30, మే 2012, బుధవారం

రేడియేషన్ (అణు ధార్మికత) ఎంత తక్కువయితే సేఫ్?


radiation-exposureజపాన్ లో ఫుకుషిమా అణు కర్మాగారంలో వినాశకర ప్రమాదం జరిగాక తరచుగా వినిపిస్తున్న మాట “రేడియేషన్ ఫలానా పరిమితి కంటే తక్కువగా ఉంది గనక ప్రమాదం లేదు” అని. అణు పరిశ్రమ యాజమాన్యాలు, వారికి వత్తాసుగా నిలిచే “voodoo” శాస్త్రవేత్తలు, ఎకాలజిస్టులు తరచుగా ఈ పదజాలాన్ని వల్లె వేస్తున్నారు. వాతావరణంలో సహజంగానే కొంత రేడియేషన్ ఉంటుందనీ, అసలు మానవ శరీరంలోనే కొంత రేడియేషన్ ఉంటుందనీ, కనుక ఫలానా పరిమాణం కంటే తక్కువ స్ధాయిలో రేడియేషన్ సోకినా ప్రమాదం లేదనీ వీరు చెబుతున్నారు.
కానీ దశాబ్దాలుగా శాస్త్రవేత్తలు జరిపిన అధ్యయనాలు వీరి వాదనలకు భిన్నంగా ఉన్నాయి. న్యూక్లియర్ పరిశ్రమ వర్గాలుగానీ, వారికి వత్తాసుగా వచ్చే ‘సో కాల్డ్’ శాస్త్రవేత్తలు, ఎకాలజిస్టులు గానీ సైన్స్ పేరుతో ముందుకు తెస్తున్న అంశాలు వాస్తవం కాదని వీరి పరిశోధనలు చెబుతున్నాయి. “ప్రమాదకరం కానీ రేడియేషన్ స్ధాయి” అంటూ ఏమీ లేదని వారు చెబుతున్నారు. పెద్ద మొత్తంలో ఒకేసారి రేడియేషన్ కి గురికావడం కంటే చాలా కొద్ది మొత్తంలో ‘రేండం’ గా అయినా సరే సుదీర్ఘ కాలంగా రేడియేషన్ కి గురి కావడం మరింత ప్రమాదకరం అని దశాబ్దాల తరబడి నిర్వహించిన అధ్యయనాలు తేల్చాయి.
దశాబ్దాల పరిశోధన ద్వారా ఎల్.ఎన్.టి అనే ప్రామాణిక సిద్ధాంతం న్యూక్లియర్ రేడియాలజీ లో రూపొందించారు. (దీనిని the Linear-No-Threshold hypothesis అంటారు.) దీని ప్రకారం రేడియేషన్ ఏ మోతాదులో సోకినా ప్రమాదం ఉంటుంది. అటువంటి ప్రమాదం మోతాదుకి అనులోమానుపాతంలో ఉంటుంది.  అంతే కాకుండా బైటి నుండి సోకే రేడియేషన్ కంటే జీవుల (మనుషులతో సహా) శరీరంలోకి ప్రవేశించిన రేడియో ధార్మిక పదార్ధం ఎంత తక్కువగా ఉన్నా దానివల్ల అనేక వందల రెట్లు ప్రమాదకరం అని అనేక అధ్యయనాల ద్వారా తెలిసింది. ఈ వివరాలను పాఠకుల దృష్టికి తేవడం ఈ ఆర్టికల్ ఉద్దేశ్యం.
డా. పీటర్ కారమోస్కోస్ ఆస్ట్రేలియాకి చెందిన న్యూక్లియర్ రేడియాలజిస్టు. ‘ఆస్ట్రేలియన్ రేడియేషన్ ప్రొటెక్షన్ అండ్ న్యూక్లియర్ సేఫ్టీ ఏజన్సీ’ కి చెందిన ‘రేడియేషన్ హెల్త్ కమిటీ’ కి పబ్లిక్ రిప్రజెంటేటివ్ కూడా. ఆయన గత సంవత్సరం ఏప్రిల్ 8 తేదీన ‘సిడ్నీ మోర్నింగ్ హెరాల్డ్‘ లో సంచలనాత్మకమైన నిజాలతో ఒక సైంటిఫిక్ వ్యాసం రాశారు. అప్పటికి ఫుకుషిమా ప్రమాదం జరిగి దాదాపు నెల కావస్తోంది. మరో 18 రోజులు గడిస్తే (ఏప్రిల్ 26, 2011) చెర్నోబిల్ ప్రమాదం జరిగి పాతిక సంవత్సరాలు పూర్తి కావస్తోంది కూడా. ఆయన తన వ్యాసాన్ని ఇలా ప్రారంభించాడు.
You have to hand it to the nuclear industry and its acolytes. In the middle of the second-worst nuclear power disaster in history at Fukushima, and with still no end in sight, you would think they would respond with contrition, humility and profuse mea culpas. Not on your life. The industry representatives and its acolytes came out swinging in full denial attire.
చరిత్రలోనే అతి పెద్ద అణు ప్రమాదాల్లో రెండవదిగా ఉన్న ఫుకుషిమా అణు ప్రమాదం జరిగాక అణు పరిశ్రమ వర్గాలు గానీ, వారి మద్దతుదారులు గానీ పశ్చాత్తాపం, వినమ్రత, ఆత్మ విమర్శతో ముందుకు వస్తారని ఎవరైనా ఆశిస్తే అదంతా భ్రమగా మిగిలిందని పీటర్ పైన వ్యాఖ్యానించాడు. ఆయన ఇంకా ఇలా అన్నాడు.
But more insidious and objectionable is the creeping misinformation that the nuclear industry has fed into the public sphere over the years. There seems to be a never-ending cabal of paid industry scientific ”consultants” who are more than willing to state the fringe view that low doses of ionising radiation do not cause cancer and, indeed, that low doses are actually good for you and lessen the incidence of cancer.
అణు పరిశ్రమ సంవత్సరాల తరబడి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి చొప్పించడం ‘వంచన’ గా, ‘అభ్యంతరకరం’ గా  పీటర్ అభివర్ణించాడు. I Want You To Believe Radiation Is Safeపరిశ్రమ వర్గాల నుండి డబ్బు మేసిన ‘సైంటిఫిక్ కన్సల్టెంట్లు’ కొద్ది మోతాదుల్లో రేడియేషన్ సోకడం వల్ల కేన్సర్ రాదనీ, నిజానికి, కొద్ది మోతాదుల రేడియేషన్ ఆరోగ్యానికి మంచిదే కాక కేన్సర్ ని నివారిస్తుందని కూడా చెప్పడాన్ని పీటర్ పైన నిరసించాడు.
ఇలాంటి చెత్త సైన్స్ (junk science) ని ప్రమోట్ చేస్తున్నది అణు పరిశ్రమ మాత్రమే కాదనీ, అమెరికా కి చెందిన ‘డిపార్ట్ మెంట్ ఆఫ్ ఎనర్జీ’ (డి.ఒ.ఇ) కూడా ఈ పనిలో ఉందనీ కొన్ని దృష్టాంతాల ద్వారా అనుమానాలొస్తున్నాయి. అమెరికాలో అణ్వాయుధాలు డిజైన్ చేయడం, పరీక్షించడం, ఉత్పత్తి చేయడం అన్నింటికీ డి.ఒ.ఇ బాధ్యురాలు. అది అణు విద్యుత్ ను ప్రమోట్ చేయడం కూడా ఒక ముఖ్య విధిగా నిర్వర్తిస్తోంది. ఇంతటి ముఖ్యమైన అమెరికా ప్రభుత్వ సంస్ధ కూడా చెత్త సైన్స్ సిద్ధాంతాన్ని నెత్తినేసుకుంటూ గత డిసెంబరులో ఒక పరిశోధన ప్రచురించిందనీ దాని ద్వారా అత్యంత ప్రామాణికమైన ఎల్.ఎన్.టి సిద్ధాంతాన్ని తప్పు పట్టడానికి ప్రయత్నించిందనీ ఆరోపణలు వచ్చాయి. మ్యూటేషన్ చెందిన మానవ కణాలను గాజు పాత్రలో తీసుకుని చేసిన ప్రయోగాన్ని అశాస్త్రీయ పద్ధతుల్లో సజీవ ప్రాణులందరికీ వర్తించేదిగా ప్రకటించిందని ఆరోపణలు వచ్చాయి.  అమెరికాలో జరిగిన కొన్ని అణు ప్రమాదాలను కూడా డి.ఒ.ఇ, ఎ.ఇ.సి (ఆటామిక్ ఎనర్జీ కౌన్సిల్) లు దాచి పెట్టాయని పత్రికలు, బ్లాగ్ లు వెల్లడి చేశాయి.
డి.ఒ.ఇ నిధులిచ్చిన మరొక పరిశోధనను ఎం.ఐ.టి పరిశోధకులు జరిపారు. వీరు ఐదు వారాల పాటు ఎలుకలను తక్కువ స్ధాయి రేడియేషన్ కి గురి చేసి డి.ఎన్.ఎ కి నష్టం జరిగిందేమో పరిశీలించారు. వారి పరిశీలనలో ‘ఎక్సెసివ్ డేమేజ్’ జరగలేదని తేలింది. అదనపు నష్టం జరగలేదు గనక తక్కువ మోతాదు రేడియేషన్ వల్ల నష్టం లేదని వీరు తేల్చినట్లుగా అణు పరిశ్రమ వర్గాలు పరచారం చేస్తున్నాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన ముఖ్య సంగతి ఏమిటంటే ఈ పరిశోధన ద్వారా ఎల్.ఎన్.టి సిద్ధాంతాన్ని తప్పు పట్టలేదు. ప్రమాదం జరిగినపుడు ఎంత ఏరియా మేరకు జనాన్ని ఖాళీ చేయించాలీ అన్న విషయంపై వీరి దృష్టి కేంద్రీకృతమై ఉందని పరిశోధన నివేదికపై వచ్చిన వార్తను చూస్తే అర్ధం అవుతుంది.
అదీ కాక ఈ పరిశోధన కేవలం 5 వారాలకు సంబంధించినది మాత్రమే. సుదీర్ఘ కాలాల పాటు రేడియేషన్ కి గురి కావడం వల్ల ఎదురయ్యే ప్రమాదాలను 5 వారాల పరిశోధన ద్వారా కొట్టిపారేయడానికి వీలు లేదు. దానితో పాటు ప్రాణి శరీరం బైటినుండి సోకే రేడియేషన్ కీ, శరీరంలోపలికి చేరిన రేడియేషన్ పదార్ధం వల్ల సోకే రేడియేషన్ కీ ఉన్న తేడాను అసలు పరిశీలించలేదని తెలుస్తోంది.
నిపుణులు వెల్లడించే అభిప్రాయాలూ మాత్రం ఎల్.ఎన్.టి సిద్ధాంతానికి పూర్తి consistant గా ఉండడాన్ని గమనించవచ్చు. ఉదాహరణకి ‘ఫిజీషియన్స్ ఫర్ సోషల్ రెస్పాన్సిబిలిటీ’ ఇలా వ్యాఖ్యానించింది.
According to the National Academy of Sciences, there are no safe doses of radiation. Decades of research show clearly that any dose of radiation increases an individual’s risk for the development of cancer.
There is no safe level of radionuclide exposure, whether from food, water or other sources. Period,” said Jeff Patterson, DO, immediate past president of Physicians for Social Responsibility. “Exposure to radionuclides, such as iodine-131 and cesium-137, increases the incidence of cancer. For this reason, every effort must be taken to minimize the radionuclide content in food and water.”
“Consuming food containing radionuclides is particularly dangerous. If an individual ingests or inhales a radioactive particle, it continues to irradiate the body as long as it remains radioactive and stays in the body,”said Alan H. Lockwood, MD, a member of the Board of Physicians for Social Responsibility.         
…        …         ….
Radiation can be concentrated many times in the food chain and any consumption adds to the cumulative risk of cancer and other diseases.
దీనిని బట్టి ‘నేషనల్ ఏకాడమీ ఆఫ్ సైన్సెస్’ ప్రకారం రేడియేషన్ కి సంబంధించి ప్రమాదం కాని మోతాదంటూ ఏమీ లేదు. రేడియేషన్ ఎంత మోతాదులో సోకినా అంతమేరకు కేన్సర్ ప్రమాదాన్ని పెంచుతుందని దశాబ్దాల పరిశోధన నిరూపించింది. అయోడిన్-131 అయినా, సీసియం-137 అయినా ఎంత సోకిన కేన్సర్ ప్రమాదం కలుగ జేస్తుంది. ఆహారంలోగానీ, నీటిలో గానీ రేడియో ధార్మిక పదార్ధాలను సాధ్యమైనంతగా తగ్గించుకోవలసిందే తప్ప ‘ఈ స్ధాయి ప్రమాదం కాదు’ అనుకోవడానికి లేదు. ఆహారంతో కలిపి రేడియో ధార్మిక పదార్ధం తీసుకుంటే అది ఎంత తక్కువ మోతాదులో ఉన్న దాని ప్రభావం అది కలగజేస్తుంది. దానిని తిన్నా, పీల్చినా శరీరంలోపలికి వెళ్ళాక అది ఉన్నంతవరకూ, రేడియేషన్ ద్వారా తనకు తాను క్షీణించిపోయేవరకూ రేడియేషన్ ను వెలువరిస్తూనే ఉంటూంది. అది కాన్సర్ ప్రమాదాన్ని పెంచుతూ ఉంటుంది.
న్యూక్లియర్ వాచ్ డాగ్ సంస్ధ ‘Nukewatch’ కి చెందిన ప్రముఖుడు జాన్ లాఫోర్జ్ ఇలా అంటున్నాడు.
The National Council on Radiation Protection says, “… every increment of radiation exposure produces an incremen­tal increase in the risk of cancer.” The Environmental Protection Agency says, “… any exposure to radiation poses some risk, i.e. there is no level below which we can say an exposure poses no risk.” The Department of Energy says about “low levels of radiation” that “… the major effect is a very slight increase in cancer risk.” The Nuclear Regulatory Commission says, “any amount of radiation may pose some risk for causing cancer … any increase in dose, no matter how small, results in an incremental increase in risk.” The National Academy of Sciences, in its “Biological Effects of Ionizing Radiation VII,” says, “… it is unlikely that a threshold exists for the induction of cancers ….”
Long story short, “One can no longer speak of a ‘safe’ dose level,” as Dr. Ian Fairlie and Dr. Marvin Resnikoff said in their report “No dose too low,” in the Bulletin of the Atomic Scientists.
దీనిని బట్టి NCPR గానీ, EPA గానీ, DoE గానీ, NRC గానీ NAC గానీ అన్నీ సంస్ధలూ ఏకాభిప్రాయంతో ఉన్నాయి. ఇందులో DoE సన్నాయి నొక్కు నొక్కడం మనం గమనించవచ్చు. ‘పెద్ద ప్రభావం’ ఏమిటంటే కేన్సర్ ప్రమాదాన్ని ‘కొద్దిగా పెంచడం’ అని అది చెబుతోంది. చచ్చే పరిస్ధితి వస్తే తప్ప కొద్దిగా కేన్సర్ ప్రమాదం ఉంటే ఏమిటిట అని ప్రశ్నిస్తున్నట్లు ఉంది. మొత్తంగా చూస్తే అందరిదీ ఒకటే నిర్ధారణ: రేడియేషన్ ఎంత తక్కువ ఉన్నా ఆ స్ధాయిలో కేన్సర్ ప్రమాదం తప్పదు అని.
ట్రూత్ ఔట్ వెబ్ సైట్ ‘Radition: Nothing to See Here?’ శీర్షికన ఒక కధనం ప్రచురించింది. సదరు వెబ్ సైట్ లో కధనానికి లింక్ పని చేయడం లేదు. అదే కధనాన్ని ప్రిజన్ ప్లానెట్ వెబ్ సైట్ పునః ప్రచురించింది. దానిని ఇక్కడ చూడవచ్చు. దానిలో ఒక భాగం ఇలా ఉంది.
Many epidemiologic studies show that extremely low doses of radiation increase the incidence of childhood cancers, low birth-weight babies, premature births, infant mortality, birth defects and even diminished intelligence….
Comforting statements about the safety of low radiation are not even accurate for adults. Small increases in risk per individual have immense consequences in the aggregate. When low risk is accepted for billions of people, there will still be millions of victims. New research on risks of x-rays illustrate the point.
Radiation from CT coronary scans is considered low, but, statistically, it causes cancer in one of every 270 40-year-old women who receive the scan. Twenty year olds will have double that rate. Annually, 29,000 cancers are caused by the 70 million CT scans done in the US. Common, low-dose dental x-rays more than double the rate of thyroid cancer. Those exposed to repeated dental x-rays have an even higher risk of thyroid cancer.
బాగా తక్కువ మోతాదులో సోకే రేడియేషన్ వల్ల చిన్న తనంలో కేన్సర్ సోకుతుందని అనేక అధ్యయనాలు తేల్చినట్లు దీనిని బట్టి తెలుస్తోంది. తక్కువ బరువుతో పుట్టడం, నెలలు నిండక ముందే పుట్టడం, పసి మరణాలు, పుట్టుకతో వైకల్యం, బుద్ధి మాంద్యం సంభవించవచ్చని తెలుస్తోంది. అంతే కాక x రే, సి.టి స్కాన్ మొదలైన వాటిలో విడుదలయ్యే రేడియేషన్ వల్ల కూడా ఎలాంటి ప్రమాదాలున్నాయో పై భాగం చెబుతోంది. అమెరికా సంవత్సరానికి 70 మిలియన్లు సి.టి స్కాన్ లు జరిగితే అందులో 29,000 మందికి క్యాన్సర్ సోకిందని తెలుస్తున్నది. డెంటల్ x రే ల వల్ల ధైరాయిడ్ ప్రమాదం ఎలా ఉన్నదో చెబుతోంది.
ఈ అంశాల ద్వారా మనకు ఏమి అర్ధం అవుతోంది?
  • రేడియేషన్ మోతాదు ఎంత తక్కువ ఉన్నా ప్రమాదమే. కాకుంటే ప్రమాదం స్ధాయి మారవచ్చు.
  • రేడియేషన్  ఎంత మోతాదుకి మించితే ప్రమాదం అన్న చర్చకి అర్ధమే లేదు.
  • సుదీర్ఘ కాలం పాటు తక్కువ మోతాదులో రేడియేషన్ కి గురయినా కేన్సర్ సోకుతుంది.
  • రేడియో ధార్మిక పదార్ధం ప్రాణి శరీరం బైట ఉన్నప్పడు కంటే లోపలికి ప్రవేశించినప్పడు మరింత ప్రమాదం. ఎందుకంటే అవి వివిధ శరీర భాగాలకు అత్యంత దగ్గరగా ఉంటాయి.
ఈ అంశాలను రుజువు చేసే పరిశోధనా నివేదికలు ప్రధానంగా శాస్త్ర పరిభాషలో ఉన్నాయి. అందువల్ల అవి అందరికీ అర్ధం అయేవి కావు. వాటిని సులభ భాషలోకి మార్చి అనేకమంది శాస్త్రవేత్తలు, పర్యావరణ వేత్తలు, విజిల్ బ్లోయర్లు, స్వతంత్ర కార్యకర్తలు, సైన్స్ విలేఖరులు వివిధ వార్తా వెబ్ సైట్లలో ఆర్టికల్స్ రాశారు. వారు కేవలం ఆర్టికల్స్ రాసి సరిపెట్టకుండా ఆయా పరిశోధనలను రిఫరెన్స్ గా పేర్కొన్నారు. లింక్ లు ఇచ్చారు. పేరు గొప్ప వార్తా సంస్ధలే పరిశ్రమ వర్గాలతో కుమ్మక్కయ్యి misinformation ప్రచారం చేయడమో లేదా అసలు నిజాలే చెప్పకపోవడమో చేస్తున్నపుడు ఆయా రంగాలలోని విజిల్ బ్లోయర్లు స్వతంత్రంగా వెబ్ సైట్స్ నిర్వహిస్తూ నిజాలనూ, అబద్ధాలనూ వెల్లడి చేయవలసిన అవసరం తలెత్తింది. ఈ నేపధ్యంలో ఆయా వెబ్ సైట్లను ‘తాడూ బొంగరం’ లేదని తక్కువ చేయకుండా కొంత శ్రమ పడితే శాస్త్రబద్ధ పరిశోధనలు బోలెడు అందుబాటులో ఉండడం గమనించవచ్చు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి