2, ఆగస్టు 2013, శుక్రవారం

తెలంగాణ ప్రాజెక్టులు

తెలంగాణ ప్రాజెక్టులు-సీమాంధ్రకు నీళ్ళు

తెలంగాణ ప్రాజెక్టులు-సీమాంధ్రకు నీళ్ళు
తెలంగాణ వస్తే మాకు నీళ్లు రావు అని అమాత్యులు జె.సి. దివాకర్‌డ్డి సెలవిచ్చారు. మీ కామెంట్?
-గొట్టిపర్తి యాదగిరి, ఆలేరు, నల్లగొండ జిల్లా


ఇది పూర్తిగా నిరాధారం- అసత్యం-పైన ప్రాజెక్టులు కట్టితే కిందికి నీళ్లు రాకపోతే, మనపైన (ఆంధ్ర రాష్ట్రంపైన) మహారాష్ట్ర, కర్ణాటకలున్నాయి. మరి కృష్ణా, గోదావరి నదుల్లో మన రాష్ట్రంలోకి ప్రవహించకుండా ఉండాలి. అలా జరుగుతోందా? ఇది కేవలం ‘తెలంగాణ’ అవతరణాన్ని అడ్డుకోవడానికి, సీమాంవూధలోని సామాన్య ప్రజానీకాన్ని భయవూభాంతులకు గురిచేసే ప్రచారం మాత్రమే- పుట్టిస్తున్న పుకార్లు మాత్రమే. అంతర్‌రాష్ట్ర నదులపైన ఒడంబడికలుంటాయి. అవగాహన పత్రాలుంటాయిటిబ్యునల్ ఆదేశాలుంటాయి. కట్టుదాటి ప్రవర్తిస్తే జోక్యం చేసుకోవడానికి కోర్టులుంటాయి. ఇష్టారాజ్యంగా ప్రవర్తించడానికి ఇదేమన్న నియంతృత్వ పరిపాలనా? మన రాష్ట్ర విషయానికి వస్తే తెలంగాణ, కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు మన రాష్ట్రంలో ఉన్నాయి.

మూడు ప్రాంతాలకు సంబంధించిన నది కృష్ణానది. కోస్తాంధ్ర, తెలంగాణకు సంబంధించి గోదావరిపైన ప్రధానమైన ప్రాజెక్టులు జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, ప్రకాశం బ్యారేజీ. ఈ నాలుగు అమలులో ఉన్నవి. కృష్ణానదికి ముఖ్యమైన ఉపనది తుంగభద్ర పైన తుంగభవూద ప్రాజెక్టు (కర్ణాటకలో ఉన్నది)- దిగువన రాజోలిబండ ఆనకట్ట (ఎడమ గట్టు కర్ణాటకలో కుడిగట్టు), ఆంధ్రవూపదేశ్‌లో దాని కింద సుంకేసుల ఆనకట్ట (ఇప్పుడు బ్యారేజీ) ఉన్నాయి. గోదావరి విషయానికి వస్తే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు, చిట్ట చివరన ధనళేశ్వరం (సర్ ఆర్థర్ కాటన్) బ్యారేజీ ఉన్నాయి. ఇటీవలే నాగార్జునసాగర్ జలాశయం నీటినుపయోగించుకుని కొంతమేరకు నీటినందిస్తూ ఇంకా నిర్మాణం పూర్తి కాని ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టు ఉంది.

ఇది ఎత్తిపోతలుమగావిటీ కాలువ (బాగా వరదలు వచ్చినప్పుడు) ప్రాజెక్టు-వీటి కి అదనంగా జూరాలపైన ఆధారపడ్డ భీమా, నెట్టంపాడు, శ్రీశైలంపైన ఆధారపడ్డ కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బీసీ, వెలిగొండ, ఎస్‌ఆర్‌బీసీ, హంద్రీనీవా, గాలేరు, నగరి, తెలుగు గంగ ప్రాజెక్టులు, వీటి అనుబంధ రిజర్వాయర్ కాలువ ప్రాజెక్టులు. అలాగే గోదావరి నదికి సంబంధించిన శ్రీరాంసాగర్ ద్వితీయ దశ, వరదకాలువ, ప్రాణహిత చేవేళ్ల, ఎల్లంపల్లి, దేవాదుల, రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ఎత్తిపోతల పథకాలు, కంతనపల్లి, దుమ్ముగూడెం-నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. పోలవరం నిర్మాణంలో ఉన్నా, సుప్రీంకోర్టు అంతిమ తీర్పుపైన దాని భవిష్యత్తు ఆధారపడి ఉంది. పోలవరం రాదేమో అని చేపట్టిన పుష్కరం, తాటిపూడి, వెంకటనగరం పంపింగ్ స్కీం లు పాక్షికంగా అమల్లో ఉన్నాయి.

ఇక గమనించవలసిన విషయమేమంటే అంతర్‌రాష్ట్ర నదులే కాదు, అంతర్ దేశాల నదులపైన ఆయా దేశాల మధ్య జరుగుతున్న ఒప్పందాల మేరకు వాటి నిర్వహణ ఆధారపడి ఉంటుంది. ఒడంబడికలను ఉల్లంఘించి పై దేశాలు కాని, రాష్ట్రాలు కాని తమ ఇష్టం వచ్చినట్లు జలాశయాలు నింపుకుంటే కింది దేశాలకు- రాష్ట్రాలకు నీళ్లు రావు. కనుకనే అలాంటి పరిస్థితి ఉత్పన్నం కాకుండా అంతర్ దేశ, రాష్ట్ర నదుల నిర్వహణకు చట్టబద్ధమైన కంట్రోల్ బోర్డులు ఉంటాయి. ఉదాహరణకు మనదేశంలో సట్లెజ్, బియా స్, రావి నదుల నిర్వహణ కోసం భాక్రా-బియాస్ కంట్రోల్ బోర్డు ఏర్పాటు జరిగింది. ఏదైనా ఒక ప్రాజెక్టు నుంచి రెండు లేక అంతకుమించి రాష్ట్రాలు లబ్ధిపొందుతూ ఉంటే విధిగా అన్ని రాష్ట్రాల ప్రతినిధులు సభ్యులుగా, కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి ఆధ్వర్యంలో బోర్డును ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఆయా రాష్ట్రాల కేటాయింపుల ఆధారంగా ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయడం, సక్రమంగా ఆ నీరు ఆ రాష్ట్రాలకు చేరేట్టు చూసే బాధ్యత ఆ కంట్రోల్ బోర్డుది.

ఉదాహరణకు తుంగభద్ర ప్రాజెక్టు ద్వారా అటు కర్ణాటకకు, ఇటు ఆంధ్రవూపదేశ్‌కు నీరు సరఫరా అవుతుంది. తుంగభద్ర కంట్రోల్ బోర్డు నీటి బట్వా డా బాధ్యతలను చేపట్టింది. ఈ బోర్డును కేంద్ర వూపభు త్వం ఏర్పాటు చేసింది. కేంద్ర జలసంఘం ఛీఫ్ ఇంజనీ ర్ అధ్యక్షులుగా, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్ ప్రతినిధులు సభ్యులుగా ఈ బోర్డు పనిచేస్తోంది.

పంజాబ్ రీ ఆర్గనైజేషన్ యాక్ట్ 1966 లోని సెక్షన్ 79 అనుసరించి ఏర్పాటైన భాక్రా, బియాస్ మేనేజ్‌మెంట్ బోర్డులో కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి అధ్యక్షులుగా, పంజాబ్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, చండీగఢ్ కేంద్ర పాలిత ప్రాంతం, ఢిల్లీ ప్రతినిధులు సభ్యులుగా వ్యవహరిస్తారు. సట్లెజ్, రవి, బియాస్ నదుల వినియోగం తోపాటు భాక్రానంగల్, బియాస్ ప్రాజెక్టులద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్తు బట్వాడా విషయాలపై బోర్డు చర్చించి నిర్ణయాలు చేస్తుంది. ఇదే విధంగా మనదేశంలో అనేక కంట్రోల్ బోర్డులు, అథారిటీలు అంతర్‌రాష్ట్ర నదీ జలాల బట్వాడా అంశాల అమలు విషయమై ఏర్పాటయ్యాయి. నదీజలాలపై నెలకొనే తగాదాల పరిష్కార నిమిత్తం రాజ్యాంగంలోని 262 అధికరణం ప్రకా రం కేంద్రం జోక్యం చేసుకుని, అవసరమైన పక్షంలో ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయడంలో దోహదపడుతుంది. కృష్ణానది జలాల కేటాయింపుల నిమిత్తం లోగడ బచావత్ ట్రిబ్యునల్ ఏర్పడి తమ ఆదేశాలను వెలువరించిన విష యం పాఠకులకు విదితమే- ఇప్పుడు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏర్పా టు అయింది. అంతిమ తీర్పు ఇంకా వెలువడవలసి ఉంది.

అదే విధంగా గోదావరి జలాల వినియోగ విషయంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రవూపదేశ్, మధ్యవూపదేశ్, (ఇప్పుడు ఛత్తీస్‌గఢ్), ఒరిస్సా రాష్ట్రాలు పరస్పరం చేసుకున్న ఒడంబడికల ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ తమ అవార్డును ప్రకటించింది. ట్రిబ్యునల్ అవార్డు అంటే సుప్రీంకోర్టు డిక్రీతో సమానం. దానిపైన ఎలాంటి అప్పీలు ఉండదు. అయితే ఏరాష్ట్రమైనా ట్రిబ్యునల్ అవార్డు ప్రకారంగా నడుచుకోకుండా, ఆదేశాలను ఉల్లంఘిస్తే సుప్రీంకోర్టు తలుపు తట్టవచ్చు. ఉదాహరణకు అలమట్టి ఎత్తు విషయంలో మన రాష్ట్రం కర్ణాటక పై, మిగులు జలాల ఆధారంగా మనం నిర్మిస్తున్న ప్రాజెక్టులపైన కర్ణాటక సుప్రీంకోర్టు తలుపు తట్టడం, మధ్యంతర ఉత్తర్వులు వెలువరించి, ఈ సమస్యను తేల్చవలసిన బాధ్యతను బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్‌పైన సుప్రీంకోర్టు పెట్టడం జరిగింది.

ఇదేవిధంగా, మహారాష్ట్ర నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు ఇంకా ఇతర కట్టడాలు శ్రీరాంసాగర్‌పై దుష్ప్రభావం చూపెట్టాయని మనం సుప్రీంకోర్టుకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఆ కేసుపైన అంతిమ నిర్ణయం ఇంకా వెలువడలేదు. ఇంతకూ చెప్పొచ్చేదేమంటే అంతర్ రాష్ట్ర నదుల నీటి కేటాయింపులు, కేటాయింపుల ప్రకారం అమలు జరిగేట్టు చూడటం వగైరా విషయాల బాధ్యతలను కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఏర్పాటయ్యే సంస్థలు నిర్వహిస్తాయి. ఉల్లంఘించిన సందర్భాల్లోనే కోర్టులు జోక్యం చేసుకుంటాయి.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయితే శ్రీశైలం, నాగార్జున్‌సాగర్ రాజోలిబండ కాలువ ప్రాజెక్టుల నిర్వహణకు విధిగా కంట్రోల్ బోర్డు ఏర్పాటు చేయడం జరుగుతుంది. (రాజోలిబండపైన కంట్రోల్‌బోర్డు ఏర్పాటు విషయంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇదివరకే నిర్ణయం తీసుకుంది) ఎందుకంటే ఈ మూడు ప్రాజెక్టుల ద్వారా నీరు ఇటు తెలంగాణకు, అటు సీమాంధ్ర రాష్ట్రాలకు చెందిన ప్రాజెక్టుల కేటాయింపుల ఆధారంగా నీటి బట్వాడా జరుగుతుంది. కేటాయింపులకు మించిగాని ఎక్కువగా గాని ఆయా రాష్ట్రాలకు నీరు బట్వాడా జరుగదు. ఒకవేళ ఉల్లంఘన జరిగితే కోర్టుల జోక్యం తప్పనిసరి అవుతుంది. ఇప్పుడు దేశంలో ఉన్న వ్యవస్థ ప్రకారం ఉమ్మడి ప్రాజెక్టులు కాకుండా కేవలం ఒక రాష్ట్రానికే నీరందిస్తున్న ప్రాజెక్టుపైన అజమాయిషీ కంట్రోల్ బోర్డు అధీనంలో లేదు. కాని అంతర్ రాష్ట్ర నదులపైన వెలసిన ప్రాజెక్టుల విషయంలో ఆయా రాష్ట్రాలు కేవలం తమ అజమాయిషీలో ఉండటం మూలంగా ఒడంబడికలు, ట్రిబ్యునల్ ఆదేశాలు ఉల్లంఘిస్తున్న ఫిర్యాదులు ఎక్కువవుతున్న పరిస్థితులను గమనించి బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ మొత్తం బేసిన్ లోని అన్ని ప్రాజెక్టుల నిర్వహణ బాధ్యత కోసం చట్టబద్ధమైన సంస్థ ఉండాలని ప్రతిపాదించింది.

ట్రిబ్యునల్ ఆదేశాలు అంతిమంగా వెలువడితే కృష్ణానదిలోని అన్ని ప్రాజెక్టులపై అజమాయిషీ కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఏర్పాటయ్యే చట్టబద్ధమైన సంస్థదే అవుతుంది. చాలా సమస్యలకు ఇది పరిష్కారమని నిపుణులు భావిస్తున్నారు. మన రాష్ట్రంలో నీటి విషయంలో ఏర్పడ్డ అనేక అవకతవకలు దోపిడీ, దౌర్జన్యాలు, అన్యాయాలను దృష్టిలో వుంచుకొని ఆంధ్రవూపదేశ్ సమైక్యంగా ఉన్నా, లేక తెలంగాణ ఏర్పడ్డ రాష్ట్రంలోని కృష్ణా, గోదావరి నదులపైన అన్ని ప్రాజెక్టుల నిర్వహణ కోసం చట్టబద్ధమైన సంస్థ ఏర్పాటు చేయాలని శ్రీ కృష్ణ కమిటీ కూడా సిఫార్సు చేసింది. త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటవుతుందని, తెలంగా ణ, సీమాంధ్ర ప్రాజెక్టుల నీటి కేటాయింపుల విషయంలో ఎవరికీ అన్యా యం జరుగకుండా, నియమనిబంధనల ప్రకారం ట్రిబ్యునల్ ఆదేశాలననుసరించి అంతర్ జాతీయ న్యాయసూవూతాలు, జాతీయ జలవిధానం, సహజ న్యాయసూవూతాల ప్రకారం కృష్ణా, గోదావరి జలాలు సక్రమంగా రైతుల పంటపొలాలకు అంది ఆయా రాష్ట్రాలను సుభిక్షం కావిస్తాయని ఆశిద్దాం. అనవసరంగా నీటి విషయంలో అపోహలు సృష్టించవద్దని రాజకీయ నాయకులకు, కుహనా మేధావులకు వినవూమంగా వినతి.

జలవివాదాలు
రాజ్యాంగంలోని 262 అధికరణంలో అంతర్ రాష్ట్ర నదీ జలాల తగాదాల పరిష్కారం కోసం రెండు అంశాలను పొందుపరచటం జరిగింది.

ఒకటి-అంతర్‌రాష్ట్ర నదీ జలాల వినియోగం, పంపకం, నియంవూతణ విషయంలో ఏదైనా తగాదా ఏర్పడితే దాన్ని పరిష్కరించే నిమిత్తం పార్లమెంట్ చట్టం చేయవచ్చు. రెండు- పైన చెప్పిన తగాదాల విషయంలో సుప్రీంకోర్టుగానీ, ఇతర కోర్టులుగానీ జోక్యం చేసుకోరాదని పార్లమెంట్ చట్టం చేయవచ్చు. ఈ 262 అధికరణం కింద పార్లమెంట్ 1956 సంవత్సరంలో అంతర్ రాష్ట్ర జల వివాద చట్టం (ఇంటర్ స్టేట్ వాటర్ డిస్‌ప్యూట్ యాక్ట్) రూపొందించింది.

ఆ చట్టంలోని సెక్షన్ 3 ఏం చెప్పుతోందంటే..
‘పరాయిరాష్ట్రం చేసే లేక చేయపోయే చట్టం వల్ల కానీ అధికారిక చర్యల మూలంగా కానీ అంతర్ రాష్ట్ర జలాల వినియోగం, పంపకం నియంవూతణ విషయంలో తమ అధికారాలను అమలు చేయడంలో ఒక రాష్ట్రం లేక ఆ రాష్ట్ర సంబంధిత సంస్థ విఫలంకావడం కారణంగా కానీ, తమతో ఆ పరా యి రాష్ట్రం చేసుకున్న ఒప్పందం ప్రకారంగా కార్యక్షికమాలు అమలు జరగని సందర్భం కానీ, ఆ పరాయి రాష్ట్రంతో తమ రాష్ట్రానికి నీటి తగదా ఏర్పడిందని లేక ఏర్పడబోతుందని, ఆ తగాదా మూలంగా తమ రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిల్లే అవకాశముందని అనిపించినప్పుడు ఆ రాష్ట్రం నీటి తగాదాని పరిష్కరించేందుకు న్యాయమండలి ఏర్పాటు చేయమని కేంద్రాన్ని కోరవచ్చు.

సెక్షన్ 4లో ఏముందంటే ...
సెక్షన్ 3 కింద ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం నీటి తగాదాని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తేస్తే, చర్చలు, సంప్రదింపుల ద్వారా తగాదా పరిష్కారం సాధ్యం కాదని కేంద్రానికి అనిపిస్తే కేంద్ర ప్రభుత్వం అధికార పత్రం (official gazette)ద్వారా ఆ నీటి తగాదా పరిష్కార నిమిత్తం న్యాయమండ లిటిబ్యునల్)ని ఏర్పాటు చేయవచ్చు. ఇప్పటివరకు మనదేశంలో ఐదు జలవివాద ట్రిబ్యునల్స్ ఏర్పడ్డాయి. అవి కృష్ణా, గోదావరి, నర్మద, కావేరి, రావి- బియాస్ ట్రిబ్యునళ్లు.
-ఆర్ .విద్యాసాగర్ రావు
కేంద్ర జల సంఘం మాజీ ఛీఫ్ ఇంజనీర్ 
 
 
2)తెలంగాణ ప్రాజెక్టులు-పాలకుల వివక్ష ;
 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచే తెలంగాణ ప్రాజెక్టులకు సరైన బడ్జెట్ కేటాయించకుండా, ఇచ్చిన బడ్జెట్‌ను కూడా పూర్తిగా వినియోగించకుండా పాలకులు కుట్రలు చేశారని సీనియర్ ఇంజనీర్లు అనేక సందర్భాల్లో చెప్పుకోవడం విన్నాను. ఇది నిజమా? ఎలాగో వివరిస్తారా? 


              మీరు విన్నది నూటికి నూరుపాళ్లు నిజం. తెలంగాణ ప్రాజెక్టులపై వలసపాలకులకెప్పుడూ సవతి ప్రేమే. పొరుగు రాష్ట్రాలతో లాలూచీపడడం దగ్గర్నుంచి, ట్రిబ్యునల్ ఎదుట తెలంగాణ పక్షాన సమర్థంగా వాదించకపోవడం, సముచిత వాటా నీటిని పొందకపోవడం, పొందిన వాటా వినియోగం కోసం ప్రాజెక్టులను రూపొందించకపోవడం, రూపొందించిన ప్రాజెక్టులకు నిధులు సమకూర్చకపోవడం, విపరీతమైన జాప్యానికి కారణభూతమవడం, ప్రాజె క్టు అమలయ్యాక, అందులో నీటిని సరిగ్గా వినియోగించకపోవడం, వీలైతే తెలంగాణ ప్రాజెక్టుల్లో నిలువ చేసిన నీటిని ఆంధ్ర ప్రాజెక్టులకు తరలించడం, తస్కరించడం.. ఇలాంటి అనేక కుట్రలు చేశారు. చేస్తున్నారు. వీటన్నిటికి ఉదాహరణలను సందర్భోచితంగా పాఠకులకు తెలియజేయడం జరుగుతూనే ఉంది. మీరడిగిన ప్రశ్న బడ్జెట్ కేటాయింపు, విడుదల గురించి. ఆంధ్ర ప్రాజెక్టులతో పోలిస్తే తెలంగాణ ప్రాజెక్టులకు బడ్జెట్ విషయంలో ఏ విధంగా అన్యాయం జరిగిందో వివరించడానికి జూరాల, ఎస్8ఎల్‌బీసీ (ఎలిమినేటి మాధవడ్డి కాలువ), శ్రీరాంసాగర్ ప్రాజెక్టులను చెప్పుకోవచ్చు. జూరాల తెలంగాణకు హైదరాబాద్ రాష్ట్ర విభజన, ఆంధ్రవూపదేశ్ రాష్ట్ర అవతరణ మూలంగా నీటి కేటాయింపుల్లో ఏవిధంగా అన్యాయం జరిగిందో తమ నివేదికలో స్పష్టంగా తెలియజేసిన బచావత్ ట్రిబ్యునల్, మహబూబ్‌నగర్ జిల్లా రైతులకు కొంత మేరకు నష్టపరిహారంగా 17.84 టీఎంసీల కృష్ణా జలాలను ప్రత్యేకమైన పరిస్థితుల్లో కేటాయించడం జరిగింది. ఇలా ట్రిబ్యునల్ కేటాయించడం మహారాష్ట్ర, కర్ణాటకలు జీర్ణించుకోలేక పోయాయి. అది సహజం. అర్థం చేసుకోవచ్చు. కానీ మన రాష్ట్రంలోనే మన ‘పెద్దన్న’గా వ్యవహరించే సీమాంవూధులకు కూడా ఇది సుతారమూ నచ్చలేదు. తమ చేతనైనంతగా ఈ ప్రాజెక్టులకు అడుగడుగునా అడ్డుపడ్డారన్నది ప్రాజెక్టులో పనిచేసిన ఏ ఇంజనీర్ అయినా చెబుతాడు. నేడు జూరాలను చూడగలుగుతున్నామంటే అందు కు ప్రధాన కారణమైన వ్యక్తి నాటి భారీ సాగునీటి శాఖా మంత్రి డాక్టర్ సుధాకరరావు అని అందరికీ తెలిసిన విషయమే. అనేక కుట్రలకు, కుతంవూతాలకు బలయిన ఈ ప్రాజెక్టులో ‘డ్యాం’ పూర్తికావడానికే 20 సంవత్సరాలు (1975-1995)పట్టింది. కాలువ లు, పిల్ల కాలువలు, డిస్ట్రిబ్యూటరీ సిస్టం నిన్న మొన్నటిదాకా తయారవుతూనే ఉన్నాయి. నిర్ధారిత 1,20,000 ఎకరాలకు నీరిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నా, నిజంగా ఎన్ని నీళ్లు ఇస్తున్నారన్నది ఎవరికీ తెలియదు. డ్యాం 20 ఏళ్లు పట్టడానికి సాంకేతిక కారణాల కన్నా, బడ్జెట్ కేటాయింపు, విడుదలే కారణమన్నది జగమెరిగిన సత్యం. ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన బడ్జెట్‌ను అరకొరగా కేటాయించడం, విడుదల చేయకపోవడం సమస్య ఒకటైతే, 11 టీఎంసీల స్టోరేజీని కలిగిన ఈ డ్యాం ను పూర్తి సామర్థ్యంతో నింపివేస్తే ఏర్పడే జలాశయం ముంపు కారణంగా ఎగువన కర్ణాటకకు చెల్లించవలసిన ‘డబ్బు’ను సకాలంలో చెల్లించకపోవడంతో అనేక సంవత్సరాలు జలశయాన్ని నిర్ధారిత స్థాయికి ప్రభుత్వం నింపలేపోయింది. కేవలం 44 కోట్ల రూపాయలను కర్ణాటక ప్రభుత్వానికి చెల్లించి ఉంటే ముంపు ప్రాంతం నుంచి కర్ణాటకకు చెందిన నిర్వాసితులు తమ స్థలాలను వదిలి ఈ కాస్త డబ్బును చెల్లించడం ప్రభుత్వానికి లెక్కకాదు. ఎందుకు వాళ్లకు ఈ డబ్బు చెల్లించలేదో, చెల్లించని కారణంగా, రిజర్వాయర్లో పూర్తిస్థాయికి నీరెందుకు నింపలేదో ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. ఇంత కాలం రిజర్వాయర్‌ను పూర్తిగా నింపకుండా, ఆ వచ్చే నీటిని కిందికి వదలడం చేస్తూండేవారు. పైపెచ్చు కాలువలు కూడా పూర్తి చేయకపోవడంతో ‘జూరాల’ ప్రాజెక్టు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయింది. ఆ 44 కోట్లు క్రమేణా 100 కోట్ల దాకా పెరిగింది. ఇటీవలి కాలంలోనే ముంపు పరిహారం పూర్తిగా చెల్లించడం, రిజర్వాయర్‌ని పూర్తి జలస్థాయి వరకు నింపడం జరిగిందని ప్రాజెక్టు వర్గాలు చెబుతున్నాయి. ఒక చిన్న ప్రాజెక్టు (కేవలం 17.84 టీఎంసీల నీటి వినియోగం, 1,20,000 ఎకరాల ఆయకట్టు) పూర్తిగా తెలంగాణ ప్రాజెక్టు కావడం కారణంగానే ఇంత వివక్షకు గురైంది. 37 సంవత్సరాలు పడుతుందా ఆ ప్రాజెక్టును పూర్తిస్థాయి వినియోగంలోకి తేవడానికి? ఇంకా విచివూతమైన విషయమేమంటే ‘రాజోలిబండ’ కాలువ ఆయకట్టులోని 30 వేల ఎకరాలను దీనికి అనుసంధానం చేయడం, అంటే.. ‘జూరాల’ ప్రాజెక్టు అందివ్వడానికి నిర్ధారించబడిన అసలు సిసలైన ఆయకట్టుకు నీరందించకుండా నాలుగు టీఎంసీల నీటిని ఆర్‌డిఎస్8 ఆయకట్టుకు అందించే ఏర్పాటు జరుగుతోందన్న మాట. ఎస్ఎల్‌బీసీ (శ్రీశైలం ఎడమగట్టు కాలువ) బచావత్ ట్రిబ్యునల్ తీర్పులో అటు ‘తెలుగు గంగ’ కానీ, ఇటు ‘ఎస్8ఎల్‌బీసీ’ కానీ లేవు. 1981లో అఖిల పక్ష సమావేశంలో ఆమోదింపబడిన తీర్మానం ప్రకారం కృష్ణా అదనపు జలాలలో 29 టీఎంసీల వినియోగంతో రాయలసీమకు ఉపయోగపడే తెలుగుగంగ, 30 టీఎంసీల వినియోగంతో తెలంగాణకు ఉపయుక్తమయ్యే శ్రీశైలం ఎడమ గట్టు కాలువ పథకాలను సమానమైన స్థాయి లో చేపట్టాలి. అంటే రెండింటికీ ఒకే రకమైన ప్రాధాన్యం కలిగించాలని అర్థం. కాని వాస్తవంలో జరిగిందేమిటో, రెండు ప్రాజెక్టులకు చేసిన బడ్జెట్ కేటాయింపులను బట్టే అర్థమవుతుంది.1984 నుంచి 2008 వరకు ఎస్8ఎల్‌బీసీ, తెలుగుగంగ ప్రాజెక్టుల కేటాయింపుల్లో ఎంత తేడా ఉందో పాఠకులే అర్థం చేసుకుంటారు. 2008 నుంచి ఎస్8ఎల్‌బీసీ పనులను వేగవంతం చేస్తు, ఎక్కువమొత్తాన్ని కేటాయించడానికి గల కారణం తెలంగాణ ఉద్యమం ఊపందుకుని, ప్రభుత్వంపైన ఒత్తిడి పెరగడం. 1996-97 వార్షిక బడ్జెట్‌లో ‘గత ఐదారు సంవత్సరాలుగా సుప్తావస్థలో ఉన్న ఎస్8ఎల్‌బీసీ పనులను వేగవంతం చేయడం జరుగుతోంది’ అని ప్రభుత్వమే పేర్కొనడం గమనార్హం. తాజా అంచనాల ప్రకారం తెలుగుగంగకు 4,432 కోట్లు, ఎస్8ఎల్‌బీసీ కి 4,073 కోట్లు ఖర్చవుతాయి. అంటే దాదాపు సమానం. జనవరి 2010 నాటికి తెలుగుగంగపైన 3,151 కోట్ల 66 లక్షల రూపాయలు ఖర్చయితే ఎస్8ఎల్‌బీసీ పైన 2,196 కోట్ల 50 లక్షలు ఖర్చు చేశారు. అంటే మూడుపాళ్లు, రెండు పాళ్ల నిష్పత్తిలో అన్నమాట. గమ్మత్తేమంటే 2006 వరకే తెలుగుగంగపైన 1,880 కోట్ల 40 లక్షలు ఖర్చయితే, ఎస్8ఎల్‌బీసీపైన 687 కోట్ల 50 లక్షలు ఖర్చుపెట్టారు. (3:1) మూడుపాళ్లు ఒకపాలు నిష్పత్తిలో అన్నమాట. తెలంగాణ ఉద్యమ ప్రభావం లేకున్నా, ఎలిమినేటి మాధవడ్డి ఒత్తిడి లేకున్నా ఎస్8ఎల్‌బీసీ ఏనాడూ వెలుగు చూసి ఉండేది కాదన్న మాట వాస్తవం. ఏ ఇంజనీరైనా అదే ధృవీకరిస్తాడు. పోచంపాడు (శ్రీరాంసాగర్) 1963లో ప్రారంభమైన తెలంగాణకు జీవనాడి అయిన ఈ ప్రాజెక్టు నత్తలు కూడాసిగ్గుపడే విధంగా ఇంకా కొనసాగుతున్న వైఖరి చూస్తుంటే ఎంతటి పక్షపాతి గుండైనా ద్రవించకమానదు. 1966-67 నాటి ప్రభుత్వ వార్షిక బడ్జెట్ ఏం చెబుతోందో చూడండి. రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులు, పథకాలపైన వస్తున్న డిమాండ్లు, ఒత్తిళ్ల మూలంగా ‘పోచంపాడు’ ప్రాజెక్టుకు ఒక కోటి ఇరవై లక్షల రూపాయలకంటే ఎక్కువ మొత్తాన్ని కేటాయించడానికి సాధ్యపడడం లేదు. అయితే అదే రిపోర్టులో నాగార్జునసాగర్‌కు 8 కోట్ల ఇరవై లక్షలు, తుంగభద్ర ఎగువ కాలువ (టీహెచ్‌ఎల్‌సీ)కు ఒక కోటి 98 లక్షలు, తాండవ రిజర్వాయర్‌కు 43 లక్షలు, కేసీ కెనాల్‌కు 12 లక్షలు కేటాయించగలిగారు. అందులో ఒక నాగార్జునసాగర్ (అదీ తెలంగాణకు పావు వంతు ఆంధ్రకు ముప్పావు వంతు) తప్ప మిగిలిన ప్రాజెక్టులన్నీ సీమాంవూధ కు ఉపయోగపడేవే. ఏ సంవత్సరం బడ్జెట్ కేటాయింపులు చూసినా నాగార్జునసాగర్‌కు ఇచ్చిన ప్రాధాన్యంలో సగం కూడా శ్రీరాంసాగర్‌కు ఇవ్వలేదు. 2004లో శ్రీరాంసాగర్ ప్రథమ దశ పూర్తిచేశామని (41 సంవత్సరాల తర్వాత) ప్రభుత్వం చెప్పుకుంటోంది. 90 లక్షల 68 వేల ఎకరాలకు నీరందించే ఏర్పాట్లు పూర్తి చేశామని ప్రభుత్వం చెప్తోంటే 12-9-2008న ఏర్పాటైన చీఫ్ ఇంజనీర్ల మీటింగ్‌లో కేవలం ‘శ్రీరాంసాగర్ ప్రథమ దశలో ఐదు లక్షల ఎకరాల ఆయకట్టుకు మాత్రమే నీరందివ్వగలుగుతున్నాం’ అని చెప్ప డం విశేషం. 1999 నాటి కాగ్ నివేదిక ఇలాంటి పరిస్థితినే బయటపెట్టింది. కాలువలు 1970 నుంచే నీటిని మోసుకుపోతున్నాయి. ఇప్పటికి 6లక్షల 30 వేల ఎకరాలకు నీరందివ్వగల సామర్థ్యాన్ని సమకూర్చామని చెబుతున్నారు. కాని వాస్తవానికి రెండు లక్షల ఎకరాల కంటే ఎక్కువ నీరందించిన దాఖలాలు లేవు. ఏదేమైనా తెలంగాణ ప్రాజెక్టులు సాంకేతిక లోపాలతో (హైవూడాలజీ, డిజైన్) నిర్వహణ లోపాలతో కూనారిల్లుతున్నాయి. వీటికి తోడు ప్రభుత్వం ఏనాడూ తగిన మోతాదులో బడ్జెట్‌ను కేటాయించడం గానీ, విడుదల చేయ డం కానీ చేయలేదు. ఫలితంగా తెలంగాణ ప్రాజెక్టులు కుంటుతూ, పడుతూ లేస్తూ నిర్వీర్యంగా, నిస్సహాయంగా పడి ఉన్నాయి. ‘జలయజ్ఞం’లో 50 శాతం నిధులను (సుమారుగా అటూ ఇటూ) తెలంగాణపైనే ఖర్చుపెడుతున్నాం అని ప్రభుత్వం గొప్పలు చెబుతోంది. ఆ నిధులను ఖర్చు పెట్టిన మాట వాస్తవమే కావొచ్చు. కానీ బాగుపడుతున్నదెవరు. బడాబడా ఆంధ్రా కాంట్రాక్టుర్లు, ఇంజనీర్లు, రాజకీయ నాయకులు. నిధుపూన్ని ఇచ్చారు అనేది కాదు ముఖ్యం. ఎన్ని ఎకరాలకు నీళ్లిచ్చారు? అన్నది ప్రస్తుతాంశం. ‘తెలంగాణ ప్రాజెక్టులకు అడుగడుగున జరుగుతున్న అన్యాయాల గురించి విపులంగా చర్చించుకోవాలంటే ఓ మహాక్షిగంథమే అవుతుం ది. ఇప్పుడు అతి గొప్పగా చెబుతున్న ప్రాణహిత-చే సంగతే చూడండి. 42,500 కోట్ల రూపాయలు అవసరమయ్యే బృహత్తర పథకం. 2012 లో పూర్తి చేస్తామని ఆ మధ్య ప్రభుత్వం ప్రకటిస్తూ విడుదల చేసిన పూర్తిపేజీ అడ్వర్‌టయిజ్ మెంట్ తప్ప ఎన్ని నిధులిచ్చారు, పనులపైన ఎంత ఖర్చుపెట్టారు అనడగండి. సమాధానం ఉండదు. ఎలాంటి వ్యూహం లేకుం డా తెలంగాణ ప్రజలను మోసం చేయడానికి ‘జాతీయవూపాజెక్టు’ సాధిస్తామని ప్రగల్బాలు తప్ప ఇంకేమీ చేయడం లేదు ఈ ప్రభుత్వం. ఈ వలసవాదుల కుట్రల నుంచి ప్రాజెక్టులను రక్షించుకోవడానికి మిగిలిన ఏకైక మార్గం తెలంగాణ రాష్ట్ర సాధనే. ఇదీ సంగతి నదుల అనుసంధానం రెండు లేక అంతకన్నా ఎక్కువ నదులను కలిపితే (లింక్‌చేస్తే)దాన్ని నదు ల అనుసంధానం అంటారు. ఉదాహరణకు ఉత్తరాన ఉన్న గంగానదిని దక్షిణాన ఉన్న కావేరీ నదిని జోడిస్తే దాన్ని ‘గంగా-కావేరీ’ అనుసంధానం అంటారు. ఈ రోజున మన రాష్ట్రంలో గోదావరిని కృష్ణానదికి కలిపితే దాన్ని ‘గోదావరి-కృష్ణ’ లింక్ ప్రాజెక్ట్ అని వ్యవహరించవచ్చు. నదిలో పుష్కలంగా ఉన్న నీటిని అంటే ఆ నదీ పరివాహక ప్రాంత ప్రజల అవసరాలు తీర్చాక మిగిలిన నీటిని మరో నదికి తరలిస్తే మొదటి నది ‘దాతనది’ (DONOR BASIN), ఆ నీటిని స్వీకరించే నది ‘గ్రహీతనది’ (DONEE BASIN)అవుతుంది. ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్న మూడు ప్రధాన నదులలో గోదావరినదిలో అవసరాలకు మించిన నీరు ఉందని, కృష్ణానదిలో తన అవసరాలకు సరిపడా నీరు ఇప్పుడున్నా, భవిష్యత్తు అవసరాలకు కొరత ఏర్పడుతుందని, ఇక పెన్నానది పూర్తిగా లోటు బేసిన్ (Deficit basin) కనుక ఆ నదికి గోదావరి నుంచి కృష్ణానది ద్వారా నీటిని తరలించాలని ప్రభుత్వ పథకం. అయితే దాతనదిలో అవసరాలకు మించిన నీరున్నదా లేదా? అదే విధంగా గ్రహహీతనది వాస్తవ అవసరాలు ఏమిటి? దాతనది నుంచి గ్రహిత నదికి ఏమేరకు నీటిని తరలిస్తే ఆర్థికంగా లాభసాటవుతుంది? పర్యావరణం మాటేమిటి? ఇలాంటి అనేక సవాళ్లను ఎదుర్కోవలసి ఉంటుంది. అందుకే ఈ పని ముందుకు సాగడంలేదు. -ఆర్. విద్యాసాగర్‌రావు కేంద్ర జల సంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
------------------------------------------------------------------------------------------------
ప్రాంతాల వారీగా ప్రాజెక్టులు
తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలలో ఎన్ని ప్రాజెక్టులున్నాయి? ఎప్పుడు వాటిని పూర్తి చేశారు? ఒక్కొక్క ప్రాజెక్టు కింద ఎంత సాగవుతోంది? పై ప్రశ్నలకు సమాధానమిచ్చి కృష్ణా, గోదావరి నదుల వినియోగంలో సీమాంవూధులు తెలంగాణ వారిని ఏ విధంగా దోపిడీకి గురిచేస్తున్నారో సామాన్య ప్రజలకు అర్థమయ్యే విధంగా వివరిస్తారని కోరుతున్నాను.
-దుగ్యాల భూమారావు, గోదావరిఖని


neelu-lijalu-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaకృష్ణా, గోదావరి నదుల వినియోగంలో తెలంగాణ వారిని ఏ విధంగా వలసవాదులు దోపిడీకి గురిచేస్తున్నారన్న విషయం దాదాపు ప్రతి వ్యాసంలో తెలియజేస్తూనే ఉన్నాను. ఇక ప్రాజెక్టుల వివరాలు, కొంత మేరకు ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో 12-9-11, 26-09, 3-10 నాటి వ్యాసాల్లో తెలియజేయడం జరిగింది. క్లుప్తంగా మీరడిగిన సమాధానమిచ్చే ప్రయత్నం చేస్తాను.ఏ ఏ ప్రాజెక్టుల కింద ఎంతెంత ఆయకట్టు సాగవుతోందన్న విషయం మనకు తెలియజేయడానికి ఉన్నది ఒకే ఒక్క ఆధారం. అది ‘సాగునీరు-ఆయకట్టు అభివృద్ధి శాఖ’ వారు ఇచ్చే సమాచారం. అది లోపభూయిష్టంగా ఉందని, రైతులకు నీళ్లవ్వకుండానే ఆయకట్టు అభివృద్ధి చెందిందని తమ ఖాతాలో చూపించుకుంటారని అనేకసార్లు ప్రభుత్వం దృష్టికి తేవడం జరిగింది. ‘కాగ్’ కూడా ఎన్నోసార్లు అక్షింతలు వేసింది.

ప్రభుత్వం వారి ఆర్థిక గణాంక శాఖ (Director, economics and stastics) వారు ప్రతిసంవత్సరం విడుదల చేసే రిపోర్టులుంటాయి. అందులో కాలువలకింద, చెరువుల కింద, బావుల కింద, ఇంకా ఇతర మార్గాల ద్వారా ఎంత భూమి సాగవుతున్నది అన్న విషయం ఉంటుంది. అది జిల్లాల వారీగా కూడా ఉంటుంది. అందులో ప్రాజెక్టుల వారీగా ఆయకట్టు వివరాలు ఉండవు. కాబట్టి మనకు ఇష్టమున్నా లేకపోయినా, సమాచారం తప్పు అని తెలిసినా మనం సాగునీటిశాఖ డేటాపై ఆధారపడాలి.
‘సాగునీటి శాఖ’ వారు జూన్ 2010లో ఒక పుస్తకాన్ని వెలువరించారు. అది ‘ప్రజల’ కోసం కాదు. ఆంతరంగిక సమాచారం లాంటిది. ‘శ్రీకృష్ణ కమిటీ’ కోసం తయారు చేశారు. అందులో పొందుపరిచిన విషయాలు అసంబద్ధంగా, అవాస్తవంగా ఉన్నాయని విమర్శకులు చెప్పారు. కాని ‘నిజంగా’ ఉపసంహరించుకున్నారా అన్నది అనుమానమే.

2525-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinema‘శ్రీకృష్ణ కమిటీ’ వారు ప్రచురించిన డేటా చూస్తే ఆ విషయం బహిర్గతమవుతుంది. ‘కమిటీ’ ఉపయోగించుకున్నది ‘సాగునీటి’ శాఖ వారు పంపిన సమాచారమే. ‘సాగునీటి శాఖ’ వారి డేటా అనుసరించి ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం అవతరించక పూర్వం ప్రాంతాల వారీగా భారీ ప్రాజెక్టుల వివరాలు పట్టికలో చూడవచ్చు.

ఈ లెక్కలు ఏం చెప్తున్నాయి. ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడక ముందు రాష్ట్రం మొత్తంలో 33,25,000 ఎకరాలు సాగవుతుంటే అందులో తెలంగాణ వాటా కేవలం 3,53,000 ఎకరాలు మాత్రమే. అంటే పది శాతం మాత్రమే. ఈ అంకెలు చిన్న తరహా ప్రాజెక్టులు, చిన్న చెరువులు, బావుల కింద వ్యవసాయం, ఇంకా ఇతర భూగర్భ జలాల వినియోగం కాకుండానే. ఇకపోతే రాష్ట్రం ఏర్పడ్డాక వివిధ ప్రాంతాల్లో ప్రాజెక్టుల స్థితిగతులను పరిశీలిద్దాం. (2009-2010 దాకా) ప్రభుత్వం ఈ యాభై నాలుగు సంవత్సరాల కాలాన్ని రెండు భాగాలుగా విభజించింది.1956 నుంచి 2004 వరకు (వైఎస్సార్)పగ్గాలు చేపట్టే వరకు, మొదటి పీరియడైతే 2004 నుంచి తర్వాత కార్యక్షికమాలను ‘జల యజ్ఞం’గా పేరు పెట్టి రెండవ పీరియడ్‌గా చూపెడుతోంది.

మొదటి పీరియడ్‌లో ప్రభుత్వం నాగార్జునాసాగర్, కడెం, శ్రీరాంసాగర్ ప్రథమదశ, వంశధార ప్రథమ దశ, సోమశిల, తుంగభద్ర ఎగువ, దిగువ కాలువ లాంటి భారీ ప్రాజెక్టులు, రాజోలిబండ మళ్లింపు పథకాలను పూర్తి చేయడమే కాక, గోదావరి, ప్రకాశం ఆనకట్టల స్థానంలో బ్యారేజీల నిర్మాణం పూర్తి చేసింది. మొదటి పీరియడ్‌లో అసంపూర్ణంగా మిగిలిన ప్రాజెక్టులతో పాటు అనేక కొత్త ప్రాజెక్టులను జలయజ్ఞం కార్యక్షికమంలో భాగంగా చేపట్టింది. ‘జల యజ్ఞం’ గురించి మాట్లాడుకోవాలంటే ఒక మహా గ్రంథమే అవుతుంది. దాని గురించి వివరంగా రానున్న వ్యాసాల్లో వివరిస్తాను.

మొదటి పీరియడ్‌లో ప్రారంభించి ‘జలయజ్ఞం’లో కొనసాగుతున్న భారీ ప్రాజెక్టుల్లో తెలంగాణలో జూరాల, భీమా, నెట్టంపాడు, కల్వకుర్తి, ఎస్‌ఎల్‌బి, శ్రీరాంసాగర్ ద్వితీయదశ, వరదకాలువ, దేవాదుల వంటివి ఉన్నాయి. ఇక సీమాంధ్ర విషయానికివస్తే పులిచింతల వంశధార రెండవ దశ, తాండవ, ఏలేరు, తెలుగుగంగ, ఎస్‌ఆర్‌బిసి వంటివి ఉన్నాయి. మధ్యతరహా ప్రాజెక్టుల గురించి చెప్పాల్సివస్తే చాంతాడంత అవుతుంది. శ్రీశైలం ప్రాజెక్టు విద్యుత్తు ప్రాజెక్టు కాబట్టి దాన్ని లిస్ట్‌లో చేర్చలేదు.
ఆంధ్రవూపదేశ్ రాష్ట్రం ఏర్పడ్డాక 2010 దాకా భారీ, మధ్య తరహా ప్రాజెక్టుల ద్వారా కొత్తగా సాగులోకి వచ్చిన ఆయకట్టు స్థిరీకరించిన ఆయకట్టు వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ లెక్కలనే శ్రీకృష్ణకమిటీకి పంపి ఓహో-ఇంకేముంది తెలంగాణలో అద్భుతంగా అభివృద్ధి జరిగింది అని రాయించ గలిగింది ఈ ప్రభుత్వం. ఈ లెక్కలు ఎంత దొంగవో ఎంత అబద్దాల పుట్టో ఒక్కో ప్రాజెక్టు వివరాలను విశ్లేషిస్తే గాని అర్థం కాదు. ఉదాహరణకు తెలంగాణ ప్రాజెక్టుల విషయమే తీసుకుందాం. జూరాల ప్రాజెక్టు నిర్ధారిత ఆయకట్టు లక్షా 2వేల ఎకరాలను, రాజోలిబండలో నిర్ధారిత ఆయకట్టు 87 వేల ఎకరాలను లెక్కల్లో చూపెట్టారు.ఇంకా దుర్మార్గమైన విషయమేమంటే శ్రీరాం సాగర్ ద్వితీయ దశ కాలువలే పూర్తి కాలేదు. 2010 నాటికే 1లక్ష 20వేల ఆయకట్టును అభివృద్ధి చేసినట్టుగా రాసేసుకుందీ ప్రభుత్వం. అదేవిధంగా ఎలిమినేటి మాధవడ్డి ప్రాజెక్టుద్వారా 1లక్ష97 వేల ఎకరాల ఆయకట్టును అభివృద్ధి చేసినట్టుగా చూపెట్టింది. ఒక్క ఎకరా నీరు రైతులకందివ్వకుండానే పూర్తి ప్రాజెక్టు అభివృద్ధి(అంటే irrigation potential created)అని రాసుకున్నారు. ఈ విధంగా అంకెల గారడీతో శ్రీకృష్ణకమిటీని బురిడీ కొట్టించి రోజూ మీడియాలో లగడపాటి లాంటి నాయకుల చేత తెలంగాణ అభివృద్ధి మామూలుగానే జరిగిందని కేంద్రానికి తప్పుడు నివేదికలు పంపడానికి సాయపడిన ఈ ప్రభుత్వంపై నమ్మకం పెట్టుకునేదెట్లా?

15555-telangana News talangana patrika telangana culture telangana politics telangana cinemaసాగునీటి శాఖవారి అంకెల మాజిక్(majic )గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాగని ఆర్థిక గణాంక శాఖ కూడా తక్కువేం తినలేదు. 2007-2008లో ప్రచురించిన డేటాలో తెలంగాణాలో1956-1957 తో పోలిస్తే 23లక్షల 40 వేల ఎకరాలకు కొత్తగా సేద్యం వసతి కల్పించామని చెప్పడం జరిగింది. నిజానికి తెలంగాణలో ప్రభుత్వ నిర్వాకం వల్ల చెరువులు పూడిపోయి కబ్జాలకు గురయి, కాలువల అభివృద్ధి కొంత జరిగినా నికరంగా 6 లక్షల16 వేల ఎకరాల ఆయకట్టును కోల్పోవడం జరిగింది. రైతులు తమ సొంత ఖర్చుతో, శ్రమతో కొత్తగా 29 లక్షల 56 వేల ఎకరాలను సాగులోకి తెచ్చుకున్నారు. చెరువుల మూలంగా జరిగిన నష్టాన్ని కూడా పూడ్చుకొని రైతుల కష్టం మూలంగా తెలంగాణలో 23 లక్షల 40 వేల ఎకరాలు అభివృద్ధి జరిగితే అదంతా తమ ప్రయోజకత్వమే అని టాం టాం చేసుకుంది. తమ ఖాతాలో జమచేసుకుని కేంద్ర ప్రభుత్వానికి దొంగపూక్కలు సమర్పించే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? ఆ లెక్కల్ని నమ్మి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఇస్తే వాళ్లకే నష్టం అని ఇంకా ఈ విషయంపై నిర్ణయాన్ని సాగదీస్తున్న కేంద్రాన్ని ఏమనాలి? ఈ నీళ్ల దోపిడీని ఆపాలన్నా, వలస వాదుల కుట్రలకు, గారడీలకు బలవుతున్న తెలంగాణ ప్రాజెక్టులను కాపాడుకోవాలన్నా ప్రత్యేక రాష్ట్రమొక్కటే మార్గం.
-ఆర్. విద్యాసాగర్‌రావు
కేంద్ర జలసంఘం మాజీ చీఫ్ ఇంజనీర్
 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి