30, ఆగస్టు 2013, శుక్రవారం

భంగపడిన ఆంధ్ర నేతలు


డెబ్భై ఏళ్లక్షికితం ప్రస్తుత చెన్నై.. నాటి మద్రాస్ నగరం ఉద్రిక్త సందర్భాలను చవి చూసింది. తమ భవిష్యత్ తెలుగు రాష్ట్రానికి మద్రాస్ రాజధానిగా ఉండాలని పట్టుబట్టారు నాటి ఆంధ్రా నాయకులు. 1912 నాటికే తెలుగు ప్రజలతోపాటు, తెలుగు వార్తాపవూతికలు ద్రవిడవాదంపై ఫిర్యాదులు మొదలు పెట్టాయి. ద్రవిడుల పురోగతి..

తెలుగువారిని మసకబార్చుతున్నదని, దీన్ని సరి చేయాలంటే తెలుగు మాట్లాడేవారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలని వాదన తీసుకువచ్చారు. దానిని దేశానికి స్వాతంత్య్రం వచ్చేంత వరకూ సజీవంగా ప్రచారంలో ఉంచారు. నిజానికి మొదట్లో మద్రాస్ నగరం స్థాయి కేంద్ర అంశంగా లేదు. 1940 నాటికి పరిస్థితి మారింది. 1941 నవంబర్‌లో ఆంధ్రా నాయకులు మద్రాస్‌ను వివాదం చేశారు. అప్పటి కాంగ్రెస్ Madras_1554662gనాయకుడు, ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు విశాఖపట్నంలో జరిగిన ఒక సమావేశంలో మాట్లాడుతూ మద్రాస్ రాష్ట్ర కేబినెట్ కొద్ది నెలల క్రితం ఆంధ్రా రాష్ట్ర ఏర్పాటు అంశంపై చర్చించిందని పేర్కొన్నారు. ఆ కేబినెట్ సమావేశానికి అప్పటి మద్రాస్ గవర్నర్ లార్డ్ ఎర్సిన్‌ను కూడా ఆహ్వానించారు. ఆయన ఆంధ్రా, మద్రాస్ రాష్ట్రాలు రెండూ నగరాన్ని పంచుకోవచ్చని చెప్పారని, దీనికి తమిళ మంత్రులు కూడా సమ్మతించారని ప్రకాశం పంతులు ఆ సమావేశంలో చెప్పారు. కానీ.. కొన్ని ‘దుష్ట శక్తులు’ ఎర్సిన్ మనసును విషతుల్యం చేశారని, ఫలితంగానే ఆయన తన ప్రతిపాదనకు వ్యతిరేకంగా నాటి ప్రభుత్వ కార్యదర్శికి లేఖ రాశారని పేర్కొన్నారు. అయితే ఆ దుష్టశక్తుపూవరన్నది ప్రకాశం వెల్లడించలేదు. మద్రాస్ నగరాన్ని విభజిస్తే నగరవీధుల్లో రక్తం పారుతుందని బ్రిటిష్ ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశారని ఆయన విశాఖ సమావేశంలో చెప్పారు. 1947లో మద్రాస్ ప్రావిన్స్ ప్రధాని ఓపీ రామస్వామి రెడ్డియార్ చేసిన వ్యాఖ్యలు మరింత సంక్లిష్టతకు దారి తీశాయి. తెలుగువారు మద్రాస్‌ను కోరుకుంటే తమిళులు నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలను ప్రతిగా కోరుకుంటారని రుల సమావేశంలో రెడ్డియార్ చెప్పారు.

దీంతో ముందు నగరంపై తేల్చాలని తెలుగు నాయకులు పట్టుబట్టారు. దీనిపై తమిళ రచయితలు, నేతలు తీవ్రంగా మండిపడ్డారు. నగరంతో తెలుగువారికంటే తమిళులకే ఎక్కువ అనుబంధం ఉందని ప్రముఖ రచయిత కల్కి కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. జనాభా సంఖ్యలను కూడా ప్రస్తావించిన రాజాజీ మద్రాస్‌పై హక్కు కోరితే అంగీకరించే ప్రసక్తి లేదని తేల్చి చెప్పారు. చివరికి 1949లో ఏర్పడిన ముగ్గురు సభ్యుల కమిటీ మద్రాస్ నగరం లేకుండానే ఆంధ్ర రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. జవహర్‌లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్, పట్టాభి సీతారామయ్య సభ్యులుగా ఉన్న ఈ కమిటీజే జేవీపీ కమిటీగా ప్రసిద్ధి పొందింది. కానీ.. ఆ ప్రకటన వచ్చిన తర్వాత ఆంధ్ర నేతల పోరు మరింత పెరిగింది. కమిటీలో సభ్యుడిగా ఉన్న పట్టాభి సీతారామయ్య దీనిపై మాట మార్చుతూ.. జేవీపీ కమిటీ నివేదికలో మద్రాస్ ఆంధ్ర ప్రాంతంలో ఉండదని పేర్కొన్నదని అదే సందర్భంలో అది తమిళ ప్రాంతంలో ఉంటుందా? అన్న విషయంలోనూ నిర్దిష్టంగా చెప్పలేదని మెలిక పెట్టారు. నగరాన్ని కేంద్ర పాలిత ప్రాంతం చేయాలని పట్టాభి డిమాండ్ చేశారు. 1952లో పొట్టి శ్రీరాములు మద్రాస్ నగరంతో కూడిన ఆంధ్ర రాష్ట్రం కోసం నిరాహార దీక్ష మొదలు పెట్టారు. ఆయన దీక్షతో కేంద్రంగానీ, మద్రాస్ ప్రభుత్వంగానీ వైఖరిని మార్చుకోలేదు.

51 రోజుల దీక్ష తర్వాత శ్రీరాములు చనిపోయారు. దీంతో మద్రాస్ నగరంలోని ఆంధ్ర ప్రజలు నివసించే ప్రాంతాల్లో పెద్ద ఎత్తున హింస చోటు చేసుకుంది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలని, ఈ అంశాన్ని త్వరలోనే పరిష్కరిస్తామని నెహ్రూ చెప్పారు. దీనికి కొనసాగింపుగా 1953లో ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు విషయంలో జస్టిస్ వాంఛూ కమిటీని నియమించింది. కొత్త రెండు రాష్ట్రాల సరిహద్దులను గుర్తించిన వాంఛూ కమిటీ.. మద్రాస్‌ను మూడు లేదా ఐదేళ్లు ఉమ్మడి రాజధానిగా కొనసాగించాలని సూచించింది. అది సాధ్యం కాని పక్షంలో ఆంధ్రకు కొత్త రాజధాని నిర్మించుకునే వరకూ గుంటూరు లేదా విశాఖపట్నంలో తాత్కాలిక రాజధాని ఏర్పాటు చేసుకోవచ్చన సలహా ఇచ్చింది. మద్రాస్‌ను తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఉంచేందుకు రాజాజీ, ఇతర తమిళ నేతలు ఒప్పుకోలేదు.

దీంతో 1953 మార్చిలో మద్రాస్ తాత్కాలిక ఉమ్మడి రాజధానిగా ఉండబోవడం లేదని నెహ్రూ ప్రకటించారు. ఫలితంగా 1953 అక్టోబర్‌లో ఆంధ్ర రాష్ట్రం కర్నూలు రాజధానిగా ఏర్పాటైంది. ఆ తర్వాత అక్కడ ఇబ్బందులు భరింపశక్యం కావడంతో ఆంధ్రా నాయకులు హైదరాబాద్‌పై కన్నేశారు. అప్పటికి మహారాష్ట్ర, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను కలుపుకొని హైదరాబాద్ స్టేట్ ఉంది. దీన్ని విచ్ఛిన్నం చేస్తేగానీ తమకు హైదరాబాద్ దక్కదని భావించారు. ఇందుకోసం కర్ణాటకను రెచ్చగొట్టాలని తీర్మానించుకున్నారు. అప్పటి ఆంధ్రా కాంగ్రెస్ నాయకుడు అయ్యదేవర కాళేశ్వరరావు.. హైదరాబాద్ స్టేట్ విచ్ఛిన్నం కోసం కర్ణాటకతో కలిసి గట్టిగా పని చేయాలని ఉద్భోదించారు. ఆ ఎత్తులు పని చేశాయి. రెండేళ్ల తర్వాత హైదరాబాద్ రాజధానిగా ఆంధ్రవూపదేశ్ అవతరించింది. మద్రాస్ నగరం పూర్తిగా తమిళులకే మిగిలింది. -సెంట్రల్ డెస్క్

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి