30, ఆగస్టు 2013, శుక్రవారం

లూటీ కోసమే యూటీ పాట


8/29/2013 12:04:15 AM
జూలై 30 వరకు తెలంగాణ ఎట్లాగు రాదు.. ఇక బెంగ ఎందుకు? తెలంగాణ సపోర్టు చేస్తే పోయేదేముంది. మన నోటి మాట తప్ప.. లేకుంటే ఓ కాగితం ముక్క... మొన్నటి వరకు మాట మీద నిలబడని, వెన్నుముక లేని సీమాంధ్ర పార్టీలు, వాటి నాయకుల ఆలోచన ఇది. ఇప్పుడు మరోసారి తెలంగాణ ప్రకటన రాగానే ఒక్కసారిగా దిమ్మతిరిగి, మైండ్ బ్లాక్ అయింది. దాని నుంచి నెమ్మదిగా తేరుకొని ఇక తమ కుట్రలకు తెర లేపారు. రాజీనామా లు, రాజకీయ ఎత్తుగడలతో రాణించవని తెలుసుకున్నారు. ‘బ్రహ్మస్త్రం’ గా భావించే సీమాంధ్ర మీడియాను, సీమాంధ్ర ఉద్యోగులను ప్రత్యక్షంగా రంగంలోకి దింపారు. ఉద్యోగుల హక్కుల పరిరక్షణ, తెలంగాణలోని సీమాంవూధుల భద్రతే తమకు ముఖ్యమనీ,నీటి పంపకాలు, హైదరాబాద్‌పై హక్కుల మాత్రమే తమ లక్ష్యమని ఒకవైపు చెబుతూ వచ్చారు.

ఆయా సమస్యల పరిష్కారానికి కేంద్రం సిద్ధం కాగానే ‘ఆంటోని కమిటీ వద్దు- సమైక్యాంధ్ర ముద్దు’ అంటూ తమ మనసులో ఉన్న విషం కక్కుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించడమే తమ లక్ష్యానికి అసలు రూపమని బట్టబయలు చేశారు. ‘మాది మాకే కావాలి, మీది మాకే కావాలి’ అన్నది సీమాంధ్ర పెట్టుబడివర్గాల అసలు సిద్ధాంతం. సమైక్యాంవూధ తప్ప, వేరే ఏవైనా, అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తామని ఆంటోని కమిటీ అంటే పెత్తనమే లక్ష్యమని చెప్పలేక.. ఉంటే సమైక్యాంధ్ర లేదంటే హైదరాబాద్‌ను యూనియన్ టెరిటరీ అని అంటున్నారు. యూనియన్ టెరిటరీ చేయడం వల్ల మీకు లాభం లేదు, తెలంగాణకు నష్టం కదా అని ఆంటోనీ కమిటీ అంటే మగధీర సినిమాలో విలన్ చెప్పినట్టు ‘నాకుదక్కనిది, ఇంకెవరికీ దక్కనివ్వను’ అన్నట్టు ఈరోజు చిరంజీవి మాట్లాడడం శోచనీయం. యూటీ ముసుగులో లూటీ చేయవచ్చుని వారి ఆలోచన. దీంతో తెలంగాణ ప్రజలకు కొంత కనువిప్పు కలిగింది.
సెక్ర అత్యధికులు సీమాంధ్ర ఉద్యోగులే ఉన్నారంటూ ఇన్నేళ్ల నుంచి మన ఉద్యోగులు చేస్తున్న ఆరోపణలను నిజం చేస్తున్నారు.

వందేళ్లయిన చావు తప్పదు, వెయ్యి ఏళ్లున్నా వేరు తప్పదు, ఇక్కడ ఎన్నేళ్లున్నా సీమాంవూధులు తెలంగాణవారు కాలేరని నిరూపించుకున్నారు. రెండు వారాలుగా జరుగుతు న్న హింసాయుత ఘటనలు, వీహెచ్ లాంటి సీనియర్ నాయకులపై దాడి, సిద్దిపేట నుంచి శ్రీశైలం వెళ్లే బస్సులను అడ్డుకోవడం ఇందుకు నిదర్శనం. ప్రపంచంలోనే అత్యంత హేయమైన సంఘటన ఇటీవల జరిగింది. వైద్య వృత్తికే కళంకం తెచ్చే విధంగా పురిటి నొప్పులతో ప్రసవ వేదనతో వెళ్లిన నిండు గర్భిణి కర్నూల్ హస్పిటల్‌కు వెళ్తే కర్కశంగా గెంటివేయబడింది. గద్వాల్‌కు చెందిన ఆమె తెలంగాణ మహిళ కావడమే ఇందుకు కారణం. ఈ గోవిందమ్మ ఉదం తం తర్వాత ‘రక్షణ’ ఎవరికి అవసరం అన్న ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. తెలంగాణలో ఉండి, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న సీమాంధ్ర ఉద్యోగు లు, కొందరు ప్రజలు ‘ఆవేశంతో, దురాలోచనలతో’ కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారు’. సద్భావనతో సోదరులుగా ఉందామని తెలంగాణ ప్రజలు అంటుంటే, సెటిలర్స్ మేము, స్థానికులం కామని మీకు మీరే ముద్ర వేసుకుంటుంటే ఏమి చెప్పగలం?

ఆంటోని కమిటీ పలు విషయాలు ప్రస్తావిస్తూ కిరణ్‌కుమార్‌డ్డి ప్రధానంగా హైదరాబాద్‌ను కేంద్ర పరిపాలన (యూటీ)లో ఉంచాలని ప్రతిపాదించారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తర్వాత దురాలోచనతో కొంతమంది సీమాంధ్ర నాయకులు ఈ కుట్రకు బీజం వేశారు.1896లో మొదట హైదరాబాద్ మున్సిపాలిటీ, 1950లో మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్ ఏర్పడ్డది. 2007లో ఎంసీహెచ్‌ను విస్తరింపజేస్తూ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చేశారు. 2008లో జీవో 570 ప్రకారం 25-8-2008 న నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, రంగాడ్డిలోని 36 మండలాలను కలుపుతూ 7100 స్కేర్ కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉండి, తెలంగాణలో దాదాపు 7శాతం కలిగి ఉన్న ది. తెలంగాణ రాష్ట్ర ఆదాయంలో దాదాపు 50 శాతం వచ్చే ప్రాం తాన్ని హైదరాబాద్ మెట్రోపాలిటన్ డవలప్‌మెంట్ ఏరియా కింద మార్చారు. బెంగళూరు తర్వాత దేశంలో అత్యంత విస్తీర్ణం గల సిటీ హైదరాబాదే. ఒకవిధంగా ఇది ఆనాడే పన్నిన పన్నా గం. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనివార్యం అయితే హైదరాబాద్‌ను హెచ్‌ఎండీఏ రూపంలో విశాల హైదరాబాద్‌ను చేసి దాన్ని కబళించాలనే దురాలోచన దీని వెనక ఉన్న సత్యం.

ఏ నగరాన్నయినా కేంద్ర పాలిత ప్రాంతంగా ఎప్పుడు చేస్తారో ఆలోచించాలి. దేశంలో పాండిచ్చేరి, చండీగఢ్, లక్షదీప్, డయ్యూ డామన్ , దాద్రనగర్ హవేలీ ఒకప్పటి పోర్చుగీసు కాలనీలు. లక్షద్వీప్ ,అండమాన్ నికోబార్ ఫ్రెంచ్, పోర్చుగీసు కాలనీలు కావడం వల్ల వాటి ఒప్పందాల ప్రకారం లక్షద్వీప్, అండమాన్ నికోబార్ ద్వీపాలను దేశ రక్షణ కోసం యూటీలుగా కొనసాగించారు. ఢిల్లీ దేశ రాజధాని కావటం వల్ల మొదట యూటీ చేసినా ఇప్పుడు రాష్ట్రంగా మార్చారు. చండీగఢ్ స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ప్లాన్ ప్రకారం నిర్మించిన మొదటి నగరం. హర్యానా, పంజాబ్ రెండు రాష్ట్రాలు ఏర్పాటు అయినప్పుడు చండీగఢ్ భౌగోళికంగా రెండు రాష్ట్రాల సరిహద్దుల్లో ఉండడం వల్ల యూటీగా మార్చి, రెండు రాష్ట్ర రాజధానులుగా మార్చారు. అంటే యూటీ చేయడానికి దేశ భద్రతా, భౌగోళిక, సంస్కృతి పరంగా వేరే రాష్ట్రంలో కలువలేని పరిస్థితి, అంతర్జాతీయ ఒప్పందాల కారణమై ఉండాలి. కానీ సీమాంధ్ర నాయకులు గొంతెమ్మ కోర్కెలకు అనుగుణంగా మార్చడం కాదని గుర్తుంచుకోవాలి. హైదరాబాద్ తెలంగాణలో అంతర్భాగం. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణతో ఆంధ్ర రాష్ట్రం కలిసి ఆంధ్రవూపదేశ్ ఏర్పడిందని మరిచిపోవద్దు.

ఒకవేళ దేశ భవూదత కారణం అయితే మొదటగా యూటీని చేయవలసిన ప్రదేశాల్లో వైజాగ్ ముందుంటుంది. ఎందుకంటే అక్కడ దేశ అతిపెద్ద ఈస్టర్న్ నావల్ కమాండ్, సబ్‌మెరైన్ పోర్ట్, ఐఎన్‌ఏ విక్రాంత్ యుద్ధ నౌక లాండింగ్ సౌకర్యాలు వైజాగ్ పోర్ట్ సిటీలోనే ఉన్నాయి. అలాగే డిఫెన్సు ఆధ్వర్యంలో నడుస్తున్న ఎయిర్‌పోర్టు, ఎమ్జన్సీలో అవసరమయ్యే చమురు డిపోలు వైజాగ్ లోనే ఉండడం విశేషం. ఈ మధ్య 15 వేలకోట్లతో ఐదు వేల ఎకరాల్లో భారత దేశంలోమొట్టమొదటి సబ్‌మెరైన్ స్టేషన్ నిర్మిస్తున్నారు. అలాగే దేశంలో రెండో అతిపెద్ద స్టీల్ ప్లాంట్ (వీఎస్‌పీ) ఇండియన్ కోస్ట్ గార్డ్, షిపింగ్ యార్డ్ తదితర అనేక రహస్య సైనిక స్థావరాలు వైజాగ్ చుట్టూ ఉన్నాయి. దాదాపు 40 శాతం ఎయిర్‌పోర్టు యాక్టివిటీ వైజాగ్ ప్రాంతంలో జరుగుతుంది. అందువల్ల ప్రస్తు తం ఉన్న ఆంధ్రవూపదేశ్‌లో దేశ, రాష్ట్ర భద్రత దృ ష్ట్యా యూటీ చేయవలసిన అవసరం వస్తే వైజాగ్ మొదటి స్థానంలో నిలుస్తుంది.

తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే దేవాలయమే కాకుం డా, అత్యంత సంపన్నమైన హిందూదేవాల యం. ఈ దేవాలయాన్ని ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ ప్రజలే కాకుండా దేశ, విదేశాల్లో ఉండే హిందువులు కూడా దర్శించుకుని కానుకలు సమర్పించుకుంటారు. అందువల్ల ప్రతి సంవత్సరం ఆదాయం 2000-3000 కోట్లు ఉంటుంది. ఈ సంపద అందరికీ చెందుతుం ది. ముఖ్యంగా దీన్ని ధార్మిక అభివృద్ధికి, హిం దూ మత అభివృద్ధి, హిందూ మత ప్రక్షాళనకు ఉపయోగించాలి. అలాంటప్పుడు ఒక ధార్మిక ప్రత్యేకత కలిగి ఉన్న కోట్లాది హిందువుల మనోభావాలకు ముడిపడి ఉన్న తిరుమల, తిరుపతి ప్రాంతాలను ఒక యూటీగా మార్చడం అత్యవసరం.

ఒక మహానగరంలో వివిధ ప్రాంతాల ప్రజలు అవసరాల కోసం, అవకాశాల కోసం వచ్చి స్థిరపడుతుంటారు. చెన్నైలో 30-40 శాతం ప్రజలు వివిధ రాష్ట్రాల నుంచి స్థిరపడ్డారు. కలకత్తాలో బీహార్, ఒడిషాకు చెందిన ప్రజలు అత్యధికంగా ఉంటారు. ఇదే ప్రమాణంగా తీసుకుంటే దేశంలోని అన్ని మహానగరాలను యూటీలుగా మార్చాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజ లు దాదాపు ఆరు శాతం (శ్రీకృష్ణ కమిటీ ప్రకారం) ఉంటారు. అలాగే వివిధ తెలంగాణ జిల్లాల్లో లక్షలాది మంది సీమాంధ్ర ప్రజలు, తెలంగాణ ప్రజలతో మమేకమై ఉన్నారు. అందువల్ల ‘మాకు దక్కనిది, మీకు దక్కనీయం’ అనే సం కుచిత స్వభావానికి స్వస్తి పలికి, విభజన వల్ల విద్వేష మార్గం కాకుండా, సోదర భావంతో విడిపోయి కలిసుందాం. వితండవాదాలు వీడి విభజనకు సహకరించాలి.
-డాక్టర్ బూర నర్సయ్యగౌడ్
టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత, డాట్స్ చైర్మన్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి