తెలంగాణవ్యాప్తంగా ఘనంగా నిర్వహణకు ఏర్పాట్లు..
- హైదరాబాద్‌లో విద్యా వంతుల వేదిక ఆధ్వర్యంలో గన్‌పార్క్ వద్ద నివాళులు
- చర్లపల్లిలో జయంతి సభ.. పాల్గొననున్న ప్రముఖులు
- కాకతీయ వర్సిటీలో స్మారకోపన్యాసం..
హైదరాబాద్, ఆగస్టు 5 (టీ మీడియా): తెలంగాణ జాతిపిత, తెలంగాణ ఉద్యమ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ జయంతి సభలు మంగళవారం తెలంగాణ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నారు. తెలంగాణ జేఏసీ, టీ ఉద్యోగ సంఘాల జేఏసీ, టీ పారిశ్రామిక వేత్తల సంఘం, తెలంగాణ విద్యావంతుల వేదిక, తెలంగాణ ఇంజినీర్స్ అసోసియేషన్, విద్యుత్తు ఇంజినీర్ల జేఏసీ తదితర సంఘాలు జయశంకర్‌సార్ జయంతి సభలను నిర్వహించనున్నాయి. జేఏసీ నాయకులందరూ ఈ సభలలో పాల్గొంటారు. అన్నీ జిల్లా కేంద్రాలలో జయశంకర్ జయంతి సభలను నిర్వహించాలని టీ జేఏసీ పిలుపు నిచ్చిన నేపథ్యంలో అక్కడా ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించనున్నారు.
మంగళవారం ఉదయం 11 గంటలకు గన్‌పార్క్‌లో తెలంగాణ విద్యావంతుల వేదిక ఆధ్వర్యంలో వివిధ సంఘాల నేతలు జయశంకర్‌సార్‌కు నివాళులర్పిస్తారు. తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమాన్ని, తెలంగాణ ఆత్మగౌరవ ఉద్యమంగా, ఆస్థిత్వ ఉద్యమంగా మలిచి, సిద్ధాంతీకరించి తెలంగాణ సిద్ధాంతకర్తగా మహోన్నత భూమికను పోషించిన జయశంకర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం తెలంగాణ పౌరులందరి బాధ్యతని టీ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ నిర్వహణ, విశాల ప్రజల సంఘటనను ఏర్పరిచేందుకు మార్గదర్శనం చేసి, ప్రాతిపదికను ఏర్పరిచిన జయశంకర్‌సార్ తెలంగాణలో మహోన్నతుడుగా నిలిచాడని తెలంగాణ విద్యావంతుల వేదిక అధ్యక్షులు మల్లేపల్లి లక్ష్యయ్య పేర్కొన్నారు. తెలంగాణ పారిశ్రామిక వేత్తల సంఘం సారథ్యంలో సాయంత్రం చెర్లపల్లి ఫేజ్-2లో జయశంకర్‌సార్ చౌరస్తా వద్ద సార్ జయంతి సభ నిర్వహించనున్నారు. తెలంగాణ పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షులు కే సుధీర్‌రెడ్డి ఈ సభకు అధ్యక్షత వహించనున్నారు.
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం, ‘నమస్తే తెలంగాణ’ ఎడిటర్ అల్లం నారాయణ, బీజేపీ సీనియర్ నేత సీహెచ్ విద్యాసాగరరావు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కే.నారాయణ, టీఆర్‌ఎస్‌ఎల్పీ నేత ఈటెల రాజేందర్, సీపీఐ(ఎంఎల్) న్యూడెమొక్షికసీ నాయకులు పీ సూర్యం, ఉద్యోగ జేఏసీ నేతలు దేవీప్రసాద్, శ్రీనివాస్‌గౌడ్, విఠల్, పిట్టల రవీందర్, శ్రీధర్, కత్తి వెంకటస్వామి, కారం రవీందర్‌రెడ్డి, అద్దంకి దయాకర్, కే రఘు, డీపీ రెడ్డి, టీ వెంక మణిపాల్‌రెడ్డి, అశ్వత్థామరెడ్డి, రాజేందర్‌రెడ్డి, బేతి సుభాష్‌రెడ్డి, ఎంబీ కృష్ణయాదవ్, నల్లా రాధాకృష్ణ, చర్లపల్లి పారిశ్రామిక వేత్తల సంఘం అధ్యక్షులు పీ చంద్రశేఖర్‌రెడ్డి, టీఈసీసీఐ అధ్యక్షులు ఎం వెంక కాప్రా చిన్న తరహా పరిశ్రమల సమాఖ్య అధ్యక్షులు పీ లక్ష్మీకాంతయ్య, పీవోడబ్ల్యూ నేత సంధ్య, ఎంపీజే అధ్యక్షులు హమీద్ మహ్మద్‌ఖాన్, పారిశ్రామిక వేత్తల సంఘం కార్యదర్శి ఎస్వీ రఘు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. రసమయి బాలకిషన్ సారథ్యంలో ‘తెలంగాణ ధూం..ధాం’, సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించనున్నారు.
కాకతీయ వర్సిటీలో స్మారకోపన్యాసం..
జయశంకర్‌సార్ జయంతిని పురస్కరించుకుని మంగళవారం కాకతీయ వర్సిటీలో మొదటి స్మారకోపన్యాసం జరగనుంది. డాక్టర్ జయశంకర్ మెమోరియల్ ఎండోమెంట్, గోల్డ్‌మెడల్ కమిటీ ఆధ్వర్యంలో ‘విజన్ ఆఫ్ ఏ న్యూ తెలంగాణ’ అంశంపై స్మారకోపన్యాసం నిర్వహించనున్నారు. ఇందులో ప్రొఫెసర్ హరగోపాల్, విరసం నేత వరవరరావు, ప్రొఫెసర్ శివలింగ ప్రసాద్, కాకతీయవర్సిటీ వీసీ బోడ వెంకటరత్నం పాల్గొని ప్రసంగించనున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి