30, ఆగస్టు 2013, శుక్రవారం

నాడు మద్రాసు- నేడు హైదరాబాద్


8/27/2013 12:48:11 AM

తెలంగాణలోని రాజకీయ పక్షాలన్నీ కటువుగా వ్యవహరించాల్సిన సమయం ఆసన్నమయింది. తమ ప్రాంత ప్రయోజనాలే లక్ష్యం గా అన్ని రాజకీయపార్టీలు తమ తమక్షిశేణులను సిద్దం చేసుకొని వ్యూహాత్మకంగా అడుగు ముందుకు వేస్తారని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు. ఇంతవరకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, లాయర్లు, కవులు, కళాకారులు ఉద్యమంలో తమవంతు పాత్ర చరివూతాత్మకంగా నిర్వహించారు. తెలంగాణ కల సాకారమయ్యే రోజు అతి సమీపంలోనే ఉందన్న విషయం తేటతెల్లమయింది. దేశ రాజకీయాలలో ప్రధాన భూమిక నిర్వహించే కాంగ్రెస్, బీజేపీలు, జాతీయ ప్రాంతీయ పార్టీలలోఅధిక భాగం తెలంగాణ రాష్ట్ర డిమాండుకు ఆమోదముద్ర వేశాయి. అంతా బాగానే వుంది,వచ్చిన చిక్కల్లా హైదరాబాదు నగరం పదేళ్ళ వరకు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతుందని సీడబ్ల్యూసీ కేంద్ర ప్రభు త్వం నిర్ణయం తీసుకోవడంలోనే ఉంది. రాష్ట్రం సమైక్యంగానే ఉండాలని ఉద్యమం చేస్తున్న సీమాంధ్ర రాజకీయనాయకుల అసలు గొడవ అంతా హైదరాబాద్ మా చేజారి పోతున్నదన్న బాధేనని స్పష్టమవుతున్నది. ఈ పరిస్థితిలో తెలంగాణలోని రాజకీయ పక్షాలు తమ గొంతుబలంగా వినిపించాలి. నిక్కచ్చిగా వ్యవహరించి, పట్టువిడుపులకు సందివ్వకుండా ఎవరితో పొత్తులేని హైదరాబాద్ రాజధానిగా పది జిల్లాల భౌగోళిక తెలంగాణ సాధించుకోవాలి.ఉమ్మడి రాజధాని అన్నదే అసంబద్ధమైనది. ఏ ఊరు, ఏ పట్టణమైనా భౌగోళికంగా ఏప్రాంతంలో ఉంటుందో అన్ని అవసరాలకు, సాంస్కృతికంగా ఆప్రాంతానికే ఉంటుంది. పంజాబ్, హర్యానా రాష్ట్రాలకు చండీగఢ్ రాజధానిగా ఉండడం ఆరెండు రాష్ట్రాల మధ్య ఆనగరం ఉంది కాబట్టి సాధ్యమయింది. సరిహద్దులు నిర్ణయించడంలోను ఇబ్బందులేమి రాలేదు. కాని తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగం. తమ రాష్ట్రం సరిహద్దుల నుంచి రెండు మూడు వందల కిలోమీటర్లువూపయాణం చేస్తేనేగాని రాజధానికి చేరుకోలేని ఇబ్బందికరమైన పరిస్థితికి సామాన్య సీమాంవూధులను ఎందుకునెట్టి వేయబడాలి? పొరుగు రాష్ట్రంలో తమ రాజధాని ఉంటే పరిపాలన ఎలా సాధ్యమవుతుందో సీమాంవూధులు ఆలోచించాలి.

ఉమ్మడి రాజధానిలోవూపభుత్వ భూములపై అజమాయిషీ ఎవరికీ ఉంటుం ది? పూర్వపు అల్తాఫ్బలా ్దజిల్లాలోని 1263 గ్రామాలలోని లక్షలాది ఎకరాల భూములన్నీ నిజాం సొంతభూములే! అవన్నీ 1956లో ఆంధ్రవూపదేశ్ ప్రభు త్వ భూములయి పోయాయి. దేశంలో ఏ రాష్ట్ర రాజధానిలోను అంత పెద్దఎత్తున ప్రభుత్వ భూములు ఉండేవికావు. బహుళజాతి సంస్థలకు, సీమాంధ్ర పెట్టుబడిదారులకు, సినీనటులకు కొన్ని దశాబ్దాల లీజుకు, నామమావూతపు ధరకు అమ్మినవి పోగా, సెజ్జులకు కేటాయించినవి మినహాయించినా ఇంకా ప్రభుత్వ భూమి బోలెడంత ఉంటుంది. మరి రేపు ఉమ్మడి రాజధానిగా ఉండబోయే కాలంలో ఏపరిక్షిశమకో, ప్రజలకు ఉపయోగపడే ఏ కార్యక్షికమానికో ప్రభుత్వ భూమిని కేటాయించాల్సిన అవసరం వచ్చినప్పుడు ఏ ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది? హైదరాబాదాద్ పాలనా వ్యవస్థ ఏ ప్రభుత్వం కింద ఉంటుంది? రెవెన్యు వసూళ్ళు ఎవరు చేస్తారు ఆ వసూళ్ళు ఎవరి ఖాతాలో జమ అవుతాయి అన్న విషయాలు నిర్ణయించేటప్పుడు తెలంగాణ ప్రాంత నాయకులునిర్ణయాత్మకంగా వ్యవహరించాలి.మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడుతున్న తరుణంలో 29 డిసెంబర్ 1952 నాడు తమిళ కాంగ్రెస్ సంఘం చేసిన తీర్మానం ఇక్కడ గుర్తుచేసుకోవాలి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటవుతుందని ప్రధాని ప్రకటించారు; మద్రాసు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం అవతరించాలని ఆమరణదీక్ష చేసిన పొట్టిశ్రీరాములు మరణించి రెండువారాలే అయ్యింది; విభజన విషయాలు పరిశీలించడానికి ఒక ఉపసంఘం ఏర్పాటయింది; ఆ ఉప సంఘానికి కామరాజ్నాడార్ అధ్యక్షుడు; ఆ ఉప సంఘం ఏమాత్రం సంకోచించకుండా,ఏ శషభిషలు లేకుండా ఎకక్షిగీవ తీర్మానం ఒకటి ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపింది. ఆ తీర్మాన పాటం ఇలా ఉంది: మద్రాసు నగరం మినహాగా ఆంధ్రరాష్ట్రం నిర్మాణం గురించి ప్రధాన మంత్రి చేసిన ప్రకటనను ఈ ఉప సంఘం హృదయపూర్వకంగా ఆమోదిస్తున్నది. మదరాసు నగరం తమిళనాడులోఅంతర్భాగమని, అది సహజంగాను, తప్పనిసరిగాను మదరాసు రాష్ట్రంలో ఉండి తీరాలని ఈ ఉప సంఘం భావిస్తున్నది.(ఆంధ్ర పత్రిక 28.12.1952)ఈ తీర్మానం ఆధారంగానే మదరాసు నగరము గురించి ఆలోచించడం మానివేయకపోతే పరిస్థితులు ఇంకో లా ఉంటాయని రాజాజీ తీవ్రంగా హెచ్చరించింది.సరిగా ్గఅదే పరిస్థితి ఇప్పుడు ఉత్పన్నమైంది. ఉమ్మడి రాజధాని తప్పనిసరి అయితే, సీమాంధ్ర ప్రభుత్వానికి సచివాలయంలో కొన్ని భవనాలు, శాఖాధిపతుల కార్యాలయాలలో కొన్ని గదులు తప్ప ఇంకేమి ఉండవని సీమాంవూధులకు స్పష్టం చెయ్యాలి. కేంద్రం ఏర్పాటు చేసే కమిటీలతో, అధికారులతో ఈ విషయాలు చర్చించేటప్పుడు రాజకీయపార్టీల ప్రతినిధులతోపాటు తెలంగాణ పౌరసమాజం ప్రతినిధులు ఉండాలి. ఉద్యమ సందర్భం గా చాలాసారు ్లచెప్పుకున్న ఒంటె, గుడారం కథను మళ్లీ ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలి. పదేళ్ల ఉమ్మడి రాజధాని ఏరూపంలోనూ శాశ్వతం కాకుండా, గడువు పొడిగించకుండా ఇప్పుడే జాగ్రత్త వహించాలి. దీనికి పూనుకోవాల్సింది రాజకీయపక్షాలే!
-ఎ. రాజేంవూదబాబు
తెలంగాణ కో-ఆర్డినేషన్ కమిటీ కోశాధికారి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి