21, ఆగస్టు 2013, బుధవారం

తెలంగాణ ప్రాజెక్టులను సీమాంధ్రకు తరలించడం వల్లే ఇక్కడ చీకట్లు



హైదరాబాద్, ఆగస్టు 19 :


సమైక్య రాష్ట్రంలో తెలంగాణ విద్యుత్ వినియోగం 56 శాతం. తెలంగాణలోని ప్రాజెక్టుల విద్యుదుత్పత్తి సామర్థ్యం 37 శాతం. జల విద్యుదుత్పత్తి ప్రాజెక్టులను పక్కనపెడితే.. థర్మల్ విద్యుదుత్పత్తి సామర్థ్యం 23 శాతం. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో చేపట్టిన 600 మెగావాట్ల యూనిట్‌ను 2014 మార్చిలో పూర్తి చేస్తామని జెన్‌కో యాజమాన్యం చె బుతోంది. కేటీపీఎస్‌లో ఇప్పటికే 800 మెగావాట్ల కొత్త యూనిట్‌ను మొదలుపెట్టబోతున్నారు. రామగుండం వద్ద జెన్‌కో రెండు 660 మెగావాట్ల యూనిట్లను ఏర్పాటు చేయాలని భావిస్తోంది. దానిని తక్షణం 4000 మెగావాట్ల అల్ట్రామెగా ప్రాజెక్టుగా మార్చాలి. దానికి కావాల్సిన భూమి రామగుండం వద్ద పుష్కలంగా ఉంది. అవసరమైతే.. బీపీఎల్‌కు ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకోవాలి. ఆదిలాబాద్ జిల్లా జైపూర్ వద్ద సింగరేణి కాలరీస్ 1200 మెగావాట్ల ప్రాజెక్టును 2015 కల్లా పూర్తి చేయబోతున్నది. సత్తుపల్లిలో తలపెట్టిన 600 మెగావాట్ల ప్లాంటుతో పాటు మరికొన్ని ప్రాజెక్టులనూ చేపట్టవచ్చు. అలాగే.. కరీంనగర్ జిల్లాలోని నేదునూరు 2100 మెగావాట్ల ప్లాంటుకు, రంగారెడ్డి జిల్లా శంకరపల్లి 2000 మెగావాట్ల ప్రాజెక్టుకు కేంద్రం గ్యాస్‌ను కేటాయించాలి. ఇది కాకుండా సోలాపూర్-కర్నూలు గ్రిడ్‌ను పవర్ గ్రిడ్ కార్పోరేషన్ వేగంగా పూర్తి చేస్తోంది. ఈస్టర్న్ గ్రిడ్‌కు, సదరన్ గ్రిడ్‌కు అనుసంధాన లైన్లను కూడా వేగంగా వేస్తోంది. ఈ రెండూ పూర్తయితే.. తెలంగాణకు దాదాపు 3000 మెగావాట్ల విద్యుత్‌ను బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోలుచేసే అవకాశం ఏర్పడుతుంది. ఏడు గంటల వ్యవసాయ వినియోగం కోసం 10,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలి. ఇవన్నీ పూర్తయితే.. తెలంగాణకు భవిష్యత్తులో వెలుగులే తప్ప చీకట్లు ఉండవు. అంతేకాదు.. మిగులు విద్యుత్తు కూడా ఉంటుంది.


తెలంగాణకే విద్యుత్ సబ్సిడీ ఎక్కువ ఇస్తున్నామన్న మాట అవాస్తవం. దుష్ప్రచారం. తెలంగాణలో విద్యుదుత్పత్తి వ్యయం చాలా తక్కువ. తెలంగాణ ఏర్పడితే.. వినియోగ వ్యయం కూడా తగ్గి ఆదాయం పెరుగుతుంది. సీమాంధ్రలోనే ఉత్పత్తి వ్యయం ఎక్కువ. ఆదాయం తక్కువ. అక్కడే ప్రతి యూనిట్‌పై ఒక రూపాయిని సబ్సిడీగా ఇస్తున్నారు.


దానికి కారణం.. తెలంగాణలో నిర్మించాల్సిన థర్మల్ ప్రాజెక్టులను సీమాంధ్రకు తరలించారు. ఇక్కడి బొగ్గును అక్కడికి తరలించి.. విద్యుత్‌ను తిరిగి అక్కణ్నుంచి ఇక్కడకు సరఫరా చేస్తున్నారు. దీంతో ఉత్పత్తి వ్యయం, సరఫరా, పంపిణీ వ్యయం, పంపిణీ నష్టాలు.. అన్నీ జతకూడి తెలంగాణ ప్రజలపై అధిక చార్జీల భారం పడుతోంది. అందుకే దొంగ లెక్కలతో తెలంగాణలో ఎక్కువ సరఫరా వ్యయాన్ని చూపుతున్నారు. మణుగూరులో ఏర్పాటు చేయాల్సిన థర్మల్ ప్రాజెక్టును పునాదులు తీసిన తర్వాత విజయవాడకు తరలించారు. అలాగే.. రామగుండంలో విద్యుత్ బోర్డు ఏర్పాటు చేయాల్సిన థర్మల్ ప్లాంటును.. నిధుల్లేవని చెప్పి ఎన్టీపీసీకి ఇచ్చేశారు. వోల్టేజి సమస్యను అధిగమించాలన్న సాకుతో.. లోడ్ సెంటర్ పేరిట కడప జిల్లాలో ఆర్‌టీపీపీని ఏర్పాటు చేశారు. వీటీపీఎస్, ఆర్‌టీపీపీలలో విస్తరించిన యూనిట్లను పిట్ హెడ్ ప్రాజెక్టులుగా తెలంగాణలో ఏర్పాటు చేసి ఉంటే.. రెండు ప్రాంతాల ప్రజలకూ తక్కువ రేట్లకేవిద్యుత్ లభించేది. భవిష్యత్తులో తెలంగాణలో పిట్ హెడ్ ప్రాజెక్టులే వస్తాయి కాబట్టి.. ప్రాజెక్టు వ్యయం, సరఫరా, పంపిణీ వ్యయం, నష్టాలు తక్కువగా ఉంటాయి.


తెలంగాణలో 3-5 మెగావాట్ల సామర్థ్యంతో ఎక్కడికక్కడ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయడానికి చాలా వనరులున్నాయి. పంపిణీ నష్టాలు, సరఫరా వ్యయం తగ్గి సబ్సిడీల భారం తగ్గిపోతుంది.


నిజమే. కానీ ప్రైవేటు ప్రాజెక్టులు ఎక్కువగా సీమాంధ్రలోనే ఉన్నాయి. కాబట్టి వాటి భారాన్ని తెలంగాణపై పెడతామంటే ఒప్పుకోం. రాష్ట్ర విద్యుత్ నియంత్రణ సంస్థ (ఈఆర్‌సీ) ముఖ్యంగా 2-3 నెలలుగా ఇచ్చిన తీర్పులన్నింటినీ తక్షణం సస్పెండ్ చేయాలి. వాటిని అంగీకరించం. తెలంగాణ ఏర్పడ్డాక న్యాయ విచారణ జరిగేలా చూస్తాం.


ఇదీ మోసమే. సమైక్య రాష్ట్రంలో రూపొందించిన విద్యుత్ వినియోగ లెక్కల ప్రకారం ఆంధ్ర ప్రాంతం అత్యంత వెనకబడినట్టుగా.. అదీ రాయలసీమ కంటే కూడా వెనకబడినట్టు చూపుతున్నారు. ఇదెలా నమ్ముతాము. తలసరి గృహ వినియోగం ప్రకారం చూస్తే.. హైదరాబాద్, రంగారెడ్డి మినహా మిగిలిన తెలంగాణ వెనకబడి ఉంది. సీమాంధ్ర వినియోగం రాష్ట్ర సగటు వినియోగం కంటే ఎక్కువ.


నైజాం ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేయకముందే.. హైదరాబాద్ విద్యుత్‌రంగంలో స్వయం సమృద్ధిని సాధించింది. స్వాతంత్య్రానికి ముందే హైదరాబాద్‌లో హుస్సేన్‌సాగర్ థర్మల్ విద్యుత్కేంద్రం ఉంది. హైదరాబాద్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసే ముందే.. నిజాంసాగర్ జల విద్యుదుత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు.


దానికి కారణం.. ప్రైవేటు కంపెనీలతో లాలూచీ. 2000లోనే రంగారెడ్డి జిల్లా శంకరపల్లిలో 2000 మెగావాట్ల గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టుకు భూసేకరణ చేశారు. గ్యాస్ లేదని ఆపేశారు. కానీ 2003లో నాలుగు ప్రైవేటు కంపెనీలకు గ్యాస్ ఇచ్చేశారు. తెలంగాణ ఉద్యమం రావడంతో 2010లో కరీంనగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. గ్యాస్ కేటాయిస్తే ప్రాజెక్టులు కడతామంటూ కేంద్రానికి లేఖలు రాసి చేతులు దులుపుకొన్నారు. ఇదంతా కుట్రలో భాగమే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి