14, మే 2012, సోమవారం

పర్యావరణ పరిరక్షణకై గ్రీన్ ఫీడర్ వెహికిల్స్



 
రాజధానిలో కాలుష్యాన్ని తగ్గించడంలో భాగంగా డీఎంఆర్సీ ఇకపై పర్యావరణహిత ఫీడర్‌ వాహనాలను నడపనుంది. వీటిని ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌  తమ నివాసం వద్ద వీటిని ప్రారంభించారు. 'జి-రిక్‌'గా పిలిచే ఈ బ్యాటరీ ఆటోలను తొలివిడతలో దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్‌ మెట్రో స్టేషన్‌ నుంచి సాకేత్‌లోని సెలక్ట్‌ సిటీ వాక్‌ మాల్‌ వరకు నడుపుతారు. ఈ మేరకు 25 వాహనాలను సిద్ధం చేస్తున్నట్లు నిర్వహణ సంస్థ ఆర్గెనథమ్‌కు చెందిన గ్రీన్‌ వీల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఛైర్మన్‌ అజయ్‌ సింగ్‌ తెలిపారు. త్వరలో ఐదువేలకు పైగా పర్యావరణహిత వాహనాలను అందించనున్నట్లు ఈ సంస్థ ప్రతినిధులు తెలిపారు. వీటిని తామే నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఈ వాహనం టికెట్‌ విలువ రూ.10గా నిర్ధారించారు. ఇటువంటి సేవలు ఇప్పటివరకు టోక్యో, న్యూయార్క్‌, బెర్లిన్‌ రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ వీటిని ప్రారంభించడంతో పాటు.. వాటిని నడిపి మరీ సరదా తీర్చుకున్నారు. మెట్రో చేరని ముఖ్యమైన ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేసేందుకు డీఎంఆర్సీ పలు పలు మెట్రో స్టేషన్ల వద్ద ఫీడర్‌ బస్సులను నడుపుతోంది. వాటి స్థానంలోకొత్తగా ఈ వాహనాలను దశలవారీగా ప్రవేశపెట్టనుంది

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి