-విస్తరించారు.. వతన్ అడుగుతున్నారు..
-హైదరాబాద్ విస్తరణ వెనుక రహస్య పన్నాగం
-అభివృద్ధి అంటే ఇక్కడ జీవన విధ్వంసమే
-తెలంగాణ ఏర్పడినా.. హైదరాబాద్ దక్కకుండా..గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు వెనుక భారీ కుట్ర
-బాబు, వైఎస్ జమానాల్లోనే అమలు ప్రక్రియలు
-ముందుకు తీసుకుపోయిన పాలక వారసత్వం
-విచ్చలవిడి విస్తరణతో కార్పొరేషన్ కకావికలు
-ఉనికి కోల్పోయిన రంగాడ్డి, మెదక్ జిల్లాలు
-ఉపాధి కరువైన సాధారణ ప్రజానీకం
-అభివృద్ధితో లాభపడింది పెట్టుబడిదారులే
(టీ మీడియా, హైదరాబాద్ సిటీ బ్యూరో):హైదరాబాద్ ఎవడబ్బ సొత్తు? ఈ నగరాన్ని అభివృద్ధి చేసింది మేమే! కాబట్టి.. ఈ నగరంపై మాకు హక్కుండాలి.. దీనిని కేంద్రపాలితం చేయాలి. లేదంటే శాశ్వతంగా ఉమ్మడి రాజధానిగా ఉంచాలి! ఇవీ ఇప్పుడు తెలుగుజాతి ఐక్యత కోసం నినదిస్తున్న సీమాంధ్ర ప్రాంత నేతల వాదనలు.. డిమాండ్లు! ఈ వాదనల వెనుక అసలు వాస్తవాలు ఇప్పుడిప్పుడే అర్థమవుతున్నాయి. ఒకప్పటి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిని అంతకంతకూ పెంచుతూ పోయారు. సైబరాబాద్ సయ్యాటలతో.. రింగురోడ్డు వంకరలతో శివార్లను మింగేశారు. రంగాడ్డి, మెదక్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల విలీనంతో గ్రేటర్ మాటలు చెప్పి.. జీవన విధ్వంసం సృష్టించారు.
సమీప గ్రామాల్లోని పూల తోటలు, అంగూర్ తోటలు, కూరగాయ పంటలను సమాధి చేసి.. వాటిపై సెజ్‌లు, రియల్ ఎస్టేట్ వెంచర్లు, ఎమ్మార్ బౌల్డర్ హిల్స్.. గోల్ఫ్ కోర్సులు మొలిపించి.. వాటికి రాచమార్గాలు వేసి.. అదే అభివృద్ధి అని నమ్మబలికారు! తాము వైతాళికులమని అభివృద్ధి ముసుగులు కప్పుకున్నారు! ఇప్పుడు ఆ ముసుగులు చిరిగిపోతున్నాయి! ఎప్పటికైనా తెలంగాణ తథ్యమన్న భావనతో దీపం ఉండగానే ఇల్లు దోచేసిన వైనాన్ని కళ్లకు కడుతున్నాయి. హైదరాబాద్‌ను విస్తరణవాదంలో ముంచెత్తి.. ఆ సాకుతో దానిపై హక్కులు కోరాలన్న దురుద్దేశాలు.. ఇప్పుడు నగ్నంగా బయటపడుతున్నాయి. లేకపోతే.. తెలుగుతల్లి మెడపై కత్తి వేలాడుతోందని చెప్పి.. ఎట్టి పరిస్థితుల్లోనూ తెలుగు జాతి విడిపోవడాన్ని అంగీకరించేది లేదని భీష్మ ప్రతిజ్ఞలు చేసిన సమైక్యాంధ్ర ఉద్యమ నేతలు.. హైదరాబాద్‌పైనే పట్టుబట్టడమేంటి? నగరంపై తాము కోరుకున్న హక్కులతో అభ్యంతరాలన్నీ పక్కనపె సిద్ధపడటమేంటి? ఈ ప్రశ్నలకు జవాబులు తెలంగాణ ప్రజలకు తెలిసిపోయాయి. ఔను.. ఇప్పుడు మళ్లీ చెబుతున్నాం.. హైదరాబాద్ మా అబ్బ సొత్తే..అంటూ తెలంగాణ యావత్తు గళమెత్తుతోంది..
ఇది సీమాంధ్ర నేతల దూరాలోచన! తెలంగాణపై విస్తృత స్థాయి దురాలోచన! హైదరాబాద్‌లో తమ లాభార్జనకు అడ్డంకి లేకుండా చూసుకునేందుకు సీమాంధ్ర పెట్టుబడిదారులు.. వారి ప్రయోజనాలు కాపాడే సీమాంధ్ర రాజకీయ నాయకులు ఏళ్ల క్రితమే ఓ రహస్య కుట్ర అధ్యాయం రచన మొదలు పెట్టారు. వారి టార్గెట్ హైదరాబాద్.. దాని చుట్టూ ఉన్న అపారమైన భూములు. ఆ భూములు, గుట్టలు.. వారికి కాసులు కురిపించే కల్పవృక్షాలుగా కనిపించాయి! అప్పటికే భూమి విలువను గుర్తించి.. రాజధానిలో, శివార్లలో మకాం వేసిన సీమాంధ్ర వ్యాపారవేత్తలు, సినీ ప్రముఖులకు పారిక్షిశామికవేత్తలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తోడయ్యారు! పాలకులు సై అన్నారు.
సీమాంధ్ర వలసల కారణంగా నగర శివార్లలో జనాభా పెరిగింది. వైఎస్ రాజశేఖర్‌డ్డి సీఎం అయిన తర్వాత విస్తరణవాదం పరాకాష్ఠకు చేరుకుంది. అప్పటికే ఉవ్వెత్తున సాగుతున్న తెలంగాణ ఉద్యమంతో హైదరాబాద్‌పై ఎప్పటికైనా మెలిక పెట్టవచ్చునన్న ఉద్దేశంతోనే విచ్చలవిడిగా నగరాన్ని విస్తరిస్తూ పోయారన్న అభివూపాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే శివారు మున్సిపాల్టీల విలీనంతో గ్రేటర్ హైదరాబాద్ ఏర్పాటు చేశారని తెలంగాణ ఉద్యమకారులు ఆరోపిస్తున్నారు. ఇక్కడి భూములు పెద్ద ఎత్తున కొనుగోలు చేసి.. ప్రభుత్వం నుంచి నజరానాగా పొంది.. కొన్నిక బ్జా చేసి.. సీమాంధ్ర ప్రాంత రియల్ ఎస్టేట్ వ్యాపారులు కోట్లకు పడగపూత్తారు.
జీవన విధ్వంసం ఛాయలు కూడా లేకుండా చదును చేసేసి.. ధగధగలాడే కార్పొరేట్ భవంతుల నిర్మాణం చూపి.. ఇదంతా తాము చేసిన అభివృద్ధేనని ఇప్పు డు సీమాంధ్ర నాయకులు చెబుతుండటం.. ఆ ప్రాతిపదికన హైదరాబాద్‌పై హక్కులు కోరుతుండటమే ఇక్కడ విచిత్రం. నిజానికి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్.. సీమాంవూధుల దండయావూతలకు ముందే ఎంతో కీర్తివూపతిష్ఠలతో వర్ధిల్లిందని చర్రిత చెప్పే మాట. సీమాంధ్ర నేతల విస్తరణవాదం నగర రూపురేఖలను మార్చివేసింది. గ్రేటర్ ఏర్పాటుకు ముందే మున్సిపల్ కార్పొరేషన్ వార్షిక ఆదాయం రూ.400కోట్లుగా ఉండేది. 1869 వరకూ మున్సిపల్ కార్పొరేషన్‌ను కొత్వాల్ ఏ బల్దా పస్తుత సిటీ పోలీస్ కమిషనర్ హోదా)నిర్వహించేవారు. ఆయనే సిటీ మేజిస్ట్రేట్‌గా ఉండేవారు. మున్సిపల్ కమిషనర్ చూసే బాధ్యతలూ ఆయనే నిర్వర్తించేవారు. 1869లో సాలార్‌జంగ్-1 హయాంలో మొట్టమొదటిసారి మున్సిపల్ అండ్ రోడ్ మెయింటెనెన్స్ విభాగం ఏర్పాటైంది. అప్పుడే దానికి మున్సిపల్ కమిషనర్‌ను కూడా నియమించారు. అప్పటికి నగర శివార్లలో ఉన్న చాదర్‌ఘాట్ 1933వరకు ఓ ప్రత్యేక మున్సిపల్ బోర్డుగా కొనసాగింది.
అనంతరం దీన్ని మున్సిపల్ అండ్ రోడ్ మెయింటెనెన్స్ విభాగంలో విలీనంచేసి హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌గా గుర్తింపునిచ్చారు. అదే ఏడాది ప్రజలకు తమ ప్రతినిధులను ఎన్నుకునే హక్కు కల్పించారు. 1934లో మొదటిసారి మున్సిపల్ కార్పొరేషన్‌కు ఎన్నికలు నిర్వహించారు. అయితే ఇది ఎంతోకాలం కొనసాగలేదు. అప్పటి ప్రభుత్వ అధికారులు, ఎన్నికైన ప్రజావూపతినిధుల వ్యవస్థకు మధ్య ఏర్పడిన సమస్యల కారణంగా 1942లో ప్రజావూపతినిధుల వ్యవస్థ రద్దయింది. అనంతరం 1951వరకు ప్రత్యేక అధికారి పాలన కొనసాగింది. అదే ఏడాది హైదరాబాద్, సికింవూదాబాద్‌లు రెండు వేరువేరు కార్పొరేషన్లుగా ఏర్పాటయ్యాయి. చివరికి 1960లో వీటిని తిరిగి ఏకం చేశారు. అప్పట్లో నగర విస్తీర్ణం కేవలం 73 చదరపు కిలోమీటర్లు. ఆదాయం రూ.1.5కోట్లు ఉండేది. అనంతరం కాలక్షికమంలో హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (ఎంసీహెచ్) పరిధి 179 చదరపు కిలోమీటర్లకు విస్తరించింది. నాలుగు జోన్లు, ఏడు సర్కిళ్లు, వంద డివిజన్లను ఏర్పాటు చేశారు. గ్రేటర్ ఏర్పాటుకు ముందు వరకూ ఎంసీహెచ్ ఆదాయం సాలీనా రూ.400కోట్లు ఉండేది. అంతేకాకుండా పచ్చదనం పరిశువూభతలో అనేక బహుమతులు కూడా అప్పట్లోనే నగరం సొంతం చేసుకుంది.
గ్రేటర్ ఏర్పాటు, గ్రామాల విలీనం వెనుక మర్మమేమిటో.....?
ఏప్రిల్, 2007లో అప్పటి రాజశేఖర్‌డ్డి సర్కారు శివార్లలోని 12మున్సిపాలిటీలను ఎంసీహెచ్‌లో విలీనం చేసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)గా ఏర్పాటు చేసింది. దీంతో విస్తీర్ణం ఏకంగా 625చదరపు కిలోమీటర్లకు పెరగడంతోపాటు జోన్లు నాలుగు నుంచి ఐదుకు, సర్కిళ్లు ఏడు నుంచి 18కి పెరిగాయి. జనాభా సైతం సుమారు 78లక్షలకు చేరింది. డివిజన్లు 100నుంచి 150కి పెరిగాయి. ఇది ఎవరూ కోరుకోనిది. ఎవరికీ ఇష్టం లేనిది. జనం వద్దంటున్నా.. బలవంతంగా విలీన ప్రక్రియ పూర్తి చేశారు. ఒకవేళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పక్షంలో హైదరాబాద్‌తోపాటు రంగాడ్డి, మెదక్ జిల్లాలను తెలంగాణకు కాకుండా చేసే ఉద్దేశంతోనే గ్రేటర్ మాయకు తెర తీసినట్లు ఇప్పుడు ఆయా నేతల మాటలన బట్టి మరింత స్పష్టంగా అర్థమవుతున్నది. తాజాగా మరో 3pటాగామాలను కూడా గ్రేటర్‌లో విలీనం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
‘మహా’ విస్తరణ జరిగిందిలా..
హుడా ఏర్పాటు: హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(ఎంసీహెచ్) ప్రాంతాన్ని కలిపి 1975లో ప్రభుత్వం హుడా (హైదరాబాద్ అర్బన్ డెవలప్‌మెంట్ ఆథార్టీ)ను 27 సెప్టెంబర్ 1975 జీవో నంబర్ 411 ద్వారా ఏర్పాటు చేశారు. ఇందులో ఎంసీహెచ్ (హైదరాబాద్ జిల్లా) పరిధిలోని 16 మండలాలు, రంగాడ్డి జిల్లా 15 మండలాలు, మెదక్ జిల్లాలోని 3 మండల కేంద్రాలను కలిపారు. ఈ మేరకు 1,864.89 చదరపు కిమీటర్ల పరిధి కల్గి ఉండేది.
హెచ్‌ఎండీఏ అవతరణ:
హుడా పరిధిని 2008, ఆగస్టు 25న విస్తరించి.. హెచ్‌ఎండీఏ (హైదరాబాద్ మెట్రోపాలిటన్ ఆథార్టీగా రూపాంతరం చేశారు. అప్పటికే ఉన్న మూడు జిల్లాల్లోని 34 మండలాల నుంచి ఐదు జిల్లాల్లోని 55 మండలాలకు మెట్రో పరిధిని విస్తరించారు. ఇందులో హైదరాబాద్-16, రంగాడ్డి-22, మెదక్-10, నల్గొండ 5, మహబూబ్‌నగర్ 2 మండలాలు ఉన్నాయి. వీటిలోని 849 గ్రామాలను విలీనం చేసుకుంటూ హెచ్‌ఎండీఏగా అవతరించింది. 1975 నాటికి 1,864 చ.కి.మీ పరిధితో ఉన్న హుడా స్థానంలో.. 7,228.09 చ.కి.మీటర్లలో హెచ్‌ఎండీఏ విస్తరించింది.
బ్రేక్‌డ్యాన్సుల అవుటర్ రింగ్ రోడ్డు
హెచ్‌ఎండీఏ అవతరణకు ముందే సీమాంధ్ర పాలకులు రాజధాని శివారు భూములకు రియల్ రెక్కలు తొడిగించేందుకు రంగం సిద్ధం చేశారు. 158 కిలోమీటర్ల పొడవున అవుటర్ రింగురోడ్డును తెరపైకి తెచ్చారు. దీనికి ఇరువైపులా 330 చ.కి.మీ ప్రాంతానికి ప్రత్యేకంగా గ్రోత్ కారిడార్ మాస్టర్‌ప్లాన్‌ను 2008, జూలై 9న జీవో 470 ద్వారా ఆమోదించారు. ఇక అలైన్‌మెంట్‌లో సీమాంధ్ర రియల్టర్లు ఆడింది ఆట అయింది. బ్రేక్‌డ్యాన్సులు చేస్తూ సాగిపోయిన రింగురోడ్డు.. అనేక వంకరలు తిరిగింది. ‘మనోళ్ల భూములు పోకూడదు’ అన్న జాగరూకతతో సాగిన ఈ వ్యవహారం సీమాంధ్ర రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కోట్లు కురిపించింది. దానికి తోడు రోడ్డు నిర్మాణం కాంటాక్టు కూడా సీమాంధ్ర కాంట్రాక్టర్లకే దక్కింది. ఔటర్ రింగురోడ్డు పేరుతో శివారు ప్రాంతాల చుట్టూ ఓ వలయాన్ని ఏర్పాటుచేసి రంగాడ్డి, మెదక్ జిల్లాల్లోని ప్రాంతాలను హైదరాబాద్ పరిధిలోకి తెచ్చారు. దీంతో పట్టణీకరణ వేగంగా పుంజుకొని స్థానిక రైతులు అరకొర ధరలకు తమ భూములను అమ్ముకోగా, వాటిపై సీమాంవూధకు చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారులు అనేక రెట్లు అధికంగా సొమ్ముచేసుకున్నారు. ఇప్పుడు మరోసారి.. విస్తరిత ప్రాంతాల మాస్టర్‌ప్లాన్-2031లో రీజనల్ రింగ్ రోడ్డు తిబుల్‌ఆర్) పేరుతో 290 కిలోమీటర్ల రహదారి మార్గాన్ని తెరపైకి తెచ్చారు. దాంతో రియల్టర్లకు మళ్లీ పండగ! మొత్తంగా శాశ్వత ఉమ్మడి రాజధాని పేరుతో ఒక్క హైదరాబాద్‌నే కాకుండా.. ఐదు జిల్లాల ప్రాంతాన్ని గుప్పిటపట్టే అద్భుతమైన ఎత్తుగడ! ఇదే సీమాంధ్ర నాయకులు చెబుతున్న అభివృద్ధి పరమావధి!
నగరాభివృద్ధికి పెద్ద పీట
ఇక్కడ తొండలు కూడా గుడ్లు పెట్టవంటూ కారు కూతలు కూసే పెత్తందార్లకు హైదరాబాద్ చరిత్ర చెప్పాల్సిందేనని తెలంగాణవాదులు అంటున్నారు. 1931 నాటికే హైదరాబాద్ దేశంలో నాలుగో అతి పెద్ద నగరం. అప్పట్లోనే 53 చదరపు మైళ్ల వైశాల్యంతో ఉండేది. 1591లో మహ్మద్ కులీకుతుబ్‌షా ఈ నగరానికి పునాది వేశారు. 1912లోనే సిటీ ఇంప్రూవ్‌మెంట్ బోర్డు ఏర్పాటైంది. రూ.15 లక్షలు ఖర్చు చేసి మురికివాడల స్థానంలో పక్కా ఇండ్ల నిర్మాణం చేపట్టారు. 1932 జూన్ 15న బస్సు సౌకర్యాన్ని కల్పించారు. నగరం నుంచి నల్లగొండ, సంగాడ్డిలకు మొదట రవాణా సదుపాయం ఏర్పాటు చేశారు. 1854 -1883 ప్రాంతంలోనే రహదారి విస్తరణకు శ్రీకారం చుట్టారు.
పోలీసు వ్యవస్థ
నిజాం కాలంలోనే పోలీసు వ్యవస్థ పటిష్టంగా ఉండేది. హైదరాబాద్ కొత్వాల్ నవాబ్ ఇనాయత్ హుస్సేన్‌ఖాన్ బహదూర్ హయాంలో కొన్ని మెరుగులు దిద్దారు. జిల్లాలో ముహతామిమ్, ప్రతి తాలూకాకు ఓ అమీన్ (ఇన్‌స్పెక్టర్), ప్రతి ఠాణాకు ఒక జమేదార్, ప్రతి చౌక్‌కు ఒక దఫేదార్, ప్రతి ఠాణాకు ఎనిమిది మంది పోలీసులు, చౌక్‌కు ఆరుగురు వంతున పోలీసులు ఉండేవారు. నేటితో పోలిస్తే వేతనాలు కూడా ఎక్కువేనని సుస్పష్టం. 1864లోనే నెలకు 1వ తరగతి ముహతామిమ్‌కు రూ.200, 2వ తరగతి ముహతామిమ్‌కు రూ.170, 3వ తరగతి ముహతామిమ్‌కు రూ.140 వంతున ఇచ్చేవారు. వారికి కేటాయించిన గుర్రాన్ని మేపడానికి కూడా నెలకు రూ.25 వంతున ఇచ్చారు. అమీన్లల్లో ఒకటో కేడర్‌కు రూ.100, రెండో క్యాడర్‌కు రూ.90, మూడో క్యాడర్‌కు రూ.80, నాలుగో క్యాడర్‌కు రూ.70, ఐదో క్యాడర్‌కు రూ.60 వంతున ఇచ్చేవారు. వారి గుర్రాలకు నెలకు రూ.20 చెల్లించేవారు. 1887లో నగరంలో సిటీ పోలీసు విభాగం కింద ముగ్గురు సుపీరియర్ అధికారులు, ఇద్దరు ముహతామిమ్స్, 10 సదర్ అమీన్లు, 27 మంది అమీన్లు, ముగ్గురు నాయక్ అమీన్లు, 49 మంది సోవర్స్, 2830 మంది కానిస్టేబుళ్లు, 128 మంది అరబ్స్, 64 మంది మిసిలీనియన్స్ ఉండేవారు. వీరిలో ట్రాఫిక్ పోలీసులూ ఉన్నారు.
ఆదాయం తక్కువేం కాదు
హైదరాబాద్ స్టేట్ అత్యంత సంపన్న రాజ్యాల్లో ఒకటని అందరికీ తెలుసు. నిజాం కాలంలోనే పరిపాలన విధానం పటిష్టంగా ఉండేదనడానికి వివిధ శాఖల నుంచి వచ్చిన ఆదాయ వ్యయాలే సాక్ష్యం. ఏ శాఖలోనూ లోటు కనిపించదు. అన్నింటా మిగులే. ఆ మిగులు నిధులతోనే చారివూతక కట్టడాలు, ఇతర రంగాలకు వెచ్చించేవారని రికార్డులు చెబుతున్నాయి. 80 సంవత్సరాల క్రితమే ప్రతి శాఖకు రూ.లక్షల్లో నిధులు కేటాయించారు. ఇక్కడి భూములు, పరిక్షిశమలు, వాణిజ్యం, వర్తకం తదితర ఎన్నో రంగాలు విరాజిల్లాయి. అందుకే దేశ, విదేశీయుపూంతో మంది ఆంధ్రవూపదేశ్ రాష్ట్రావతరణకు ముందే నగరంలో స్థిరపడ్డారు. బంగారం, వెండి, ఇత్తడి, లోహాలు, వస్త్ర వ్యాపారాలు చేయడానికి అనేక మంది ఇక్కడికి వచ్చారు. ఉత్తర, దక్షిణ భారతదేశానికి ఎందరో వ్యాపారాలు చేయడానికి వచ్చారు.
‘నవాబు నాల్లెల ముల్లును నేను
నలిగింది నేను..
వజ్రాయుధాలై మెరిసింది మీరు
ఉదయినిలై వెలిగింది మీరు
పాటెన్కపాట కట్టి
అయిటెంక గోరికట్టిన
అనామకున్ని నేను’’
అని ఓ తెలంగాణ కవి నిజాం కాలం నుంచి ఇప్పటి దాకా నష్టం, లాభం అన్నీ తామై నగరాన్ని నిర్మించుకున్న వైనాన్ని కళ్లకు కట్టారు. వలాసాధిపత్యం ఎట్లా వెలిగిపోయిందో కూడా ఆక్రోశాన్ని ఒక్క పదంతో చెప్పేశారు. ‘సమైక్య రాష్ట్రంలో ఏం మిగులలేదు. నిజాం రాచరికపు వ్యవస్థలోనూ కష్టసుఖాలతోనే ఈ సుందర నగరాన్ని నిర్మించుకున్నాం. నవాబు పాలనను అనుభవించిన మాకే దీనిపై సర్వహక్కులు ఉంటాయి’ అని తెలంగాణవాదులు తేల్చి చెబుతున్నారు. నగరానికి తాత్కాలిక రంగులద్ది హైటెక్కులు కల్పించిన మాత్రాన.. మొత్తం చేసింది తామేనని సీమాంధ్ర నేతలు వాదించడం అర్థరహితమేనని స్పష్టం చేస్తున్నారు. విలీనానికి ముందే అత్యంత సంపన్న రాజ్యంగా వెలిగింది హైదరాబాద్. ఆ విషయాన్ని సమైక్యం ముసుగులో దాచేస్తున్నారు. వలసవాదుల రాకకు ముందే ‘ఇదర్ సబ్‌కుచ్ హై’ అంటోన్న హైదరాబాదీలకు ఇచ్చే సమాధానం ఏమిటి?

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి