3, ఆగస్టు 2013, శనివారం

తెలంగాణ పోరుబాట

.. -1948 సెప్టెంబర్ 18: నిజాం పాలనలోని హైదరాబాద్ స్టేట్‌గా ఉండిన ప్రస్తుత తెలంగాణ ప్రాంతం భారత యూనియన్‌లో విలీనం.
-1950 జనవరి 26 : హైదరాబాద్ స్టేట్ మొదటి ముఖ్యమంవూతిగా ఎంకే వెల్లోడిని నియమించిన కేంద్రం.
-1952 : ప్రజాస్వామ్యయుతంగా జరిగిన తొలి ఎన్నికల్లో ముఖ్యమంవూతిగా ఎన్నికైన బూర్గుల రామకృష్ణారావు.
-1953 అక్టోబర్ 1 : మద్రాస్ రాష్ట్రం నుంచి భాషా ప్రయుక్త రాష్ట్రంగా వేరుపడిన ఆంధ్ర.
kcrParty
-1955 నవంబర్ 25 : విలీనం జరిగితే తెలంగాణ ప్రాంతానికి రక్షణలు కల్పిస్తూ ఆంధ్ర అసెంబ్లీ తీర్మానం.
-1956 ఫిబ్రవరి 20 : పెద్ద మనుషుల ఒప్పందంపై బెజవాడ గోపాలడ్డి, బూర్గుల రామకృష్ణారావు తదితరుల సంతకాలు.
-1956 నవంబర్ 1 : తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలతో కలుపుకొని హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రవూపదేశ్ ఆవిర్భావం.
-1969 : హామీలు ఉల్లంఘనకు గురికావడం, పెద్ద మనుషుల ఒప్పందం విఫలం కావడంతో తెలంగాణలో ఉద్యమాలకు ఊపిరి. మర్రి చెన్నాడ్డి నాయకత్వంలో ఉధృతమైన ప్రత్యేక రాష్ట్ర పోరు. పోలీసు కాల్పుల్లో 300 మంది విద్యార్థుల మృతి.
-1969 ఏప్రిల్ 12 : ఉభయ ప్రాంతాల నేతలతో చర్చలు జరిపి ఎనిమిది సూత్రాల పథకాన్ని తీసుకువచ్చిన నాటి ప్రధాని ఇందిరాగాంధీ. ఈ పథకాన్ని తిరస్కరించిన తెలంగాణ ప్రజా సమితి నేతలు తమ ఆందోళనలు కొనసాగించారు.
-1972 : తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో జై ఆంధ్ర ఉద్యమం మొదలు.
-1973 సెప్టెంబర్ 21 : ఆరు సూత్రాల పథకంతో ఉభయ ప్రాంతాలకు రాజకీయ రాజీ చేసిన కేంద్రం.
-1985 : ఉద్యోగాల విషయంలో జరుగుతున్న అన్యాయంపై గళమెత్తిన తెలంగాణ ఉద్యోగులు. దీంతో ఆ అన్యాయాలు సరి చేసేందుకు అప్పటి ఎన్టీ రామారావు ప్రభుత్వం 610 జీవో తీసుకువచ్చింది.
-1999 : అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌ను మళ్లీ లేవదీసింది.
-2001 ఏప్రిల్ 27 : దశాబ్దాలుగా తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలపై కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు టీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేయడంతో మళ్లీ పుంజుకున్న ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు. తెలంగాణ ఉద్యమ చరివూతలో కొత్త అధ్యాయం మొదలు.
-2001 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రెండో ఎస్సార్సీ వేయాల్సిందిగా నాటి ఎన్డీయే ప్రభుత్వానికి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ తీర్మానంతో కూడిన లేఖ. తిరస్కరించిన నాటి హోం మంత్రి ఎల్‌కే అద్వానీ.
-2004 : ఎన్నికల్లో గెలిస్తే తెలంగాణ రాష్ట్రం ఇస్తామన్న హామీతో టీఆర్‌ఎస్‌తో ఎన్నికల పొత్తు కుదుర్చుకున్న కాంగ్రెస్. అటు కేంద్రంలో, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ విజయం. రెండో చోట్లా ప్రభుత్వాల్లో చేరిన టీఆర్‌ఎస్.
-2006 డిసెంబర్ : రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ ప్రభుత్వ జాప్యాన్ని నిరసిస్తూ ప్రభుత్వాల నుంచి తప్పుకున్న టీఆర్‌ఎస్.
-2008 అక్టోబర్ : మనసు మార్చుకున్న టీడీపీ.. రాష్ట్ర విభజనకు అనుకూలమని ప్రకటన.
-2009 నవంబర్ 29 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌తో టీఆర్‌ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ నిరాహార దీక్ష ప్రారంభం.
-2009 డిసెంబర్ 9 : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను మొదలు పెడుతున్నట్లు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం.
-2009 డిసెంబర్ 23 : సీమాంధ్ర నుంచి వెల్లు వ్యతిరేకతతో రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన కేంద్రం. కేంద్రం ప్రకటనతో భగ్గుమన్న తెలంగాణ. యువకుల ఆత్మబలిదానాలు మొదలు.
-2010 ఫిబ్రవరి 3 : తెలంగాణ డిమాండ్‌పై పరిశీలనకు జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం.
-2010 డిసెంబర్ 30 : కేంద్రానికి నివేదిక సమర్పించి శ్రీకృష్ణ కమిటీ.
-2011-12 : సకల జనుల సమ్మె, మిలియన్ మార్చ్, టీ ఎమ్మెల్యేల రాజీనామాలు వంటి ఉధృత ఆందోళనలతో అట్టుడికిన తెలంగాణ.
-2012 డిసెంబర్ 28 : తెలంగాణ వాదుల ఒత్తిడితో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసిన కేంద్ర హోంశాఖ

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి