఎంసీలయింది.

పాకాల-2.60 టీఎంసీలు, వైరా-3.70, పాలేరు-4, డిండి-3.50, కోయిల్‌సాగర్-3.90, రాజోలిబండ డైవర్షన్ స్కీం- 15.90, మూసీ-9.40, లంకసాగర్-1, కోటిపల్లి వాగు-2, ఊకచెట్టువాగు-1.90, జూరాల 17.84టీఎంసీలు, జంటనగరాల తాగునీటి పథకం-5.70 టీఎంసీలు, ---మైనర్ (చిన్ననీటి పారుదల) 89.15 టీఎంసీలు, భీమా- 20 టీఎంసీలు, నాగార్జునసాగర్ ఆవిరినష్టంతో సహా -105.70 టీఎంసీలు, శ్రీశైలం ఆవిరి నష్టం-11 టీఎంసీలు, చెన్నై తాగునీటి వినియోగం-1.67 టీఎంసీలు.. వెరసి 298. 96 టీఎంసీలు. మరోమాటలో చెప్పాలంటే తెలంగాణ ఏర్పాటయ్యాక ఆరాష్ట్రానికి 298.96 టీఎంసీలు, రాయలసీమకు 144.70 టీఎంసీలు, కోస్తాంవూధకు 367.34 టీఎంసీలు లభ్యమవుతాయి. కనుక బచావత్ ట్రిబ్యూనల్ తెలంగాణ ప్రాజెక్టులకు కేటాయించిన నీటికంటే ఒక్క చుక్క నీటిని కూడా ఎక్కువగా అనుభవించే వీలుండదు. ఈ విషయం సీమాంవూధలో పనిచేసే జలరంగనిపుణులకు, ఇరిగేషన్ అధికారులకు తెలుసు. అయినా తెలంగాణ ఏర్పాటయితే సీమాంధ్ర ప్రాజెక్టులకు నీళ్లు రావని ప్రచారం చేయడంలో అర్థమేమిటి?

తెలంగాణ భౌగోళికంగా పైన ఉంది. కాబట్టి తెలంగాణ వారు అటు సీమకు గాని, ఇటు కోస్తాంవూధకు గానీ వారి వాటాలు వదలకపోవచ్చు అన్న వాదన ఉంది. అందుకే ఈ వాదనకు సమాధానంగా కీలకమైన లేక సమస్యాత్మకమైన ప్రాజెక్టులపైన కంట్రోల్ బోర్డులు ఏర్పాటవుతాయి. ఒక ప్రాజెక్టు నుంచి ఒకటికన్నా ఎక్కువ రాష్ట్రాలకు నీటి సరఫరా అయ్యేట్టు ఉంటే అక్కడే కంట్రోల్ బోర్డులు ఏర్పాటవుతాయి. కృష్ణా బేసిన్‌లో అలాం టి అవకాశమున్న ప్రాజెక్టులు మూడు. ఒకటి: రాజోలిబండ డైవర్షన్ స్కీం, (ఇక్కడి నుంచి తెలంగాణకు, కర్ణాటకకు, ఆంధ్రవూపదేశ్‌కు నీటి పంపకం ఉంటుంది). రెండు: శ్రీశైలం- ఇక్కడ్నుంచి నీటిని విద్యుచ్ఛక్తి (ఎడమ, కుడి పవర్ హౌజ్‌లు) కోసం, తెలుగు గంగకు (15 టీఎంసీలు- చెన్నై తాగునీటి కోసం), శ్రీశైలం కుడిగట్టు కాలువ (19 టీఎంసీలు- సాగునీటి కోసం) ప్రస్తుతం విడుదల చేసింది. మున్ముందు, మిగులు జలాల కేటాయింపు జరిపాక తెలంగాణకు, రాయలసీమకు, కోస్తాంవూధకు నీటి పంపకం జరిగే అవకాశముంది.మూడు: నాగార్జునసాగర్ ఇక్కడ్నుంచి పరోక్షంగా కృష్ణా డెల్టాకు, ప్రత్యేకంగా కుడికాలువ (ఆంవూధవూపదేశ్‌కు), ఎడమ కాలువలద్వారా (తెలంగాణకు, పాక్షికంగా ఆంధ్రవూపదేశ్) నీటి సరఫరా ఉంటుంది. ఒక్కసాగర్ ఎడమ కాలువ విషయంలో తప్ప మిగిలిన ఏ ప్రాజెక్టుకాని, కాలువ విషయంలోకాని ఎలాంటి పేచీ ఉండబోదు. కేటాయింపులననుసరించే నీటి విడుదల జరుగుతుంది. సాగర్ ఎడమకాలువ విషయంలో మటుకు నీరు తెలంగాణలో ప్రవహించాక ,సీమాంధ్రకు చేరుతుంది. తుంగభద్ర కుడిగట్టు కాలువల (ఎగువ, దిగువ కాలువలు) విషయంలో నీరు కర్ణాటకలో ప్రవహించి ఆనక ఆంధ్రవూపదేశ్‌కు చేరుతుంది. విడుదలైన నీటి పరిమాణంలో కొంతమేరకు ఎగువ రాష్ట్రమైన కర్ణాటక అక్రమంగా అనుభవిస్తుందన్న పేచీలున్నాయి. అదేవిధంగా కంట్రోల్‌బోర్డు సాగర్ ఎడమకాలువకు సక్రమంగా ఆంధ్రకు తరలించే ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అంతే తప్ప మరేప్రాజెక్టులకు ఇబ్బంది ఉండదు.

మిగులు జలాలను రాష్ట్రంలో మున్ముందు వివిధ ప్రాజెక్టులకు కేటాయిస్తే ఈ కంట్రోల్ బోర్డులే వాటిని కూడా ఆయా రాష్ట్రాలకు, ప్రాజెక్టుల వారీగా పంపకం జరగవలసి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నీటి పంపకానికి కంట్రోల్ బోర్డులు ఏర్పాటయ్యాక కూడా కిందికి నీళ్లు రావు’ అని చేస్తున్న వాదనకేమైనా అర్థం ఉందా? ఇక గోదావరి విషయానికి వస్తే- ఆ నీటిని పంచుకోవడానికి తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాలు మాత్రమే అర్హత కలిగి ఉన్నాయి. గోదావరి నికర జలాలు టిబ్యూనల్ ఖరారు చేసిన సమాచారం ఆధారంగా) మన రాష్ట్రానికి 1480 టీఎంసీలు-కృష్ణా మాదిరిగా ప్రాజెక్టుల వారీగా ట్రిబ్యూనల్ నీటిని కేటాయించలేదు. మన ప్రభుత్వం తెలంగాణకు సుమారు 900 టీఎంసీలు, మిగతా 580 టీఎంసీలను కోస్తాంధ్ర వినియోగం కోసమని అట్టిపెట్టింది. ఇప్పుడున్న వినియోగంతోపాటు గోదావరి బేసిన్‌లో తెలంగాణకు, కోస్తాంవూధకు వివిధ ప్రాజెక్టులకు కేటాయించిన నీరు మొత్తం వినియోగించుకున్నా.. నికర జలాలతో కొంచెం మిగులు ఉంటుంది. పైపెచ్చు గోదావరి జలాల వినియోగంలో సగానికి మించి ఇప్పటికీ కాలేదు. రెండు రాష్ట్రాల మధ్య గోదావరి నీటి పరిమాణం విషయంలో గాని పంపకంలోగానీ ఎలాంటి పేచీ ఉండదు. పేచీ అల్లా పోలవరం ఎత్తు విషయంలో మాత్రమే. అది వేరే విషయం. నికర జలాలే పూర్తిగా వినియోగించుకోవడం లేదు కనుక గోదావరి మిగులు జలాల విష యం అప్రస్తుతం.

గోదావరి విషయంలో ఎలాంటి జగడం లేదు. కృష్ణా విషయంలో కంట్రోల్ బోర్డులేర్పడుతాయి కనుక వివాదానికి అస్కారంలేదు. కనుక తెలంగాణ ఏర్పడితే ‘మాకు నీళ్లు రావు’ అని చేస్తున్న వితండవాదంలో ఔచిత్యం ఏమిటి? కాస్త లోతుగా పరిశీలిస్తే.. ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఇప్పుడు సమైక్యరాష్ట్రంలో ఏం జరుగుతున్నది? రాజోలిబండ ఆనకట్ట నుంచి కాలువమార్గంగా 15.90 టీఎంసీలు తెలంగాణకు (మహబూబ్‌నగర్ జిల్లాకు) న్యాయంగా, ట్రిబ్యూనల్ ఆదేశించినట్టుగా రావలసి ఉండగా ఎప్పుడు కూడా ఆరేడు టీఎంసీల కన్నా ఎక్కువ రావడంలేదు. అదే కేసీ కాలువకు (రాజోలిబండకు దిగువ కట్టడం) కేటాయించిన నీరు 39.90 టీఎంసీలుండగా ప్రతి సంవత్సరం 50-60 టీఎంసీలు నీరు విడుదలవుతుంది. అంటే రాజోలిబండకు చెందవలసిన నీరు కేసీ కాలువకు మళ్లుతోందన్నమాట. ఇకపోతే శ్రీశైలంలో అక్రమంగా అనధికారికంగా ఏర్పాటు చేసి వెడల్పు చేసిన, పోతిడ్డి పాడు తూములనుంచి లెక్కపత్రం లేకుండా ఎప్పుడు శ్రీశైలంలో నీళ్లుంటే అప్పుడు యథేచ్ఛగా రాయలసీమకు కృష్ణా నీరు ఇప్పుడు విడుదలవుతున్నది.

తెలుగుగంగ మీద ఏర్పాటు చేసిన వెలుగోడు (17టీఎంసీలు), బ్రహ్మంగారి మఠం (17టీఎంసీలు), సోమశిల (78టీఎంసీలు), కండలేరు (68టీఎంసీలు) ఇలా 180 టీఎంసీల నీటిని భద్రపరచడానికి వీలుగా ఏర్పాటు చేసిన జలాశయాల్లోకి ఇంకా ఇతర స్కీంలో భాగంగా ఏర్పాటు చేసిన అనేక జలాశయాల్లోకి కృష్ణా బేసిన్ నీరు నింపడానికి అన్ని హంగులు పూర్తయ్యా యి లేక అవుతున్నయి. ఇవికాక హంద్రీనీవా కోసం డైరెక్టుగా శ్రీశైలం నది నుంచి 40 టీఎంసీల ఎత్తిపోతల ఏర్పాటు చకచక సాగుతున్నది. మరి తెలంగాణ ఏర్పడితే అటు రాజోలిబండ కాని, ఇటు పోతిడ్డిపాడు దందాలు కొనసాగవన్న భయం సీమాంవూధులను పీడిస్తున్నది. అదేమాదిరిగా కృష్ణా డెల్టా రైతులు తమకు కృష్ణా జలాలనుపయోగించడంలో ప్రథమ హక్కు ఉందని దబాయిస్తూ, ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ, సాగర్‌లో, శ్రీశైలంలో ఉన్న నీటిని వాటి లెవల్స్ గురించి పట్టించుకోవకుండా జీవోలను తుంగలో తొక్కి ఇంతకాలం ఇష్ఠారాజ్యంగా అనుభవిస్తున్నారు. రేపు తెలంగాణ ఏర్పడి కంట్రోల్ బోర్డులు ఏర్పాటైతే తమ ఆటలు సాగవన్న భయాందోళనలు కోస్తాంధ్ర రైతాంగాన్ని కలచివేస్తున్నాయి. అదేవిధంగా ఇప్పటిదాక ఎడమకాలువ నీటిని అనుభవించాల్సిన తెలంగాణ ప్రయోజనాలను కాలరాచి కోస్తాంవూధకు నీటిని విడుదలచేయడం జరిగింది. గోదావరి విషయంలో కూడా ధవళేశ్వరానికి నీటి కొరత ఏర్పడేలా శ్రీరాంసాగర్ రిజర్వాయర్‌ని, కిన్నెరసాని జలాశయాన్ని ఖాళీ చేసి గోదావరి డెల్టా రైతాంగాన్ని కాపాడటం ఇప్పటిదాక జరిగిందే. తెలంగాణ ఏర్పడితే దౌర్జన్యంగా నీటి విడుదల విషయంలో ఇప్పటి వరకు తెలంగాణకు జరిగిన అన్యాయానికి, ఆంధ్రకు లభించిన అయాచిత నీటి వాటాకు బ్రేకులు పడతాయన్న భయం సీమవాసులను కంగారుపెడుతున్నది. అంతే తప్ప వారికి న్యాయబద్ధంగా సక్రమంగా రావలసిన నీరు రాదేమోనన్న బెంగ వారికెప్పుడూ లేదు. ముఖ్యమంవూతి అయి నా, మరే సీమాంధ్ర నేతయినా ఎందుకీ దుష్ప్రచారం చేస్తున్నారో దీన్ని బట్టి తేటతెల్లం అవుతుంది.
-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి