8, ఆగస్టు 2013, గురువారం

ఆంధ్రరాష్ట్రం ఆవిర్భావం ఇలా..


ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు కోసం 1914నుంచీ డిమాండ్ ఉంది. 1914 బాపట్ల సమావేశంతో ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్ష చాటడం మొదలైంది. ఆ తర్వాతి కాలంలో ఢిల్లీ లెజిస్లేటివ్ కౌన్సిల్‌లో ఆంధ్ర ఎంపీ ఒకరు పత్యేక రాష్ట్రం తీర్మానం ప్రవేశ పెట్టగా ఎవరూ మద్దతు పలకలేదు. కాంగ్రెస్ పార్టీ భాషారాష్ట్రాలకు మద్దతు పలికి స్వాతంవూత్యానంతరం అవి ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. స్వాతంత్య్ర సమయంలో మతవిద్వేషాలు రగిలి దేశం అతలాకుతలం కావడంతో ఈ ప్రతిపాదనను అటకెక్కించింది.

రాజ్యాంగ రచన సమయంలో ధార్ అధ్యక్షతన నియమించిన భాషా రాష్టాల సంఘం 1948 డిసెంబర్ 10న ఇచ్చిన నివేదికలో ‘ ఇపుడే కాదు.... భవిష్యత్తులో కూడా భాషారాష్ట్రాలు వద్దని సూచించింది. తీవ్ర నిరసనలు నెహ్రూ సూచనతో కాంగ్రెస్ పార్టీ తరపున జవహర్, పట్టాభి, పటేల్ సభ్యులుగా జేవీపీ కమిటీ ఏర్పాటైంది. ఈకమిటీ కూడా1949 ఏప్రిల్ 7న ఇచ్చిన నివేదికలో భాషారాష్ట్రాల ఏర్పాటు ఇపుడే వద్దని తేల్చి, ఆంధ్ర రాష్ట్రానికి మాత్రం మినహాయింపు నిచ్చింది. కేంద్రం అదే సంవత్సరం డిసెంబర్ 7న మద్రాసు ముఖ్యమంత్రి కుమారస్వామి రాజా నేతృత్వంలో 4గురు తమిళ 4గురు తెలుగు శాసనసభ్యులతో విభజన సంఘం ఏర్పాటు చేసింది. ఈ సంఘం మద్రాసులేకుండా 11 తెలుగు జిల్లాలతో రాష్ట్రం ఏర్పాటు చేయాలని సూచించగా సంఘంలో సభ్యుడైన ప్రకాశం దాన్ని వ్యతిరేకించాడు. నివేదికను కేంద్రానికి పంపించగా ఏకాభివూపాయం కుదరనందున సమ్మతించలేదు.

సమస్య పరిష్కారం కాకపోవడంతో స్వామిసీతారాం సత్యాక్షిగహ దీక్షకు పిలుపునివ్వగా నిరశన దీక్షలు జరిగాయి. చివరకు విసిగి పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష ప్రారంభించారు. 1952 డిసెంబర్ 10న పార్లమెంటులో ప్రధాని నెహ్రూ నిర్వివాద ప్రాంతాలతో రాష్ట్రం ఏర్పాటుకు సిద్దమని ప్రకటించారు. అయితే మద్రాసు విషయం తేల్చాల్సిందేనని శ్రీరాములు దీక్ష కొనసాగించి డిసెంబర్ 15 అర్దరాత్రి కన్నుమూయగా ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటుకు కేంద్రం స్పష్టమైన ప్రకటనచేసింది.

రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ ఇలా కొనసాగింది.....
1952 డిసెంబర్ 19: భారత ప్రధాని నెహ్రూ పార్లమెంటులో ప్రకటన చేశారు. ‘ రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ప్రకారం మద్రాసు రాష్ట్రంలోని తెలుగు ప్రాంతాలతో ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం నిశ్చయించింది. 1953 జనవరి నెలాఖరులోగా రాష్ట్ర ఏర్పాటుకు పాలన, ఆర్థిక సంబంధమైన, హద్దుల నిర్ణయం వంటి ఇతర అంశాలపైనా నివేదికను ఇచ్చేందుకు ప్రభుత్వం జస్టిస్ కే ఎన్ వాంఛూ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను నియమిస్తున్నది ’ అని నెహ్రూ ప్రకటించారు.

1953 జనవరి 5: జస్టిస్ కేఎన్ వాంఛూ మద్రాసుకు చేరుకుని పలువురు రాజకీయ నాయకుల అభివూపాయాలు నమోదు చేసుకున్నారు. తాత్కాలికంగా కూడా మద్రాసు రాజధానిగా ఇవ్వడానికి తమిళనాయకుల వ్యతిరేకత.
1953 జనవరి19: పాలనాంశాలపై దృష్టి సారించారు. అర్బివూటేటర్ హోదాలో ఆయన ప్రభుత్వ ఆస్తుల అంచనా పని ప్రారంభించారు. జిల్లాల వారీగా ఆదాయ అంచనాల వివరాలు అందించాలని అధికారులను ఆదేశించారు.
1953 జనవరి 20: ఆంధ్ర ప్రాంతంలో పర్యటించి రాజధాని నగరంపై ఒక అంచనాకు వచ్చారు.
1953 ఫిబ్రవరి 5: నివేదిక పూర్తయిందని వెల్లడించిన వాంఛూ. ఆంధ్రకు ఆర్థిక లోపం ఉందని వెల్లడి. ఆంధ్రవాటాకు వచ్చే 2.5 కోట్ల మాఫీకి సిఫారసు.
1953 ఫిబ్రవరి 7: ఢిల్లీ చేరుకున్న వాంఛూ. హోంమంవూతికి నివేదిక సమర్పణ. సుదీర్ఘ చర్చలు. పలుసూచనలు.
1953 ఏప్రిల్ 10: రాష్ట్రం ఏర్పాటుపై కేంద్రం కసరత్తు షురూ. కేంద్రం సలహా మేరకు నలుగురుసీనియర్ ఉద్యోగులతో విభజన సంఘం నియమించిన రాష్ట్ర ప్రభుత్వం. పర్యవేక్షణకు శాసనసభ్యులతో మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు.
1953 ఏప్రిల్ 16: విభజన సంఘం ప్రధాన కార్యదర్శితో భేటీ.ఉద్యోగులు, ఆర్థిక అంశాల్లో విభజనపై మంతనాలు. ఉద్యోగుల పంపిణీని పూర్తి చేసిన విభజన సంఘం.ఫర్నిచర్ రికార్డులన్నీ ఆంధ్ర, మద్రాసు రాష్ట్ర్రాల మధ్య పంపిణీ.
1953 మే 27: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు ముసాయిదా బిల్లు మద్రాసు, మైసూరు రాష్ట్రాలకు పంపిన కేంద్రం
1953 జూన్ 1: ఆంధ్రరాష్ట్రానికి రాజధాని నిర్ణయం కోసం అసెంబ్లీ ప్రత్యేక సమావేశం. కర్నూలు తీర్మానం ఆమోదం. జూలై 1నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వ పాలనా కార్యకలాపాలు ప్రారంభం కావాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశం.
1953 జూన్ 19: కర్నూలు వసతుల కల్పన కోసం ప్రత్యేకాధికారిగా డెవలప్‌మెంట్ కార్యదర్శి ఎల్ ఎం లోబో నియామకం.
1953 జూన్ 22: ఆంధ్ర, మద్రాసు రాష్ట్రాల మధ్య ఆస్తి అప్పుల పంపిణీ కోసం ఇండియా ఆడిటర్ జనరల్ రాక.
1953 జూన్ 26: ఆంధ్ర రాష్ట్రానికి ఉద్యోగులు, వారికి శాఖలు కేటాయింపు. బదిలీఉత్తర్వులు అందచేత.
1953 జూలై 14: మద్రాసు శాసనసభలో ఆంధ్ర రాష్ట్ర బిల్లు ప్రతిపాదన. చర్చవూపారంభం.
1953 జూలై 14: చివరి అంకానికి చేరిన రాష్ట్ర ఏర్పాటు. ఆంధ్రరాష్ట్రానికి స్పెషల్ ఆఫీసర్‌గా చందూలాల్ త్రివేది నియామకం. రాష్ట్ర కార్యకలాపాల నిర్వహణ, ఆవిష్కరణ ఏర్పాట్లు, ఉద్యోగులకు విధుల కేటాయింపు, వసతుల కల్పన బాధ్యతలు. ఇందుకోసం నిధుల కేటాయింపు. పరిస్థితిని అంచనావేసిన త్రివేది. కార్యాలయాలకు భవనాలు లేక 90 ఎకరాల స్థలం సేకరణ. 400 గుడారాల ఏర్పాటుకు సన్నాహాలు. మద్రాసులో దొరక్క పూనా నగరంనుంచి గుడారాలు తెప్పించిన త్రివేది.
జిల్లా కోర్టుఖాళీ చేయించి అసెంబ్లీకి కేటాయింపు. పాఠశాలల్లో శాసనసభ్యులకు వసతి. రహదారి గెస్ట్‌హౌస్ గవర్నర్‌కు.
1953 జూలై 18: ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా అకౌంటెంట్ జనరల్ నియామకం. కార్యాలయం ఏర్పాటు.
1953 జూలై 27: ఆంధ్ర రాష్ట్రం బిల్లును ఆమోదించిన మద్రాసు శాసనసభ. కేంద్రానికి సమర్పణ.
1953 సెప్టెంబర్ 10: రాష్ట్రాలు ఆమెదించిన బిల్లులను పరిశీలించి ఆమోదించిన కేంద్రమంవూతివర్గం.
1953సెప్టెంబర్ 12: పార్లమెంటులో ఆంధ్రరాష్ట్రం బిల్లుకు ఆమోదం. ఇక రాష్ట్రపతి సంతకమే తరువాయి.
1953 సెప్టెంబర్ 14: ఆంధ్రరాష్ట బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం. సాకారమైన ఆంధ్ర రాష్ట్రం. వార్త తెలిసిన వెంటనే పంచుకున్న రికార్డులు, పర్నిచర్‌తో 53 వ్యాగన్లలో కర్నూలుకు రైలులో పయనమైన తొలివిడత సరంజామా.
1953 అక్టోబర్ 1: గవర్నర్‌గా చందూలాల్ త్రివేది పదవీస్వీకారం. నూతన మంత్రివర్గం ప్రమాణం. ఆంధ్ర రాష్ట్రాన్ని జ్యోతి వెలిగించి ఆవిష్కరించిన ప్రధాని నెహ్రూ.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి