29, ఆగస్టు 2013, గురువారం

గైర్‌ముల్కీహోగయా ముల్కీ


-స్థానికుల అవతారమెత్తిన సీమాంధ్ర ఉద్యోగులు
-సొంతగడ్డపైనే పరాయివాడైన హైదరాబాదీ
-స్టేట్ లెవెల్ అంటూ రాజధానిలో సీమాంధ్ర పెత్తనం
-సీమాంధ్ర పట్టణాల్లో తెలంగాణవారేరి?
-దోపిడీకోసమేనా సమైక్య నినాదం?

టీ మీడియా, హైదరాబాద్, సిటీబ్యూరో : సొంతగడ్డపై తెలంగాణ ప్రజలను పరాయివాళ్లను చేసిన సీమాంధ్ర పాలకులు దోపిడీకి నిలువుటద్దంలా నిలుస్తున్నారు. ఇసుంట రమ్మంటే ఇల్లంత నాదేనంటూ పేచీ పెడుతున్నారు. ముల్కీ నిబంధనలకు పాతర పెట్టి సొంతవారికి పట్టం కట్టారు. విద్యావంతుల పేరిట ఉద్యోగాలను పంచుకు తిన్నారు. అయితే ఇంతకాలం సకల భోగభాగ్యాలను అక్రమంగా అనుభవించినవారికి ఇప్పుడు ఆ అవకాశం చేజారుతుండటం మింగుడు పడడం లేదు. తెలుగు వాళ్లమంతా ఒక్కటంటూ, సమైక్యమే ముద్దంటూ సమైక్యాంవూధవూపదేశ్ కోసం కృత్రిమ ఉద్యమానికి తెర తీశారు. దీని వెనుక ఉన్న మర్మమేమిటో సీమాంధ్ర సామాన్యులకూ తెలియాల్సిన అవసరం ఉంది. అందుకే భాగ్యనగరంపై పేచీ పెట్టే వైనం వెనుక దాగిన కుట్రపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం.

విలీనంతోనే మొదలు:
నిజాం పాలనలో ‘సర్కారీ ములాజిమీన్’ అనే సంస్థ సభ్యులు, ఉద్యోగులు సుమారు 9 వేలకు పైగానే నగరంలో పని చేస్తుండేవారు. వీరిలో ముస్లిం మైనార్టీలు 60 శాతం వరకు ఉండేవారు. హైదరాబాద్ స్టేట్ విలీనం తర్వాత ముస్లిం ఉద్యోగుల సంఖ్య క్రమేణా తగ్గిపోయింది. అప్పటి దాకా ఉర్దూ, తెలుగు మాత్రమే అధికంగా తెలిసిన అధికారులపై ఇంగ్లీషు పెత్తనం మొదలైంది. దీంతో మొదలైన కుట్ర రానురాను తీవ్రమై ఆఖరికి నాల్గో తరగతి ఉద్యోగాల్లోనూ పాగా వేశారు. సీమాంవూధులకు అనుకూలంగా ముల్కీ నిబంధనలను రద్దు చేశారు. నాలుగేళ్లు ఉంటే చాలు.. లోకల్ అంటూ నాలుగు రోజుల కింద వచ్చినవారుకూడా ఇబ్బడిముబ్బడిగా దొంగ సర్టిఫికేట్లు సంపాదించి ఉద్యోగాలు కొళ్లగొట్టారని తెలంగాణవాదులు మండిపడుతున్నారు. ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన వారికి ఉపాధి అవకాశాలు లేకుండా చేశారు. వీరి ఆధిపత్యం ముందు కొలువు దొరకక వేలాది మంది గల్ఫ్ దేశాలకు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారు.

స్టేట్ క్యాడర్ పోస్టులన్నీ వారివే:
భాగ్యనగరంలో వివిధ శాఖల్లోని స్టేట్ క్యాడర్ పోస్టుల్లో సీమాంవూధులే అధికంగా కూర్చున్నారు. దాంతో పాటు స్థానిక సంస్థలైన జీహెచ్‌ఎంసీ, హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ అండ్ సీవరేజ్ బోర్డు, హుడా, హెచ్‌ఎండీఏల్లోనూ వారే వచ్చి చేరారు. నిన్నటికి నిన్న జీహెచ్‌ఎంసీలో సీమాంవూధకు చెందిన 13 మంది ఇంజినీర్లనూ బదిలీ చేశారంటే సీమాంధ్ర పాలకుల దాష్టీకం ఎంతగా ఉందో అర్ధం చేసుకోవచ్చు. పట్టుమని 10 శాతం కూడా స్టేట్ క్యాడర్ పోస్టుల్లో తెలంగాణవాళ్లు లేరంటే ఆశ్చర్యం కలుగుతోంది. హైదరాబాద్ జిల్లా స్థాయిలో 66 హెచ్‌ఓడీలను తీసుకుంటే అందులో 44 మంది వారే. కేవలం 22 మంది మాత్రమే తెలంగాణకు చెందిన వారున్నారని తెలిసింది. ఐతే ఈ పోస్టులు స్టేట్ క్యాడర్ అంటూ వాదిస్తారు. కానీ ఈ జిల్లాకే రావడం వెనుక కుట్ర కాకపోతే మరేంటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

ఏపీఐఐసీలో దాగిన కుట్ర:
పారిక్షిశామికాభివృద్ధి పేరిట 1973లో ఏర్పాటు చేసిన ఆంధ్రవూపదేశ్ పారిక్షిశామిక మౌలిక సదుపాయాల కార్పొరేషన్ లిమిటెడ్‌లోనూ కుట్ర దాగి ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. హైదరాబాద్, రంగాడ్డి, మెదక్, నల్లగొండ జిల్లాల్లోని ఖరీదైన భూములను సీమాంధ్ర పెత్తందార్లకు దోచి పెట్టేందుకు ఈ సంస్థలో ఐఏఎస్ నుంచి సెక్షన్ ఆఫీసర్ దాకా సీమాంవూధులే వచ్చి చేరారు. స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామంటూ భూములు పొందినా ఎలాంటి చర్యలు తీసుకోకుండా పెత్తందార్లకు వత్తాసు పలికారు. దాంతో నాలుగు జిల్లాల్లో ప్రభుత్వ భూములతో పాటు రైతుల నుంచి బలవంతంగా గుంజుకున్న భూములు పెద్దోళ్ల వశమయ్యాయి. అలాగే కాలుష్య నియంవూతణ మండలిలోనూ కుర్చీలపై వాళ్లే కూర్చున్నారు. ఇలాంటి అనేకాంశాల్లోనూ సీమాంవూధుల పెత్తనం ఓ పథకం ప్రకారమే చెలాయిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తమనెక్కడ వెళ్లమంటారోనన్న ఆందోళనతో కృత్రిమ ఉద్యమానికి తెర తీశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.

సాధారణ పరిపాలనే కీలకం:
గోల్కొండ సతీశ్, తెలంగాణ ఉద్యోగ జేఏసీ వైస్ చైర్మన్రాష్ట్ర రాజధానిలో వచ్చి చేరడానికి దోహదపడింది సాధారణ పరిపాలనా విభాగమే(జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్టుమెంట్), దీంట్లో 90 శాతం అధికారులు వారే ఉన్నారని తెలంగాణ ఉద్యోగ జేఏసీ వైస్ చైర్మన్ గోల్కొండ సతీష్ పేర్కొన్నారు. కేవలం నాల్గో తరగతి ఉద్యోగులు, జూనియర్ అసిస్టెంట్ క్యాడర్, లిఫ్ట్ ఆపరేటర్లు మాత్రమే తెలంగాణవాసులని తెలిపారు. ఖాళీగా ఉంటే వెంటనే ఆ పోస్టులో అక్కడి వారిని కూర్చోబెట్టడం, లేదంటే డిప్యూ తీసుకురావడం వంటి ప్రక్రియలో కీలక భూమిక వహిస్తోందీ ఆంధ్రా అధికారులేనని ఆరోపించారు.

తాత, తండ్రి.. ఇప్పుడు కొడుకు:
కే లక్ష్మయ్య, రెవెన్యూ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడుస్టేట్ క్యాడర్, డిస్ట్రిక్ట్ క్యాడర్ ఏదీ లేకుండా అన్నీ సీమాంవూధులకే ఇచ్చారని రెవిన్యూ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కే లక్ష్మయ్య అన్నారు. హైదరాబాద్‌లో ఉండే ఆంధ్రా వాళ్ల ఇంట్లో చూస్తే పెద్దాయన రిటైర్డ్ అయి పింఛన్ తీసుకుంటాడు. ఇంటి యజమాని అధికారిగా, ఆయన కొడుకు ఇంకేదో ఉద్యోగం చేస్తుంటాడు. ఆయన భార్య, కోడలు కూడా ఉద్యోగాల్లోనే ఉంటారని వ్యాఖ్యానించారు. వారికి పాలక పెద్దల సహకారం అందుతుంది. అందుకే తెలంగాణ వస్తుందనగానే మింగుడు పడతలేదని విమర్శించారు.

హైదరాబాద్ జిల్లా అధికారుల వివరాలు
కలెక్టర్ - ముఖేశ్‌కుమార్ మీనా, (రాజస్థాన్),

సీమాంధ్ర అధికారులు

సంయుక్త కలెక్టర్- ఈ.శ్రీధర్, అదనపు సంయుక్త కలెక్టర్- జి.రేఖారాణి, ల్యాండ్ ప్రొటెక్షన్ అధికారి- గోపాల్‌రావు, ఎస్డీసీ(ఎల్.పి)- మాసుమాబేగం, భూసేకరణ, ఎస్డీసీ -ఎస్.సరళావందనం, ఎస్‌ఈఎం -జయచంవూదాడ్డి, ఆర్డీఓ హైదరాబాద్ -ఎస్.హరీష్, ఈఈ, ఏపీఈడబ్ల్యూడీసీ-నర్సింహమూర్తి, ఎండీ, ఏపీఈడబ్ల్యూడీసీపభాకర్‌రావు, డీడీ, ఎస్‌ఎల్‌ఆర్-దేవదాసు, జిల్లా రిజిస్ట్రార్, నార్త్-సులేమాన్, డీఐజీ, రిజిస్ట్రేషన్ -రవీంవూదనాథ్, డీఐజీ, రంగాడ్డి -పుష్పలత, బీసీ సంక్షేమ శాఖాధికారిణి -భార్గవి, ఈడీ, ఎస్సీ కార్పొరేషన్-కె.సత్యనారాయణ, జిల్లా కో ఆపరేటివ్ అధికారి -శ్రీధర్, ఈడీ, మైనార్టీ కార్పొరేషన్ -ఎండి.అక్రంఅలీ, జిల్లా గిరిజన సంక్షేమాధికారి-శివవూపసాద్, పీడీ, ఆర్వీఎం -సుబ్బరాయుడు, జిల్లా ఉపాధి కల్పనాధికారి -విజయభోగేశ్వరుడు, ఏడీ, మత్స్యశాఖ -సాల్మాన్‌రాజ్, జిల్లా వైద్యాధికారి -ఓ.నరేంవూదుడు, పీడీ, ఎన్‌సీఎల్పీ -జయచంవూదాడ్డి, జీఎం, డీఐసీ పసాద్, జిల్లా విద్యాధికారి -సుబ్బాడ్డి, వయోజన విద్య, డీడీ -రాంచంవూదాడ్డి, కార్యదర్శి, జిల్లా గ్రంథాలయం -శంకర్‌డ్డి, లీడ్ బ్యాంక్ మేనేజర్ -భరత్‌కుమార్, డీడీ, చేనేత, జౌళి శాఖ -డోలయ్య, ఏడీ, చేనేత, జౌళి శాఖ -కె.రాంగోపాల్‌రావు, డీఎం, ఆప్కో -కె.లక్ష్మణ్, జిల్లా సైనిక్ వెల్ఫేర్ అధికారి -శ్రీనిష్‌కుమార్, డీఎం, సివిల్ సప్లయి -ఆశ, ఆరోగ్యశ్రీ, కో ఆర్డినేటర్ -శ్రీధర్, సీఆర్వో -పద్మ, జిల్లా టూరిజం అధికారి పకాశ్, డీసీటీఓ, ఆబిడ్స్-సుభద్ర, డీసీటీఓ, పంజాగుట్ట -ఉషారాణిడ్డి, డీసీటీఓ, సరూర్‌నగర్ -రమేశ్, డీసీటీఓ, బేగంపేట -ఈశ్వరయ్య

తెలంగాణకు చెందిన అధికారుల వివరాలు
లా ఆఫీసర్ - రఘురాంశర్మ, డిప్యూటీ కలెక్టర్(కేఆర్‌సీ) -నర్సింహాడ్డి, పరిపాలనాధికారి -రవీంద్ర, ఎస్టేట్ ఆఫీసర్ -పి.సురేశ్‌బాబు, కార్మిక శాఖ జాయింట్ కమిషనర్-గంగాధర్, ఆర్డీఓ, సికింవూదాబాద్ -రవీంవూదబాబు, సీపీఓ -ఎ.బల రాం, హౌజింగ్, పీడీ -కృష్ణయ్య, డీపీఆర్వో -టి.వి.చంద్రశేఖరయ్య, నెహ్రూ యూత్ కోఆర్డినేటర్ డీడీ, సాంఘిక సంక్షేమం -విజయ్‌పాల్, ఈడీ, బీసీ కార్పొరేషన్ -ఖాజానిజాం అలీ, యువజన సంక్షేమాధికారి -ఎ.సత్యనారాయణడ్డి, ఏడీ, వికలాంగుల సంక్షేమం -సుదర్శన్, మైనార్టీ సంక్షేమ శాఖాధికారి -సలీంపాషా, జేటీసీ, ఆర్టీఏ -పాండురంగారావు, పీడీ, ఐసీడీఎస్ -కేఆర్‌ఎస్ లక్ష్మీదేవి, జిల్లా రిజిస్ట్రార్, సౌత్ -విష్ణువర్ధన్‌రాజు, డీఎస్‌ఓ -రాజశేఖర్, జిల్లా స్పోర్ట్స్ అధికారి -అలీంఖాన్, డీసీటీఓ, చార్మినార్ -రాజు, డీసీటీఓ, హైదరాబాద్ రూరల్ -శ్రీనివాసులు, డీసీటీఓ, సికింవూదాబాద్ -జె.లక్ష్మీనారాయణ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి