30, ఆగస్టు 2013, శుక్రవారం

ఆదాయం యథాతథం


8/30/2013 1:36:54 AM
-ఎక్సైజ్ ఆదాయం భారీగా పెరిగింది
-రిజిస్ట్రేషన్, రవాణా మినహా మిగిలినవన్నీ ఓకే
- రిజిస్ట్రేషన్ మీద ఆషాఢం, విలువల పెంపు ప్రభావమే ఎక్కువ
- నష్టజాతక సీమాంధ్ర ఆర్టీసీ నడవకపోతేనే లాభం
- ఆదుకున్న తెలంగాణ ప్రాంతం
- ఎనీవేర్ రిజిస్ట్రేషన్ యోచనకు మోకాలడ్డుతున్న సీమాంధ్ర అధికారులు

హైదరాబాద్, ఆగస్టు 29(టీ మీడియా): సీమాంవూధలో సమైక్యాంధ్ర ఆందోళన నెలరోజులకు చేరుతున్నా cash-02tif-alfaరాష్ట్ర ఆదాయం మీద ఆ ప్రభావం దాదాపు శూన్యం. అన్ని కీలక ఆదాయ వనరులు యథాతథ రాబడులను నమోదు చేశాయి. ఆందోళనలు...ఉద్యమాల ప్రభావం రాష్ట్ర ఖజానాపై లేదని ధృవీకరించాయి. ఖజానాకు కీలక ఆదాయ వనరులైన వాణిజ్య పన్నులు, ఎక్సైజ్ శాఖలనుంచి ఆదాయ రాబడి ఆగస్టు మాసంలో ఏ మాత్రం తగ్గకపోగా ఎక్సైజ్ ఆదాయం లక్ష్యానికి మించి పెరుగుదల నమోదయింది. ఇక మరో కీలక వనరు వాణిజ్య పన్నుల వాటా 90 శాతానికి మించింది. అయితే రిజిస్ట్రేషన్ శాఖపై ఆదాయంలో కొంత కోత పడినట్లుగా కనిపిస్తోంది. దీనికి కూడా ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికలు, ఆషాఢ మాసం, మార్కెట్ విలువల పెంపు భారం పడిందని భావిస్తున్నారు. మరో ప్రధాన ఆదాయ వనరు రవాణా శాఖపై కొంత మేర సమ్మె ప్రభావం పడింది. రూ. 100కోట్ల ఆదాయం ఆర్టీసీ కోల్పోయిందని, అయితే సీమాంవూధలో ఆపరేటింగ్ వ్యయం నష్టాల్లో ఉందని...

ఆర్టీసి బస్సులు నిలిచిపోవడంతో వచ్చే నష్టం ఏమీ లేదని..పైగా ఆపరేటింగ్ ఖర్చులు, నష్టాలు మిగులుతున్నాయని ఆర్టీసీ ఉన్నతాధికారులు అంటున్నారు. అయితే ప్రధానంగా భారీ క్షీణత నమోదైన రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయంపై అందరి దృష్టి పడుతోంది. ఈ ఆదాయం తగ్గుదలకు సమ్మెతో సంబంధం లేదని...అనేక ప్రతికూల ప్రభావాలు కారణమయ్యాయని రిజిస్ట్రేషన్ శాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో ప్రధానంగా ఏప్రిల్ 1నుంచి మార్కెట్ విలువల పెంపుతో భూములు, స్థిరాస్థుల రిజిస్ట్రేషన్ చార్జీలు పెరిగిన సంగతి తెలిసిందే. మార్కెట్ విలువల పెంపుపై ప్రభుత్వం రెండు నెలల ముందుగానే పబ్లిక్ డొమైన్‌లో పెట్టి ప్రజల అభివూపాయాలను స్వీకరించిన సంగతి విదితమే. దీంతో విలువల పెంపు భారం భయంతో ప్రజలు మార్చిలోనే తమ ఆస్థులు, భూముల రిజిస్ట్రేషన్లు ఆగమేఘాలమీద పూర్తి చేసుకున్నారు. దీంతో సహజంగానే ఏప్రిల్‌నుంచి ఆదాయం మందగించింది. దీనికితోడు స్థానిక ఎన్నికలు, ఆషాడ మాసం కారణంగా లక్ష్యంలో 29.11 శాతం పేలవమైన ఫలితాలను సాధించింది. అయితే ఈ ఏడాది ఇప్పటివరకు నిర్దేశించుకున్న లక్ష్యం రూ. 1527కోట్ల లక్ష్యానికిగానూ ఆగష్టు మాసాంతానికి 72.93 శాతంతో రూ. 1114 కోట్లకు చేరడం విశేషం.

ఈ నెలలో రిజిస్ట్రేషన్ల శాఖ రూ. 601.35 కోట్ల లక్ష్యాన్ని నిర్దేశించుకోగా అందులో 29.11 శాతం ఆదాయాన్ని సాధించి రూ. 9కోట్ల 54 లక్షల ఆదాయాన్ని మాత్రమే చేరుకుంది. అయితే ఈ ఆదాయమంతా కేవలం తెలంగాణ జిల్లాలనుంచి వచ్చిందే కావడం గమనార్హం. ఆగస్టు 1నుంచే సీమాంధ్ర జిల్లాల్లో రిజిస్ట్రేషన్ సేవలపై సమ్మె ప్రభావం పడగా...రాష్ట్రం మొత్తంమీద స్థానిక సంస్థల ఎన్నికల ప్రభావం భారీగా పడిందని రిజిస్ట్రేషన్ శాఖలోని ఉన్నతాధికారి ఒకరు అభివూపాయపడ్డారు. ఈ ఆర్జనలో అత్యధికంగా కరీంనగర్, నిజామాబాద్ డివిజన్ల నుంచి లభించింది. అయితే ఆగస్టు మాసం ఆరంభంనుంచే సీమాంవూధలో రిజిస్ట్రేషన్ సేవలకు ఆటంకాలు ఏర్పడటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించింది. మరోవైపు సీమాంధ్ర అధికారులు రాష్ట్రవ్యాప్త ఆన్‌లైన్ సేవలను నిలిపివేయాలని సీఎంను కలిసి విజ్ఞప్తి చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే 2010-11 వార్షిక ఏడాదిలో సీమాంవూధలోని 13 జిల్లాలనుంచి రూ. 2354.0కోట్లు ఆదాయంరాగా తెలంగాణ 10 జిల్లానుంచి రూ.20.79కోట్లు సమకూరింది. 2011-12లో సీమాంవూధనుంచి రూ. 20.40కోట్లు రాగాతెలంగాణ నుంచి రూ. 2620.72కోట్లు, 2012-13లో సీమాంవూధనుంచి రూ. 2917కోట్లుకాగా తెలంగాణనుంచి రూ. 3667.31 కోట్ల ఆదాయం లభించింది.


సెప్టెంబర్‌లో రాష్ట్రవ్యాప్తంగా ఎనీవేర్ రిజిస్ట్రేషన్ సేవలు...
తాజాగా ఇలాంటి ఆటంకాలకు చెక్ పెట్టేందుకు రిజిస్ట్రేషన్ల శాఖ 23 జిల్లాల్లో అమలులో ఉన్న ఎనీవేర్ రిజిస్ట్రేషన్ విధానాన్ని విస్తరించి రాష్ట్రవ్యాప్తం చేయాలని నిర్ణయించింది. తాజాగా ట్రయల్ రన్ చేసిన అధికారులు ఈ విధానం ఆశించిన రీతిలో సఫలం కావడంతో ఇక అమలులోకి తెచ్చే చర్యలకు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ విధానాన్ని వీలైతే సెప్టెంబర్ మొదటి వారంలో అందుబాటులోకి తెచ్చి ప్రజలకు ఆటంకాలు లేకుండా చూడాలని రిజిస్ట్రేషన్ల శాఖ యోచిస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి