30, ఆగస్టు 2013, శుక్రవారం

తెలంగాణ సంఘీభావ ఉద్యమాల చరిత్ర


8/25/2013 12:33:43 AM
ముంబై రిపోర్ట్
దేశ ఆర్థిక రాజధానిగా, అంతర్జాతీయ నగరంగా ప్రసిద్ధి చెందిన ముంబై మహా నగరాన్ని 200 ఏళ్ళ క్రితమే చారివూతక, సామాజిక అనేక కారణాల రీత్యా వలస వచ్చిన తెలంగాణ బిడ్డలు నిర్మించినట్లు చరిత్ర పరిశోధకులు తేల్చి చెప్పారు. అంతేకాకుండా భాష తెలియని భాషా ప్రాంతానికి చేరి అక్కడి సామాజిక, రాజకీయ, సాంస్కృతిక పరిస్థితులకు అనుగుణంగా అతికొద్ది కాలంలోనే మార్పు చెంది, అక్కడి ప్రజలతో మమేకమై నగర నిర్మాతల బిరుదు పొందడం, సంఘ సంస్కరణ, సాహితీ, సాంస్కృతిక, రాజకీయ రంగాల్లో అగ్రక్షిశేణి పాత్ర పోషించడం చరివూతలో అరుదైన, అనూహ్య అంశంగా పరిశోధకులు అభివర్ణించారు. ఇందులోనూ బడుగు, బలహీనవర్గాల వారికి చెందిన శ్రామిక జీవులు అత్యధికం కావడం మరీ విశేషం. బట్టల మిల్లు నగరంగా ప్రసిద్ధి చెందడంతో అప్పటికే బ్రిటీష్ వారి (ఈస్ట్ ఇండియా) వలస పాలన విధానాల మూలంగా గ్రామీణ చేతివృత్తులు కుంటు పడడంతో లక్షలాది తెలంగాణ నేత కార్మికులు షోలాపూర్, పూనేలాంటి నగరాలతో బాటు ముంబైకి వలసల నేపథ్య రూపంలో చేరుకున్నారు. నాటి నుంచి నేటికీ ముంబై - తెలంగాణ ప్రాంతానికి మధ్య అవినాభావ, రక్త సంబంధాలు మాతృనేల ప్రేమతో ఏదో ఒక రూపంలో కొనసాగుతూనే ఉన్నాయి.
udhymam
2009 డిసెంబర్ 9 ప్రకటనకు పూర్వమే తెలంగాణపై స్పష్టమైన రాజకీయ వైఖరితో ప్రొ॥ జయశంకర్ సిద్ధాంతాల ప్రేరణతో ముంబైలోని కొందరు సాహితీపరులు, సామాజిక న్యాయ ఉద్యమకారులు తమ ఉద్యమ కార్యక్షికమాలతో ముందు నిలిచారు. టీఆర్‌ఎస్ ఆవిర్భావం తెలంగాణ కవులు, రచయితలు, కళాకారుల ప్రేరణ, ధూంధాం, ఆటపాటల సాంస్కృతిక వెల్లువల వెలుగులో తొలిసారి 2007లో ముంబైలోని గోరేగావ్‌లో తెలంగాణ యువశక్తి ఆధ్వర్యాన భారీ ‘ధూంధాం’ కార్యక్షికమాన్ని ఏర్పరిచారు. ఇందులో ప్రముఖ కవులు, కళాకారులూ పాల్గొని ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. రసమయి బాలకిషన్, వంతడుపుల నాగరాజు, దేశపతి శ్రీనివాస్, అంద్శై, వరంగల్లు శ్రీనులతో పాటు 40 మంది కళాకారుల బృందం పాల్గొని ముంబైలో తెలంగాణ ఉద్యమాలకు ఊపిరినిచ్చింది. ఈ సందర్భంగా ‘ముంబై తెలంగాణ ధూంధాం’ సీడీని ఎన్నో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని విడుదల చేశారు. ఆ తర్వాత తెలంగాణ అంశంపై రిలయన్స్ కార్మికులు, భవన నిర్మాణ కార్మిక సంఘాల మద్దతుతో ముంబై పరిసర ప్రాంతాల్లో అనేక అవగాహన సదస్సులు తెలంగాణ అనుకూల కళాకారులు, రచయితల మద్దతుతో ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో 2009 డిసెంబర్ 9 ప్రకటనకు ముందే భావసారూప్యత గల తెలంగాణ వాదుల సమిష్టి కృషితో ‘ముంబై తెలంగాణ సంఘీభావ వేదిక’నే ఏర్పరిచారు. ఇందులో వివిధ ప్రాంతాలకు చెందిన నాయకులను ఎంపిక చేసి కన్వీనర్ల బాధ్యతలు అప్పగించి విస్తృత స్థాయిలో ముంబైలో తమ కార్యక్షికమాలు చేపట్టారు. దీనిలో భాగంగా 2009 డిసెంబర్ మొదటి వారంలో ముంబై ‘ఆజాద్ మైదాన్’లో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ నిరసన ప్రదర్శన జరిపారు.

ఆ తర్వాత డిసెంబర్ 9 చిదంబరం ప్రకటనతో ఉవ్వెత్తున సంబరాలు జరిపారు. కానీ, దాని వెను వెంటనే జరిగిన కృత్రిమ రాజీనామాల, ఉద్యమాల పరిణామాల మూలంగా నోటి వద్దకు వచ్చిన ముద్దను లాక్కెళ్ళిన గుప్పెడు పెట్టుబడిదారీ సీమాంవూధుల కుట్రల మూలాలు తెలుసుకొని తిరిగి 2013 జూలై 30న సీడబ్ల్యూఎస్ తీర్మాణాల వరకు విరామం లేకుండా పోరాడిన ఘనత ముంబై తెలంగాణ ఉద్యమ సంఘీభావ వేదికకు దక్కింది. ఈ వేదికతో అనుబంధం పెంచుకొని ఆ తర్వాత స్వతంవూతంగా ముంబై తెలంగాణ బహుజన ఫోరం టీఆర్‌ఎస్ ఐక్యకార్యాచరణ సమితులు ఏర్పడి మరింత విస్తృత స్థాయిలో పనిచేశాయి. ముంబై తెలంగాణ కళాసాహితీ, ముంబై తెలంగాణ రచయితల వేదిక, ముంబై తెలంగాణ విద్యావంతుల వేదిక, ముంబై తెలంగాణ కార్మిక సంఘాల సహకారాలతో సుమారు 300లకు పైగా నిరసన, మృతవీరుల సంతాప సభలు, ధర్నాలు, వినతిపవూతాలు, అవగాహన సదస్సులు, ధూంధాం సాంస్కృతిక కార్యక్షికమాలు నిర్వహించారు. వీటితో పాటు నవంబర్ 1 విద్రోహదినం, తెలంగాణ యోధుల స్మృతి సభలూ జరిపారు.

2007 జనవరి 27వ తేదిన గోరేగావ్‌లో ఎనిమిది వేలమందితో తెలంగాణ యువశక్తి వేదిక ద్వారా అంద్శై, రసమయి, దేశపతి, నాగరాజు, శ్రీనులతో ప్రారంభమైన ధూంధాం 2010 ఆగస్టు 13 బాంద్రా ధూంధాంకు చేరే లోపుల తెలంగాణ సంఘీభావ వేదిక ఏర్పాటైంది. దాని ఆధ్వర్యాన తెరవే ప్రస్తుత అధ్యక్షులు జూలూరి గౌరీశంకర్ ముఖ్య అతిథిగా సంధ్య, వంతడుపుల నాగరాజు, విమలక్క, దరువు ఎల్లన్నల కళాబృందాలతో బాంద్రాలో సుమారు 18,000 మంది జనం సమీకరణతో భారీ ప్రదర్శన నిర్వహించారు.

చారివూతాత్మకమైన ఆగస్టు 13 ధూంధాంలో తెలంగాణ (ముంబై) కళామంచ్, నవోదయ, రిలయన్స్ కార్మిక సంఘం, బాంద్రా కార్మిక సంఘం ఎమ్‌టిఎస్‌వి నేతృత్వంలో అ.భా.తెరవే అధ్యక్షులు మచ్చ ప్రభాకర్, ఎం.టి.బి.ఎఫ్. కన్వీనర్ మూలనివాసి మాల, గ్యార శేఖర్, ఎలిజాల శ్రీను, మారంపెల్లి రవి, పిట్టల గణేష్, సత్తయ్య, దేవానంద్, రాజేశ్వర్ నాయకుల సమిష్టి కృషితో లక్షల ఖర్చుతో కూడిన ధూంధాం (బాంద్రా) నిర్వహించారు. ఆ పిదప వాషి, న్యూముంబైలో బద్ది హేమంత్ ‘తెలంగాణ టుడే’ పత్రిక ప్రారంభించడం వేదికలో పనిచేసి టిఆర్‌ఎస్‌ను ఏర్పరిచినా అక్కడ దరువు ఎల్లన్న బృందంతో మరో ధూంధాం సంఘీభావ వేదిక ఆధ్వర్యాన నిర్వహించారు. ఇక వరుసగా డోంబివలీలో వెయ్యి మందితో, జూహు, గోరేగావ్, ప్రతీక్షనగర్, ఖార్, ఘట్‌కోపర్ లాంటి అనేక తెలంగాణ ప్రజలున్న ప్రాంతాల్లో నిరసనలు, అవగాహన సదస్సులు, సంతాప సభలు నిర్వహించారు. ముఖ్యంగా ఇందులో భవన నిర్మాణ కార్మికుల, రిలయన్స్ కార్మికుల పాత్ర మరువలేని త్యాగం.

ముంబైలో ఉద్యమం విస్తరించి ఆత్మ బలిదానాల పరంపర కొనసాగుతున్న దశలోనే తెలంగాణ ఉద్యమ సంఘీభావం విస్తరించి సరికొత్త నాయకులను అందించింది. ఆందులో గొండ్యాల రమేష్, అక్కన దుర్గేశ్, మారంపెల్లి రవి, వెంక బాధ్యతాయుతంగా ప్రవర్తించి ఉద్యమాన్ని మరింత విస్తృతి చేయటంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ఇదే దశలో కంటె అశోక్, వేదిక ఆధ్వర్యాన వర్లీలో అక్కడి కొన్ని వర్గాల వారిని కలిపి తెలంగాణ అమరుల సంతాప దినం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత రసమయి బృందంతో ధూంధాం నిర్వహించారు. ప్రముఖ ధూంధాం కళాకారుడు ఎం.రవి చొరవతో జుహులోని ఏడు ప్రాంతాల ప్రజలను సమీకరించి తొలిసారి ముంబై ‘జెఎసి’ని తెలంగాణలోని టి.జెఎ.సి.కి అనుబంధంగా ఉండాలన్న దూరదృష్టితో వేదిక, ఈ వ్యాస రచయిత, స్వామిగౌడ్, నారాయణగౌడ్, సాయిబాబా తదితరుల కృషితో ఏర్పాటు చేసిన పిదప మరో జెఎసి సహితం ఏర్పడి తమ కార్యక్షికమాలతో తెలంగాణ సంఘీభావం కోసం విస్తృత స్థాయిలో కృషిచేశాయి.

తెలంగాణ విద్యావంతుల వేదిక డా॥ శ్రీధర్, తెరవే రచయితలు బెల్లి యాదయ్య, కార్యదర్శి సూరేపల్లి సుజాత, గోగు శ్యామల, అన్నవరం దేవేందర్ లాంటి ఎందరో ప్రముఖ రచయివూతులు, రచయితలతో ఎమ్.టి.ఎస్.వి. సభలు నిర్వహించింది.జనవరి 19, 2013 టిఎన్‌జీవో చైర్మన్ దేవీవూపసాద్, కార్యదర్శి కె.రవీందర్‌డ్డి, రేచెల్, కె.రంగరాజు, వెంక విజయలక్ష్మీ బృందం ముంబై దర్శించినప్పుడు సుమారు 62 సంఘాలతో దాదర్ దేవరాజ్ హాలులో ‘స్వాగత సభ’ను వేదిక ఏర్పాటు చేసింది. ఆ రోజు కోదండరాం (చ్మైన్ టిజెఎసి) సందేశాన్ని ఫోను ద్వారా దేవీవూపసాద్ సభలో పాల్గొన్న వందల తెలంగాణ కార్మిక ప్రజలకు వినిపించారు. ఇంతేగాక మిలియన్ మార్చ్, సమరదీక్ష, చలో అసెంబ్లీ లాంటి అనేక టిజెఎసి పిలుపులకు స్పందించి ముంబైలోని వేదిక, ఎం.టి.బి.ఎఫ్., జెఎసి తదితర నాయకులు హాజరై తమ సంఘీభావం తెలియజేశారు.కాగా, గత జూలై 30 సీడబ్ల్యూసీ తెలంగాణ ఆమోదముద్ర ప్రకటనతో ముంబైలోనూ వర్లీ, సయాన్, దోబీఘాట్, కంపెనీ గేట్ల వద్ద పెద్ద ఎత్తున టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచుకొని సంబరాలు చేసుకున్నారు. వివిధ తెలంగాణ ఉద్యమ సంఘాలతో పాటు ఇంతకాలం తటస్థంగా ఉన్న కొన్ని ప్రధాన కుల సంఘాలు ఆలస్యంగానైనా సరే, ఖుషీతో సంబరాలు జరుపుకోవడం విశేషం. చిట్ట చివరగా జూలై 31న సుమారు మూడు వందల మంది తెలంగాణ వాదులతో ‘తెలంగాణ సాధన సమారంబ’ సభను మాటుంగా శివాజీనగర్ సొసైటీ హాలులో స్థానిక తెలంగాణ కార్పొరేటర్, నాయకులతో ధూంధాం సాంస్కృతిక కార్యక్షికమాలను తెలంగాణ శ్రమజీవి సంఘం, పలు కార్మిక సంఘాల ఆధ్వర్యాన సంయుక్తంగా ఉత్తేజ పూరితమైన సభను ఏర్పాటు చేయడమూ విశేషమే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి