21, ఆగస్టు 2013, బుధవారం

రెండు ప్రాంతాలు.. మూడు ముళ్లు


-పెనవేసుకున్న అనుబంధాలు
-అల్లుళ్లు.. కోడళ్లు.. సంస్కృతి వారధులు..
-విభజన జరిగినా.. మమతానురాగాలు పటిష్ఠమే
హైదరాబాద్, ఆగస్టు 20 (టీ మీడియా):సరిహద్దుల్లేనిది మానవ సంబంధం! అందులోనూ వైవాహిక బంధానిది ప్రత్యేక పాత్ర! ఎందుకంటే.. సమాజ వికాసం.. సంస్కృతి విస్తరణకు అవే బాటలు తీశాయి! ఇది చరిత్ర చెప్పిన సత్యం! first
తెలుగు నేల ఇందుకు మినహాయింపేమీ కాదు! భిన్న సంస్కృతులుగా విరాజిల్లుతున్న ఆంధ్ర.. రాయలసీమ.. తెలంగాణ మధ్య అనేక వైవాహిక బంధాలు దశాబ్దాలుగా పెనవేసుకుని ఉన్నాయి! చరిత్ర తవ్వాలేకానీ.. శతాబ్దాల క్రితమే అల్లుకున్న మమతల మల్లియల పరిమళాలు ఇప్పటికీ సాక్ష్యంగా నిలుస్తాయి! ఆ బంధాల నీడన అనేక బాంధవ్యాలు మారాకు వేశాయి! వీటికి రాజకీయాల్లేవు! వీటికి స్వార్థ చింతనల్లేవు! మానవ సంబంధాలు ప్రాంతాలకు అతీతమన్న పునాదిపైనే వసుధైక కుటుంబాలు వికసించాయి! తెలంగాణ ప్రాంత వనపర్తి రాజావారి కంటి రాయలసీమ ప్రాంత మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కరడ్డి తన ఇంటిదీపంగా చేసుకున్నా.. రాయలసీమకు చెందిన రామచంవూదాడ్డితో తెలంగాణ బిడ్డ..

మంత్రి గీతాడ్డి ఏడడుగులు నడిచినా.. ఆంధ్రా అమ్మాయిని తెలంగాణ ప్రాంత మంత్రి కే జానాడ్డి తన చిన్నకోడలిగా తెచ్చుకున్నా.. ఉపాసనను పాణిక్షిగహణం చేసి.. నిజామాబాద్ సంస్థానానికి చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ తేజ అల్లుడయినా.. ఆంధ్రా అమ్మాయి నమస్తే తెలంగాణ సీఎండీ సీఎల్ రాజం ఇంటికి కోడలై శోభ తెచ్చినా.. అది మానవ సంబంధాల్లోని గొప్పతనమే! ఇప్పుడు జరిగే విభజన.. ఈ రెండు ప్రాంతాల కుటుంబ సంబంధాలను విడదీస్తుందని ఊహ చేయడమూ.. అసాధ్యమైనదే.. అసంబద్ధమైనదే! ఎందుకంటే.. ఇవి మనిషికి మనసుకు మధ్య.. మమతల పందిరి వేశాయి కనుక! ఇలాంటివే అనేక ఉదాహరణలు.. ప్రత్యేకించి గడిచిన రెండు దశాబ్దాల కాలంలో ఎన్నో కనిపిస్తాయి! మాజీ సీఎల్పీనేత దివంగత పీ జనార్ధన్‌డ్డి కూతురు విజయాడ్డి.. రాయలసీమకు కోడలిగా వెళ్లారు! మాజీ స్పీకర్ సురేష్‌డ్డి కుమ్తాను నెల్లూరుకు చెందిన మేకపాటి రాజమోహన్‌డ్డి తమ్ముడి కొడుకుకు ఇచ్చారు! మాజీ మంత్రి విజయరామారావుతన కూతుర్ని ఆంధ్రాకు కోడలిగా పంపారు! ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌డ్డి కూతుర్ని నెల్లూరు జిల్లా ఇంటికి ఇచ్చారు. రాష్ట్ర సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి డీకే అరుణకు ఉన్న ముగ్గురు కూతుళ్లలో ఇద్దరు నెల్లూరు జిల్లాకు కోడళ్లుగా వెళ్లారు! బీసీ సంక్షేమ శాఖ మంత్రి బస్వరాజు సారయ్య కూతురికి విజయవాడ అబ్బాయితో పెళ్లి జరిగింది.

మాజీ హోంమంత్రి సబితా ఇంద్రాడ్డి కోడలు ఆంధ్రా అమ్మాయే! మాజీ మంత్రి మూలింటి మారెప్ప కూతరు కరీంనగర్‌కు కోడలిగా వచ్చింది. మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కొడుకు కరీంనగర్ జిల్లాకు చెందిన అమ్మాయితో మూడు ముళ్ల బంధం వేసుకున్నారు! టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కే కేశవరావు రెండో కోడలు ఆంధ్రా అమ్మాయే! రంగాడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి చంద్రశేఖర్ కుమారుడు మాజీ ఉప ముఖ్యమంత్రి దివంగత కోనేరు రంగారావు మనుమరాలిని వివాహం చేసుకున్నారు! తెలుగుదేశం సీనియర్‌నేత, మాజీ మంత్రి టీ దేవేందర్‌గౌడ్ పెద్ద కుమారుడు నెల్లూరు అమ్మాయిని వివాహం చేసుకున్నారు! సినీ నటుడు అల్లు అర్జున్ తెలంగాణ అల్లుడయ్యాడు! పారిక్షిశామికవేత్త, ఎంపీ జీ వివేక్ ఆంధ్రా అబ్బాయిని అల్లుడిని చేసుకున్నారు! తూర్పుగోదావరి జిల్లా ఎమ్మెల్యే రౌతు సూర్యవూపకాశరావు కూతుర్ని మెదక్ జిల్లా పారిక్షిశామివేత్త అంజనేయులు కుమారుడికి ఇచ్చారు. నిజామాబాద్‌జిల్లాకు చెందిన మాజీ మంత్రి మహ్మద్ అలీ షబ్బీర్ కూతురితో అనంతపురం జిల్లాకు చెందిన ఐపీఎస్ అధికారి ఏకే ఖాన్ కొడుకు వివాహం ఇటీవల జరిగింది. ప్రముఖ పారిక్షిశామికవేత్త జీవీ కృష్ణాడ్డి కుటుంబం కూడా తెలంగాణ కుటుంబాలతో వైవాహిక సంబంధాలు కలిగి ఉంది.

అంతే కాదు ప్రముఖ సంపాదకుడు ఏబీకే ప్రసాద్ ఇంట్లో మూడు ప్రాంతాల నుంచి వివాహ సంబంధాలున్నాయి. రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ రాజశేఖర్‌డ్డి సతీమణి కడప జిల్లాకు చెందినవారు. మహబూబ్‌నగర్ జిల్లకు చెందిన ఎంతో మంది సమీపంలోని కర్నూలు జిల్లాతో వర్తక సంబంధాలతోపాటు వివాహ సంబంధాలున్నాయి. ఇవి కొన్ని వివరాలు మాత్రమే! కొందరు ప్రముఖుల విషయాలు మాత్రమే. ఇవన్నీ వారి వ్యక్తిగత విషయాలే అయినా.. రెండు ప్రాంతాల మధ్య ఐక్యతను చాటిన ఉదంతాలు కాబట్టి ప్రస్తావించడమే! ఇక సాధారణ ప్రజల్లో ఆంధ్రా ప్రాంతం నుంచి అనేక మంది తెలంగాణకు అల్లుళ్లయ్యారు! తెలంగాణ బిడ్డలు ఆంధ్ర ప్రాంతానికి కోడళ్లుగా వెళ్లారు! రెండు ప్రాంతాల సంస్కృతీ వికాసానికి.. ఉభయ ప్రాంతాల సంప్రదాయాల మేలు కలయికకు వారు ఆనవాళ్లవుతున్నారు! ఇంతటి గొప్ప సంబంధాలు తెలంగాణ-ఆంధ్ర మధ్య ఉన్నాయి! ఇప్పుడేదో మానవ సంబంధాలతో సంబంధం లేని.. కొన్ని సామాజిక అంశాలపై, అసమానతలపై, ఒక ప్రాంతానికి దశాబ్దాలుగా జరిగిన అన్యాయంపై రాష్ట్రం విడిపోతున్నంత మాత్రాన ఈ బంధాలు బలహీనమవుతాయా? రాష్ట్రం విడిపోయినా..

ఈ బంధాల్లో ఎలాంటి మార్పు రాదు! ఎందుకని ప్రశ్నిస్తే.. మళ్లీ మానవ సంబంధాల గొప్పతనమే సమాధానంగా నిలుస్తుంది! అనకాపల్లి అబ్బాయితో అమెరికా అమ్మాయికి పెళ్లి జరిగితే.. ఎంత మురిపెం? మీడియా ఎంత ముచ్చగా ఆ ముచ్చటను చెబుతుంది? హద్దుల్లేని ప్రేమ.. మానవ నైజం! అందుకే.. ఎప్పుడో పాతికేళ్ల క్రితం తీసిన ‘పడమటి సంధ్యారాగం’ సినిమా అంతటి ప్రజాదరణ పొందింది! విచిత్రం ఏమిటంటే.. మానవ సంబంధాల్లోని ఇంత గొప్పతనానికి సీమాంవూధలోని సమైక్యాంవూధవాదులు ఇప్పుడు మసి పూస్తున్నారు! ఇంతటి ప్రేమానుబంధాలు పెనవేసుకున్న ప్రాంతాలు.. రేపు విడిపోయిన తర్వాత ముఖం ముఖం చూసుకునే పరిస్థితి ఉండదన్న నిర్హేతుకమైన వానదలు తెచ్చి.. రెండు ప్రాంతాల మధ్య లేనిపోని అనుమానాలను ప్రోది చేయడం ద్వారా కనీస లబ్ధి పొందుదామని కుట్ర చేస్తున్నారు. విభజన వికాసానికే తప్ప ఇరు ప్రాంతాల సంబంధాల మధ్య అడ్డుగోడ కాదనే నగ్నసత్యాన్ని సమైక్యం ముసుగుతో కప్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ.. ప్రాంతం విడిపోయినా.. మనసు కలిసే ఉంటుంది. రాష్ట్రం వేరైనా.. మమత వేళ్లూనుకునే ఉంటుంది! గుప్పెడు మంది స్వార్థ శక్తులు వేసే పాచికలతో దాని ప్రాశస్థ్యం పోదు! పైగా.. రెండు రాష్ట్రాల మధ్య ఆప్యాయతలకు ఆలంబన అవుతుంది!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి