30, ఆగస్టు 2013, శుక్రవారం

ఆంధ్రోళ్ల అడ్డా.. నిమ్స్


8/30/2013 4:40:00 AM
తెలంగాణ వారిని ఇంటర్వ్యూకే రానివ్వని కుట్ర
26మందిలో ఎంపికైన ఐదుగురూ సీమాంధ్రులే..

హైదరాబాద్ ఆగస్టు 29 (టీ మీడియా):ఎవరు కట్టించిన ఆస్పత్రి?.. ఎవరికోసం కట్టించిన ఆస్పత్రి?.. చివరకు ఎవరి పాలైంది! ఏ ఆశయంతో పెట్టారు.. ఇపుడక్కడ ఏం జరుగుతోంది? తెలంగాణ తనను తాను కోల్పోవడం వల్ల జరిగిన నష్టమేమిటి?... ఈ ప్రశ్నలన్నింటికీ నగరం నడిబొడ్డున ఉన్న ఒకనాటి నిజాం బొక్కల దవాఖానా.. నేడు రంగులు పూసి.. హంగులు వేసి సీమాంవూధులు కబ్జా పెట్టిన నిమ్స్ andhraఅనబడే పెద్దోళ్ల దవాఖానా సమాధానంగా నిలుస్తుంది. ఆస్పవూతిని గుప్పిట్లో పెట్టుకున్నవాళ్లను.. ఆస్పత్రి మంచాలను ఆక్రమించిన వాళ్లను చూస్తే గుండె పగులుతుంది. గొర్రెల్లాంటి...గోదల్లాంటి కటిక పేదలైన తన ప్రజలకోసం ఒకానొక నియంత కూడా చలించి సొంత డబ్బు ఖర్చుచేసి కట్టించి ఉచితంగా వైద్యం చేయించుకుని చల్లగా బతకమని ఇచ్చిన ఆశీర్వాదం.. సీమాంవూధుల పాలై వైద్యాన్ని కరెన్సీ కట్టలతో తూ చే వ్యాపార శాపంగా మారిపోవడం ఒక విషాదం. నీళ్లున్న చోట కప్పలు చేరినట్టు కరెన్సీ కట్టల చప్పుడు వింటేనే మూగే వ్యాపార మనస్తత్వం కలిగిన వారి గుప్పిట్లో ఉక్కిరిబిక్కిరి కావడం ఒక దౌర్భాగ్యం. రాజ్యాన్ని ఏలేవాడే ఇక్కడి వైద్యాధికారాన్ని ఏలాలని అమలు చేస్తున్న అప్రకటిత శాసనం ముఫ్పై ఏళ్ల నిమ్స్ చరివూతలో తెలంగాణ వాడికి అధికారం మూడేళ్లుకూడా మిగల్చని... విభజన ముంగిట్లోనూ తెలంగాణ వాడికి దక్కనివ్వని వాస్తవం చెబుతున్నదేమిటి? ముదిరిన రోగానికి అంగఛ్చేదనంలాగే అవధులన్నీ దాటిన సీమాంధ్ర జాఢ్యానికి రాష్ట్ర విభజనే మార్గమని!!

నిమ్స్ డైరెక్టర్ పదవికి ఎన్నికలో తెలంగాణకు మళ్లీ అన్యాయం జరిగింది. ఎట్టిపరిస్థితిలోనూ తెలంగాణ వారికి అవకాశం ఇవ్వరాదన్న కృత నిశ్చయంతో సెర్చ్‌కమిటీ జరిపిన ఎంపిక ప్రహసనంలో ఇంటర్వ్యూలకు ఎంపిక స్థాయిలోనే తెలంగాణ వారందరినీ పక్కన పెట్టేశారు. ఇపుడు ఇక వారిష్టం.. వారి రాజ్యం. నిజాం బొక్కల దవాఖానా 1985లో నిమ్స్‌గా పేరుమార్చుకున్న తర్వాత సీమాంవూధులు దీన్ని తమ అడ్డాగా మార్చుకున్నారు. రాష్ట్రం విడిపోతున్న ఈ సందర్భంలోనూ ఆస్పవూతిలో తమ హవాకు అడ్డులేకుండా మళ్లీ నిమ్స్ డైరెక్టర్ పదవిని కబ్జా పెట్టుకోవడానికి సిద్ధమయ్యారు. ఖాళీ అయిన డైరెక్టర్ పదవికి దరఖాస్తు చేసుకున్న 26మందిలో 20 మందీ వాళ్లే. ఉన్న ఆరుగురు తెలంగాణ వాళ్లలో ఒక్కళ్లనీ ఇంటర్వ్యూకే పిలవకుండా కుట్రలు. తెలంగాణ వాళ్లు కానీ ఐదుగురుని పిలిచి ఇంటర్వ్యూ అనే ముందే రచించుకున్న నాటకాన్ని ఆడేందుకు స్టేజీ సిద్ధమైంది. చిత్తూరు వారికి ఖాయం అయిన పోస్టుకు తూతూ తతంగంలో చివరి అంకానికి తెర లేస్తున్నది.

ఇదీ నిమ్స్ చరిత్ర
1950లో నిజాం రాజు హైదరాబాద్ రాష్ట్రానికి రాజ్‌వూపముఖ్(గవర్నర్)గా ఉండేవాడు. ఒక రోజు ఆయన డ్రైవర్‌కు చేయి విరిగితే ఉస్మానియా ఆస్పవూతిలో చేర్పించారు. మరుసటి రోజు పరామర్శకు ఉస్మానియా ఆస్పవూతికి వెళ్లిన నిజాంకు అక్కడ ఎముకల వైద్యానికి తగు ఏర్పాట్లు లేవని తెలిసింది. అక్కడున్న డాక్టర్లు కూడా ఎముకల దవాఖానా లేకపోవడం వల్ల ఇబ్బందులు వస్తున్నాయని చెప్పారు. ఎముకలు విరిగి వైద్య సదుపాయాలు లేక అల్లాడుతున్న ప్రజలను చూసి కరకు నియంత అయిన ఆయన మనసు కూడా తల్లడిల్లింది.

దీంతో ప్రత్యేకంగా ఎముకల వైద్యాన్నే అందించే ఒక మంచి ఆస్పత్రి కట్టించాలని నిర్ణయించి తన సొంత డబ్బు, సొంత స్థలంతో నిజాం అర్థోపెడిక్ హాస్పిటల్‌ను నిర్మించారు. పేదలందరికీ వైద్యాన్ని ఉచితంగా అందించే ఏర్పాట్లు చేశాడు. ఆ తరువాత కాలంలో ఇది ప్రభుత్వ ఆధీనంలోకి వచ్చింది. ఉచిత వైద్యం కొనసాగింది. పాతికేళ్ల పాటు ఇలా రాష్ట్రంలోని పేదలకు ఉచితంగా వైద్యం అందిస్తూనే వచ్చింది. 1985లో ఈ దవాఖానకు కష్టాలు వచ్చిపడ్డాయి. ఎన్టీఆర్ ముఖ్యమంవూతిగా ఉన్నపుడు దీన్ని అటానమస్ అన్నారు. తన అనునాయి, తన ప్రాంతానికి చెందిన ఒకాయనకు అన్ని అధికారాలు కట్టబెట్టారు. ఖర్చుల వెసులుబాటుకు డబ్బుల వసూలు పద్దతి పెట్టారు. పేదల ఆస్పత్రి స్టార్ ఆస్పవూతిగా మారింది. పేదలకు చుక్కలను చూపింది. గతంలో ఈ నిమ్స్ ఆస్పత్రి ప్రవేశ ద్వారం వద్ద నిజాం అర్థోపెడిక్ హాస్పిటల్ అనే బోర్డు ఉండేది. కానీ ఈ సీమాంధ్ర నేతలు ఈ బోర్డును కూడా ఎత్తివేయించారు. పూర్తిగా ఈ ఆస్పవూతిని తామే కట్టించినట్లుగా ప్రవేశద్వారం కట్టించి ఇది నిమ్స్ అన్నారు.

table ఆదినుండి తెలంగాణపై వివక్షే
అప్పటినుంచి దీన్ని తమ అడ్డగా మార్చుకున్న సీమాంధ్ర పాలకులు పూర్తిగా తమ అనుయాయులనే డైరెక్టర్లుగా నియమించుకుంటూ వచ్చారు. నిమ్స్‌గా మారిన తరువాత 30ఏళ్ల చరిత్ర ఉన్న ఈ ఆస్పవూతికి 15మంది డైరెక్టర్లు వస్తే వారిలో కేవలం ఒక్కరే తెలంగాణ ప్రాంత వ్యక్తి అంటే అర్థం చేసుకోవచ్చు. ఇక డైరెక్టరే కాకుండా ఇతర సిబ్బంది విషయంలోనూ 1985 నుండి లెక్కలు పూర్తిగా తారుమారయ్యాయి. అంతదాకా ఉన్న తెలంగాణ వారందరినీ తరిమివేశారు. ఇక డైరెక్టర్ పదవిలోకి వచ్చిన నిజామాబాద్ జిల్లాకు చెందిన డి.రాజాడ్డి టర్మ్ మూడు సంవత్సరాలు ఉంటే దాన్ని కూడా పూర్తిచేయనీయలేదు. కాలికి పెడితే వేలికి వేలికి పెడితే కాలికీ ముడి పెడుతూ అందులోని డాక్టర్లే అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. ఫిర్యాదులతో ఉక్కిరిబిక్కిరి చేశారు. ఆనాడు నిమ్స్‌లో ఉన్న సోమరాజు, మరికొంతమంది సీమాంధ్ర డాక్టర్లు నానాయాగీ చేసి ఆయన విసిగి రాజీనామాచేసేదాకా నిద్రపోలేదు. ఒక్కో వ్యక్తి రెండేసి సార్లు నిమ్స్ డైరెక్టర్ అయిన సందర్భాలన్నా తెలంగాణ వారికి మాత్రం అవకాశం ఇవ్వలేదు. ఉద్యోగుల విషయంలోనూ సీమాంధ్ర డైరెక్టర్లు పూర్తిగా వివక్షనే చూపారు.

ఈ దఫా కూడా సీమాంధ్ర డైరెక్టరే...
ప్రస్తుతం నిమ్స్ ఆస్పవూతికి ఐఎఎస్ అధికారి అజయ్‌సహానీ ఇన్‌ఛార్జీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఆయన వైద్యారోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీగా కూడా ఉన్నాయి. అంతకుముందున్న సీమాంధ్ర డైరెక్టర్ అవినీతిలో ఊబిలో కూరుకుపోయి తప్పనిసరి పరిస్థితిలో పదవి వదులుకోవడం వల్ల ఈయన రావలిసి వచ్చింది. పాత డైరెక్టర్ ధర్మరక్షక్ తన పదవీకాలంలో సర్జికల్ ఐటెంల కొనుగోళ్లలో వంద కోట్లకు పైగా అక్రమాలు జరిగాయని తేలింది. వాస్తవానికి ధర్మరక్షక్‌ను ఏడాది కాలానికే డైరెక్టర్ పదవిలో నియమించారు. ప్రభుత్వం నుండి మరో ఏడాదికి కొనసాగింపు ఆర్డర్‌ను తెచ్చుకున్నారు. ఈయనకు డైరెక్టర్ పదవి రావడానికి ప్రధాన కారణం ఢిల్లీలోని పైరవీనే అని నిమ్స్ వర్గాలు చెబుతున్నాయి. నిమ్స్‌ను ఏకచవూతాధిపత్యంగా ఏలిన ధర్మరక్షక్ అనుకున్న వారికి సర్జికల్ ఆర్డర్లు ఇచ్చినట్లు ఆరోపణలు వెల్లు ఇదే సమయంలో ధర్మరక్షక్‌కు రెండోసారి డైరెక్టర్‌గా అవకాశం ఇవ్వడంపై నిమ్స్‌లోని ఒక వర్గం హైకోర్టుకు వెళ్లడం, కోర్టు ధర్మరక్షక్‌ను మీరు తొలగిస్తారా... మమ్మల్ని తొలగించమంటరా... అని అడగడంతో ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చింది. దీనికి తోడు ఆయన టైంలో జరిగిన కొనుగోళ్లలో అక్రమాలు జరిగినట్లు ప్రభుత్వం గుర్తించడంతో తన పదవికి రాజీనామా చేసి వెళ్లిపోయారు.

సీమాంవూధవారికి అండగా సెర్చ్‌కమిటీ
సీమాంధ్ర డైరెక్టర్ల చేతిలో అప్రతిష్టను మూటగట్టుకున్న నిమ్స్ ఆస్పవూతికి మరో కొత్త డైరెక్టర్‌ను నియమించడం కోసం ప్రభుత్వం ఒక సెర్చ్ కమిటీ వేసింది. ఈ కమిటీలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి కొండ్రు మురళి, పబ్లిక్ హెల్త్ పౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు శ్రీనాథ్‌డ్డి, వైద్యారోగ్యశాఖ కార్యదర్శి అజయ్‌సహానీ ఉన్నారు. దరఖాస్తులు ఆహ్వానిస్తే 26మంది దరఖాస్తు చేసుకున్నారు. వారిలో ఆరుగురు తెలంగాణ ప్రాంతానికి చెందిన వారున్నారు. వీరిలో రమేష్‌రావు ప్రస్తుతం నిమ్స్‌లోనే ఫార్మకాలజీ ప్రొఫెసర్‌గా ఉన్నారు. శోభాజగదీష్ నిమ్స్‌లోనే ఎగ్జిక్యూటివ్ రిజిస్టార్‌గా, మన్మధరావు చెస్టు ఫిజీషియన్ ప్రొఫెసర్‌గా, సుదర్శన్‌డ్డి నిలోఫర్ పిడియావూటిక్ ప్రొఫెసర్‌గా, కేటీ రెడ్డి అడ్మినిస్ట్రేషన్ వింగ్‌లో పనిచేస్తున్నారు. అయితే 26మందిలో ఐదుగురిని ఇంటర్వ్యూకు పిలిచారు.

వారిలో సీఎం సొంత జిల్లా చిత్తూరుకు చెందిన ముకుందడ్డి, నరేంవూదనాథ్ (గుంటూరు), వీబీఎన్ ప్రసాద్ (కర్నూల్), జీఎస్‌ఎన్ రాజు (రాజమండ్రి), పీవీఎల్‌ఎన్ మూర్తి (గుంటూరు రూరల్) ఉన్నారు. ఒక్కరూ తెలంగాణ వారు లేకపోవడంలో వ్యూహం ఉందంటున్నారు. ఇంటర్వ్యూలో ఒక్క తెలంగాణవారున్నా తెలంగాణవాదులు, నాయకులు ఆందోళన చేసి ఆ వ్యక్తికే డైరెక్టర్ పదవి ఇవ్వాలని అడుగుతారని, దీనితో సీమాంధ్ర చాన్స్ పోతుందనేఉద్దేశ్యంతో ఇంటర్వ్యూకు ఐదుగురూ సీమాంవూధులే ఉండేలా ప్లాన్ చేసినట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. దరఖాస్తు చేసిన వారిలో సీనియారిటీ ఆధారంగా ఇచ్చామని చెబుతున్నా అధికారులు ఇన్నాళ్లు తెలంగాణ ప్రాంతానికెందుకు డైరెక్టర్ పదవి ఇవ్వలేదని అడిగితే మాత్రం సమాధానం చెప్పడం లేదు. పెద్దల ఆదేశం మేరకు చిత్తూరు జిల్లా డాక్టర్‌కే డైరెక్టర్ పదవిని కట్టబె అంతా సిద్ధమైనట్టు సమాచారం.

విమ్స్ కానీ నిమ్స్‌కు వస్తారట
సీమాంధ్ర ప్రాంత డాక్టర్ల తీరు చూస్తుంటే ఆశ్చర్యం కలగక మానదు. విశాఖపట్నంలోని విమ్స్‌లో డైరెక్టర్ స్థాయి పోస్టు ఒకటి ఖాళీగా ఉంది. దీనికి దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా దరఖాస్తులు ఆహ్వానించింది. కానీ ఒక్కటంటే ఒక్క దరఖాస్తు కూడా రాలేదు. దీంతో ఆ నోటిఫికేషన్‌ను రద్దు చేశారు. కానీ నిమ్స్ డైరెక్టర్ పోస్టు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తే దరఖాస్తు చేసుకున్న 26మందిలో 20మంది సీమాంవూధులే. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుకునే వారు తమ ప్రాంతం వారికి సేవచేసుకోకుండా తెలంగాణలో పనిచేయడానికి మాత్రం ఉరుకులు పరుగులుగా రావడం వింత

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి