- ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టిన చంద్రబాబు
- సభాసంఘం వేసి చేతులు దులుపుకున్న వైఎస్సార్
- స్వాధీనం చేసుకోవాలన్న సభాసంఘం..హైకోర్టుదీ అదే తీర్పు
- ఏడేళ్లయినా స్పందించని ‘సమైక్య’ పాలకులు
- తెలంగాణ రాష్ట్రంలోనే నిజాం షుగర్స్‌కు పూర్వవైభవం
బోధన్, ఆగస్టు 29 (టీ మీడియా):కలిసి ఉందామంటూనే సమైక్య పాలకులు తెలంగాణ కు తీరని అన్యాయం తలపెట్టారు. తెలంగాణలోని ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రముఖమైన నిజాం షుగర్స్ లిమిటెడ్ దీనికి ప్రత్యక్ష ఉదాహరణ. తెలంగాణ వారసత్వ సంపదగా వెలుగొందిన నిజాం షుగర్స్ అస్తిత్వాన్ని దెబ్బతీసి మెజార్టీ వాటాను ప్రైవేట్‌వ్యక్తులకు అంటగట్టడం సమైక్యపాలకులకే చెల్లింది. కంపెనీలు నష్టాల్లో ఉంటే ఆదుకోవాల్సిన సర్కారు, ఏకంగా అమ్మేయడం ఆంధ్రాబాబుల పాలనలో యథేచ్ఛగా కొనసాగింది. తిరిగి స్వాధీనం చేసుకోవాలని శాసనసభా సం ఘం, హైకోర్టు ఆదేశించి ఏడేళ్లు గడుస్తున్నా నేటికీ స్పందన లేదు. తెలంగాణను అభివృద్ధి చేస్తామంటున్న సమైక్యవాదు లు దీనికి ఎం సమాధానం చెబుతారో? రూ.300 కోట్ల విలువున్న కంపెనీని కారుచౌకగా రూ.67 కోట్లకే మెజార్టీ వాటా ను ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టేయడం వలసపాకులకే చెల్లిం ది. తెలంగాణలోని పరిక్షిశమలపై ప్రైవేట్‌వ్యక్తుల గుత్తాధిపత్యానికి రెడ్‌కార్పేట్ పరిచి పూర్తిగా ప్రైవేటీకరించేందుకు పావులు కదుపుతున్నారు. ఇంకా సమైక్యంగా ఉండాలనడంలో ఏమై నా అర్థం ఉందా!
అనుకున్నదే తడవుగా అమ్మకం
ఒకప్పుడు ఆసియా ఖండంలోనే అతిపెద్ద చక్కెర ఫ్యాక్టరీగా నిజాంషుగర్స్ పేరొందింది. దీని యూనిట్లను అప్పటి సీఎం చంద్రబాబు నిబంధలకు వ్యతిరేకంగా ప్రైవేటీకరించారు. ప్రైవేటీకరణ జాయింట్ వెంచర్ రూపంలో జరిగింది. డెల్టా పేపర్ మిల్స్‌కు 51శాతం వాటా, నిజాం షుగర్స్‌కు 49శాతం వాటాకు పెట్టిన ముద్దుపేరే ‘జాయింట్ వెంచర్’. వాస్తవానికి ఫ్యాక్టరీని మొత్తంగా డెల్టా పేపర్‌మిల్స్ యాజామాన్యం స్వాధీనం చేసుకుంది. 2002లో ఈ ప్రైవేట్ యాజామాన్యం శక్కర్‌నగర్, మెట్‌పల్లి, మెదక్‌యూనిట్లతోపాటు నిజాంషుగర్స్‌కు చెందిన శక్కర్‌నగర్ ఆల్కహాల్ డిస్టిల్లరీ యూనిట్‌ను కూడా స్వాధీనం చేసుకుంది. తెలంగాణ ప్రజలు, బోధన్ ప్రాంత చెరుకు రైతులు, కార్మికులు ప్రైవేటీకరణను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, నాటి చంద్రబాబు ప్రభుత్వం మొండి గా వ్యవహరించింది.
అధికారంలోకి వస్తే నిజాం షుగర్స్ ప్రైవేటీకరణను రద్దు చేస్తామని 2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ రాజశేఖర్‌డ్డి ప్రకటించారు. 2004లో అధికారంలోకి రాగానే నిజాం షుగర్స్ వ్యవహారంపై శాసనసభా సంఘాన్ని నియమించి అప్పటి దేవాదాయ, ధర్మదాయశాఖ మంత్రి రత్నాకర్‌రావు చైర్మన్‌గా, ఎమ్మెల్యేలు చిన్నాడ్డి, పీ సుదర్శన్‌డ్డి, బాజిడ్డి గోవర్ధన్, ఎస్ గంగారాం, సురేశ్‌షెట్కార్, పద్మాదేవేందర్‌డ్డి, శశిధర్‌డ్డి, కళా సభ్యులుగా నియమించారు. ‘జాయింట్ వెంచర్’ పేరిట జరిగిన ప్రైవేటీకరణలో అవినీతి, అక్రమాలు జరిగాయని సభాసంఘం గుర్తించింది. జాయింట్ వెంచర్ ఒప్పందం తర్వాత కూడా ఒప్పందంలోని అంశాలను ప్రైవేట్ యాజమాన్యం ఉల్లంఘించినట్లు సభాసంఘం తేచ్చింది. నిజాంషుగర్స్ ఆస్తుల విలువను రూ.300కోట్లుగా అంచనావేసి, కారుచౌకగా రూ.67కోట్లకు విక్రయించడాన్ని తప్పుబట్టింది. జా యింట్ వెంచర్ చెల్లదని, నిజాంషుగర్స్ యూనిట్ల ప్రభు త్వం స్వాధీనం చేసుకోవాలని సిఫార్సు చేసింది.
కోర్డులనూ గౌరవించని పాలకులు
నిజాం షుగర్స్ ప్రైవేటీకరణపై సభాసంఘం సిఫార్సుల అమ లు విషయంలోనూ కాంగ్రెస్ పాలకులు కాలయాపన చేస్తున్నారు. స్వాధీనం చేసుకోవాలని హైకోర్టు తీవ్రస్థాయిలో హెచ్చరించినా ఫలితం లేదు. ఈ విషయమై 2007లో నిజాం షుగర్స్ పరిరక్షణ సమితి కన్వీనర్ ఎం అప్పిడ్డితో పాటు నలుగురు రైతు నాయకులు హైకోర్టులో పిల్ దాఖలు చేశారు.
2007జూలై 2 ఆరు వారాల్లో సభా సంఘం సిఫార్సులను అమలు చేయాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఆరేళ్లయినా ఆ తీర్పును ప్రభుత్వం ఖాతరు చేయలేదు. దీంతో రైతు నాయకులు ఈ ఏడాది జనవరిలో మరోసారి హైకోర్టు లో కొందరు మరో ప్రజావూపయోజన వ్యాజ్యం దాఖలు చేశా రు. ఈసారి కూడా అడ్వకేట్ జనరల్ కుంటిసాకులు చెబు తూ గడువులు తీసుకుంటూ ఏడాదిగా కాలయాపన చేస్తూ వచ్చారు. దీంతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గత మార్చి లో మరోసారి ఆదేశాలు జారీచేశారు. అప్పటినుంచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు మారుతుండటంతో ఈ విషయ మై కదలిక లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సాకారం కానుండటంతో ఇకనైనా నిజాం షుగర్స్ తమకు దక్కుతుందన్న ఆశ తెలంగాణ ప్రజల్లో కలిగింది.
చెరుకును కనుమరుగు చేసే కుట్ర?
నిజాం కాలంలో 193లో ప్రారంభమైన ఈ ఫ్యాక్టరీ ఆసియాలోనే ఓవెలుగు వెలిగింది. ప్రైవేట్ పరం చేయడానికి కొన్నేళ్ల కిందటి వరకు బోధన్‌తోపాటు మిగతా యూనిట్లలో నాలుగైదు వేల మంది కార్మికులు ఉపాధి పొందేవాళ్లు. ప్రస్తుతం బోధన్‌లో కేవలం 300 కార్మికులు పనిచేస్తున్నారు. వీరిలో 220 మంది కాంట్రాక్ట్ కార్మికులే. ఆస్పత్రి, నివాస గృహాలు, రోడ్లు ఉండేవి. పదేళ్ల కింద ఐదు లక్షల టన్నుల చెరుకు క్రషింగ్ చేస్తే, గత ఏడాది 1.63 లక్షల టన్నులకు పడిపోయింది. ప్రైవేట్ పరమయ్యాక సాగు విస్తీర్ణం కూడా భారీగా తగ్గింది.
ఇదే సమయంలో ఈ ప్రాంతంలోని ప్రైవేట్ షుగర్ ఫ్యాక్టరీలు లాభాల్లో దూసుకుపోతున్నాయి. అంటే పథకం ప్రకారం ప్రభుత్వరంగంలోని ఫ్యాక్టరీని నష్టాలబాట పట్టించి మూసివేయించడమే లక్ష్యంగా కనిపిస్తోంది. చెరుకును తెలంగాణ నుంచి కనమరుగు చేయడం, సమైక్య రాష్ట్రంలో సీమాంధ్ర పెట్టుబడిదారులే చెరుకు పంటపై ఆధిపత్యం సాధించడమనేది స్థూల నిర్ణయమని తెలుస్తోంది. పదేళ్ల కింద రాష్ట్ర ఆదాయంతో పోలిస్తే ఇప్పుడు పదిట్లకు పైగా పెరిగింది. నిజాం షుగర్స్ విక్రయించే నాటికి బడ్జెట్ పదివేల కోట్లపైన ఉంటే, ప్రస్తుతం లక్షా యాభైవేల కోట్లు దాటింది. అయినా ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకోవడానికి అడ్డొచ్చే అవరోధాలు ఏమిటో వలసపాలకులకే తెలియాలి!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి