30, ఆగస్టు 2013, శుక్రవారం

కృష్ణా జలాలపై.. ట్రిబ్యునల్ ముందు ముగిసిన వాదనలు


8/31/2013 2:00:33 AM
తీర్పు రిజర్వు, వచ్చే నెల 30లోగా వెలువరించే అవకాశం
హైదరాబాద్, ఆగస్టు 30(టీ మీడియా): కృష్ణా జలాల వినియోగానికి సంబంధించి బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల వినియోగం పూర్తయిన తర్వాతే ఇతర కేటాయింపుల వినియోగం ప్రారంభం కావాలని ఆంధ్రవూపదేశ్ పునరుద్ధాటించింది. మిగులు జలాల వినియోగానికి సంబంధించి ట్రిబ్యునల్ చేసిన తాజా ప్రతిపాదనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసింది. ఈ మేరకు జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్‌కు శుక్రవారం మన రాష్ట్రం తేల్చి చెప్పింది. నీటి వినియోగంపై ఆంధ్రవూపదేశ్ శుక్రవారం వాదనలను విన్పించడంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటకలు చేసిన వాదనలపై అభ్యంతరాలను ట్రిబ్యునల్‌కు రాతపూర్వకంగా తెలియజేసింది. ఆంధ్రవూపదేశ్ వాదనలతో బ్రిజేష్ ట్రిబ్యునల్ ఎదుట మూడు రాష్ట్రాల తుది వాదనలు ముగిసినట్లయింది. దీంతో జస్టిస్ బ్రిజేష్ కుమార్ నేతృత్వంలోని కృష్ణా ట్రిబ్యునల్ నీటి వినియోగంపై తుది తీర్పును రిజర్వులో ఉంచింది.

సెప్టెంబర్ 30లోగా ట్రిబ్యునల్ తుది తీర్పును వెలువరించే అవకాశం ఉంది. కృష్ణా జలాల వినియోగానికి సంబంధించిన తాజా ప్రతిపాదనపై మూడు రాష్ట్రాల మధ్య ఏకాభివూపాయం కుదరకపోవడంతో ఇక ట్రిబ్యునలే తుది నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. బచావత్ ట్రిబ్యునల్ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా కృష్ణా నదిలో మొత్తం 2,130 టీఎంసీల నికర జలాలు ఉన్నట్లు లెక్కగట్టి, బేసిన్‌లోని మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌ల ఇదివరకే మధ్య కేటాయింపులు చేసింది. దీని ప్రకారం.. మహారాష్ట్రకు 585 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, ఆంధ్రవూపదేశ్‌కు 811 టీఎంసీలు దక్కాయి. కొత్తగా ఏర్పాటైన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్.. 65 శాతం నీటి లభ్యత ఆధారంగా 2,293 టీఎంసీలు, సరాసరి నీటి లభ్యత కింద 2,578 టీఎంసీలు ఉన్నట్లు లెక్కగట్టి అదనపు జలాల(448 టీఎంసీల)ను మూడు రాష్ట్రాల మధ్య పంపిణీ చేసింది.

అయితే, బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల వినియోగం పూర్తయిన తర్వాతే... 65 శాతం లభ్యత ఆధారంగా అదనంగా కేటాయించిన 448 టీఎంసీలను వినియోగం ప్రారంభమవుతుందని తొలుత స్పష్టం చేసింది. దీనిపై ఎగువ రాష్ట్రాలు అభ్యంతరం తెలిపాయి. దీంతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ తాజాగా ఒక ప్రతిపాదన చేసింది. దీని ప్రకారం.. 75 శాతం నీటి లభ్యత కింద ఆంధ్రవూపదేశ్‌లో లభ్యమయ్యే నీటి(352 టీఎంసీల)ని మినహాయిస్తే 459 టీఎంసీలు ఎగువ రాష్ట్రాల నుంచి రావాల్సి ఉంటుంది. ఈ నీటిని విడుదల చేసిన తర్వాత 65 శాతం నీటి లభ్యత ప్రకారం లభించే మిగులు జలాలను ఎగువ రాష్ట్రాలు వినియోగించుకోవచ్చని సూచించింది. దీనిపై మూడు రాష్ట్రాలు కలిసి చర్చించుకొని ఓ అభివూపాయానికి రావాలని ట్రిబ్యునల్ కోరింది.

ఈ నేపథ్యంలో మూడు రాష్ట్రాల న్యాయవాదులు, ఇంజనీర్లు గత ఆది, సోమవారాల్లో ఢిల్లీలో సమావేశమై చర్చించినా.. ఏకాభివూపాయం రాలేదు. కొత్త కేటాయింపులు ఖరీఫ్ నుంచే వాడుకుంటామని కర్ణాటక, ప్రధాన కృష్ణా నుంచి భీమాకు మళ్లించుకుంటామని మహారాష్ట్ర, అదనపు నీటిని కేటాయించాలని ఆంధ్రవూపదేశ్ పట్టుబట్టాయి. ఎవరి వాదనలు వారివే కావడంతో ట్రిబ్యునల్ సూచనపై ఏకాభివూపాయం సాధ్యం కాలేదు. దీంతో ఈ విషయమై కర్ణాటక, మహారాష్ట్రలు మంగళవారమే ట్రిబ్యునల్‌కు తమ అభివూపాయాన్ని తెలుపగా... ఆంధవూపదేశ్ శుక్రవారం తన అభివూపాయాన్ని వెల్లడించింది. ట్రిబ్యునల్ తాజా సూచనను వ్యతిరేకించింది. ఈ కొత్త ప్రతిపాదన వల్ల రాష్ట్ర ప్రయోజనాలు తీవ్రంగా దెబ్బతింటాయని పేర్కొంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి