30, ఆగస్టు 2013, శుక్రవారం

అన్ని పార్టీలు ఒప్పుకున్నాకే కాంగ్రెస్ నిర్ణయం


- టీడీపీ, వైఎస్సార్సీపీ ఓట్ల రాజకీయాలు మానుకోవాలి
- సమైక్యంగా ఉండేందుకు దీక్షలు: మంత్రి శైలజానాథ్

హైదరాబాద్, ఆగస్టు 29 (టీ మీడియా): రాష్ట్ర విభజనకు అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకున్నాకే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నదని రాష్ట్ర మంత్రి శైలజానాథ్ అన్నారు. టీడీపీ, వైఎస్సార్సీపీ సీమాంవూధలో ఓట్ల రాజకీయం చేస్తున్నాయని మండిపడ్డారు. గురువారం ఆయన సీఎల్పీలో ఎమ్మెల్యే గాదె వెంకట్‌డ్డితో కలిసి విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర విభజనపై ఆ రెండు పార్టీలు ఇప్పటికైనా మనసు మార్చుకుని.. వ్యతిరేక తీర్మానం చేయాలన్నారు.

రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని ఆంటోని కమిటీ వద్దకు వెళ్లినప్పుడు.. రాజకీయ పార్టీలు ఇచ్చిన లేఖలు తమకు చూపించారని తెలిపారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని మొదటి నుంచి పోరాటం చేస్తున్నది ఒక సీమాంధ్ర కాంగ్రెస్ నేతలే అన్నారు. సమన్యాయం అంటున్న జగన్ పార్టీ కూడా ఇప్పటి వరకు సమైక్యత కోసం ఒక్క మాట మాట్లాడలేదని విమర్శించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ను విమర్శిస్తూ టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం సమైక్యంగా ఉంచాలని కోరుతూ సీమాంవూధకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలమంతా హైదరాబాద్‌లో దీక్షలు చేస్తామని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలోని గాంధీ విగ్రహం లేదా తెలుగుతల్లి విగ్రహం వద్ద సెప్టెంబర్ 2 లేదా 3న దీక్షలు చేయాలనుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. కేంద్రం వద్ద రాయల తెలంగాణ ప్రతిపాదన లేదని మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.

విభజన జరిగితే.. పార్టీలో ఉండే విషయం ఆలోచిస్తా: గాదె
మెజార్టీ లేని యూపీఏ ప్రభుత్వం రాష్ట్ర విభజనపై ఎలా నిర్ణయం తీసుకుంటుందని ఎమ్మెల్యే గాదె వెంకట్‌డ్డి ప్రశ్నించారు. రాష్ట్ర విభజనపై ఇప్పటి వరకు ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోలేదన్నారు. తెలుగు ప్రజల మధ్య తమ పార్టీ చిచ్చు పెట్టిందన్నారు. చిచ్చుపెట్టిన పార్టీలో ఎలా ఉంటున్నారని విలేకరులు ప్రశ్నించగా.. పార్టీలో ఉండేది, ఉండని విషయాన్ని విభజన జరిగితే ఆలోచిస్తానని బదులిచ్చారు.

బొత్సతో మంత్రి శైలజానాథ్ భేటీ
సీమాంధ్ర కాంగ్రెస్ నేతల దీక్షల విషయం చర్చించేందుకు పీపీసీ అధ్యక్షుడు బొత్స తో రాష్ట్ర మంత్రి శైలజానాథ్ గురువారం భేటీ అయ్యారు. దీక్షలకు వేదికను ఎంపిక చేసే విషయంపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. అసెంబ్లీ, తెలుగుతల్లి విగ్రహం వద్ద అనుమతి లభించకపోతే .. గాంధీభవన్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద దీక్ష చేసేందుకు పర్మిషన్ ఇవ్వాలని బొత్సను కోరినట్లు తెలిసింది.

‘ఉద్యమాలతో విద్యార్థులు నష్టపోతున్నారు’
హైదరాబాద్: ఉద్యమాల కారణంగా విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారని భారతీయ జనతా యువమోర్చ అధ్యక్షుడు విష్ణువర్ధన్‌డ్డి అన్నారు. గతంలో తెలంగాణలో ఉద్యమాలు, ఇప్పుడు సీమాంవూధలో ఉద్యమం కారణంగా విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, సీమాంవూధలో నెల రోజులుగా ఆందోళన జరుగుతున్నా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. రాజకీయ నాయకులు తమ పిల్లలను ఇతర రాష్ట్రాల్లో చదివించుకుంటున్నారని, మరి పేదల పిల్లలు ఎక్కడ చదవాలని ప్రశ్నించారు. మహబూబ్‌నగర్‌లో బీజేవైఎం నాయకుడు యాదిడ్డిపై పోలీసులు దాడి చేయడాన్ని ఖండించారు. సమావేశంలో నాయకులు శ్రీనివాసనాయుడు, భరత్‌గౌడ్, నవీన్‌గౌడ్ పాల్గొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి