
- లిబియాలో ఇంతవరకూ ఎలక్ట్టిసిటీ బిల్లు లేదు.. అందరికీ కరెంటు ఫ్రీ
- బ్యాంకుల నుంచి తీసుకునే రుణాలకు వడ్డీ ఉండదు. బ్యాంకులన్నీ
ప్రభుత్వానివే.
- సొంతింటిని కలిగిఉండడమనేది లిబియాలో హక్కుగా పరిగణిస్తారు.
- లిబియాలో కొత్త పెళ్లైన జంటకు ఇల్లు కొనుక్కోవడం కోసం 60 వేల దినార్లు
ప్రభుత్వం నుంచి అందుతాయి. రూపాయిల్లో చెప్పాలంటే దాదాపు 25 లక్షలు.
- విద్య, వైద్యం లిబియాలో పూర్తిగా ఉచితం. గడాఫీ అధికారం చేపట్టక ముందు
అక్కడ అక్షరాస్యత 25 శాతమే. అది ఇప్పుడు దాదాపు 83 శాతానికి చేరింది.
- వ్యవసాయం చేయాలని లిబియన్లు అనుకుంటే వారికి భూమిని, వ్యవసాయ పరికరాలను,
విత్తనాలను, పశువులను అన్నింటినీ ప్రభుత్వమే ఉచితంగా ఇస్తుంది.
- దేశంలో సరైన వైద్యం అందకపోతే విదేశాలకు వెళ్లి వైద్యం చేయించుకోవచ్చు. ఆ
ఖర్చు కూడా ప్రభుత్వానిదే. పైగా నెలకు లక్షరూపాయల వరకూ అలవెన్సును కూడా
ప్రభుత్వం ఇస్తుంది.
- ఇక లిబియన్లు కారు కొనుక్కుంటే, వారి ఆస్తి అంతస్థుతో సంబంధం లేకుండా
సగం బిల్లును ప్రభుత్వమే చెల్లిస్తుంది.
- లిబియాలో పెట్రోల్ ధర కేవలం 7 రూపాయలు మాత్రమే
- ఏ దేశానికీ లిబియా రుణపడి లేదు. దాదాపు 150 బిలియన్ డాలర్ల వరకూ
విదేశాల్లో నిధులున్నాయి. లిబియా సంక్షోభంతో వీటన్నింటిని ఆయా దేశాలు
స్తంభింపజేశాయి. అమెరికాలోనూ లిబియా పెట్టుబడులు పెట్టింది.
- డిగ్రీ పూర్తయ్యాక ఉద్యోగం దొరకకపోతే, ప్రభుత్వం నిరుద్యోగ భృతిని
చెల్లిస్తుంది.
- క్రూడ్ అమ్మకాల ద్వారా వచ్చే మొత్తంలో కొంత భాగం లిబియన్ల బ్యాంక్
ఖాతాల్లో నేరుగా జమవుతుంది.
- ప్రసవం అవగానే తల్లికి రెండు లక్షల యాభై వేల రూపాయలు అందుతాయి.
- ఏడున్నర రూపాయలకు 40 బ్రెడ్ ప్యాకెట్లు లిబియాలో దొరుకుతాయి.
- లిబియాలో 25 శాతంమందికి యూనివర్సిటీ డిగ్రీ ఉంది.
- ప్రపంచంలోనే అతిపెద్ద నీటిపారుదల ప్రాజెక్టును గఢాపీ నిర్మించాడు.
ఎడారిదేశం అంతటికీ నీరు అందివ్వడం కోసం.. భూగర్భమార్గంలో పైపులైన్లు
వేశాడు.

ఇవన్నీ అమెరికా సహా ప్రపంచమంతా నియంతగా ముద్రవేసిన గఢాఫీ పాలనలో లిబియాలో
కనిపించిన దృశ్యాలు. అగ్రరాజ్యం అమెరికా, తనకు అడ్డుగా ఉన్న గఢఫీని అత్యంత
ప్రణాళికాబద్ధంగా, తనపేరు బయటకు రాకుండా అంతం చేసేసింది. తిరుగుబాటు సేనలకు
ఆయుధాలు అందించడమే కాక, నాటో దళాలతో లిబియాను అగ్నిగుండంగా మార్చేసింది.
ఇప్పుడు లిబియా సంక్షోభిత దేశం, ఎవడు అధ్యక్షుడు అవుతాడో ఎంతకాలం ఉంటాడో,
ఎలా పాలిస్తాడో ఎవరికీ తెలియదు.
ఇక, ఏళ్లతరబడి గఢాఫీ సింహాసనాన్ని వదిలి ఉండకపోవచ్చు.
కానీ, గఢాఫీ కల్పించినన్ని సౌకర్యాలు, అభివృద్ధి చెందిన దేశాల్లోనూ,
ప్రజాస్వామ్య దేశాల్లోనూ ఎక్కడైనా, ఒక్కటైనా కల్పించాయా. తనకు ఎదురుతిరిగిన
దేశాలపై ఏకంగా దాడులకు తెగబడుతూ, యావత్ అమెరికన్ల ప్రయోజనాలను
తాకట్టుపెట్టి మరీ యుద్ధాలు చేస్తున్న అమెరికా అధ్యక్షుడు నియంతా..? లేక
గఢాఫీనా..? అణుబిల్లులు లాంటి తమకు కావల్సిన బిల్లులను ఎంతకైనా తెగించి
చట్టాలు చేయడమే కాదు, దేశానికి కావల్సిన మహిళా రిజర్వేషన్
బిల్లులాంటివాటిని ఏళ్లతరబడి తొక్కిపెడుతున్న భారత ప్రధానులు నియంతలా.. ?
గఢాఫీనా..? ఆలోచించండి..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి