8, ఆగస్టు 2013, గురువారం

నీటివాటా ఎవరికెంత?

నీరు పదిలమే!
water
-ట్రిబ్యునళ్ల ప్రకారమే పంపకాలు
-పర్యవేక్షణకు చట్టబద్ధ సంస్థ ఏర్పాటు చేయాలి
-పోలవరం ముంపు నష్టాన్ని తగ్గించాలి
-దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ ఉపసంహరించుకోవాలి
-భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలి

హైదరాబాద్, జులై 9 (టీ మీడియా):ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించినట్లు వార్తలొస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే నదుల నీటి పంపకాలు ఎలా ఉండబోతున్నాయనే అంశంపై పలువురు నీటిపారుదల నిపుణులను సంప్రదించి ‘టీ మీడియా’ ప్రత్యేకంగా అందిస్తోన్న ‘రోడ్ మ్యాప్’ ఇది...

40 నదీ బేసిన్లు.. 12 అంతపూరాష్ట నదులు
ఆంధ్రవూపదేశ్‌లో పెద్దవీ, చిన్నవీ కలిపి మొత్తం 40 నదీ బేసిన్లు ఉన్నాయి. 12 అంతపూరాష్ట నదులు ఉన్నాయి. రాష్ట్రంలోని నదులన్నీ కలిసి ఏటా 75 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన 2,746 టీఎంసీల నీటిని అందజేస్తున్నాయి. కృష్ణా, గోదావరి తెలంగాణ గుండా ప్రవహిస్తున్నాయి. వంశధార, నాగావళి ఆంధ్రవూపదేశ్, ఒడిషా పంచుకుంటున్నాయి. ఒడిషా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌లు గోదావరి నదిని, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్‌లు కృష్ణా నదిని పంచుకుంటున్నాయి. పెన్నా నదిని ఆంధ్రవూపదేశ్‌తోపాటు కర్ణాటక, పాలార్ వంటి చిన్న నదీ బేసిన్లను ఆంధ్రవూపదేశ్‌తోపాటు తమిళనాడు పంచుకుంటున్నాయి. ఆంధ్రవూపదేశ్ విడిపోయినా తెలంగాణ, కోస్తా, రాయలసీమలకు వాటాలు వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి.

ఎవరి వాటాలు వారికే!
తెలంగాణ వస్తే సీమాంవూధకు నీరు వదలరని, డెల్టా ప్రాంతం ఎండిపోతుందని సీమాంవూధలో సాగుతోన్న ప్రచారం అపోహ మాత్రమే. అంతర్జాతీయ న్యాయ సూత్రాలను అనుసరించే పరివాహక ప్రాంతంలోని దేశాలు, రాష్ట్రాలు, ప్రాంతాలు నీటి కేటాయింపులు జరుగుతాయి. బలవంతంగా నీటిని కాజేసే అవకాశం రాష్ట్రంగా కలిసి ఉన్నప్పుడే ఉంటుందితప్ప విడిపోయాక ఎవరి వాటాలు వారికుంటాయి. ట్రిబ్యూనళ్లు ఉంటాయి. అలాంటి వ్యవస్థలే లేకపోతే ఇప్పటికే కర్నాటక, మహారాష్ట్ర దాటి కృష్ణా, గోదావరి నదులు వచ్చేవే కాదు. జల వివాదాలకు సంబంధించి దేశంలో ఒక పటిష్ట వ్యవస్థ, యంత్రాంగం ఉంది.

‘అంతపూరాష్ట్ర నదులు, నదీ లోయల అభివృద్ధి, క్రమబద్ధీకరణ’ అంశాలను రాజ్యాంగంలోని ఏడో షెడ్యూల్‌లో ఉన్న కేంద్ర జాబితాలో చేర్చారు. రాజ్యాంగంలోని 262 ఆర్టికల్‌లో రెండు విషయాలను స్పష్టంగా చేర్చారు. ఒకటి, అంతపూరాష్ట్ర నదీ జల వినియోగం, పంపకం, నియంవూతణ విషయంలో ఏదైనా తగాదా ఏర్పడితే పరిష్కరించేందుకు పార్లమెంట్ చట్టం చేయవచ్చు. రెండు, వివాదాల్లో సుప్రీంకోర్టుగానీ, ఇతర కోర్టులుగానీ జోక్యం చేసుకోరాదని కూడా పార్లమెంట్ చట్టంచేయొచ్చు. ఈ ఆర్టికల్ కింద పార్లమెంట్ 1956లో అంతపూరాష్ట్ర జల వివాద చట్టాన్ని చేసింది. చర్చలు, సంప్రదింపుల ద్వారా సమస్య పరిష్కారం సాధ్యం కాదని భావిస్తే ట్రిబ్యునల్‌ను ఏర్పరిచే అధికారం కేంద్రానికి ఉంటుంది. దేశంలో ఏడు ట్రిబ్యునళ్లు ఏర్పడగా రాష్ట్రానికి సంబంధించినవి మూడు- కృష్ణా ట్రిబ్యునల్ (బచావత్, బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్), గోదావరి ట్రిబ్యునల్ (బచావత్), వంశధార ట్రిబ్యునల్ (ముకుందంశర్మ ట్రిబ్యునల్).

కృష్ణా జలాల పంపకం ఇలా..
కృష్ణా నదీ జలాల్లో బచావత్ ట్రిబ్యునల్ ఆంధ్రవూపదేశ్‌కు 811 టీఎంసీల నికర జలాలను కేటాయించింది. కేటాయింపులను ప్రభుత్వం ప్రాజెక్టు కేటాయింపుల్లో సర్దుబాటు చేసింది. ఫలితంగా 68.50 శాతం పరివాహక క్షేత్రం కలిగిన తెలంగాణకు 34.50 శాతం వాటా అంటే 295.26 టీఎంసీలు, కోస్తాంవూధకు 369.74 టీఎంసీలు, రాయలసీమకు 146 టీఎంసీలు దక్కాయి. కృష్ణా బేసిన్‌లోని 227.50 టీఎంసీల మిగులు జలాలను ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వం వివిధ ప్రాజెక్టులను చేపట్టింది.

తాజాగా వచ్చిన బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ 65 శాతం విశ్వసనీయత ప్రాతిపదికన నీటి కేటాయింపులు చేసింది. ఫలితంగా ఆంధ్రవూపదేశ్‌కు 811 టీఎంసీలకు అదనంగా 45టీఎంసీలు లభించాయి. అలాగే 145 టీఎంసీల మిగులు జలాలను కేటాయించింది. రాయలసీమకు ఉపయోగపడే తెలుగుగంగ ప్రాజెక్టుకు 25 టీఎంసీలు కేటాయించి, మిగిలిన 120 టీఎంసీలను శ్రీశైలం, నాగార్జున సాగర్‌ల క్యారీ ఓవర్ స్టోరేజీకి జత కలిపింది. బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తీర్పును రాష్ట్రాలు ఒప్పుకోకపోవడంతో విషయం సుప్రీంకోర్టుకు చేరింది. కొత్త రాష్ట్రాలు ఏర్పాటైనంత మాత్రాన నీటి కేటాయింపుల్లో ఎలాంటి మార్పు ఉండదు.

గోదావరి జలాల పంపకం ఇలా..
గోదావరి జలాలపైన బచావత్ ట్రిబ్యునల్ రాష్ట్రాలు పరస్పరం చేసుకున్న ఒప్పందాల ఆధారంగా అవార్డు ప్రకటించింది. ఆంధ్రవూపదేశ్‌కు గోదావరిలో లభించే నికర జలాలు 1,480 టీఎంసీలు. ప్రస్తుత కేటాయింపులను అనుసరించి ఇంచుమించుగా 900 టీఎంసీల నికర జలాలు తెలంగాణకు, 580 టీఎంసీల నికర జలాలు ఆంధ్రకు అందుతాయి. జలాల్లో సగం నీటిని ఇంకా వినియోగించుకోవాల్సి ఉంది. కాబట్టి ఈ విషయంలో వివాదాలు తలెత్తే అవకాశమే లేదు.

గోదావరి బేసిన్‌లో స్పష్టత రావాల్సినవి..
గోదావరిలో కేటాయింపు నీరే చాలా ఉన్నందున పేచీ ఉండబోదు. కాకపోతే, ఒకవూటెండు అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.
-పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని తెలంగాణ ప్రజలు వ్యతిరేకిస్తున్నా నిర్మాణం ఇప్పటికే ప్రారంభమైనందున దీన్ని ఆపడం కుదరని పని. ముంపు నష్టాన్ని సాధ్యమైనంత కనీస స్థాయికి నివారించేందుకు, ప్రత్యామ్నాయ మార్గాల కోసం అవగాహన రావాల్సి ఉంది.
-అనుసంధానం ముసుగులో గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్‌కు నీటిని తరలించేందుకు ఉద్దేశించిన దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టుఆలోచనను విరమించుకోవాల్సి ఉంది.
-పంపకాల విషయంలో అంతపూరాష్ట్ర సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే ఖమ్మం జిల్లాలోని భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలి.(నిజాం హయాంలో ఈ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలోనే భాగమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి.)
-కోస్తాంవూధలో పోలవరం ప్రాజెక్టుకు, తెలంగాణలో ప్రాణహిత-చే ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి.
కృష్ణా బేసిన్‌లో ఇవీ...
కృష్ణా జలాల పంపకం విషయంలో తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల మధ్య ఎలాంటి తగువులేదు. వినియోగంలోనే పేచీ ఉంది. పారదర్శకత లేకపోవడం కారణం.
-బచావత్ ట్రిబ్యునల్ ప్రాజెక్టుల వారీగా నీటి కేటాయింపులు చేసినా వినియోగంలో అసమానతలు తలెత్తినందున కేంద్ర జలసంఘం ఆధ్వర్యంలో చట్టబద్ధమైన అధికారాలతో ప్రత్యేక మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంది.
-శ్రీశైలం ప్రాజెక్టు నుంచి మిగులు జలాల ముసుగులో కృష్ణా జలాలను సీమాంవూధకు తరలించేందుకు పోతిడ్డిపాడు హెడ్‌గ్యులేటర్ సైజును, సామర్థ్యాన్ని నాలుగింతలు పెంచారు. అక్రమంగా నిర్మించిన నాలుగు స్లూయిజ్‌లను మూసేయిస్తామన్న ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. పర్యవేక్షణ యంత్రాంగాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
-హంద్రీ నీవా, వెలిగొండ తదితర ప్రాజెక్టులకు కేటాయించిన కృష్ణామిగులు(వరద) జలాలను 30రోజుల్లో వాడుకునేలా ప్రభుత్వం అనుమతి ఇచ్చినందున తెలంగాణలో ఎత్తిపోతల పథకాలకు కూడా 30 రోజుల్లో కేటాయించిన నీటిని వాడుకునేలా అనుమతి ఇవ్వాలి.
-పులిచింతల ప్రాజెక్టుకు కృష్ణా జలాలను బచావత్ ట్రిబ్యునల్ అంగీకరించలేదు. అందువల్ల వరద సమయాల్లో మినహాయించి ఆ ప్రాజెక్టు కోసం నాగార్జున సాగర్ నుంచి హక్కుకు మించి చుక్క నీరు కూడా అదనంగా విడుదల చేయకుండా చూడాలి.

నీటి పంపకాలు యథాతథం
తెలంగాణ వస్తే జల వనరుల విషయంలో సీమాంవూధకు అన్యాయం జరుగుతుందని, ఆంధ్రాకు నీళ్లు రావన్నది ఉత్తి దుష్ప్రచారం మాత్రమే. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైనా తెలంగాణ, కోస్తా, రాయలసీమ ప్రాంతాలు తాము వాడుకునే నీటి వాటాలో ఎలాంటి తేడా రాదు. అంతర్జాతీయ జల సూత్రాలు, జాతీయ జల విధానం, ట్రిబ్యునళ్ల నీటి పంపకం మేరకే అంతపూరాష్ట నదుల్లో ఆయా రాష్ట్రాలు తమ వాటా నీటిని వినియోగించుకుంటున్నాయి. రాష్ట్ర విభజన జరిగాక కూడా ఇవే సూత్రాలు వర్తిస్తాయి.
- ఆర్.విద్యాసాగరరావు, కేంద్ర జల సంఘం మాజీ సభ్యుడు


కృష్ణా జలాల వినియోగంపై పర్యవేక్షణ సంస్థ ఉండాలి
రాష్ట్ర విభజన జరిగితే ప్రతి ప్రాంతం, ప్రతి ప్రాజెక్టు తన హక్కు ప్రకారమే నీటిని వాడుకునేలా చూసేందుకు ప్రత్యేక యంత్రాగాన్ని ఏర్పాటు చేసుకోవాలి. చట్టబద్ధమైన మానిటరింగ్ సెల్‌ను ఏర్పాటు చేయాలి. రాయలసీమకైనా కృష్ణా డెల్టాకైనా హక్కు ప్రకారమే నీటి విడుదల జరగాలి. పోలవరం ముంపు నష్టాన్ని తగ్గించాలి. దుమ్ముగూడెం-సాగర్ టెయిల్‌పాండ్ విరమించుకోవాలి. భద్రాచలం డివిజన్‌ను తెలంగాణ రాష్ట్రంలోనే కొనసాగించాలి.
- మేరెడ్డి శ్యాంప్రసాద్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విశ్రాంత ఇంజనీర్ల వేదిక

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి