1. 2500 సంవత్సరాల తెలుగు జాతి చరిత్రలో 2200 ఏండ్లు తెలంగాణ
విడిగానే ఉంది.
ఇది నూటికి నూరు పాల్లు నిజం. రాతిశిలాయుగం నుంచి ఆంధ్రప్రదేశ్ అవతరణ వరకు
చరిత్ర చదివితే విషయం అర్థమౌతుంది. రాతిశిలాయుగం నాటి ఆనవాల్లు కూడా ప్రస్తుతం
కరీంనగర్లో ఉన్న కాలేశ్వరం, వరంగల్ జిల్లాలో ఉన్న ఏటూరునాగారం, ఖమ్మం
జిల్లాలో ఉన్న భద్రాచలం ప్రాంతాల్లోనే దొరికాయి.
ఇప్పటికీ రాతిశిలాయుగం లో సీమాంధ్రలో నాగరికత ఉన్న ఆనవాల్లే లేవు. భారతదేశం
అనే భావన మగద సామ్రాజ్యంలో మొదటిసారి వచ్చింది. దేశవ్యాప్తంగా ఉన్న
16 రాష్ట్రాలు భారతదేశంలో భాగమయ్యాయి. వాటినే 16 జనపదాలు అన్నారు.
ఆపదహారిట్లో
ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలోని బోధన్ గా పిలుస్తున్నా అశ్మక-ములక రాజ్యాలు.
అప్పుడు మగద సామ్రాజ్యంలో సీమాంధ్ర ప్రాంతాలు లేవు.
మొత్తం చరిత్ర చూసుకుంటే శాతవాహనుల కాలంలో వంద సంవత్సరాలు, కాకతీయుల కాలంలో యాభై సంవత్సరాలు, గోల్కొండ కుతుబ్ షాహి పాలనలో నూటా ఇరవై సంవత్సరాలు మాత్రమే
ఆంధ్రా, రాయలసీమ, తెలంగాణ కలిసున్నాయి.
ఇక నిజాం పాలనతో రాయలసీమ, ఆంధ్రా ప్రాంతాలు ఎక్కువ రోజులు లేవు.
1724లో నిజాం పాలన ప్రారంభమైంది. ముజఫర్ షా కాలంలోనే ఆంధ్రా, రాయలసీమ జిల్లాలు ఫ్రెంచ్,బ్రిటీష్ పాలనలోకి
వెల్లిపోయాయి. ఇదంతా 1749 నుండి జరిగిన పరిణామం. అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ ఏర్పడే
వరకు విడివిడిగానే ఉన్నాం. నిజాం పాలన 1724 నుండి 1948 వరకు సాగింది. అదంతా
తెలంగాణ ప్రాంతంలోనే ఉంది. కుతుబ్ షాహీల నుంచి పాలన నిజాంలకు మారే కాలంలో కేవలం 20
ఏండ్లు మాత్రమే అన్ని ప్రాంతాలు కలిసున్నాయి.
5. నెహ్రూ విలీనానికి వ్యతిరేకం
1956 మార్చి 5 న నిజామాబాద్ లో భారత్ సమాజ్ సమావేశం ఉదయం, సాయంత్రం సెషన్స్ లో జరిగాయి. ఉదయం సెషన్లో ఆంధ్ర ప్రదేశ్
ఏర్పడటాన్ని నిరసిస్తూ నినాదాలు వచ్చాయి. దీనికి స్పందించిన నెహ్రూ ఆంధ్రా తుంటరి
అబ్బాయికి అమాయకపు తెలంగాణ అమ్మాయికి పెళ్లి జరిగిందని వ్యాఖ్యానించారు. ఐతే
నెహ్రూ ముందుగా రాసుకొచ్చిన స్పీచ్ లో అది లేదు. ఈవ్యాఖ్యలను అప్పటికప్పుడు నెహ్రూ
చేశారు. ఇండియన్ ఎక్స్ ప్రెస్ బాంబే ఎడిషన్లో ఈవినింగ్ ఎడిషన్లో ఈ వార్త కూడా
వచ్చింది. ఆసభలో పాల్గొన్న పండిట్ నారాయణరెడ్డి , సరోత్తమరావు ఇంకా
బతికే ఉన్నారు.
నిజామాబాద్ మీటింగ్లో మాట్లాడిన దానికన్నా ఎక్కువగానే
కర్నూలు, హైదరాబాద్ లో జరిగిన సమావేశాల్లో నెహ్రూ స్పందించారు. ఆంధ్ర
తెలంగాణ కలపాలనే ఆలోచన వెనుక సామ్రాజ్య విస్తరణ వాద కాంక్ష ఉందని నెహ్రూ చెప్పారు.
దానికి సంబందించిన ఆధారాలు, పేపర్ కటింగ్స్ ఉన్నాయి.
8. ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు తెలంగాణ ప్రజల అభిమతానికి వ్యతిరేకం
· ఇది ముమ్మాటికి నిజం. హైదరాబాద్ అసెంబ్లీ తీర్మానాన్ని
సాకుగా చూపుతున్నారు. ఆరోజు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేయలేదు. 29 మంది సభ్యులు
వ్యతిరేకించారు. 15 మంది తటస్థంగా ఉన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వర్ రావు లాంటి ఆంధ్ర నాయకుల నాయకత్వంలో ఉన్న
ఎక్కువ మంది కమ్యూనిస్ట్ సభ్యులు తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశారు. అప్పటి నుండి
ఇప్పటిదాకా ఆంధ్ర నాయకుల పెత్తనంలో ఉన్న రాజకీయపార్టీల వల్లే తెలంగాణ నష్టపోయింది.
అసెంబ్లీ తీర్మానాలు కూడా వారికి అనుకూలంగానే చేసుకుంటున్నారు.
ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ ఉద్యమం ఆంధ్రకు వ్యతిరేకం
ఇడ్లీ సాంబార్ ఉద్యమం 1952లో జరిగింది. అప్పటికి ఇంకా ఆంధ్ర రాష్ట్రం
ఏర్పడలేదు. 1953 లో ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. 101 అబద్దాలు అనే పుస్తకాన్ని
విడుదల చేసిన సంజయ్ బార్ తండ్రి బీపీఆర్ విఠల్ , విఠల్ తండ్రి
లాంటి వారు ఐఏఎస్ అధికారులుగా ఉండి తెలంగాణ ప్రాంతానికి అన్యాయం చేస్తుండటంతోనే ఈ
ఉద్యమం వచ్చింది. రాజమండ్రికి చెందిన బీపీఆర్ విఠల్ , సంజయ్ బార్, వారి
కుటుంబసభ్యులు అప్పటి కసిని ఇప్పుడు తీర్చుకుంటున్నట్లు కనిపిస్తోంది. ఖమ్మం
తర్వాత ప్రాంతమంతా అప్పుడు మద్రాసులోనే ఉండేది. వాల్లను మద్రాసీలని, ఇడ్లీ సాంబార్ గాండ్లని పిలిచేవారు. వారికి వ్యతిరేకంగానే
ఉద్యమం వచ్చింది.
భాషా సంస్కృతి
16. సీమాంధ్ర, తెలంగాణ ప్రజలు భిన్నమైన వారు. వారి
సంస్కృతులు వేరు.
దీనికి కోటి ఉదాహరణలు చెప్పవచ్చు. మా చరిత్ర వేరు. సంస్కృతి వేరు. భాష వేరు.
పండుగలు వేరు. మేము ఆశ్వయుజ మాసంలో ప్రతీ ఊర్లో బతుకమ్మ ఆడతాం. మీరు ఆడతారా. మాకు
బోనాల సంస్కృతి ఉంది. మీకు ఉందా. మీకు అట్లతద్దె పండుగ ఉంది. మేము ఆ పండుగ ఎక్కడైన
ఆడంగా చూశారా.
19. రెండెన్నర జిల్లాల ప్రజల భాషను రాష్ట్రమంతా బలవంతంగా రుద్దుతున్నారు.
ఇది ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రజలతో పాటు తూర్పుగోదావరి
జిల్లాలోని కోనసీమ ప్రజలు, పశ్చిమగోదావరి జిల్లాలోని పోలవరం ప్రాంత
ప్రజలు కూడా ఒప్పుకొని తీరుతున్న విషయం. సినిమాలు , సాహిత్యం, నవలలు, నాటకాలు, టీవీలు, పేపర్లు అన్నింట్లో ఈ భాషే ఉంది. వాస్తవానికి మీరు మాట్లాడే
భాషను మా తెలంగాణలో మాట్లాడితే బూతులు వస్తాయి. మీరు కొల్లి , బొంగు, బద్ద, బుల్లి అంటారు. అవి మా దగ్గర పచ్చి
బూతులు. మీరు గేదె అంటే మేం బర్రె అంటం. మీరు దిండు అంటే మేం మెత్త అంటం. ఇట్ల
చెప్పుకుంటూ పోతే శతకోటి మాటలకు పొంతనే ఉండదు.
22. నిజాంపాలనలో భాషా స్వేచ్ఛ ఉంది.
ఉర్దూ అధికార భాషగా ఉన్నా నిజాం రాజ్యంలో భాష స్వేచ్ఛ ఉంది. 1901లోనే వరంగల్లో
రాజరాజనరేంద్ర గ్రందాలయం ఏర్పడింది. సుల్తానాబాద్ లో శ్రీకృష్ణదేవరాయ గ్రంథాలయ
స్థాపన జరిగింది. 1946 వరకు నిజాం రాజ్యంలో 11 ఆంధ్ర మహాసభలు జరిగాయి. తెలుగు భాష
ఉద్యమానికి నిజాం రాజులు అడ్డుపడలేదు. తెలుగు భాషలో విద్యాబోధన కూడా జరిగింది.
ఇప్పుడు మేము సమావేశాలు పెట్టుకుందామన్నా సీమాంధ్ర సర్కారు అనుమతివ్వటం లేదు కానీ
అప్పుడు నిజాం రాజులు తెలుగు భాష ఉద్యమానికి సంబందించిన సమావేశాలకు అనుమతి, అవకాశాలిచ్చారు.
23. కవులకు గుర్తింపు లేదు. ట్యాంక్ బండ్ మీద విగ్రహాల ఏర్పాటులో వివక్ష
మొత్తం 32 విగ్రహాలుంటే అందులో 24 సీమాంధ్రులవే. శ్రీశ్రీ, జాషువా లాంటి వారు గొప్పవారే. కానీ ప్రభుత్వ ఆస్థాన కవిగా కూడా ఉన్న దాశరధిని ఎందుకు విస్మరించారు. పుట్టు
గిరిజనుడైన కొమురంభీం పోరాట యోధునిగా ఎందుకు కనిపించ లేదు. ట్రైబల్ కాకున్నా కోయ
వీరుడిగా అల్లూరికి ఇచ్చిన గౌరవం కొమురంభీం కు దక్కిందా. చాకలి ఐలమ్మ, దొడ్డి కొమురయ్య లాంటి ఎందరో పోరాట యోధుల
విగ్రహాలు ఎందుకు పెట్టలేదు.
24. తెలుగు సినీ పరిశ్రమ ఆంధ్ర వాళ్ల చేతుల్లోనే ఉంది.
ఇది నూటికి వెయ్యిపాళ్లు నిజం. దీనికి వేరే సాక్ష్యాలు, ఆధారాలు కూడా
అవసరం లేదు. ఇప్పుడున్న నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఎవరు ? ఎక్కడ నుండి వచ్చారు? జైఆంధ్ర ఉద్యమంలో పాల్గొన్న కృష్ణకు పద్మాలయ స్టూడియో
పేరుమీద హైదరాబాద్లో భూమి ఇచ్చారు. నాగేశ్వర్ రావు అన్నపూర్ణ స్టూడియో, రామానాయుడు స్టూడియో, రామోజీరావు
ఫిలింసిటీ లకు స్థలం ఇచ్చారు. ఒక్క తెలంగాణ ప్రోడ్యూసర్ కైనా ఈ ప్రొత్సాహం
దొరికిందా. సినిమాల్లో తెలంగాణ భాషను అవమానించటం లేదా? తెలంగాణ
ఇతివృత్తంతో సినిమాలు తీస్తే మీరు కనీసం డబ్బింగ్ స్టూడియోలను కూడా దొరకనీయట్లేదు.
ధియెటర్లు ఇవ్వటం లేదు. ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ఆ సినిమాలను
ఆడనివ్వటం లేదు. కానీ మేం ఎన్టీఆర్ ను ఆయన కొడుకులను, మనవళ్లను భరించాలి. నాగేశ్వర్ రావు, కృష్ణ లాంటి కుటుంబాలను చూసి తరించాలి. ఇదెక్కడి న్యాయం?
ఆర్థికం
29. నిజాం పాలనలో తెలంగాణ ఆంధ్ర కంటే ఆర్థికంగా బలంగా ఉంది.
ఈ విషయాన్ని 101 అబద్దాలు పుస్తకాన్ని ఆవిష్కరించిన సంజయ్ బారు తండ్రి బీపీఆర్
విఠల్ స్వయంగా రాసిన తెలంగాణ సర్ ప్లస్ అనే పుస్తకంలోనే వివరించారు. ఆంధ్ర ప్రదేశ్
కు చీఫ్ సెక్రెటరీగా పనిచేసిన విఠల్ 1956 నుండి 1967 వరకు 62 కోట్ల ఆదాయాన్ని
ఆంధ్రకు తరలించినట్లు అధికారికంగానే వెల్లడించాడు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు
హైదరాబాద్ రాష్ట్ర బడ్జెట్ 16 కోట్లైతే, ఆంధ్ర రాష్ట్రం
బడ్జెట్ 8 కోట్లు.
ఇంకొన్ని నిజాలు.......
ఆంధ్ర రాష్ట్ర ఆర్ధిక స్థితి ఏమాత్రం బాగాలేదు. మున్ముందు
బాగుపడే పరిస్థితి కూడా లేదు. ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేని దుస్థితి – కర్నూలు రాజధానిగా ఉన్న ఆంధ్ర రాష్ట్ర ఆర్ధిక
స్థితిగతులపై డిసెంబర్ 3 -1954న ఆంధ్ర పత్రిక సంపాదకీయం!
ప్రస్తుతం మనం 18 కోట్ల లోటు బడ్జెట్‌తో ఉన్నాం. కేంద్రం
ఆదుకుంటే తప్ప ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేం.- ఆంధ్రా అసెంబ్లీలో 1953 నవంబర్ 5న నీలం
సంజీవరెడ్డి
ఎక్కడికి వెళ్లినా ప్రజలు సాగునీరు, కరెంటు అడుగుతున్నారు.
ఎక్కడి నుంచి తేగలం. –ఆంధ్రా అసెంబ్లీలో 1954
ఫిబ్రవరి 25న నీలం సంజీవరెడ్డి.
ఆంధ్ర రాష్ట్రంలో రాజధాని కార్యాలయాలు కాదుగదా.. కనీసం
జిల్లా ఆఫీసులు కూడా పెట్టుకునే స్థలం కూడా లేదు- కర్నూలు వాస్తవ స్థితిపై 1953
మార్చి 13న ఆంధ్ర పత్రికలో కడప కోటిరెడ్డి.
హైదరాబాద్ వస్తే మన బాధలన్నీ తీరుతాయి. అయితే అది ఎట్లా
వస్తుందో ఎక్కడి నుంచి ప్రయత్నించాలో మనం ఆలోచించుకోవాలి.- టంగుటూరి ప్రకాశం(ఆంధ్ర
పత్రిక -02-06-1953)
కర్నూలు వాళ్లు ఎప్పుడు హైదరాబాద్ పోదామా అని ఉత్సాహం
చూపుతున్నారు. మా వూరి నుంచి రాజధాని పోతోందనే బాధ ఎవరికీ లేదు. గత రెండేళ్లలో
చాలా అవస్థలు పడ్డాం. కార్యాలయాలకు వసతుల్లేవు. ఫజల్ అలీ సిఫారసుల ప్రకారం మరో ఐదేళ్లు ఆగితే ఆంధ్రాకు
కష్టాలు తప్పవు- నీలం సంజీవరెడ్డి( 09-08-1954-ఆంధ్ర పత్రిక)
"భాషాప్రయుక్త రాష్ట్రం" అనే పిడివాదం ఎందుకు?
ఇకతెలంగాణా ప్రాంతంలో ముస్లింలు 40 లక్షలు, క్రిష్టియన్లు 4 లక్షలు, జైనులు 20 వేలు, బౌద్ధులు 30 వేలు, సిక్కులు24 వేలు, హిందువులు 3 కోట్లు సుమారుగా ఉంటే, అందులో దాదాపు 30 లక్షల జనాభా కలిగియున్న ఎరుకల, బంజారా, కోయ, గోండు, చుంచు తదితర షెడ్యూల్ తెగలకు చెందినవారేగాక ఆరె, ఒడ్డెర, బలిజె, గాండ్లలాంటి అట్టడుగు వర్గాలకు చెందిన స్థానికులు, కన్నడ, మలయాళం,తమిళం, మరాఠీ, మార్వాడి, పంజాబీ, హిందీ, ఒరియా, గుజరాతీ తదితర భాషల్లో మాట్లాడే రాష్ట్రేతరులు తెలంగాణలోనే ఎక్కువగా స్థిరపడ్డారు, తెలంగాణ వారితో సఖ్యంగా సహజీవనం చేస్తున్నారు. వారందరి మాతృభాష "తెలుగు కానప్పుడు, వీరందరితో భాషా-భావోద్వేగాలకు, కుల-మత వర్గ వైషమ్యాలకు ఆస్కారం కల్పించే మా తెలుగు తల్లి
నిజాతీయ గీతం వలె అన్ని విద్యాసంస్థల్లో, అధికారిక ఉత్సవాల్లో స్థుతించాలని బలవంతంగా రుద్దే ప్రయోగం ఎందుకు చేస్తున్నట్లు?
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి