30, ఆగస్టు 2013, శుక్రవారం

సోకులు వాళ్లకు షాకులు మనకు


8/29/2013 6:40:18 AM
దశాబ్దాలుగా సీమాంధ్రులు విద్యుత్ రంగాన్ని కబ్జా చేశారు. కరెంటు దందాతో అనుబంధం ఉన్న సీమాంధ్ర పెట్టుబడిదారులు వ్యాపారపరంగా రాష్ట్ర ఎల్లలు దాటడమే కాకుండా.. విదేశాల్లో పెట్టుబడులు పెట్టే స్థాయికి ఎదిగిపోయారు. కోస్తాలోని కృష్ణా-గోదావరి బేసిన్‌లోని సహజవాయు నిక్షేపాలు,
సహజ వనరులను సొంతం చేసుకుని, రాష్ట్ర ప్రయోజనాలను విస్మరించి సొంత సామ్రాజ్యాలు నిర్మించుకున్నారు. ఇప్పుడు అదే
పెట్టుబడిదారులు.. తమ వ్యాపార ప్రయోజనాలకు భంగం కలుగకుండా చూసుకునేందుకే తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తున్నారు.

currentవీటీపీఎస్‌లో 3,600 ఎకరాల భూముల్లో 1,760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా బీహెచ్‌ఈఎల్ జాయింట్ వెంచర్‌తో మరో 182 మెగావాట్ల ఇంటిక్షిగేటెడ్ గ్యాసిఫికేషన్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ (ఐజీసీసీపీపీ) నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి అన్ని రకాల అనుమతులున్నాయి. ఇందుకోసం ఇంకా 230 ఎకరాల భూములు సేకరించాలని డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లో పేర్కొన్నారు. అంటే దీని కోసం భూ సేకరణ జరపాల్సి ఉంది. ప్రస్తుతం వీటీపీఎస్ పరిసరాల్లో ఎకరం భూమి ధర కోటి రూపాయలకు పైగా ఉండడం విశేషం. అయినా వెనుకాడని ప్రభుత్వం.. అంత సొమ్ము వెచ్చించి భూములు సేకరించడం ద్వారా కొత్త పవర్ ప్రాజెక్టులను విజయవాడలోనే నిర్మించేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం.

తెలంగాణలో కొత్త పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలకు వందల ఎకరాలు అందుబాటులో ఉన్నాయి. రామగుండంలో 600 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. దాని పక్కనే రాయగండి వద్ద 1,512 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఇక్కడ ఎకరం ధర గరిష్ఠంగా రెండు లక్షలకు మించదని తెలంగాణ విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా కేటీపీపీ ప్లాంటు పక్కన ఉన్న వ్యవసాయ భూములకు గిట్టుబాటు ధర కల్పిస్తే విద్యుత్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ ఎకరం రూ.4లక్షల నుంచి రూ.5లక్షలకు మించదు. కేటీపీఎస్ వద్ద స్థానికంగా మరో 8,600 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రభుత్వం, జెన్‌కో యాజమాన్యం భూసేకరణకు అవసరమైన నిధులు లేవని సాకులు చెబుతున్నాయి.


కరెంటు లోటు ఇక్కడ.. ఉత్పత్తి ప్లాంట్లు అక్కడ
విద్యుత్ రంగంలో నిండు నిర్లక్ష్యం


అందుబాటులో బొగ్గు.. పక్కనే ప్రవహించే గోదావరి.. విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పేందుకు తగిన భూమి.. తెలంగాణకు ఇంకేం తక్కువ?.. కానీ సర్కారుకు చిత్తశుద్ధి లోపించింది. తెలంగాణకు కరెంటు కష్టమొచ్చింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం విద్యుత్ రంగంలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైందనేది నిప్పులాంటి నిజం! విద్యుత్ అవసరాలు ఉన్న తెలంగాణలో ప్లాంటులు కట్టాల్సిన పాలకులు.. తెలంగాణకు చెందాల్సిన ప్రాజెక్టులను సైతం మళ్లించుకుని.. సీమాంధ్ర ప్రాంతాన్ని వెలుగులతో నింపుకొంటున్నారన్నది షాక్ కొట్టినంత సత్యం! భూములు సేకరించడానికి డబ్బుల్లేవని చెబుతున్న ప్రభుత్వం.. ఎకరం రెండు లక్షలకు దొరికే భూమి ఉన్న ప్రాంతాన్ని వదిలిపెట్టి.. అదే ఎకరం భూమి కోటికిపైగా పలుకుతున్న చోట ఖర్చుకు వెనుకాడకుండా సీమాంధ్రలోనే కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి సిద్ధపడుతుండటం.. పాలకుల కుటిల పన్నాగాలకు నిదర్శనం! తెలంగాణ విడిపోతే ఆ రాష్ట్రానికి తలెత్తే మొట్టమొదటి సమస్య విద్యుత్తేనంటూ సీమాంధ్ర పాలకులు బెదిరిస్తుండటమే అందుకు సాక్ష్యం!

హైదరాబాద్, ఆగస్టు 28 (టీ మీడియా): గాయం ఒక చోట ఉంటే.. మందు మరో చోట పూస్తే? విద్యుత్ ప్రాజెక్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వైఖరి సరిగ్గా ఇలానే ఉంది. పవర్‌లోడ్ (విద్యుత్ వినియోగం) ఉన్న చోట్ల విద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పాలని స్వయంగా విద్యుత్ చట్టమే చెబుతోంది. దీని వల్ల ప్రాజెక్టు పెట్టుబడి వ్యయం తగ్గడంతో పాటు విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు తగ్గుముఖం పట్టడం, నాణ్యమైన విద్యుత్ సరఫరాకు అవకాశం ఉంటుందనేది మానసిక వికాసం కలిగిన ప్రతిఒక్కరికీ తెలిసిన అంశం. అయితే విద్యుత్‌రంగానికి మూల వనరులైన బొగ్గు, నీళ్లు, ప్రాజెక్టుల ఏర్పాటుకు అవసరమైన భూములు అందుబాటులో ఉన్నప్పటికీ తెలంగాణలో కట్టాల్సిన అనేక విద్యుత్ ప్రాజెక్టులను సీమాంధ్రకు తరలించి ఉద్దేశపూర్వంగా తెలంగాణను విద్యుత్‌రంగంలో వెనుకబడేశారన్నది నిర్వివాదాంశం. ఇందుకు నాడు విద్యుత్‌బోర్డు చైర్మన్‌గా పనిచేసిన నార్ల తాతారావు, పార్ధసారధి కారణమన్న అభిప్రాయాన్ని తెలంగాణవాదులు వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర విభజనతో తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ లోటు గణనీయంగా ఉంటుందని, విద్యుత్‌పరంగా తెలంగాణ ప్రజలు ఇబ్బందులపాలు అవుతారని సీమాంధ్ర కీలక నేతలు బెదిరిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలంగాణ విద్యుత్ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

తెలంగాణ ఉద్యమం తీవ్రస్థాయిలో ఉన్న తరుణంలోనూ కొత్త విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రతిపాదనల్లో కూడా సీమాంవూధకే ప్రాతినిధ్యం ఇవ్వడం గమనార్హం. కొత్త పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి అవసరమైన భూములు అందుబాటులో లేకున్నా కోటి రూపాయలకు ఎకరం చొప్పున భూసేకరణ జరిపి.. ప్రాజెక్టు వ్యయాన్ని పెంచి మరీ విజయవాడలోనే మరో కొత్త ప్రాజెక్టు (800 మెగావాట్ల) నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవడంపై తెలంగాణవాదులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో 4,000 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు అన్ని రకాల అవకాశాలున్నాయని వారు చెబుతున్నారు. గణనీయంగా విద్యుత్‌లోటు ఉన్న తెలంగాణ ప్రాంతంలో విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం విజయవాడలో వీటీపీఎస్‌లో ఏర్పాటుకు ప్రతిపాదించిన 800 మెగావాట్ల (స్టేజ్-5) పవర్‌ప్లాంట్‌ను, కృష్ణపట్నంలో రెండోదశ 800 మెగావాట్ల ప్లాంట్‌ను తెలంగాణకు మళ్లించాలని విద్యుత్‌రంగ నిపుణులు డిమాండ్ చేస్తున్నారు. అవసరమైతే ఏపీ జెన్‌కోకు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఒడిశాలోని సర్పల్‌నౌపారా, మధ్యప్రదేశ్‌లోని సులియారి బెల్వారీ బొగ్గు గనులను తెలంగాణ కొత్త ప్రాజెక్టుల కోసం మళ్లించేందుకు కేంద్రంతో సంప్రదింపులు జరపాలని సూచిస్తున్నారు.


గనులిక్కడ.. ప్రాజెక్టులక్కడా?
విజయవాడలోని వీటీపీఎస్‌లో స్టేజ్-5 ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన భూములు అందుబాటులో లేవు. ప్రస్తుతం అక్కడ (వీటీపీఎస్) కేవలం 85 ఎకరాలు మాత్రమే ఉంది. ఇప్పటికే వీటీపీఎస్‌లో 3,600 ఎకరాల భూముల్లో 1,760 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లు పనిచేస్తున్నాయి. వీటికి అదనంగా బీహెచ్‌ఈఎల్ జాయింట్ వెంచర్‌తో మరో 182 మెగావాట్ల ఇంటిక్షిగేటెడ్ గ్యాసిఫికేషన్ కంబైన్డ్ సైకిల్ పవర్ ప్లాంట్ (ఐజీసీసీపీపీ) నిర్మాణం చేపట్టాల్సి ఉంది. దీనికి అన్ని రకాల అనుమతులున్నాయి. ఇందుకోసం ఇంకా 230 ఎకరాల భూములు సేకరించాలని డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లో పేర్కొన్నారు. అంటే దీని కోసం భూ సేకరణ జరపాల్సి ఉంది. ప్రస్తుతం వీటీపీఎస్ పరిసరాల్లో ఎకరం భూమి వ్యయం కోటి రూపాయలకు పైగా ఉండడం విశేషం. అయినా వెనుకాడని ప్రభుత్వం.. అంత సొమ్ము వెచ్చించి భూములు సేకరించడం ద్వారా కొత్త పవర్ ప్రాజెక్టులను విజయవాడలోనే నిర్మించేందుకు ఆసక్తి చూపుతుండటం విశేషం. వీటీపీఎస్ పక్కనే మరో 800 మెగావాట్ల పవర్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేస్తున్నారు. కొత్త ప్రాజెక్టుల ప్రతిపాదనలను తాము స్వయంగా పరిశీలిస్తామని కేంద్ర విద్యుత్ అథారిటీ (సీఈఏ) కమిటీ ఏపీ జెన్‌కోకు సమాచారాన్ని అందించింది. అయితే కమిటీ వస్తే వాస్తవాలు (భూమి కొరత) వెలుగులోకి వస్తాయనే భయంతో కొత్త పవర్ ప్లాంట్ల నిర్మాణానికి అంగీకారం తెలియజేస్తూ ఆమోద లేఖ రాయాలని సీమాంధ్ర రాజకీయనేతలు సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీపై ఒత్తిళ్లు తీసుకు వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.


తెలంగాణలో భూసేకరణ సులువు
తెలంగాణలో కొత్త పవర్ ప్రాజెక్టు నిర్మాణాలకు భూపాలపల్లి, రామగుండం, కొత్తగూడెం విద్యుత్ ప్రాజెక్టుల పరిసరాల్లో కొన్ని వందల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం రామగుండంలో 600 ఎకరాల స్థలం అందుబాటులో ఉంది. దాని పక్కనే రాయగండి వద్ద 1,512 ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఇక్కడ భూ సేకరణ జరపాల్సి వస్తే ఎకరం ధర గరిష్ఠంగా రెండు లక్షలకు మించదని తెలంగాణ విద్యుత్‌రంగ నిపుణులు చెబుతున్నారు. వరంగల్ జిల్లా భూపాలపల్లి వద్ద కేటీపీపీ పరిసరాల్లో కొన్ని వందల ఎకరాల ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. కేటీపీపీ ప్లాంటు పక్కన ఉన్న దుబ్బపల్లి గ్రామాన్ని జెన్‌కో యాజమాన్యం దత్తత తీసుకుంది. ఇక్కడి వ్యవసాయ భూములకు గిట్టుబాటు ధర కల్పిస్తే విద్యుత్ ప్రాజెక్టుకు భూములు ఇచ్చేందుకు స్థానికులు సిద్ధంగా ఉన్నారు. ఇక్కడ భూసేకరణ జరపాల్సి వస్తే ఎకరం రూ.4లక్షల నుంచి రూ.5లక్షలకు మించదు. కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్)లో ప్రస్తుతం 1,720 మెగావాట్ల విద్యుత్ ప్లాంట్లు పనిచేస్తున్నాయి. స్థానికంగా మరో 8,600 ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. కానీ ప్రభుత్వం, జెన్‌కో యాజమాన్యం భూసేకరణకు అవసరమైన నిధులు తమ వద్దలేవని సాకులు చూపుతుండడం విశేషం.


బొగ్గు సింగరేణిది.. సోకు సీమాంధ్రది
తెలంగాణలో కడతామన్న ప్రాజెక్టులు ఎన్నో ఏళ్లుగా మూలుగుతునే ఉన్నాయి. బొగ్గు, నీరు లేని రాయలసీమలో ఆర్టీపీపీ కట్టారు. సింగరేణి బొగ్గుతో మణుగూరులో కట్టాల్సిన ప్రాజెక్టును తరలించి విజయవాడ వద్ద వీటీపీఎస్‌గా మార్చారు. తెలంగాణ ప్రాంతంలో 1400 మెగావాట్ల శంకరపల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టు గత పదేళ్ళుగా పడకేసింది. అన్నీ అనుమతులు పొందిన కరీంనగర్ జిల్లా నేదునూరు గ్యాస్ పవర్ ప్రాజెక్టు ఇప్పటికీ అతీగతి లేదు. సత్తుపల్లిలో 600 మెగావాట్ల థర్మల్ పవర్ ప్రాజెక్టు రాకుండా పోయింది. ఫలితంగానే తెలంగాణలో వ్యవసాయ, పారిశ్రామిక రంగాలు ఎదగాల్సినంత ఎదగలేకపోయాయని నిపుణులు చెబుతున్నారు. దాని పర్యవసానంగానే ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల ఉద్యోగ, ఉపాధి అవకాశాలను తెలంగాణ ప్రాంతం కోల్పోయిందని అంటున్నారు. మొత్తంగా తెలంగాణ ప్రాజెక్టులకు 13.17 మిలియన్ టన్నుల కోల్ లింకేజీ ఉండగా.. ఆంధ్రకు 13.31 మిలియన్ టన్నులు, రాయల సీమకు 8.07 మిలియన్‌టన్నుల లింకేజీ ఉండటం విశేషం.


సీమాంధ్రులదే పెత్తనం......
నేటికీ విద్యుత్‌రంగంలో చైర్మన్లు, డైరెక్టర్లు, ఉద్యోగులుగా అత్యధిక శాతం సీమాంద్రులే ఉన్నారు. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కమ్‌ల పరిధిలోనూ సీమాంధ్ర కాంట్రాక్టర్లదే ఆధిపత్యం. విద్యుత్ సంస్కరణల పేరుతో ప్రభుత్వరంగంలో విద్యుత్ ఉత్పత్తికి పాతర వేసిన టీడీపీ అధినేత చంద్రబాబు ప్రైవేటు రంగంలో విద్యుత్ ఉత్పత్తి (జనరేషన్)కి ప్రాధాన్యం ఇచ్చారు. తద్వారా సీమాంధ్ర పెట్టుబడిదారులు విద్యుత్ ప్రాజెక్టులు పెట్టుకునేందుకు అవకాశాన్ని కల్పించారు. ప్రభుత్వరంగంలో రావాల్సిన విద్యుత్ ప్రాజెక్టులు రాకుండా పోయాయి. ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో ప్రతిపాదించిన విద్యుత్ ప్రాజెక్టుల్లో ఏ ఒక్కటీ ఈనాటి వరకు ఆచరణకు నోచుకోలేదు.


విద్యుత్‌బోర్డు నుంచే కుట్రలు
విద్యుత్ సంస్కరణలకు ముందు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ బోర్డు (ఏపీఎస్‌ఈబీ) నాటి నుంచే సీమాంధ్రులు కుట్రలు కుతంత్రాల్లో ఆరితేరారు. విద్యుత్‌బోర్డు కాలంలో డైరెక్టర్లుగా పనిచేసిన ఎక్కువ మంది బినామీ పేర్లతో కాంట్రాక్టులు చేసిన ఆరోపణలు ఉన్నాయి. టీడీపీ పాలనలో విద్యుత్ బోర్డులో పదవీ విరమణ చేసిన ఉన్నతాధికారులను ప్రైవేటు ప్లాంటు యాజమాన్యాలు డైరెక్టర్లుగా నియమించుకున్నాయి. వారిచేత సీమాంధ్ర ప్రాజెక్టులకు అనుకూలంగా, భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు, సమస్యలు తలెత్తకుండా ప్రభుత్వంతో అనుమతులు తెప్పించుకుని.. ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ఆరోపణలు ఉన్నాయి.


జెన్‌కో ప్రాజెక్టులు రాకుండా..ప్రభుత్వరంగ సంస్థ ఏపీ జెన్ పరిధిలో కొత్త గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులు రాకుండా, ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టుల సామర్ధ్యం పెరగకుండా గుప్పెడు మంది సీమాంధ్ర పెట్టుబడిదారీ వర్గాలు అడ్డుకుంటున్నాయని తెలంగాణవాదులు ఆరోపిస్తున్నారు. కరీంనగర్ జిల్లా నేదునూరు గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టు, రంగారెడ్డి జిల్లాలో శంకర్‌పల్లి గ్యాస్ ఆధారిత విద్యుత్ ప్రాజెక్టులున్నాయి. నేదునూరు ప్రాజెక్టు నిర్మాణం కాకుండా చేసిన కుట్రలు అన్నీ ఇన్నీ కావు. ఈ ప్రాజెక్టు సకాలంలో పూర్తయితే 2100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరిగుండేది. దాంతో ప్రభుత్వరంగ జెన్‌కోకు పేరు ప్రతిష్టలు రావడంతోపాటు తెలంగాణ ప్రాంతం వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ముందుకు దూసుకు పరిస్థితులుండేవి. శంకర్‌పల్లి ప్రాజెక్టుకు భూ కేటాయింపులు ఏనాడో జరిగినా ఇప్పటికీ నిర్మాణం ఊసే లేదు. ఇంకా ఆ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమై ఉంది. ఈ ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలోనే భూ సేకరణ జరిగింది. తొలుత నాఫ్తా ఆధారంగా విద్యుత్ ఉత్పత్తి చేయాలని భావించారు. అది వ్యయంతో కూడుకున్నదని తదుపరి దానిని గ్యాస్ ఆధారితంగా మార్చారు. విశేషం ఏమిటంటే.. ఈ ప్రాజెక్టును కాదని 2003లో సీమాంవూధుల పవర్ ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులు జరిగాయి.

గ్యాస్ కేటాయింపులోనూ మతలబు
ల్యాంకో పవర్‌ప్రాజెక్టుకు గ్యాస్ కేటాయింపులోనూ ఎంతో మతలబు చోటుచేసుకుంది. వాస్తవానికి కాకినాడ వద్ద కట్టాల్సిన ల్యాంకో పవర్ ప్రాజెక్టును విజయవాడ సమీపంలోని కొండపల్లికి తరలించారు. పైగా ప్రభుత్వ వ్యయంతో ల్యాంకో కొండపల్లి ప్రాజెక్టుకు పైప్‌లైన్ నిర్మాణాలు జరిపారు. శంకర్‌పల్లి ప్రాజెక్టుకు వచ్చిన అభ్యంతరాలు ల్యాంకో ప్రాజెక్టుకు రాకపోవడంలోనూ చాలా వ్యవహారం నడిచింది. మర్చెంట్ పవర్ ప్రాజెక్టుగా ల్యాంకో ప్రాజెక్టుకు ఏపీ ట్రాన్స్‌కో సిఫారసు చేయలేదు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న కొన్ని పరిణామాలతో ల్యాంకోకు గ్యాస్ కేటాయింపుల కోసం ప్రభుత్వం చట్ట విరుద్ధంగా సిఫారసు చేసిందన్న విమర్శలు ఉన్నాయి. అలాంటి ల్యాంకో కొంతకాలం క్రితం జరిగిన సమ్మె కాలంలో రాష్ట్రానికి కరెంటు అందించకుండా తమిళనాడుకు అమ్ముకుంది. దీంతో కరెంటు కోతలు పెరిగి పంటలు ఎండిపోయాయి. రైతులు భారీగా నష్టపోయారు. పరిశ్రమలకు కోతలతో పారిక్షిశామిక ఉత్పత్తులు దెబ్బతిన్నాయి. వాటిల్లో పని చేసే రైతులు, కూలీలు, కార్మికుల ఉపాధిని దెబ్బతీసింది.


రాయలసీమ ప్రాజెక్టు
తెలంగాణలో విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి గ్యాస్, నీళ్లు లేవని సాకులు చెప్పిన పాలకులు నీళ్లు, బొగ్గు లేని రాయలసీమ ప్రాంతంలో రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు (ఆర్టీపీపీ) నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు సింగరేణి నుంచి బొగ్గు, దాదాపు 200 కి.మీ. మేర పైప్‌లైన్ నిర్మాణాలు చేపట్టి.. శ్రీశైలం ఎడమ కాలువ నుంచి పోతిరెడ్డిపాడు ద్వారా నీటిని అందిస్తున్నారు.


కొత్త ప్రాజెక్టులపైనే కోటి ఆశలు
తెలంగాణ ప్రాంతంలో మరో ఏడాదిలో వినియోగంలోకి వస్తాయన్న భావిస్తున్న జెన్‌కో విద్యుత్ ప్రాజెక్టులు రాష్ట్రంలో బొగ్గు, గ్యాస్ కొరతల కారణంగా నిర్దేశిత కాలానికి పూర్తి అయ్యే అవకాశాలు కనిపించడంలేదు. అదే నెల్లూరులోని కృష్ణపట్నం ప్రాజెక్టు వచ్చే నవంబర్ రెండో వారంలో విద్యుత్ ఉత్పత్తికి సిద్ధమవుతుండడం గమనార్హం. కృష్ణపట్నం ప్రాజెక్టుకు విదేశీ బొగ్గు దిగుమతులున్న విషయం తెలిసిందే. గ్యాస్ ఆధారంగానే ప్రణాళికలో ఉన్న కరీంనగర్‌లోని 700 మెగావాట్లు, శంకరపల్లిలోని 1,000 మెగావాట్ల ప్రాజెక్టుల మనుగడ ప్రశ్నార్థకంగా మారింది.

రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది నుంచి సోలార్, విండ్ పాలసీలను ప్రకటించినప్పటికీ ఆచరణలో వాటికి సంబంధించిన ప్రాజెక్టుల ఏర్పాట్లు చురుకుగా లేవు. 2013 మార్చి చివరాంతానికి ఏపీ జెన్‌కో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 8,924.86 మెగావాట్ల వరకు ఉంది. 11వ పంచవర్ష ప్రణాళిలో 1,994 మెగావాట్ల అదనపు విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకుని 2,374 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని చేర్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి మొదలయ్యే 12వ పంచవర్ష ప్రణాళికలో రూ.32,828 కోట్ల వ్యయంతో అదనంగా 7,110 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ప్రణాళికలతో కార్యాచరణను ప్రభుత్వం సిద్ధం చేసుకుంది. ఇందులో భాగంగా 2014 నాటికి కేవలం ఏపీ జెన్‌కో పరిధిలో అదనపు సామర్థ్యం ద్వారా 3,210 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తిని సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. సుమారు పదివేల కోట్ల రూపాయలతో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తి చేసేందుకు అంచనాలు రూపొందించుకుంది. ఇందుకోసం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ.4,119.33 కోట్లు ఖర్చు చేయాలని జెన్‌కో సంకల్పించింది. ఇలాంటి ప్రాజెక్టుల్లో నాగార్జునసాగర్ టెయిల్‌పాండ్ (50 మె.వా.) మొదలుకుని లోయర్ సీలేరు (240 మె.వా.), పులిచింతల (120 మె.వా.), కొత్తగూడెం స్టేజ్-2 (600 మె.వా.), ఆర్టీపీపీ స్టేజ్-4 (600 మె.వా.)తో పాటు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం (1,600 మె.వా.) పవర్ ప్రాజెక్టులున్నాయి. గత పదేళ్లకాలంలో ఏపీ జెన్‌కో అదనంగా 2,394 మె.వా. విద్యుత్ ఉత్పత్తిని సాధించగా, వచ్చే 12వ పంచవర్ష ప్రణాళిక కాలంలోని ఐదేళ్ళలో ఏకంగా 5,610 మె.వా. అదనపు విద్యుత్ ఉత్పత్తిని లక్ష్యంగా నిర్దేశించుకున్నది.


తెలంగాణ వ్యవసాయరంగం తెర్లు
వ్యవసాయరంగానికి ఏడు గంటల పాటు కరెంటు సరఫరా చేస్తున్నట్లుగా ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలకు, ఆచరణలో ఉన్న పరిస్థితులకు పొంతన లేకుండా పోతున్నది. దీంతో రైతాంగం పెట్టుకున్న ఆశలు ఆవిరవుతున్నాయి. తెలంగాణ జిల్లాల్లో బోరుబావుల్లో నీళ్లున్నా వాటిని తోడేందుకు కరెంటు లేకపోవడంతో కంటిముందే మొలక ఎండిపోతున్నది. కాలాన్నే నమ్ముకుని విత్తనం వేసిన అన్నదాత వరుణుడి కరుణ కోసం ఆకాశంవైపు ఎదురుచూస్తున్నాడు.

తాగునీటి అవసరాలను సైతం ఫణంగా పెట్టి డెల్టా ప్రాంతానికి మూడో పంట కోసం సాగర్ జలాలను వదిలిన సర్కార్.. తెలంగాణ ప్రాంత రైతాంగం పంటలను కాపాడేందుకు కరెంటును సరఫరా చేయడంలో మాత్రం ఆసక్తి చూపడం లేదన్న విమర్శలు వెల్లు తెలంగాణ జిల్లాల్లో వ్యవసాయమంతా భూగర్భజలాలపై అధారపడి ఉంది. బోరుబావుల నుంచి నీటిని తోడేందుకు కరెంటు తప్పనిసరి. అందుకే తెలంగాణలోని (హైదరాబాద్ మినహా) తొమ్మిది జిల్లాల్లో దాదాపు 17లక్షలకుపైగా వ్యవసాయ పంపుసెట్లు ఉన్నాయి. తెలంగాణలో వ్యవసాయరంగాన్ని విచ్ఛిన్నం చేసేందుకే కరెంటు సరఫరాలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్న అరోపణలు వెల్లు అవసరాల మేరకు విద్యుత్ కొనుగోలుపై ఆంక్షలు విధించడం, కొన్న విద్యుత్‌కు బకాయిల చెల్లింపులో తీవ్ర జాప్యంతోపాటు తెలంగాణ జిల్లాలకు నిర్దేశించిన విద్యుత్ కోటాలోనూ కోతలు విధించడం పరిపాటిగా మారిందని తెలంగాణ విద్యుత్ నిపుణులు చెబుతున్నారు. అదేసమయంలో తెలంగాణలోని సీమాంధ్ర కంపెనీలకు మాత్రం వారి అంచనాలకు మించి విద్యుత్ సరఫరా ఉండటాన్ని వారు ప్రస్తావిస్తున్నారు.


తెలంగాణపై నష్టాల నెపం
రాష్ట్రంలో విద్యుత్ పంపిణీ, సరఫరా టాన్స్‌మిషన్, డిస్ట్రిబ్యూషన్) నష్టాలు గణనీయంగా పెరిగిపోతున్నాయి. భూగర్భ జలాలపై ఆధారపడి విద్యుత్ అవసరాలు ఎక్కువగా ఉన్న తెలంగాణ జిల్లాల్లోనే విద్యుత్ పంపిణీ, సరఫరా నష్టాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. కానీ సీమాంధ్రలో పది శాతం లోపే విద్యుత్ నష్టాలున్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంటే కరెంటు నష్టాల నెపం తెలంగాణపై నెట్టివేసి పాలకులు సీమాంధ్రకు కరెంటు సుఖాలు అందిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తం అవుతున్నది. తెలంగాణ జిల్లాలోనే ఎక్కువ విద్యుత్ నష్టాలు ఉంటే యుద్ధ ప్రాతిపదికన వాటిని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సి ఉంది. కానీ.. అంతా బాగున్న సీమాంధ్రలో విద్యుత్ సరఫరాకు అవసరమైన మౌలిక సదుపాయాలు పెంచుకుంటూ పోవడంతో సీమాంధ్రలో నష్టాలు తగ్గుముఖం పడుతున్నట్లుగా తెలుస్తున్నది. తెలంగాణ ప్రాంతంలో దశాబ్దాల నాటి విద్యుత్ లైన్లు, పటిష్టంగా లేని సరఫరా వ్యవస్థతో నిర్ణీత పరిమితికి మించి విద్యుత్ నష్టాలు కొనసాగుతున్నాయి. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ పరిస్థితి కొనసాగేది కాదననే అభిప్రాయం ఉంది.

తెలంగాణ ప్రాజెక్టులు
తెలంగాణలో బొగ్గు నిల్వలు, నీటి లభ్యత ఉన్నా ఏర్పాటు కావాల్సిన విద్యుత్ ప్రాజెక్టులే రాకుండాపోయాయి. సత్తుపల్లిలో థర్మల్ ప్రాజెక్టు 2007లో తలపెట్టారు. నిజానికి చుట్టూ బొగ్గు ఉన్నా.. బొగ్గు కేటాయింపులు లేవనే సాకుతో ఈ ప్రాజెక్టు ఇంత వరకు అమలుకు నోచుకోలేదు. కరీంనగర్ జిల్లా నేదునూరు గ్యాస్ ఆధారిత ప్రాజెక్టుకు 2002లోనే అన్ని అనుమతులు వచ్చాయి. చిత్తశుద్ధి ఉంటే కేవలం 13 నెలల నుంచి 26 నెలల లోపు ఇది పూర్తయి ఉండేది. కేవలం గ్యాస్ కేటాయింపులు లేవనే సాకుతోనే నేదునూరు పవర్ ప్రాజెక్టు ముందడుగు వేయలేకపోయింది. ఇదే సమయంలో 2003లో సీమాంధ్రకు చెందిన నాలుగు గ్యాస్ పవర్ ప్రాజెక్టులు జీవీకే (220 మె.వా.), వేమగిరి (370 మె.వా.), గౌతమి (464 మె.వా.), కోనసీమ (445 మె.వా.) పవర్ ప్రాజెక్టులకు మాత్రం కేటాయింపులు జరిగాయి. తెలంగాణలోని 1400 మెగావాట్ల సామర్ధ్యం గల శంకర్‌పల్లి గ్యాస్ పవర్ ప్రాజెక్టుకు 2000 సంవత్సరంలోనే అన్ని అనుమతులూ వచ్చినా ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం పక్కన పడేసిందన్న ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో కంతనపల్లి పాటు మరికొన్ని హైడల్ ప్రాజెక్టులు సైతం ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఎక్కడివక్కడే నిలిచిపోయాయి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి