30, ఆగస్టు 2013, శుక్రవారం

పీటముడిని విప్పేదెవరు?


తెలంగాణ ప్రాంతం నిజాం నుంచి 1948 సెప్టెంబర్ 17న విముక్తి అయి భారతదేశంలో విలీనమైంది. ఆంధ్ర ప్రాంతం 1953 లో మద్రాసు నుంచి విభజింపబడి కర్నూలు రాజధానిగా ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పడింది. విశాలాంవూధలో ప్రజారాజ్య స్థాపన జరుగగాలని కమ్యూనిస్టులు, తెలుగు మాట్లాడేవారు ఒకే రాష్ట్రంలో ఉండటం ద్వారా సమగ్ర అభివృద్ధి చెందుతుందని ఆనాటి పెద్దలు ఆకాంక్షించి విశాల ప్రాతిపదికగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణకు రూపకల్పన చేశారు. తెలంగాణలో అనేక మంది పెద్దలు మేధావులు అభ్యంతరం పెట్టారు. అందుకే పెద్ద మనుషుల ఒప్పందం, ఆరు సూత్రాల పథకం, రాష్ట్రపతి ఉత్తర్వులు, 610జీవోలు విడుదల చేసి భరోసా కల్పించారు. మొత్తానికి జరిగినదేమిటి, చేసుకున్న ఏ ఒక్క ఒప్పందం కూడా సక్రమంగా అమలుకు నోచుకోలేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష ఈనాటిది కాదు, 1953 నుంచి ప్రతి సందర్భంలో రకరకాల పద్ధతులలో వ్యక్తం చేయబడుతూనే ఉన్నది. 1969లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 1972లో జై ఆంధ్ర ఉద్యమాల ను విశ్లేషణాత్మక దృష్టితో పరిశీలించాలి. ఎందుకంటే తెలంగాణకు ఉద్యోగాలు, నిధులు, సాగునీరు కొన్ని రక్షణలు కల్పిస్తే ఆంధ్ర ప్రాంతం వారు అంగీకరించలేదు.

అందుకే భిన్న ధృవాలుగా ఆలోచనలు కలిగాయి. కేంద్ర ప్రభుత్వం రెండు ప్రాంతాల వారిని ఒత్తిడి చేసి ఒప్పించగలిగినా, అది తాత్కాలిక ఉపశమనంగానే మారింది. 1985లో 610 జీవో గిర్‌గ్లాని కమిషన్, అలాగే అనేక కమిటీలు వేయబడ్డాయి. 2005లో నాటి అసెంబ్లీలో 610 జీవో అమలుకు 15 మంది శాసనసభ్యులతో మానిటరింగ్ ఇంప్లిమెం కమిటీ పెట్టినా, అమలుకు అన్ని అవరోధాలు ఎదురయ్యాయి. కారణం చిత్తశుద్ది లేకపోవడమే. పరిణామాలను గమనించిన సీపీఐ 2000 సంవత్సరం డిసెంబర్ 15న వరంగల్‌లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీలిచ్చి తెలంగాణ చారివూతాత్మకంగా వెనుకబడినందున 10 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ, 610జీవో అమలు, మూసిపెట్టిన పరివూశమలు తెరిపించి, భూసంస్కరణ చట్టా న్ని అమలు చేయాలని, రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలలో వెనుకబడిన ప్రాంతాలను గుర్తించి సాగు నీరు సౌకర్యము ఇతర మౌళిక సదుపాయలపై దృష్టిలో పెట్టాలని ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వానికి, 2004 లో అధికారానికి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వానికి విన్నవించినా పెడచెవిన పెట్టింది నిజం కాదా!.

సీపీఐ 23 జిల్లాలో కూడా తన ఆందోళనలు నిర్వహించింది. 2001 టీఆర్‌ఎస్ ఏర్పడింది. 2004లో దానితో కాంగ్రెస్ ఒప్పందం చేసుకుంది. కనీస ఉమ్మడి కార్యవూకమంలో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అంశమును చేర్చి రాష్ట్రపతి ప్రసంగము ద్వా రా ప్రకటించింది. 2008 సీపీఐ జాతీయ మహాసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అనుకూలంగా తీర్మానించింది. తెలుగుదేశం పార్టీ తెలంగాణకు అనుకూలమని నిర్ణయించింది. బీజేపీ తెలంగాణ ఏర్పాటు కావలసిందేనని ప్రకటించింది. 2007లో సీపీఐ శాసనసభా పక్షం వేసిన ప్రశ్నకు అసెంబ్లీలో ప్రాం తాల వారీగా నిధులు వసూల్లు, ఖర్చులపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. ఆనాటి ఆర్థికశాఖ మంత్రి కె.రోశయ్య అస్పష్టమైన సమాధానమిచ్చారు. సభను తప్పుతోవ పట్టించారు. జలయజ్ఞంలో భాగంగా కూడా తెలంగాణ ప్రాంతానికి తెలంగాణకు మొదటి ప్రాధాన్యం ఇవ్వలేకపోయింది.

2009 డిసెంబరు 9న ప్రత్యేక తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నట్లు ఆనాటి కేంద్ర హోంశాఖమంత్రి చిదంబరం ప్రకటించి సీమాంధ్ర ఉద్యమ నేపథ్యంలో 13 రోజులలోనే నిలిపివేశారు. శ్రీ కృష్ణ కమిటీ, కోర్ కమిటీ లు, వారు రూంలో కమిటీలు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షులు బొత్స సత్యనారాయణతో రోడు మ్యాపు తెప్పించుకొన్నారు. 2012 డిసెంబరు 28న సుశీల్ కుమార్ షిండ్ హోంశాఖ మంత్రి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన అఖిలపక్ష సమావేశంలో హాజరైన ఎనిమిది పార్టీలలో ఆరు పార్టీలు విభజనకు అనుకూలమని తేల్చిచెప్పాయి. తరువాత ఏడు మాసాలు గడిచిన తర్వాత జూలై 30న యూపీఏ భాగస్వామ్య పక్షాలతో ప్రధాన ప్రతిపక్షమైన బీజేపీతో సంప్రదించి సీడబ్ల్యూసీలో చర్చించి రాష్ట్ర విభజనకు కార్యాచరణను ప్రకటించింది.

మరుసటి రోజు నుంచి ఎందుకు సీమాంధ్ర ఉద్యమం ఆరంభమయ్యింది. దీని వెనకాల ఏ శక్తులున్నాయి. ఇందులో పాల్గొంటున్నదెవరు. మాజీ ప్రధాన మంత్రులైన ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీల విగ్రహాల కూల్చివేత మూలంగా ఎటువైపు సంకేతాలు పంపుతుంది. వైఎస్‌ఆర్‌సీపీ ప్లేటు ఫిరాయించి 16 మంది ఎమ్మెల్యేతో రాజీనామా చేయించి, విజయమ్మతో నిరవధికదీక్ష ఇపుడేమో చంచల్ గూడ జైల్లో జగన్మోహనరెడ్డి జైల్లో దీక్షలు ఏ లక్ష్యంతో కొనసాగుతున్నవి. తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు విభజనకు అనుకూలమని, రాజధాని నిర్మాణం, ఇతర అంశాలు పరిష్కరించాలని వారు ప్రకటిస్తే, కింది స్థాయిలో ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామాలు, ఆందోళనలు మరొక వైపున అధికార కాంగ్రెస్‌కు సంబంధించి మంత్రులు బరితెగించి సీమాంధ్ర ప్రత్యక్ష ఆందోళనలో పాల్గొంటున్నారు. కాంగ్రెస్ ఎంపీలు పార్లమెంటులో కాంగ్రెస్ అధినాయకురాలు సోనియాగాంధీ ముందే వెల్‌లోకి పోతూ, నిరసనలు తెలుపుతున్నారు.

ఎందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ప్రేక్షకపాత్ర వహిస్తున్నది. ఇంతటి దిగజారిన విలువలను ఎవరైన ఊహించగలరా! సాక్షాత్తు రాష్ట్ర సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు మంత్రులను ఘెరావ్ చేయడంతోపాటు రోజు వినూత్న పద్ధతులలో ఆందోళనలు చేస్తున్నారు. ఈ మధ్య తెలంగాణ ఉద్యోగులు కూడ నినాదాలతో నిరసనలు చేస్తున్నారు. రెండు ప్రాంతాల ఉద్యోగులు తోపులాటలు, ఘర్షణలు పడుతున్నారు. మరోవైపు లాయర్లు ఆందోళన ఉద్రిక్తతలకు దారి తీసింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ముద్ర వేసుకున్నారు. వీరి నాయకత్వంలో పరిపాలన ఎలా సజావుగా సాగుతుంది. పరిపాలన పడకేసింది. హైదరాబాద్, సాగునీరు, ఇతర అంశాల పరిష్కరించడంలో కేంద్రం పూర్తిగా విఫలమైందని, హైదరాబాద్ కేంద్ర ప్రాంతంగా వచ్చి ఇక్కడి అభివృద్ధి సంపద మేము సృష్టించిదేనన్న పెడ ధోరణలతో అక్కసు వెల్లగక్కుతున్నారు. కొంతమంది కాంగ్రెస్ ఎం పీలు, ఎమ్మెల్యేలు తెలంగాణ విభజనను బహిరంగంగానే వ్యతిరేకిస్తూ రెచ్చగొట్టే ప్రకటనలు చేస్తున్నారు.

కొంత మంది తెలంగాణ నాయకులను టార్గెట్ చేస్తున్నారు. ఆనం వివేకనందాడ్డి వారు ఇం గిత జ్ఞానము కూడా కోల్పోయి తెలంగాణవాదులు విద్రోహులు, హింసవాదులని నోటికి అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతున్నారు.
ఆంధ్రప్రదేశ్ అవతరణ సందర్బంలో ఇలాంటి అనేక అనుమానాలు సందేహలు వ్యక్తమైతే తెలంగాణ నుంచి నలుగురిని, సీమాంధ్ర నుంచి నలుగురి ముఖ్యులను ఎంపిక చేసి ఎనిమిది మందితో కేంద్ర ప్రభుత్వ మధ్యవర్తిత్వం తో పెద్ద మనుషుల ఒప్పందం చేయబడింది. ఇన్ని సంవత్సరాల సంప్రదింపుల ను కేంద్ర ప్రభుత్వాలు ఎందుకు కొలిక్కి తీసుకరాలేక పోయింది. హైదరాబాద్, సాగునీరు, నిధులు ఇలాంటి అంశాలపై క్లారిటీగా చర్చించి, తగిన పరిష్కారం చూపడంలో విఫలం కావడం దురదృష్టకరం. సమైక్యాంధ్ర, కోరుకునే వాళ్ల అనుమానాలను నివృత్తి చేయడానికి ప్రత్యేక దృష్టి చేయాలి. లేదా నిపుణులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి సమస్యలకు సత్వర పరిష్కారం చూపాలి. ఉద్రికత్తలు రోజురోజు పెరుగుతున్నందున, కాలయాపన పనికిరాదు.

ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ ప్రజలలో సత్సంబంధాలున్నవి. బంధుత్వాలు కూడా పెరిగినవి. అసలు ప్రశ్న ఏమిటి నిధులు, నీళ్ళు, ఉద్యోగాలు, పరిపాలనలో భాగస్వామ్యంలో వైఫల్యాలు అందుకే సుదీర్ఘంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సుదీర్ఘంగా ఉద్యమం సాగింది. ఆంధ్ర, రాయలసీమ కూడా హైదరాబాద్ ఆదాయం, ఉద్యోగాలు, నిధులు, అలాగే ప్రాజెక్టులు, తదితర అంశాలలో సందేహాలుంటే నివృత్తి చేయవలసిన ప్రధాన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుంది. ఇంకా ఎంత జాప్యం చేస్తే సమస్య అంత జటిలమయ్యే పరిస్థితులు ఏర్పడతాయని కేంద్ర ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి వుంటుంది.
-చాడ వెంకటడ్డి
మాజీ శాసనసభ్యులు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి