-తుంగభవూదపై మరో రిజర్వాయర్.. సీమ నేతల కొత్త ప్రతిపాదన
- ఒత్తిడి చేసి సర్వేకు అనుమతి.. వరద జలాల పాలమూరుకు, నికర జలాల గండ్రేవులకు లింకు
-ప్రాంతీయ విద్వేషాల సృష్టికి టీజీ, బైరెడ్డి యత్నం..
-ఈ రిజర్వాయిర్ నిర్మిస్తే శ్రీశైలంకు చుక్క నీరు రాదు
-దైవాధీనంగా మారనున్న సాగర్ భవితవ్యం
హైదరాబాద్, ఆగస్టు 21(టీ మీడియా):రాష్ట్ర విభజన ఖాయమైంది. ఆ లోపలే ఉన్నది సర్దుకునే యత్నాలు మొదలయ్యాయి. ఇంతకాలం సమైక్య రాష్ట్రం పేరిట కమ్మని కబుర్లు చెప్పి తెలంగాణ నీటిని యధేచ్ఛగా మళ్లించుకున్న సీమాంధ్ర నాయకులు ఇపుడు విభజన నేపథ్యంలో ‘ముందుచూపు’ ప్రదర్శిస్తున్నారు.
జలదాహం తీరని సీమ నాయకుల కన్ను ఈసారి తుంగభద్ర నీటిపై పడింది. తుంగభద్ర నది నుంచి శ్రీశైలం మార్గంలో కర్నూలు జిల్లాలో తుంగభద్ర బ్యారేజీ(సుంకేశుల) ఎగువన రిజర్వాయిర్ నిర్మించే ప్రతిపాదన తెర మీదికి తెచ్చారు. తక్షణమే ఓకే చెప్పాలంటూ నీటిపారుదల శాఖపై ఒత్తిళ్లు పెంచారు. ఇది అమలు జరిగితే శ్రీశైలంకు తుంగభవూదనుంచి చుక్కనీరు కూడా రాదు. కాగా తుంగభద్ర నదిపై మరోచోట ఇప్పటికే ప్రతిపాదించిన రిజర్వాయిర్ నిర్మాణానికి గతంలో నీటిపారుదల శాఖ సమర్పించిన నివేదికపైనే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఇపుడు అదనంగా మరో చోట రిజర్వాయిర్ నిర్మాణానికి సర్వేకు అనుమతి ఇవ్వాలంటూ సీమాంధ్ర నేతలు నీటిపారుదల శాఖపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు.
అంతటితో ఆగకుండా తెలంగాణ విశ్రాంత ఇంజనీర్లు, ప్రజాసంఘాల సుదీర్ఘ పోరాటాల అనంతరం ఇటీవలే సర్వేకు అనుమతి ఇచ్చిన పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతల పథకానికి, దీనికి లింకు పెడుతూ ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలను ఎగజిమ్ముతున్నారు. నిజానికి పాలమూరు- రంగాడ్డి పథకం వరద జలాలతో చేప దీనివల్ల ఎవరి నికర జలాలకు వచ్చే ఇబ్బంది లేదు. ఎవరి వాటా వారికి యథావిధిగా వస్తుంది. కానీ సీమ నాయకులు ప్రతిపాదిస్తున్న గండ్రేవులు పథకం నికర జలాలతో ముడి పడింది. చుక్కనీరు వాడినా ఇతరులకు ఆ మేర నష్టమే. ఎంతనీరు తరలిపోతే అంతమేర ఇతరుల ఆయకట్టు ఎండిపోవాల్సిందే. అయినా వరద జలాలు, మిగులు జలాల మతలబులు ప్రజలకు వెల్లడించకుండా సీమ నాయకులు ప్రాంతీయ విద్వేషాలు రాజేస్తున్నారు.
తుంగభద్ర నది మార్గంలో రాజోలిబండ మళ్లింపు పథకం(ఆర్టీఎస్), తుంగభద్ర బ్యారేజీ (సుంకేశుల) మధ్య కర్నూలు జిల్లా గండ్రేవుల అనే గ్రామం వద్ద 15-20 టీఎంసీల నీటిని నిల్వ చేసుకొనేలా సుమారు రూ.600 కోట్లతో ఓ రిజర్వాయిర్‌ను నిర్మించాలంటూ సీమాంధ్ర నేతల నుంచి మూడు నెలల కిందట నీటిపారుదల శాఖకు ఓ ప్రతిపాదన వచ్చింది. ఈ విషయాన్ని జులై 9న ‘ఆగని జల దోపిడీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది.
ఈ రిజర్వాయిర్ నిర్మాణం ద్వారా కర్నూలు-కడప(కేసీ) కాలువకు ట్రిబ్యూనల్ కేటాయింపుల కంటే అధికంగా రాయలసీమకు నీటిని తరలించుకుపోయేందుకు ఎత్తు వేస్తున్నారు. ఎలాంటి జల కేటాయింపులు లేకుండా ఇలా రిజర్వాయిర్ నిర్మించడం కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశాలకు విరుద్ధం. వాస్తవానికి తుంగభద్ర బ్యారేజీ(సుంకేశుల)కి 11 కిలోమీటర్లు ఎగువన రంగాపూర్ అనే గ్రామం వద్ద రిజర్వాయిర్ నిర్మాణానికి గతంలోనే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వచ్చాయి నీటిపారుదల శాఖ సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్) కూడా సమర్పించింది. అయితే, దీనిపై ప్రభుత్వం ఇందులో జలవివాదాల అంశం ఉండడం వల్ల ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇటీవల తెలంగాణలోని మూడు జిల్లాల్లో సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీరు అందజేసేందుకు ఉద్దేశించిన పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతల పథకం సర్వేకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8న ఉత్తర్వులు జారీ చేసింది. దీనితో గంగ సీమ నాయకులు ఈ సర్వేకు అనుమతిని సాకుగా చూపుతూ గండ్రేవుల వద్ద బ్యారేజీ సర్వేకు అనుమతివ్వాలంటూ నీటిపారుదల శాఖపై ఒత్తిడి పెంచడంతో చేసేదీ లేక సాధ్యాసాధ్యాలపై పరిశీలన చేయాలంటూ కర్నూలు జిల్లా చీఫ్ ఇంజనీర్‌ను నీటిపారుదల శాఖ ఆదేశించింది.
దిగువకు చుక్క నీరు కూడా రానట్లే!
కర్ణాటక రాష్ట్రంలో ఉన్న తుంగభద్ర డ్యాం తర్వాత తుంగభవూదపై మన రాష్ట్రంలో మహబూబ్‌నగర్, కర్నూలు జిల్లాల సరిహద్దులో ఆర్డీఎస్, దాని దిగువన తుంగభద్ర బ్యారేజీ(సుంకేశుల) ఉన్నాయి. ఈ బ్యారేజీ వద్ద తుంగభవూదకు కుడి వైపు నుంచి కర్నూలు-కడప కాలువ(కేసీ కెనాల్)కు నీరు వెళ్తోంది. ఈ కాలువ ద్వారా రాయలసీమ జిల్లాల్లో సుమారు 90 వేల ఎకరాలకుపైగా సాగునీరు అందుతోంది. ఈ బ్యారేజీ వద్ద కేవలం 2.5 టీఎంసీల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం ఉంది. తుంగభద్ర బ్యారేజీ దిగువన ఈ నదిపై ఎలాంటి కట్టడాలు లేవు. ఇక్కడి నుంచి నీరు నేరుగా శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తుంది. శ్రీశైలం ప్రాజెక్టు నిండడంలో తుంగభవూదకు వచ్చే వరద నీటిదే కీలక పాత్ర. శ్రీశైలంలో నీటిమట్టం 845 అడుగులు దాటితేగానీ నాగార్జున సాగర్‌కు నీటి విడుదల జరగదు. ఈ నేపథ్యంలో తుంగభద్ర బ్యారేజీ ఎగువన గండ్రేవుల వద్ద రిజర్వాయిర్‌లో నీటిని నిల్వ చేసి కేసీ కెనాల్ ద్వారా సీమకు తరలిస్తే దిగువన ఉన్న శ్రీశైలంకు చుక్కనీరు కూడా రాదని నీటిపారుదల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనితో సాగర్ ఆయకట్టు ఉన్న కోస్తాంధ్ర తెలంగాణ జిల్లాలకు గడ్డకాలమేనంటున్నారు.
పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతలతో లింకు!
వరద జలాలపై ఆధారపడిన పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతల పథకానికి, కేటాయింపులను అధిగమించి అదనంగా నికర జలాలను తరలించుకుపోయేందుకు ఉద్దేశించిన గండ్రేవుల రిజర్వాయిర్‌కు లింకు పెడుతూ ప్రజల్లో ప్రాంతీయ విద్వేషాలు రేకెత్తించేందుకు రాయలసీమ నేతలు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వరద మిగుల జలాలు, ట్రిబ్యూనల్ కేటాయింపుల వంటి అంశాలు పరిగణించకుండా తెలంగాణకు పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతలకు జీవో ఇచ్చి, సీమకు గండ్రేవుల రిజర్వాయిర్ నిర్మాణం పట్ల నీటిపారుదల శాఖ తీవ్ర వివక్ష ప్రదర్శిస్తోందంటూ చిన్నతరహా నీటిపారుదల శాఖ మంత్రి టీజీ వెంక ఇటీవల బాహాటంగానే ఆరోపించి ప్రాంతీయ విద్వేషాలను రేకెత్తించేందుకు ప్రయత్నించారు. మరోవైపు, పాలమూరు-రంగాడ్డి ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహిస్తామని రాయలసీమ పరిరక్షణ సమితి నేత బైరెడ్డి రాజశేఖర రెడ్డి ప్రకటించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి