9, ఆగస్టు 2013, శుక్రవారం

అప్పట్లో హైదరాబాద్ ఎలా వుండేదంటే..!!







చార్‌ సౌ సాల్ పురానా షహర్! ఏ షహర్‌ హమారా!ఏ షౌకత్ హమారా!! ఏ హమారా షహర్‌ హైదరాబాద్ దక్కన్! కానీ ఏం లాభం. పెచ్చులూడుతున్న గోడలు.. కూలుతున్న పైకప్పులు.. కదులుతున్న పునాదులు! ఇదీ నగర చారిత్రక కట్టడాల దుస్థితి. విదేశీయులు మన హెరిటేట్‌ సైట్స్  నాలుక్కాలాలు నిలబెట్టాలని పాటుపడుతుంటే.. మన పాలకులకు మాత్రం ఆ సోయి లేదు. నాలుగొందల ఏళ్ల చరిత్ర ఈ భాగ్యనగరిలో ఎన్నో అపురూప చారిత్రక కట్టడాలు. దేన్ని చూసినా నాటి రాజసం కళ్ల ముందు కదలాడుతుంది. ఏ గోడను తాకినా అపూర్వ చారిత్రక సందర్భాలు గుర్తుకొస్తాయి. వాటిని పసిపాపల్లా కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన బాధ్యత పాలకులది. కానీ జరుగుతున్నదేంటి? పట్టించుకునేవాళ్లు లేక చెత్తా చెదారం నిండి, ఆక్రమణలకు గురై, ఎలాంటి పరిరక్షణ లేక ఎన్నో కట్టడాలు శిథిలమైపోతున్నాయి. నగరంలోని ప్రతీ చారిత్రక కట్టడం దీనంగా విలపిస్తోంది. పునాదులు కదులుతూ, నేడో రేపో నేలమట్టమయ్యే దుస్థితిలో ఉన్నాయి. వాటిని పట్టించుకునే నాధుడు లేడు. గజం లెక్కన హైదరాబాద్ భూముల్ని కేకుల్లా కోసుకు తినడానికి మనసొస్తుంది కానీ.. చారిత్రక కట్టడాల్ని కాపాడుకుందామన్న ధ్యాసే ఉండదు. అసలు వాళ్లకు ఇది మనది అనే మనసుంటే కదా కాపాడ్డానికి. హైదరాబాద్ అంటే అమ్ముకోవడం మాత్రమే వాళ్లకు తెలిసింది.
హన్స్ విన్‌టెన్‌బర్గ్, థామస్ లెజ్జ్‌. జర్మనీకి చెందిన ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్లు. చరిత్ర ప్రేమికులు. 1975లో అప్పటి హెచ్ఎండీఏ డైరెక్టర్ వసంత్ పిలుపుతో నగరంలోని ప్రముఖ చారిత్రక కట్టడాలను ఫోటోలు తీశారు. పురాతన కట్టడాల పరిరక్షణపై అవగాహన కల్పించటానికి ఓ ఎగ్జిబిషన్ కూడా నిర్వహించారు. 1996లో మళ్లీ అవే ప్రాంతాలను ఫోటోలు తీశారు. మళ్లీ తిరిగి 2011లో మరోసారి తీశారు. వాస్తవానికి 1996లో రెండోసారి ఫోటోలు తీసినప్పుడే ఈ ఫోటోగ్రాఫర్లు విస్మయం చెందారు. చారిత్రక కట్టడాల సమీపంలో ఎలాంటి కొత్త నిర్మాణాలు రాకూడదని హెరిటేజ్‌ చట్టాల్లో రాసుకున్నా, అవి ఎందుకు అమలు కావట్లేదని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు కట్టడం ఎక్కడుందో వెతుక్కోవాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదాహరణకు ఒకనాడు ఆయుధాలు తయారు చేసిన స్థలం గన్‌ఫౌండ్రీ ఇప్పడు ఇళ్ల మధ్యలో ఎక్కడుందో వెతుక్కోవాల్సిన దుస్థితి వచ్చింది. అసలు ఇక్కడి ప్రభుత్వానికి చరిత్రను పరిరక్షించే ఉద్దేశం ఉందా లేదా అని విదేశీలు ప్రశ్నించారు.  ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ఎక్కడో జర్మనీలో పుట్టిన పుట్టిన వాళ్లకు మన నగరం మీద అవ్యాజమైన ప్రేమ ఉంది. మన కట్టడాల మీద అపారమైన గౌరవం ఉంది.  భాగ్యనగరాన్ని తమదిగా ఫీలై హెరిటేజ్ పరిరక్షణకు కృషిచేస్తున్నారు. కానీ మన పాలకులకు మాత్రం ఆ ఆలోచన లేదు. ముందుతరాలకు ఈ అపురూప కట్టడాల్ని అందించాలనే స్పృహ ఏ కోశానా లేదు.
అందుకే మీ కోసం కొన్ని హైదరాబాద్ పాత ఫోటోలు !!


చౌమహల్లా ప్యాలెస్‌ డ్రాయింగ్ రూం
బషీర్‌బాగ్ ప్యాలెస్‌
 ఖైరతాబాద్ మసీదు
చార్మినార్‌ ఎదురుగా యునానీ దవాఖానా
ఉస్మానియా జనరల్ హాస్పిటల్
అప్పటి రెసిడెన్సీ.. ఇప్పటి కోటి విమెన్స్ కాలేజీ
సన్స్ ఆఫ్‌ హైదరాబాద్
ప్యాలెస్ ఆఫ్ ద హైదరాబాద్
ఇప్పటి అసెంబ్లీ అప్పట్లో
నిజాం టైంలో పళ్ల మార్కెట్
నిజాం పర్సనల్ ఎలిఫెంట్
చార్మినార్‌ 
నిజాం వ్యక్తిగత భద్రతా సిబ్బంది (అరేబియన్‌ ట్రూప్)
 సికింద్రాబాద్ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వ్యూ
అప్పటి జేమ్స్ స్ట్రీట్.. ఇప్పటి రాణిగంజ్‌
మీర్‌ ఉస్మాన్ అలీ ఖాన్‌ (ఆఖరి నిజాం)
కులీకుత్బుషా
 పురానా పూల్(హైదరాబాద్ ఎంట్రన్స్)
 గులాం షా టూంబ్‌
గోలకొండ కోట
గుల్జార్‌ హౌజ్‌
మక్కా మసీదు
మీరాలం చెరువు
మొజాంజాహీ మార్కెట్ చౌరస్తా
స్టేట్‌-సెంట్రల్ లైబ్రరీ
 మౌలాలీ
 పికెట్ చెరువు
ఖైరతాబాద్‌లో జట్కా స్టాండ్
తిరుమలగిరి పరిసరాలు
సైఫాబాద్ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వ్యూ
ఇప్పటి నెక్లెస్‌ రోడ్‌ నుంచి హుస్సేన్‌ సాగర్‌ వ్యూ
నిజాం రిసెప్షన్‌ హాల్
మొహర్రం ర్యాలీ
లాంగ్ వ్యూలో ఫలక్‌నూమా ప్యాలెస్‌

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి